Extremely disappointed with @JioCare@reliancejio.
I’ve made 50+ calls (1991, 199, 1800....) only to be trapped in endless chatbot loops with 0 human response. My connection drops 30-50 times a day and now it's completely dead (red/blue lights).
1 of 2. Please see continuation...
పెద్ది
ఒప్పుకుంటాను కొన్ని సన్నివేశాలు అసలు బాగాలేవు, నాకు నచ్చలేదు, అలా తీసి ఉండకూడదు, దాని పైన చాలా విమర్శలు వచ్చాయి, వాటికి సంఘీభావం తెలుపుతున్నాను. అటువంటి సన్నివేశాలను ఇగ్నోర్ చెయ్యమని, అది మంచి ప్రవర్తన కాదని కూడా మా అబ్బాయికి చెప్పాను.
ఇకపోతే “మిగతా” సినిమా అంతా గొప్పగా ఉంది. ముందుగా ఇప్పుడు వస్తున్న మిగతా తెలుగు సినిమాల్లా రోత హాస్యం, వెగటు హింస లేకుండా ఒక ప్రేరణ కలిగించే కథతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
నటులలో @AlwaysRamCharan అత్యద్భుతమైన నిబద్ధతని కనబరిచారు. ప్రతిసన్నివేశంలో ఆయన తన దేహం గురించి గానీ, ఆహార్యం విషయంలో కానీ, నటన విషయంలో కానీ తీసుకున్న ప్రతీ చిన్న జాగ్రత్త లేదా మెళకువలు బాగా కనిపించాయి. ప్రేక్షకుడిని ఆయన లోకువగా తీసుకోలేదు. అతన్ని అలా చూడాలి అనిపించింది. అయితే అతని ప్రవేశ సన్నివేశంలో వెనక నుంచి చూపించడం ఆయన నడకలో @KChiruTweets కనిపించడం ఎన్నో జ్ఞాపకాలని తోడింది.
శుభలగ్నం సినిమా నుంచి నాన్నకు ప్రేమతో మొదలుకుని నేను @IamJagguBhai సినిమాలని వేటినీ వదలకుండా చూసాను. ఈ చిత్రంలో ఆయన పాత్ర నాకు బాగా నచ్చింది, ప్రస్తుత తెలుగు సినిమాలో కోట శ్రీనివాసరావు లాంటి మహామహులు వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు తీర్చగలిగేది ఈయనొక్కరే. ఆయన ఆఖరి సన్నివేశం గుండెల్ని పిండింది.
ఇకపోతే సినిమా మొత్తం నా బాల్యంతో ముడిపడిన విజయనగరం, బొబ్బిలి ప్రాంతంతో తీయడంతో నేను బాగా కథకి దగ్గరయ్యాను. ఉత్తరాంధ్ర యాసని చక్కగా చూపారు. చక్కెర కర్మాగారం బొబ్బిలిలో నేను చదివేటప్పుడు దూరంగా కనిపించే లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ పొగగొట్టాన్ని గుర్తుచేసింది. గౌరునాయుడు, అచ్చియ్యమ్మ, పెద్ది, అప్పల సూరి ఈ పేర్లు అన్నీ మా ఊర్లో ఉన్నాయి. ఎప్పుడో ఛత్రపతిలో అప్పలనాయుడు పాత్ర పేరు విని మా ఊర్లో ఒకరిపేరు ఇది అని సంతోషించిన నాకు ఇన్ని పేర్లు ఒకేసారి వినటం బాగా ఆనందం కలిగించింది. అలాగే వసతులు లేక వలసలు పోయే ఎన్నో ఉత్తరాంధ్ర ఊర్ల కథ ఇది.
అలాగే కుస్తీ ఆట విషయంలో ఉత్తరాంధ్ర చరిత్రని చెప్పటమే కాక, ఆ ఆట విషయంలో దర్శకత్వ జట్టు సునిశిత పరిశీలన కూడా బాగా నచ్చింది. కుస్తీ పట్టేవాళ్లలో ఉండే కాలీఫ్లవర్ చెవులని కూడా చూపించారు. అప్పటికి విజయనగరంలో చందన బ్రదర్స్ మాత్రమే ఉండేది కానీ సినిమాలో సీఎంఆర్ అని చూపించారు, వాణిజ్య కారణాల వలన కావచ్చు. అలాగే వెనక దుకాణాలపైన పైడితల్లి వంటి పేర్లు కనిపించాయి. గంటస్తంభం సెట్ కూడా బాగుంది. అయితే సాధారణంగా గ్రామీణ ప్రజలు ఎక్కువమంది ఇజీనగరం అని పలుకుతారు కానీ ఇక్కడి పాత్రలన్నీ విజయనగరం అని పిలుస్తారు. సినిమాలో చూపించిన క్రికెట్ ఆట ఎలాగూ మా చిన్నప్పటి మా చిన్నాన్నలు ఆడిన గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్లని చూపించింది.
బోమన్ ఇరానీ పాత్ర మధ్య మధ్యలో వచ్చి చిరాకు పెట్టింది. ఇకపోతే కథానాయిక పాత్ర పూర్తిగా తీసేస్తే సినిమా ఇంకా బాగుంటుంది. రావు రమేష్ ని వాడుకోలేదు. సంగీతం అంతంత మాత్రం. నృత్యం బాగాలేదు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటే బాగుణ్ణు అనిపించింది. అదనపు సెంటిమెంటు సీన్లు ఉన్నాయి.
దివ్యేందు పాత్రకి న్యాయం చేసారు. పోరాటాలు బాగున్నాయి. చిత్రణ బాగుంది. ఎక్కువగా ఏఐ వాడలేదు. డూపులు కూడా వాడినట్లు కనపడలేదు. కథ ఊహించదగినదిగా ఉన్నప్పటికీ కథనం బాగుంది. ఈ ఎవడో రావడం, ఎంక్వయిరీ చెయ్యటం, దానికి ఇంకొకడు ఫ్లాష్‌బ్యాక్ చెప్పటం ఇక ఆపేస్తే బాగుంటుంది. తక్కువ పాత్రలు పెట్టుకుని వాటికి మంచి సంభాషణలు రాసుకుంటే బాగుంటుంది. క్రీడ నేపథ్యంలో కథ రాసుకోవటం అన్నింటికన్నా నచ్చిన విషయం. చూసే పిల్లలకు ఒక ప్రేరణ కావచ్చు.
తెలుగు భాషా ప్రేమికుడిగా ఒకవైపు ఉత్తరాంధ్ర యాసను బాగా చూపారు అని సంతోషిస్తూనే ఒక్క నిర్మాత తప్ప ఎవ్వరి పేరూ తెలుగులో వేయలేదు అన్న బాధ కలిగింది.
కథానాయకుల చేత ఆ బీడీలు, బీరు సీసాలు తాగించడం మానండిరా బాబు.
మొత్తానికి సినిమా నాకు బాగా నచ్చింది.
మనం ఎంత గట్టిగా కోరుకున్నా...
కొన్ని జరగవు..!
ఎందుకంటే మన జీవితంలో జరగాల్సిన "అద్భుతం" వేరే చోట ఉంది కాబట్టి....!
ఆ అద్భుతాన్ని సరైన సమయంలో సరైన విధంగా వచ్చేలా చేసేదే " కాలం".....!
ఆ అద్భుతాన్ని చూడాలి అన్నా...అది మన జీవితంలోకి రావాలి అన్నా... ఆ సమయం కోసం వేచి చూడాలి ......
అన్న @naralokesh
నా పేరు అడ్డాల నరసింహారావు ,మా నాన్న పేరు అడ్డాల కనకం. మాది డా"బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం మోరి గ్రామం,2016 మన ప్రభుత్వం అధికారం లో ఉండగా మాకు ఇంటి రుణం మంజూరు అయినది, ఇంటి నిర్మాణం మొదలు పెట్టి పూర్తి చేసి ఉన్నాము , మంజూరు అయిన రుణం నిమితo ఒక రూపాయి మా నాన్న గారు అకౌంట్ లో జమ అయినది, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా అటువంటి అమౌంట్ ను మేము పొందలేదు,తరువాత గవర్నమెంట్ మారినది,నేను అంత తిరిగిన ప్రయోజనం లేదు ,మళ్ళీ మన ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఎంతో ఆశతో ఈ జనవరి నుంచి మా అమ్మ గారి పేరున మూడు ఆన్లైన్ కంప్లైంట్స్ పెట్టడం జరిగినది, AE గారు DE garu ఇంటికి వచ్చి వస్తాయి వస్తాయి అని చెప్పి మేము పైకి పంపిన praposal కాపీలు ఇవ్వమని అడిగిన ఇస్తాం అని చెప్పి కంప్లైంట్స్ పేపర్స్ మీద సంతకం చేయించుకుని వెళ్ళారు,మేము మొదటి కంప్లైట్ పెట్టినపుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి , హౌసింగ్ అధికారి గారికి కూడా పోస్ట్ ద్వారా లెటర్స్ కూడా పంపడం జరిగినది,కావున మా ఈ సమస్యని పరీక్షరిస్తారని కోరి ప్రాధిస్తున్నాను
@ncbn@AndhraPradeshCM@PawanKalyan@APDeputyCMO@kolusu_o28210@mlkhattar

An update regarding @AlwaysRamCharan Garu's injury on the sets of #Peddi.
We promise everything is safe and on track ❤️
Kindly do not speculate. Thank you.