అన్నయ్య @PawanKalyan గారు. నాకు తెలిసిన ఈ వైసీపీ నాలుగున్నరేళ్ల పాలన లో మీ ప్రసంగం అయిపోయాక ఇంత టైం ఒక్కళ్ళు కూడా మీడియా మైకులు ముందుకి రాకపోవటం ఇదే మొదటిసారి. ఒక్క మంత్రి ఒక్క mla కూడా రాలేదు ఇప్పటివరకు 🤔. స్క్రిప్ట్ ఇచ్చే సజ్జల ఆలోచనలో పడ్డాడా లేక వీళ్ళే ఆలోచనలో పడ్డారో భయం తో అర్ధం కాలేదు 😂😂
చంద్రబాబు కు నేను అభిమాని కాదు, ఆయనతో బంధుత్వం లేదు, ఆయనతో విభేదించే అంశాలు చాలా ఉంటాయి, రాజధాని 33 వేల ఎకరాలు వద్దు, 5 వేల ఎకరాలు చాలు అని చెప్పిన వాడిని, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది అని గౌరవిస్తాను - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#HelloAP_ByeByeYCP
రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి పొత్తు పెట్టుకోవడం తప్పుకాదు.
పాలసీల పరంగా అభిప్రాయ బేధాలు ఉండొచ్చు కానీ, పొత్తు పెట్టుకోకపోతే రాష్ట్రం అంధకారం అయిపోతుంది.
-శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు!!
@JanaSenaParty || @PawanKalyan
@PawanKalyan@JanaSenaParty@NagaBabuOffl@mnadendla@AjayaKumarJSP@JSPShatagniTeam
పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ చేసే విమర్శల్లో పస ఉందా?
1) జనసేనని టీడీపీకి తాకట్టు పెట్టారు - నాకు అసలు అర్థం గాని ఒక విషయం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తాకట్టు పెట్టినట్టేనా? ఒక పార్టీ పెట్టి, నానా మాటలు అంటుంటే పడి, రోజుకి కొంత సమయం పార్టీకి కొంత సమయం వృత్తికి కేటాయిస్తూ, వచ్చిన సంపాదనను పార్టీకి ఖర్చుపెడుతూ, ఎంతో మంది కొత్త నాయకులను తయారుచేసి అసెంబ్లీకి పంపాలని ప్రయత్నిస్తుంటే దీనిలో తాకట్టు పెట్టడం ఏమిటి? తాకట్టు పెట్టడం అంటే మాకు ఏమీ సీట్లు వద్దు మీకు ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తాము అంటే తాకట్టు పెట్టడం అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీ నే బీజేపీ కి తాకట్టు పెట్టారు. కేసుల భయంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఒక్క బిల్లుని కూడా వ్యతిరేకించలేకపోయారు. వీరి కేసుల కోసం రాష్ట్ర అభివృద్ధిని కూడా పట్టించుకోకుండా గెలిచిన MP లందరినీ బీజేపీకి తాకట్టు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నూతన నాయకత్వం - అవినీతిలేని ప్రభుత్వం. ఆ వైపుగా అతను జనసేనని ముందుకి నడిపిస్తున్నాడు. ఎంతోమంది కొత్త నాయకులను అసెంబ్లీకి పంపడం కోసం ఎవరు ఎన్ని మాటలన్నా భేఖాతర్ చేయకుండా ముందుకు కదులుతున్నాడు.
2) ప్యాకేజీ ఆరోపణలు - రాజకీయాలు కాకుండా ఏ వృత్తి లేకపోయినా వందల వేల కోట్ల రూపాయిల ఆస్తులు కూడబెడుతున్నారంటే చేసే ప్రతి పనిలో ఎంత ప్యాకేజీ తీసుకుంటున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్యాకేజీ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తన ఒళ్లు హూనం అయ్యేలా రెండు పడవలపై ప్రయాణం చేయాల్సిన పనిలేదు. అతని ఆస్తి వ్యక్తిత్వం - ఇవ్వడమే తప్ప అడిగిన చేతులు కావవి. అక్రమాస్తుల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ, అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వాళ్లు కూడా అతని మీద ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. వైసీపీ మనస్తత్వం ఏమిటంటే తమకున్న బురదని నలుగురికి అంటించి ఆనందపడడం. వాళ్లు ప్రభుత్వంలో ఉన్నారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు అందరి అక్రమ ఆస్తులపై విచారణ జరిపిస్తే ప్యాకేజీలు ఎవరు తీసుకున్నారో ప్రజలకు తెలుస్తుంది. అలా చేయాలంటే వాళ్ళకి భయం, వాళ్ళ పార్టీ వాళ్లందరూ బయటకు వస్తారని.
3) కాపులకు ద్రోహం చేశారు - మొదటిది పవన్ కళ్యాణ్ కేవలం ఒక కులం ఆధారంగా పార్టీ పెట్టలేదు. రెండవ విషయం ఇన్ని సంవత్సరాలుగా ఆ సామాజిక వర్గం రాజకీయ నాయకులు చేయని ద్రోహం పవన్ కళ్యాణ్ గారు చేశారా? మీకు ఆ సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే మీ కుటుంబాలే ఎప్పుడూ పదవులు అనుభవించకుండా ఈ సారి ఎన్నికల్లో ఆ సామాజిక వర్గంలో ఉన్న యువ నాయకులకు అవకాశం ఇవ్వండి. అలా ఇచ్చే ధైర్యం లేదు కానీ విమర్శ మాత్రం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పుణ్యమా అని మీ సామాజిక వర్గంలో కూడా ఎంతో మంది యువ నాయకులు తయారవుతున్నారు, వారిని తొక్కేయాలనేది మీ ఆలోచన. ద్రోహం చేసేది మీరా లేక పవన్ కళ్యాణ్ గారా?
✍️ రమేష్
పొత్తు ఎందుకు అని ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈ సంఘటనలే కారణం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే అకారణంగా నిర్బంధిస్తారు, నాయకులను కారణం లేకుండా అరెస్టు చేస్తారు. మనిషి ప్రాథమిక హక్కులని కూడా హరిస్తుంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం పార్టీలకు ఉంటుంది. అందుకే నిర్ణయాలు ఆ దిశలోనే తీసుకుంటారు.
దమ్ముంటే 175 సీట్లలో పోటీ చెయ్యండి అని వైసీపీ అంటుంది..
Pawan Kalyan Response:
"జగన్ ని రాజమండ్రి నుండి పోటీ చెయ్యమని మేము అంటున్నామా?... మీ మాటలన్నీ... లోపల పెట్టుకోండి"
#ChandrababuArrest
మేము మా పార్టీ ఎలా నడపాలి మా ఇష్టం, మేము @ysjagan ను పులివెందుల నుండి కాకుండా గోదావరి జిల్లాలో పోటీ చేయండి అంటే వింటారా? మీ అభిప్రాయాలు మీ దగ్గర పెట్టుకోండి - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#HelloAP_ByeByeYCP