బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన లండన్ లోని తెలంగాణ ఎన్నారైలు
రానున్న రోజుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం మరింత ఉదృతం
యూకేలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎందరో తెలంగాణ ఎన్నారైలు, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు @NaveenReddyBRS ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు @Anil_trs వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో భారీగా తెలంగాణ ఎన్నారైలు పార్టీలో చే��ినట్టు మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ గార్ల నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో పార్టీలో చేరుతున్నామని, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అని భావిస్తున్నట్టు ఎన్నారైలు తెలిపారు.
తరువాత ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు హరిబాబు నవాపేట్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గసభ్యులంతా ప��ల్గొన్నారు.
ఈ సమావేశంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి స్వాగతం పలుకుతూ, కేసీఆర్, కేటీఆర్ గార్ల నాయకత్వంలో క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎంతో పోరాటం చేస్తుందని, వారికి సంఘీభావంగా పార్టీ కార్యకర్తలుగా రానున్న రోజుల్లో అటు సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా లండన్ లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించినట్టు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. గత పదిహేను సంవత్సరాలుగా లండన్ లో పార్టీ చేస్తున్న కార్యక్రమాలని అలాగే ఎన్నారైలు పార్టీకి అండగా ఉంటూ చేస్తున్న సేవలని నూతన సభ్యులకి వివరించి వారికి దిశా నిర్దేశం చేసారు. అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు పార్టీ నాయకత్వం ఎన్నారైలను ఎంతో ప్రోత్సహిస్తుందని, కష్టపడి పని చేస్తే గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే సలహామండలి చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయం నుండి నేటి వరకు ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా నిలిచామని, అదే స్ఫూర్తి, క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ.. అందరికీ ఇంతటి అవకాశం కలిపించిన కేసీఆర్ గారికి సంస్థ పక్షాన కృతఙ్ఞతలు తెలిపి, కేవలం రాజకీయ ���ార్టీ వేదికలా కాకుండా ఎలాంటి సమస్యలున్నా కుటుంబంలా మనమంతా కలిసి ఉంటామని ఏదైనా సమస్యలుంటే సంప్రదించాలని సభ్యులకు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, మనం మరింత ఉత్సాహంతో పని చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలని, 420 హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం చెయ్యాలని, పార్టీకి అండగా నిలబడి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు విశ��రమించేది లేదని ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల తెలిపారు.
కార్యదర్శి రవి ప్రదీప్ గౌడ్ పులుసు మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని విశ్లేషణాత్మకంగా గణాంకాలతో సహా వివరించి ప్రశ్నిస్తున్నామని, రానున్న రోజుల్లో మరింత ఉదృతంగా ప్రభుత్వ అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇసెంపల్లి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి, అడ్వైసరీ బోర్డు చైర్మన్ సీక చంద్ర శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, అడ్వైసరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, కార్యదర్శి - ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కార్యదర్శులు అబూ జాఫర్, సురేష్ గోపతి, కోశాధికారి సురేష్ బుడగం, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇసెంపల్లి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, కార్యదర్శి - యూత్ వింగ్ ప్రశాంత్ మామిడాల, మెంబర్ షిప్ కో ఆర్డినేటర్ అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లునావత్ మరియు ముఖ్య సభ్యులు ఉన్నారు.
Shameful and Unacceptable | @NitishKumar
A Muslim woman, wearing a burqa and likely present to receive her joining letter, was subjected to public humiliation when Bihar CM Nitish Kumar reportedly reached out to pull down her Hijab/Mask.
The hijab is not a costume. It is faith