సామాన్యుల జీవితాల్లోని వేదనను తన పద్యాల్లో ప్రతిబింబించి, సమాజంలో వేళ్లూనుకున్న వివక్షను, అన్యాయాన్ని నిర్భయంగా ప్రశ్నించిన మహాకవి గుర్రం జాషువా గారు. మానవత్వాన్ని చాటి, సమాజాన్ని చైతన్యపరిచిన ఆయన రచనలు తెలుగు సాహిత్యానికి అమూల్య సంపద. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు.
ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం అని తన అసాధారణ ప్రతిభతో నిరూపించిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.
#EngineersDay
𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!
@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.
𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄 𝘁𝗵𝗲 𝘁𝘄𝗶𝘀𝘁𝘀:
𝗧𝘄𝗶𝘀𝘁 𝟭. 𝟲𝟱 𝗠𝗮𝗿𝗸𝘀 → 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻
The post was reportedly awarded with 65 TET marks, after the candidate passed through 7 stages of verification.
𝗧𝘄𝗶𝘀𝘁 𝟮. 𝗧𝗵𝗲 𝗗𝗘𝗢 𝗖𝗼𝗻𝗳𝗶𝗿𝗺𝘀 “𝗜𝗻𝗲𝗹𝗶𝗴𝗶𝗯𝗹𝗲”
The DEO confirmed the candidate to be ineligible.
So the obvious question is: What actually was verified in those 7 stages?
𝗧𝘄𝗶𝘀𝘁 𝟯. 𝗛𝗲 𝗚𝗼𝘁 𝘁𝗵𝗲 𝗝𝗼𝗯, 𝗕𝘂𝘁 𝗗𝗶𝗱𝗻’𝘁 𝗞𝗻𝗼𝘄 𝗛𝗼𝘄
The candidate himself reportedly said that he did not know how he got the job.
𝗧𝘄𝗶𝘀𝘁 𝟰. 𝗧𝗵𝗲 𝗦𝘂𝗱𝗱𝗲𝗻 𝟳𝟳-𝗠𝗮𝗿𝗸 𝗧𝘄𝗶𝘀𝘁
Officials confirmed that he had scored 77 marks in a 2018 TET attempt.
If those 77 marks were already on record:
Why were they not considered earlier?
Why did the DEO declare him ineligible?
And why did this explanation emerge only after questions were raised?
𝗧𝘄𝗶𝘀𝘁 𝟱. 𝗧𝗵𝗲 “𝗪𝗿𝗼𝗻𝗴 𝗣𝗮𝗽𝗲𝗿” 𝗧𝘄𝗶𝘀𝘁
The reported 77 marks are being cited under Paper-II-B.(School assistant special education)
But Paper-I-A is the required TET category for an SGT post.
So, how did he pass through 7 stages of verification?
𝗧𝘄𝗶𝘀𝘁 𝟲. 𝗧𝗘𝗧 𝗔𝗴𝗮𝗶𝗻, 𝗔𝗳𝘁𝗲𝗿 𝗚𝗲𝘁𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗝𝗼𝗯
Even after getting the job, the candidate appeared for TET again in 2025.
If the 2018 score of 77 marks already made him eligible, then:
What was the need to appear for TET again?
And now, the biggest questions of all:
Can this, by any means, be called fair and transparent?
Has this not enabled the DSC scam?
Will you not assume moral responsibility for this?
#MegaDSCScam
𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!
Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?
𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho authorities: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗰𝗲𝗿𝘁𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗲 𝗶𝘀 𝗿𝗲𝗽𝗼𝗿𝘁𝗲𝗱𝗹𝘆 𝗳𝗮𝗸𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟯: Check with Nagarjuna University: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝘀𝗽𝗼𝗿𝘁𝘀 𝗲𝘃𝗲𝗻𝘁 𝗮𝗹𝗹𝗲𝗴𝗲𝗱𝗹𝘆 𝗻𝗲𝘃𝗲𝗿 𝗵𝗮𝗽𝗽𝗲𝗻𝗲𝗱.
Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this?
#MegaDSCScam
.@ncbn గారూ… మెగా డీఎస్సీ స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారు? ఇంకెన్నాళ్లు యువకులను మోసం చేస్తారు? మీరు నిర్వహించిన డీఎస్సీ మోసాల్లో “మెగా”, నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట “దగా” అని తేలిపోతుంటే మీరు, మీ సుపుత్రుడు దాక్కోవడం ఎందుకు? ఈ స్కాంకు బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేత రాజీనామా చేయించకుండా, అధికార బలంతో, అబద్ధాలుచెప్తూ, పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తూ కొడుకును కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?
కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారు? ఒన్-టు-ఒన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా, పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి, ఆ తర్వాత దశలుకూడా దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? అధికారుల చేత ఈ పని చేయించిన ఆ అదృశ్య శక్తి ఎవరు? లోకేష్ కాదంటారా? రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఎస్సీ–2025లో ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో ఉన్నాయి.
చంద్రబాబుగారూ.., ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వమే అధికారంలో ఉండగా, మీ అధికారులతో చేసే విచారణలు నిజాయితీగా, స్వతంత్రంగా జరుగుతాయా? మీ కుమారుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో, మీ కిందపనిచేసే అధికారులు స్వతంత్రంగా నడుచుకోగలరా? అందుకే డీఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయించాలని మేం మొదటి నుంచీ పట్టుబడుతున్నాం. నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా కోర్టులోనూ పోరాడుతున్నాం.
చంద్రబాబుగారూ… మరో నిర్ఘాంతపరిచే విషయం ఏంటంటే, పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన మీరు, మీ అక్రమాల విధానాన్ని డీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీకి కూడా పాకించడం. మా హయాంలో ఫైనాన్స్ క్లియరెన్స్ పొందిన అటవీశాఖలోని 814 ఉద్యోగాలకు, నోటిఫికేషన్లు జారీ చేసి, మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్-4నే మీరు వాడుకున్న మాట వాస్తవం కాదా?
డీఎస్సీ అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేయడంతోపాటు, ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే బాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా నిలిపేయడం వాస్తవం కాదంటారా?
చంద్రబాబుగారూ… ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే, వీటి వెనుక మీరు, మీ సుపుత్రుడు ఉన్నారు కాబట్టే మీరు సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు. ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీలు చేయించి, మీకు డబ్బా కొట్టించుకోవడం వల్ల నిజాయితీపరులైన ఉద్యోగార్థులను దెబ్బతీసిన ఈ దారుణమైన స్కాంను కప్పిపుచ్చలేరు.
పారదర్శకంగా పరీక్షలు, నిష్పక్షపాతంగా ఉద్యోగ నియామకాల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థులు, యువకులకు వైయస్సార్సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తామని మరోమారు భరోసా ఇస్తూ, లీకేజీ వ్యవహారం నుంచి స్పోర్ట్స్ కోటా వరకు, టెట్ అర్హతల నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు, మొత్తంగా మెగా డీఎస్సీ వ్యవహారాన్ని, జీవో నంబర్ 4 ఆధారంగా నడిచిన నియామకాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని మరోమారు డిమాండ్ చేస్తున్నాను.
#MegaDSCScam
#NaraLokeshMustResign
🚨
నిన్న జనసేన ఎంపీ లింగమణేని రమేష్ కొడుకు..
నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆర్ట్ దర్శకుడు ఆనంద్ సాయి కొడుకు!
టీటీడీ బోర్డు సభ్యుడు, ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆనంద్ సాయి కుమారుడు, 23 ఏళ్ల సందీప్ ఆనంద్..
మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఒక పాదచారిని తన కారుతో గుద్దేశాడు..
ఈ ఘటనలో 21 ఏళ్ల నంద కిషోర్ అక్కడికక్కడే మృతిచెందాడు. లా విద్యార్థి ఖాద్రికి తీవ్ర గాయాలు.
వెంటనే పారిపోయిన సందీప్ ఆనంద్. అనంతరం సందీప్ ను అరెస్టు చేసినప్పటికీ మరుక్షణం బెయిల్ మీద వెళ్ళిపోయాడు!
#Janasena
Remembering Former Andhra Pradesh Chief Minister Y. S. Rajasekhara Reddy and his immense contribution to public life.
A staunch Congress leader and a powerful voice of the people, his pro-people, compassionate governance and landmark welfare initiatives touched millions of lives.
పేదల పక్షపాతి, సంక్షేమ పథకాల సారథి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నా ఘన నివాళులు.
రైతుల కన్నీళ్లు తుడిచిన ఆయన పాదయాత్ర, సంక్షేమ పాలన మా ప్రజా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మార్గదర్శకం.
మీ ఆశయ సాధనే మా లక్ష్యం.
జోహార్ వైఎస్సార్! 🙏
Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer offered tributes to Dr. Y.S. Rajasekhara Reddy,former Chief Minister of united Andhra Pradesh on his death anniversary.The Governor said Dr. Rajasekhara Reddy was a visionary leader who dedicated himself to the welfare of the people.
Remembering Dr. Y. S. Rajasekhara Reddy on his Death Anniversary. A leader of the people, his vision, compassion and commitment to public service continue to be remembered and cherished. His legacy remains deeply woven into the journey of Andhra Pradesh.
#YSRForever #AndhraPradesh @YSRCParty@ysjagan
లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందించేందుకు 'జలయజ్ఞం'తో అప్పట్లో భగీరథ తపస్సు చేసిన వైయస్ఆర్ గారు
రైతు ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా సాగిన వైయస్ఆర్ ప్రయాణం.. ఎప్పటికీ చిరస్మరణీయం
#YSFamilyForAPIrrigation#YSRVardanthi#JoharYSR#YSRLivesOn
ప్రజల గుండె చప్పుడు... పేదల కన్నీళ్లు తుడిచిన ప్రజల నాయకుడు, దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
మీ నవ్వు, మీ అడుగుజాడలు, పేదవాడి కడుపు నింపిన మీ సంక్షేమ బాట, మీ ఆశయాలే మా ఊపిరి, మీ ప్రజాపాలనే మా సంకల్పం.
మిమ్మల్ని ఎప్పటికీ మరువం రాజన్న..
జోహార్ వైఎస్సార్ 🙏
#YSRForever #JoharYSR
.@ncbn గారూ… ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి, ఆ ఇప్పటికే ఉన్న పంపులతో గోదావరి నీటిని ఎత్తి, ఇప్పటికే ఉన్న పోలవరం ఎడమ కాలువలో వదిలి, దాన్ని చూపించి “పోలవరం నీళ్లు తెచ్చేశాం” అంటూ డప్పు కొట్టుకోవడం ఏంటి? పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీళ్లు ఇవి కావనీ మీకూ తెలుసు, అందరికీ తెలుసు. కానీ ప్రచారం మాత్రం వేరే లెవల్. నీళ్లు పురుషోత్తపట్నానివి… కాలువ వైయస్సార్ హయాంలో నిర్మించినది… క్రెడిట్ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్?
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ… ఇవాళ పోలవరం ఎడమ కాలువ… ఇంకోరోజు ఇంకోటి. మీరు మొదలుపెట్టని, మీరు పూర్తిచేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే. ఒకవేళ అరకొర పనులు చేసినా, అవి కూడా అంచనాలు పెంచేసి దోచేయడానికే. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా మీ మోడస్ ఆపరెండీ, మీ ధోరణి, మీ నైజం ఇదే.
పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు, ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా? అసలు పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% పనులు వైయస్సార్‌గారి హయాంలోనే పూర్తైతే, ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి “అంతా నేనే చేశా” అని చెప్పుకోవడం చంద్రబాబుగారూ మీకే చెల్లింది!
పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014–19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ… ఇవన్నీ రాష్ట్రానికి శాపంలా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు పాటించకుండా, పద్ధతీపాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే, ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. చివరకు స్పిల్‌వేకు పనులు పూర్తికాకుండానే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే, మెయిన్డ్యాం పునాది పనుల్లో భాగమైన డయాఫ్రంవాల్ చేపట్టారు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ నిర్వాకాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడం ఒక్కటే కాకుండా, వరదల వల్ల వచ్చిన నీరు, అప్పటికి పాక్షికంగా చేసిన స్పిల్‌వే ద్వారా డైవర్ట్ కాక, ఎగున అరకొరగా చేసిన కాఫర్ డ్యాంవల్ల, ఆ గ్యాప్‌ల ద్వారా నీరు చొచ్చుకుని వచ్చి, మెయిన్ డ్యాం కింద పునాదులు, అంటే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయి నష్టంకూడా జరిగింది.
వీటన్నింటినీ సరిదిద్దుతూ ముందుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వే పనులు, కాఫర్ డ్యాంలను పూర్తిచేసి, ఆ తర్వాత మెయిన్ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లాం, ప్రణాళికా బద్ధంగా. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ఎత్తు సంగతి తేల్చండి చంద్రబాబుగారూ. పోలవరం FRL 45.72 మీటర్లు అయితే, నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబుగారూ?
మరోవైపు ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఈ స్కీంకు వైయస్సార్ గారు 2009లోనే రూ.7,214.10 కోట్ల పరిపాలనా అనుమతి ఇస్తే, మా ప్రభుత్వంలో మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో రూ.17,050.20 కోట్లకు అంచనాలను సవరించి పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చాం. కీలకమైన Package-1, Package-2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లాం. భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు కూడా ఏర్పాటు చేశాం. మరి మీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా?
చంద్రబాబుగారూ… పోలవరం విషయంలో డ్రామాలు మానండి. పనులపై దృష్టిపెట్టండి. 41.15 మీటర్లు కాకుండా, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో పోలవరాన్ని పూర్తిచేయండి. దీనివల్ల పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యపడుతుంది, తద్వారా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడంతోపాటు, పూర్తి గ్రావిటీతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించగలుగుతాం. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమకాల్వతోపాటు, కుడికాల్వకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇదిచేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు?
#YSRPolavaram
కనుమరుగైపోలేదు రాజన్న!
వైఎస్సార్ అనేది పేరు కాదు... కొందరి పాలిట సింహస్వప్నం, మరికొందరికి ప్రేమ పంచిన, కొత్త జీవితాన్ని ఇచ్చిన అమృత హృదయం.
ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తెలుగు రాజకీయాల్లో వైఎస్సార్ కేంద్రంగా ఇప్పటికీ, ఎప్పటికీ రాజకీయ చర్చ, రచ్చ నడుస్తూనే వుంటుంది. ఇది సత్యం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్సార్ గట్టిగా పాలించింది ఐదేళ్లే. కానీ ఆంధ్రప్రదేశ్ సమాజంపై శాశ్వత ముద్రవేసే అనేక సాగు, తాగునీటి ప్రాజెక్టులకు రూపశిల్పి, నిర్మాణ కర్త ఆయనే.
#YSR