అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ అటాక్!
తెర వెనుక వ్యహాలతో బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేసిన రేవంత్.. అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగంతో తనదైన శైలిలో బీఆర్ఎస్కు షాకిచ్చారు.
స్పీకర్ స్థానం, దళిత ఆత్మగౌరవంపై ప్రతిపక్షం దాడిని ప్రజల ముందు పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులు… కాంగ్రెస్ హయాంలో జరిగిన పనుల్ని వివరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో కేవలం 7,857 టీచర్ పోస్టులే భర్తీ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 55 రోజుల్లోనే 10,006 పోస్టులు నింపామని లెక్కలతో సహా వివరించారు.
గత ప్రభుత్వం మిగిల్చిన రూ.5,430 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో ఇప్పటికే రూ.3,488 కోట్లు చెల్లించి జెన్-జీ తరానికి అండగా నిలిచామని నిరూపించారు!
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అండతో అత్యున్నత పదవులు అనుభవించిన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు ఇప్పుడు బీఆర్ఎస్ ఉచ్చులో పడి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నేరుగా ఎండగట్టారు!
సభ బయట నడిపిన హైడ్రామాను తిప్పికొడుతూ బీఆర్ఎస్ను పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టారు.
#RevanthReddy
కేబీఆర్ పార్క్ వన్-వే సూపర్ హిట్! - ఇక ఫ్లైఓవర్లెందుకు?
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ తెచ్చిన వన్-వే విధానం గ్రాండ్ సక్సెస్. గతంలో క్యాన్సర్ హాస్పిటల్ నుంచి రోడ్ నం. 45 వెళ్లడానికి 30 నిమిషాలు పడితే, ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే చేరుకుంటున్నారు.
రూ.1,000 కోట్ల H-CITI ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ పనుల కోసం పెట్టిన ఈ వన్-వే మొదట్లో కాస్త గందరగోళం అనిపించినా.. ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీ-ఫ్లోగా సాగుతోంది. గూగుల్ మ్యాప్స్‌లో కూడా రోడ్డంతా క్లియర్‌గా కనిపిస్తోంది.
సింపుల్ వన్-వే మేనేజ్‌మెంట్‌తోనే ట్రాఫిక్ కష్టాలు తీరిపోయినప్పుడు, వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ, వందలాది చెట్లను నరికి ఫ్లైఓవర్లు నిర్మించడం అవసరమా అనే ప్రశ్నలు ఇప్పుడువస్తున్నాయి.
కొద్దిగా చుట్టూ తిరగాల్సి వచ్చినా సిగ్నల్స్ వద్ద గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేకపోవడం, సమయం ఆదా అవ్వడంపై వాహనదారులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేబీఆర్ పార్క్ సక్సెస్ మోడల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఐకియా అండర్‌పాస్, సైబర్ టవర్స్, నాలెడ్జ్ సిటీ కారిడార్లలోనూ వన్-వే సిస్టమ్ అమలు చేస్తే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఐటీ ఉద్యోగులు సూచిస్తున్నారు.
#TrafficSolutions
పద్నాలుగేళ్ల క్రితం అప్పుడే ఎండి జనరల్ మెడిసిన్ చదివినవాళ్ళకి నెలకి మూడు లక్షల జీతం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎనభై వేలు ఇస్తారు, మహా అయితే లక్షన్నర. వైద్యం కొనలేనంత ప్రియం అయ్యింది, వైద్యుడు కొబ్బరి పీచు అయ్యాడు.
బోధన్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత….
18 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు ఢిల్లీలో అమిత్ షా తో ప్రత్యేక భేటీ.
శాసన మండలి బీఆర్ఎస్ పక్ష నేత గా తీన్మార్ మల్లన…
సొంత పార్టీ వల్లే నన్ను ఓడించారు అని ఆరోపణలు చేసిన నగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్.
కరీంనగర్ ఎమ్మెల్యే గా బండి సంజయ్. శాసన సభ ప్రతిపక్ష నేతగా ఎంపిక.
బీజేపీ కి ముందు వరుసలో సీట్లు కేటాయించి నాకు వెనుక వరుసలో ఇవ్వడం ఏంటి అని అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద కేటీఆర్ నిరసన.