జగదీష్ రెడ్డి-కేసీఆర్ లాంటి అగ్ర వర్ణ దొరల మాటలు విని వట్టె జానయ్య యాదవ్ లాంటి బహుజన బిడ్డలను అక్రమ కేసులలో ఇరికించి వేధిస్తున్న పోలీసన్నలారా, మమ్ముల నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసే ముందు దయచేసి ఒక్క సారి ఆలోచించండి!!
1. మన పేద కుటుంబాలు గ్రామాల్లో ఏ విధంగా ఇప్పటికీ అణచివేతకు గురైతున్నయో గుర్తు చేసుకోండి.
2. కేసీఆర్ దొర పాలనలో మనకొక న్యాయం - వాళ్ల కొక న్యాయం అన్నది అప్పుడే మరచి పోయిండ్రా?
3. వాళ్లోళ్ల కేమో ఫ్రీగా, పైరవి లేకుండా మంచి మంచి పోస్టింగులు, మనకేమో ఈసడింపులు, అవమానాలు, పోస్టింగులకు పది లక్షల డిమాండులు!
4. మనం చిన్న తప్పు చేస్తే వీఆర్లు, లూపులైన్లు, చార్జి మెమోలు, సస్పెన్షన్లు, డిమోషన్లు, వాళ్లకేమో దొడ్డిదారిన ఆక్సిలరేటెడ్ ప్రమోషన్లు, సేవా పథకాలు, ఫారిన్ టూర్లూ…
5. పోస్టింగుల్లో వాళ్లకేమో మాదాపూర్లు, మనకేమో మాదన్నపేటలు…
6. మియాపూర్ లాంటి ఏసీబి కేసులో వాళ్లకేమో స్టేషన్ బెయిల్, మనకేమో చంచల్ గూడ జైల్..!
7. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసింది కానిస్టేబుల్ కిష్టయ్య- శ్రీనివాస్ గౌడ్ లు, వాళ్ల కేమో అగ్గి పెట్టెలు కూడా దొరకలే, పైగా మనను రోజూ బూతులు తిడ్తనే ఉంటరు..!
8. ఒకటవ తారీఖు నాడు రావలసిన జీతాలు, 15 నాడు ఎందుకొస్తున్నయో ఆలోచించారా?
9. ఇంత వరకు మూడు సరెండర్ లీవుల ఎన్క్యాష్మెంట్ ఎందుకు రాలేదో చూశారా?
10. మన ప్రమోషన్ల కోసం కాళ్లు పట్టుకున్నా మన లిస్టులు తయారుచేయరు, కోర్టునుండ్ ఆర్డరు తెచ్చుకోమంటరు, మరో వైపు పాలకులు వాళ్ల వాళ్ల కోసమే లిస్టులు ‘రహస్యంగా’ తారుమారు చేస్తరు.
11. మేం (BSP) ఎవరి ప్రయోజనాల కోసం పోరాడుతున్నామో ఒక్క సారి ఆలోచించండి.
అన్ని రోజులు ఒకటే తీర్గ ఉండవు. మన రాజ్యం కూడ వస్తది. #VR99 #LibTel #Time4Blue #FifthRevolution
బహుజన రాజ్యంలో మన తెలంగాణలో పుట్ట గొడుగుల్లా వెలసిన అన్ని బెల్ట్ షాపులను (అంటే 90ml మందు షాపులన్న మాట) బందు చేసి వాటి స్థానంలో పాల షాపులను పెట్టడమే తెలంగాణ చెల్లెల్లకు, అక్కలకు మేమిచ్చే రాఖీ పండుగ బహుమతి.🙏
అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు 💐💐💐
आप सभी को रक्षाबंधन पर्व का शुभ कामनाये। Happy Rakshabandhan to everyone. 💐💐💐
ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ లో తమకు అన్యాయం జరుగిందని నిరుద్యోగ అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిస్తే వారిని పోలిసులు అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికం. D.ed, B.ed అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఎస్పి తీవ్రంగా ఖండిస్తుంది. నిరుద్యోగ అభ్యర్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ సంఘీభావంగా ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో KCR ను గద్దె దించుతేనే నిరుద్యోగ బిడ్డలకు న్యాయం జరుగుతది.
#VoteMaaku_AdhikaramMeeku
#RSP4CM #Time4Blue #VR99% #IamRSP #BSP4Telangana #KCRFailedTelangana #ElephantThisTime #Youth #Employment @RSPraveenSwaero@BITCELL_BSP
బీజేపీ వల్ల మనుస్మృతి వస్తోంది.. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ సహా సెక్యూలర్లు, లిబరల్స్, కమ్మీస్ ప్రతిరోజు తెగ గించకుంటుంటారు.
బరాబర్ బీజేపీ ఈ దేశానికి ప్రమాదమే. వారిది మనుస్మృతి మనస్తత్వమే.
మరి కాంగ్రెస్ పార్టీ శెనగ గింజనా? బటానీ గింజనా?
బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ దుర్మార్గమైన మనువాద పార్టీ. మనుస్మృతిని అమలు చేసే పార్టీ.
ఈ కింద విగ్రహం కనిపిస్తుంది కదా.. మహిళల్ని సెక్స్ వస్తువులుగా శూద్రుల్ని బానిసలుగా గుర్తించే మనుస్మృతి రాసిన ‘మనువు’ విగ్రహం. 1989లో రాజస్థాన్ హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. అప్పటి నుంచి ఈ విగ్రహం తీసేయాలని, పేల్చేయాలని చాలా పెద్ద డిమాండే ఉంది. అయినా తొలగించలేదు. ఇప్పుడు కూడా అక్కడ సెక్యూలర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది.
ఛాలెంజ్ చేస్తున్నా.. ఈ మనువు మీద కాంగ్రెస్ పార్టీ ఈగ కూడా వాలనీయదు.
దళితులు, మైనారిటీలు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అనేవి కాంగ్రెస్ పార్టీ వెన్నపూసిన కత్తులు. నిజానికి ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసినంతగా బ్రిటిషర్లు, మొఘలులు కూడా చేయలేదు.
. @RSPraveenSwaero సర్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు గురుకులాల్లో తీసుకొచ్చిన మార్పులు లక్షలాదిమంది విద్యార్థులను తమ లక్ష్యం వైపు నడిపిచ్చింది. అంత గొప్పగా ఈ మీడియా ఏనాడూ చూపలేదు అరకొర తప్పా. చూపకపోగా కింది వర్గాలను ఉన్నత స్థాయి వరకు తీసుకురావద్దనే కుంచిత మనస్తత్వం ఉన్న నాయకులకు వత్తాసు పలికి ఇరకాటంలో పడేసేది.. ఈ నిర్ణయం, మార్పులతో ఆయనంటే ప్రతి ఒక్కరికి ఎనలేని గౌరవం వచ్చింది. ఆయన కనిపిస్తే ఎంత పెద్ద నాయకుడైన దగ్గరకు వచ్చి జై భీమ్ సర్ అని పలకరిస్తారు. నేడు ఆయనను దేశం మొత్తం చాలా గౌరవప్రదంగా "సర్" అంటున్నారు. @RSPraveenSwaero సర్ తీసుకొచ్చిన ఈ సంచలన మార్పులను ఇంత క్లుప్తంగా వివరించిన @bbcnewstelugu వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే చరిత్రకు సాక్ష్యం..
ఛలో సూర్యాపేట👊
ఓటమి భయంతో మంత్రి జగదీష్ రెడ్డి ఎందుకు తన పోలీసులతోని బీసీ బిడ్డ అయిన వట్టె జానయ్య యాదవ్ మీద ముప్పేట దాడి చేస్తున్నడు?
ఎందుకు జానయ్య మీద ఎన్నడు లేని కేసులను కుప్పలు తెప్పలుగా, ఆగమేఘాల మీద అక్రమ కేసులు పెట్టించి పీడీ ఆక్టు కింద జైలుకు పంపాలని చూస్తున్నడు? ఎందుకు జానయ్యను కిరాయి మూకలతో ఖతం చేయాలని చూస్తున్నడు??
జగదీష్ రెడ్డి మాఫియా చీకటి దందాల సంగతి గురించి బాగా తెలిసినోడనా?
జానయ్య యాదవ్ ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటూ తన కష్టార్జితాన్ని నీళ్ల లాగా ఖర్చు పెట్టి పనిచేయకపోతే జగదీష్ రెడ్డి 2018 లో గెలిచెటోడా? అంటే మేం మిమ్మల్ని గెలిపియ్యాలె, తర్వాత రోజూ భయం భయంగా బతకాలె!!!
ఆయన కొడుకు పెళ్లికి యాభై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీర్వదించిందుకా? ఆయనను సూర్యాపేట ప్రజలు ఆదరిస్తున్నందుకా?
ఆయన ఇంటికి బీయస్పీ అధ్యక్షుడు #RSP వచ్చినందుకా? ఎప్పుడు సూర్యాపేటలో, తెలంగాణలో రెడ్డి లేదా వెలమ భూస్వాములే రాజకీయాలను శాసించాల్నా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జీవితాంతం (ఎమ్మెల్యేలయినా)మీకు చంచాలుగానే బతకాల్నా???
నూటికి 99% ఉన్న బహుజనులు కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకే పరిమితమై మీ ఇండ్ల దగ్గర కావలి కుక్కలుగానే ఉండాల్నా? వాళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యే అర్హత లేదా?
మీరు చేస్తేనేమో అది రియల్ ఎస్టేటు వ్యాపారం, భూములు వెంచర్లు అయితవి. మేం అదే వ్యాపారం చట్టబద్ధంగా చేస్తే కబ్జాలు అయితయా? అంటే మీరే ఎప్పుడు డబ్బు సంపాయించాల్నా ? మేం ఎప్పుడూ బిచ్చగాళ్లు గనే ఉండాల్నా??
తెలంగాణ ప్రజలారా …
50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణ దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లూ భరిస్తనే ఉంటరు?? వాళ్లిచ్చే పది గొర్రెలకు బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా? ఆలోచించండి.
దొడ్డి కొమురన్న, బెల్లి లలితక్క, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, చిట్యాల ఐలమ్మ, పండుగ సాయన్న, మారోజు వీరన్న, సర్వాయి పాపన్న లాంటి వీర యోధులు మన వర్గాల్లోనే జన్మించి దొరలపై పోరాటాలు చేసిండ్రన్న విషయం మర్చిపోయినమా?
అందుకే…
మనకు ఏమైనా చీము నెత్తురు ఉన్నా తెలంగాణ బహుజన సమాజం అందరం వట్టె జానయ్య యాదవ్ కు వెన్ను దన్ను గా నిలబడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో గ్రామ గ్రామాన రచ్చ బండల దగ్గర అన్ని సంఘాలు కేసీఆర్-జగదీష్ రెడ్డిల మాఫియాలను గద్దె దించాలని ప్రతిజ్ఞ చేయాలె. అందరు గ్రామ దేవతల సాక్షిగా బొడ్రాయి దగ్గర ప్రమాణం చేయాలె.
మన కొమరెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్న, ఈ దోపిడి దొరలకు మన గొల్ల-కుర్మ ఢోలు దెబ్బ, మోకు దెబ్బ, గూటం దెబ్బ, చాకి రేవు దెబ్బ, వల దెబ్బల, నగారా దెబ్బల రుచి చూపించాలె.
లక్షలాదిగా స్వచ్ఛందంగా నడురి సూర్యాపేటకు. ఈ దోపిడి దొంగ దొరల సంగతేందో సూద్దాము👊 పోలీసోల్లు సంపుతే సద్దామి, కానీ మన బిడ్డను, మన ఇజ్జత్ ను కాపాడుకుందామి.
దొరలందరూ ఒక్కటైనప్పుడు, మనమందరం ఒక్కటి కావాలె. కలవాలె. నిలవాలె. గెలవాలె.
రాండి. ✊
శనార్తి🙏
#Janaiah
#SelfRespect
#VR99
#LiberateTelangana
జై భీం కి అవార్డ్ ఇవ్వకూడదు అన్నది ఒక కాన్షియస్ డెసిషన్ ...
మీరందరూ మరచిపోయినట్టున్నారు
గత సంవత్సరం కూడా దళిత వాదం వైపు నిలబడ్డ , దళిత పౌరషం , రోషం చూపించిన పలాస సినిమాకి అవార్డ్ రాలేదు
కలర్ ఫోటో అని ఒక పెసిమిస్టిక్ , చెత్త సినిమాకి అవార్డ్ ఇచ్చారు .... ఈ ఉప్పెన సినిమా కి బాబు అది
మూలాల్లోకి వెళితే .... మన మాదిగ సోదరులు చేసి ఇచ్చే చెప్పు తో మనమే కొట్టుకోవాలి
మన సమస్యల మీద మన కళల మీద మనకి అనుకూలంగా మనం ఓట్లేసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా ? వాళ్ళు కదా మాట్లాడాలి ...: మనం మాత్రమే సోషల్ మీడియా లో ఎందుకు చించుకోవాలి ?
ఓటు సరదాకి వేయం కదా...
మన ఓటు మన కోసం మాట్లాడాలి ... అందుకేగా మనకు ఓటు ఉంది
ఇదీ మనం ఆలోచించాలి
RSP Visiting USA for a week long tour with a big public meeting in New Jersey on August 27. Please register and share across this flyer and invite for RSVP 👇
Please RSVP and share across
https://t.co/XrpRy9qC8t
#RSPInForeign#RSPInUSA
కోరుట్లలో తరతరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి @BJP4India ను వీడి @BSP4Telangana లో చేరి బహపజనరాజ్యం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న సోదరుడు నిశాంత్ కార్తికేయ గౌడ్ గారికి అభినందనలు💐 కలుద్దాం. నిలుద్దాం. గెలుద్దాం. #VR99#LiberateTelangana
13500 టిచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని శాంతియుతంగా ముట్టడించిన డి.ఎడ్ బి.ఎడ్ అభ్యర్థులను అరెస్ట్ చేసి గోషామహల్ స్టేషన్ కి తరలించారు.
అసెంబ్లీ సాక్షి గా #కేసీఆర్ గారు ప్రకటించిన 13500 పోస్టులతో డిఎస్సి వెయ్యలని డిమాండ్.