వరంగల్ కమిషనరేట్‌లో ముగిసిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్
గత మూడు రోజులుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామునూరు పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ గురువారం ఘనంగా ముగిసింది. ఈ డ్యూటీ మీట్లో జోనల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్ లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ విభాగాల్లో పోటీపడ్డారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ చేతుల మీదుగా పతకాలు అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగం 13 గోల్డ్ మెడల్స్‌తో కలిపి మొత్తం 28 పతకాలను సాధించింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం 12, మహబూబాబాద్ జిల్లా 13, ఖమ్మం 9 పతకాలను సాధించాయి.
ఇందులో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు త్వరలో మల్కాజిగిరి కమిషనరేట్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొంటారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఇలాంటి డ్యూటీ మీట్ల ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. కఠోర సాధన ద్వారా వృత్తి నైపుణ్యంతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచవచ్చని, ముఖ్యంగా వృత్తి నైపుణ్యం సాధించడం ద్వారా విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిళ్లను అధిగమించవచ్చని పేర్కొన్నారు. జోనల్ స్థాయిలో కనబరిచిన ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కూడా కొనసాగించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
విజయవంతంగా ఈ పోటీలను నిర్వహించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు శ్రీనివాస్, బాలస్వామి, ఏసీపీలు సురేంద్ర, డీఎస్పీలు శ్రీనివాస్, సాంబరాజు, ఆర్ఐలు సతీష్, ఇన్స్పెక్టర్లు క్రాంతికుమార్, విశ్వేశ్వర్, శ్రీనివాస్, ఎస్ఐ విజయ్ కుమార్, ఆర్ఎస్ఐ శ్రవణ్ కుమార్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaDGP@TelanganaCOPs
Participated in a four-day training programme for police trainers of the Bhadradri Zone on effective crowd management during festivals, processions and other law and order related instances.
The training will empower them with skills and strategies for professional and respectful approach while handling law and order issues.
@dgptelangana@telanganacops
@TNewsTelugu The ward member of Theegaram village, elected from the BRS Party, has willingly joined the Congress Party. In a video, he clarified that he was not kidnapped and joined voluntarily. The social media post alleging his kidnapping by Congress workers is completely false.
@TeluguScribe The ward member of Theegaram village, elected from the BRS Party, has willingly joined the Congress Party. In a video, he clarified that he was not kidnapped and joined voluntarily. The social media post alleging his kidnapping by Congress workers is completely false.
అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.
అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, కవిత వరంగల్ పోలీస్ కమిషనర్ ని మర్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డ్ స్థాయి వరకు అందరూ ఎన్నికలు ప్రకటన తేది నాటి నుండి ప్రణాళిక ప్రకారం పనిచేయడంతో పాటు పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్త్ నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంలో కీలకంగా నిలిచిన పోలీస్ కమిషనర్ అధికారులు, పోలీస్ సిబ్బందిని అభినందనలు తెలియజేసారు.
@TelanganaDGP@TelanganaCOPs #GP_Elections
New Cyber Fraud Alert! 🚨
Scammers posing as bank executives are couriering pre-configured phones under the guise of “DoT SIM Verification”. Don’t fall for it - never accept unsolicited devices or share personal details.
#CyberSafety#StayAlert#TGCSB#CIPLK
యువత మత్తుకు బానిసలుగా మరొద్దు
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.
యువత మత్తు పదార్ధాలకు బానిసలుగా మరొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ యువతకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ డివిజినల్ పోలీసుల ఆధ్వర్యంలో భీమారంలోని ఎస్. వీ. ఎస్ కళాశాలో ఏర్పాటు చేసిన కార్యక్రమనికి ముఖ్య అతిదులుగా హాజరైన వరంగల్ పోలీస్ కమిషనర్, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ముందుగా కాలేజీ ఆవరణలో ముందుగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషరేట్ మాదక ద్రవ్యాలను తరిమికొట్టాల్సిన భాధ్యత మనందరి పై వుందని, మత్తు పదార్ధాలకు యువత దూరంగా వుండాలని, డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు అంధకారంగా మారుతుందని, యువత డ్రగ్స్ పై పోరాటం చేయాలని, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా మత్తు పదార్ధాలు విక్రయించినా, వినియోగించినా పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు యువత విద్యార్థులు కలసికట్టుగా ముందడుగు వేసి వరంగల్ ను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని అన్నారు. సమాజంపై మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిడబ్ల్యూఎంసి కమిషనర్
మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలన్నారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దన్నారు.
అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకం సంఘటితం అవుతామని, సమాజం నుండి మాదక ద్రవ్యాలను తరిమి వేద్దామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు నర్సింహా రావు, కాజీపేట్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్లు రవికుమార్, శివకుమార్, రంజిత్ కుమార్, కేంద్ర సాహిత్య అవార్డు అంపశయ్య నవీన్, ఆచార్య రవికుమార్, అనిత ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
@cpwarangal@TelanganaDGP@TelanganaCOPs #drugfreesociety #drugfreewarangal
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైన ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై కఠిన చర్యలు వుంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ మందుబాబులను హెచ్చరించారు
సోషల్ మీడియాలో కనిపించే పెట్టుబడి చిట్కాలను నమ్మే ముందు జాగ్రత్త. ఇన్వెస్టిమెంట్ల విషయంలో అపరిచితుల్ని అస్సలు నమ్మొద్దు. అత్యాశతో పెట్టుబడి పెడితే మోసపోతారు. ఇన్వెస్టిమెంట్ మోసాలపై ఇతరులకు అవగాహన కల్పించండి.
#telanganapolice