అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్
🔹పౌష్టికాహారం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు
🔹అంగన్వాడీ కేంద్రాలకు చూడముచ్చటైన డిజైన్
🔹దివ్యాంగులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల అమలు
🔹ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానం
🔹మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం శ్రీ @Revanth_Anumula
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారటం సరైంది కాదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా.. లేదా పక్కాగా అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కేవలం రికార్డుల్లో రాసుకొని పౌష్ఠికాహారం దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బయో మెట్రిక్ అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్ వాడీ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వాటి పరిధిలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆడిటింగ్ వీలుండేలా అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచాలని చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో జనాభాకు సరిపడే అంగన్వాడీ కేంద్రాలు లేనందున, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవం నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే శానిటరీ నాప్కిన్స్ వినియోగంపై బాలికలకు అవగాహన కల్పించి, నాప్కిన్స్ పంపిణీ చేయాలని చర్చ జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలతో శానిటరీ నాప్కిన్స్ తయారీ చేయించాలని, అందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పాలని ఆదేశించారు. విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న వాటిలో ఇప్పటికే 12,315 అంగన్ వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటికి సొంత భవనాలను నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలు చేపడుతామని చెప్పారు.
రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకే డిజైన్తో అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని సీఎం పలు సూచనలు చేశారు. చూడగానే ఆకర్షించేలా అంగన్వాడీ కేంద్రాల భవనాలన్నింటికీ ప్రత్యేకంగా డిజైన్ చేయాలని చెప్పారు. మాతా, శిశు సంక్షేమం ఉట్టిపడే చిత్రాలు, ఆకర్షించే రంగులతో ఈ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలని చెప్పారు. అవసరమైతే ఆరేండ్ల లోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు.
దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. చట్ట ప్రకారం ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఫైలు సిద్ధం చేసి పంపించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు. ట్రాన్స్ జెండర్లకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్లోనే వారికి చికిత్సలు చేస్తున్నారనే చర్చ జరిగింది. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ అన్నిట్లో ట్రాన్స్ జెండర్లకు వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలన్నీ వారికి వర్తించేలా, వారికి సరైన అవకాశాలు కల్పించేందుకు, సంక్షేమానికి వీలుగా ప్రత్యేక విధానాన్ని తయారు చేయాల్సి ఉందని అన్నారు.
ఈరోజు సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ, మాతా శిశు సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్రీమతి క్రాంతి వెస్లీ, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ విభాగం శ్రీమతి శైలజ, సంబంధిత శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈరోజు TPSF రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అద్వర్యం లో PRC కమిటీ ని కలిసి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల కు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింప జేయలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రేడ్స్ గురుంచి కూలంకుశంగా చర్చించడం జరిగింది. @TelanganaCMO@seethakkaMLA @mpponguleti @tpsf2019
Dear @TelanganaCMO ,
One of the Junior Panchayat Secretaries(Outsourcing) has applied to the Collector to either solve his problem or allow him for EUTHANASIA!!!! The frustration levels in this issue are really scary.
I request you to kindly act upon this on humanitarian grounds urgently to save lives. It seems they(Around 80 of them) have spent ₹50 lakhs for seeking elusive justice !!! Where will poor people get such money from?
గత ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు పనిచేసిన తర్వాత చేయని తప్పుకు అన్యాయంగ (98 ) JPS లను తొలగించింది. దాదాపు రెండు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగితే దాదాపు 70 పేజీల సుదీర్ఘ జడ్జిమెంట్ ను వాళ్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిందంట.
దీనిని అమలు పరచాలని గత ప్రభుత్వంలో మంత్రులను కూడా వారు కలిశారు. కానీ లాభం లేదు.
జిల్లా కలెక్టర్ ని కలిస్తే కమిషనర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు, కమిషనర్ ను కలుస్తే ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరు చెబుతున్నారు, ప్రిన్సిపల్ సెక్రెటరీని కలుస్తే ప్రభుత్వం పేరు చెప్తున్నారంట!!! ఇక ప్రభుత్వం అంటే ఎవరు??? దాని అడ్రసు ఎక్కడ???
ప్రస్తుతమున్న మినిస్టర్స్ అందరిని దాదాపు కలిశారంట, సీఎం ఓ లో కూడా ఫిర్యాదు చేసిండ్రంట. ఇప్పుడు అలసిపోయి జిల్లా కలెక్టర్లకు కారుణ్య మరణానికి (Raw గా చెప్పాలంటే ఆత్మహత్యకు పర్మిషన్ లాంటిది) కూడా అప్లై చేశారంట.😭
దాదాపు మూడు సంవత్సరాలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు. చాలా మందికి పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలు వచ్చినప్పటికీ పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం ఉందని ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసిండ్రు.
ప్రస్తుతం ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం రెండు లేకుండా పోయాయి.
వీళ్లలో చాలామంది స్పోర్ట్స్ కోటాల కాకుండా రిజర్వేషన్లలో ఉద్యోగం వచ్చింది. వీళ్ల కంటే తక్కువ మార్కులు ఉన్నవాళ్లు కూడా ఉద్యోగంలో ఉన్నారు!
చాలామందికి వయసు కూడా అయిపోయింది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కూడా కాదు తప్పు ఏమి లేకుండా దాదాపు మూడు సంవత్సరాల నుంచి వీరు మానసిక వేతన అనుభవిస్తున్నారు.
@TelanganaCS
మేడం @seethakkaMLA గారు తమరికి విన్నపం చేయుచున్నది ఏమ్మనగా ప్రతీ సారి పెట్టినట్టు ఈసారి కూడా పెట్టారు శుభం కానీ అక్కడ మాకు 2 ఆప్షనల్ హాలీడే ఇంకా 1 Sunday దెబ్బ తింటున్నాయి కావున ఎలా అయితే ప్రజాపాలన లో హాలీడే కూడా ఇచ్చారో ఇక్కడ కూడా మాకు మినహాయింపు ఇవ్వాల్సింది గా కోరుతున్నాము
@TelanganaCMO@aclb_kb@Collector_KB @mpponguleti
@TV9Telugu
గ్రామసభలు పెట్టింది,అప్లికేషన్లు నింపించి తీసుకున్నది మేము ఆఖరికి oneline చేస్తుంది మేమే అయిన మమ్మల్ని గుర్తించే వారే లేరా?
మా కష్టాన్ని గుర్తించకున్న పర్వాలేదు కానీ మా కష్టాన్ని వేరే వారి ఖాతాలో వేయడమేంది?
#పంచాయతీరాజ్
లంచం ఎందుకు తీసుకోవాలో షాకింగ్ కారణం చెప్పిన ఎమ్మార్వో.
మంత్రులు ఉన్నతాధికారులు పర్యటనకు వస్తే లక్షల్లో ఖర్చవుతుంది అందుకే మేము లంచం తీసుకోక తప్పడం లేదు.
--- మడకశిర మండల ఎమ్మార్వో
దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ఒక అప్తమిత్రుణ్ణి కోల్పోయాము.ఈ ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడిన OPS మిత్రుడు "ప్రశాంత్" కు మావంతు చిన్న సహాయంగా KBఆసిఫాబాద్ జిల్లాకమిటీ తరుపున 50K సహాయాన్ని అందించడంజరిగింది.ప్రశాంత్ ను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం
@KTRBRS@TelanganaCMO
How can we treat the same athletes who have brought so much of honour & glory & countless medals for this country be treated so inhumanly???? HOW? ?
Is this what this has come to ???
#ShameOnUsAll#WrestlersProtest