నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు
•క్రీస్తు పూర్వం నుంచే కృష్ణా తీరాన విరాజిల్లిన విషయాన్ని చెప్పే శాసనాలు
•చారిత్రక స��క్ష్యాలను వెలుగులోకి తెచ్చిన పురావస్తు శాస్త్రవేత్తలకు శ్రీ @PawanKalyan గారి అభినందనలు
•మన వారసత్వ సంపద గుర్తింపు, సంరక్షణ మా బాధ్యత
•అటవీశాఖ నుంచి నిరంతర సహకారం అందిస్తామన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ(ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావడం అద్భుత పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గత నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం మండల పరిధిలోని, అయ్యంబొట్లపల్లె గ్రామం వెలుపల మొదలుపెట్టిన అన్వేషణ��ో తెలుగు లిపిలో చెక్కిన 13వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కాకతీయ రాణి రుద్రమదేవి వద్ద సేనాపతిగా పని చేసిన మల్లికార్జున నాయకుడు - నాటి ధాన్యకటకం, నేటి ఆమరావతిలోని బుద్ధదేవునికి కృష్ణానది తీరంలోని వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు సదరు శాసనం తెలియజేస్తున్��ట్టు పురావస్తు శాస్త్రవేత్తలు వివరించారు.
ఈ అంశంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ.. ‘మన చారిత్రక వారసత్వ సాక్ష్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోన్న పురావస్తు శాస్త్రవేత్తలకు, వారికి సహకరిస్తున్న రాష్ట్ర అటవీశాఖ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలు బదులిస్తాయి. అంతేకాదు నేటి ఈ అమరావతిలోనే క్రీ.పూ. 4వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు బౌద్ధం ఆనవాళ్లు, అమరావతి స్తూపం ఉన్నట్టు ఆధారాలు లభించాయి. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గొప్ప బౌద్ధ క్షేత్ర��గా అమరావతి శతాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందినట్టు తెలుస్తోంది. మన వారసత్వ సంపద గుర్తింపుతోపాటు సంరక్షణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నల్లమల అటవీ ప్రాంతంలో మరింత లోతైన పరిశోధనలకు అటవీశాఖ తరఫున భవిష్యత్తులోనూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. వన్య ప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన ప్రాచీన వైభవాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంద’న్న��రు.
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియకు విశేష స్పందన
• 7 రోజుల పాటు సాగిన సమాచార సేకరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకుపైగా దరఖాస్తులు
• వచ్చే 2 వారాల్లో దరఖాస్తుల పరిశీలన
• ఆగస్ట్ 15 నాటికి పంచాయతీ నుండి పార్లమెంట్ స్థాయి వరకు కమిటీల నియామకం పూర్తి చేసేలా అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నిర్ణయం
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
గౌరవ ఉప ము��్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సహకారంతో ప్రారంభమై నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్న కడప మున్సిపల్ స్కూల్ స్మార్ట్ కిచెన్..!
#PawanKalyanAneNenu
Every milestone towards Viksit Bharat – 2047 is a step towards realizing the visionary dream of Hon'ble Prime Minister Shri @narendramodi Ji. The National Launch of VB-G RAM G from Mukkavaripalli in Railway Koduru Constituency, Andhra Pradesh, is one such historic milestone, making it a proud and memorable occasion for our State.
My heartfelt gratitude to Hon'ble Union Minister for Rural Development Shri @ChouhanShivraj Ji for graciously honouring our request and launching VB-G RAM G from Andhra Pradesh. This recognition reflects the Government of India's confidence in our State's commitment to transparent governance, effective implementation, and accelerated rural development.
The announcement of ₹7,707 crore for Andhra Pradesh under VB-G RAM G, coupled with ₹422 crore under PMGSY-IV for 146 road works covering 347 km and 19 bridges, is far more than an investment in infrastructure—it is an investment in the aspirations of our villages, the dreams of our farmers, the opportunities for our youth, and the future of rural Andhra Pradesh.
I also express my sincere gratitude to Hon'ble Prime Minister Shri @narendramodi Ji, whose unwavering commitment to rural empowerment continues to transform the development landscape of our nation. These landmark initiatives stand as a testament to his vision of creating vibrant, self-reliant villages as the foundation of a Viksit Bharat.
The confidence reposed in Andhra Pradesh through one of the country's largest allocations under VB-G RAM G is both an honour and a responsibility. The Government of Andhra Pradesh accepts this responsibility with utmost sincerity. We are committed to ensuring that every sanctioned road, every bridge, and every rupee entrusted to us is translated into quality infrastructure, improved livelihoods, and lasting development. We shall never disappoint the confidence reposed in our State by the Government of India.
Together, under the leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi Ji, with the continued support of Hon'ble Union Minister Shri Shivraj Singh Chouhan Ji, and under the leadership of Hon'ble Chief Minister Shri @ncbn Garu, the Government of Andhra Pradesh remains committed to building stronger villages, empowered communities, and a Viksit Andhra Pradesh that contributes meaningfully to the vision of Viksit Bharat.
@PMOIndia@MoRD_GoI@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
ప్రజల క���్టాలు తీర్చే పవర్ హౌస్లా పంచాయతీరాజ్ వ్యవస్థ మారాలి
•గత ప్రభుత్వ విజన్ లేని పాలన వల్లే పంచాయతీలు దెబ్బ తిన్నాయి
•గత రెండేళ్లలో గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా రూ.4,200 కోట్లు బదిలీ
•వ్యవస్థలు బలంగా నడవాలంటే ఉద్యోగుల పాత్రే కీలకం
•ప్రజల కోసం మీరు ఒక అడుగు వేస్తే... మీ కోసం నేను వంద అడుగులు వేస్తా
•మనం చేసే ప్రతి పనిలో పారదర్శకత ఉండాలి
• శ్రీ వెంకట కృష్ణ గారి లాంటి అధికారుల వల్లే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది
•పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు
•ప్రభుత్వ అదనపు కార్యదర్శి శ్రీ కె. వెంకటకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
యువత ఉచితాలు అడగటం లేదు
నేను హుద్ హుద్ తుపాను సమయంలో శ్రీకాకుళంలో పర్యటించినపుడు ఓ యువకుడు అన్న మాట నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మాకు 10 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండని కోరాడు. ఈనాటి యువత ఉచితాలు అడగటం లేదు. వారికి గౌరవమైన జీవనం ఇవ్వాలని కోరుతున్నారు. జనసేన పార్టీ సంక్షేమ పథకాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ సంక్షేమ పథకాలతోనే ఓట్లు వస్తాయి... ప్రభుత్వాన్ని నడిపేద్దాం అనుకుంటే మాత్రం తప్పు. వైసీపీ అలా అనుకునే బోర్లాపడింది. బటన్లు నొక్కాం అనే పేరుతో వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు, వసతులను పట్టించుకోలేదు. రోడ్లు నిర్మ���ంచలేదు. ఇప్పుడు మళ్లీ వాటిని సరిదిద్దడానికి తపన పడుతున్నాం. వ్యవస్థలు బలోపేతం కావాలని మేం కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాల కోసమే ప్రభుత్వం నడిపితే ప్రజలకు అవసరం అయ్యే విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలన్నీ గాలిలో దీపాలుగా మారుతాయి. కూటమి ప్రభుత్వంలో రోడ్లను వేస్తున్నాం. గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయిన ప్రతి వ్యవస్థకు పునరుజ్��ీవం పోస్తున్నాం. ప్రాధాన్యత పరమైన సంక్షేమం మంచిదే. కానీ బడ్జెట్ దేనికోసం కేటాయించాలి..? దేనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాలను జనసేన నాయకులు ప్రజల్లో అవగాహన తెచ్చేలా పనిచేయాలి. నాయకుడు ప్రజల భావం మాట్లాడాలి. ప్రజలకు ఏది అవసరమో దానిపై మాట్లాడాలి.
• ప్రజాస్వామ్యబద్ధంగా జనసేన పార్టీ నిర్మాణం
జనసైనికులు, వీర మహిళలే పార్టీకి సారథులు. క్యాడర్ టూ లీడర్షిప్ లో భాగంగా 28 మందితో సమాచార సేకరణ కమిటీలను నియమిస్తున్నాం. పార్టీ కోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ప్రత్యేక ఫార్మాట్ ప్రకారం సమాచారం సేకరించి, వీరు నా ముందుకు తీసకొస్తారు. పార్టీ కోసం ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు..? ఏ కార్యక్రమాలు చేశారు..? ఎలాంటి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు..? చేసిన సేవలు ఏంటీ..? ప్రజలతో ఎలా మమేకం అవుతారు..? అనే అన్ని రకాల విషయాలను బేరీజు వేసి, బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. బాధ్యతలను కూడా ప��ర్టీ కార్యకర్తల సమక్షంలోనే మీరు చెప్పిన విధంగానే పూర్తి పారదర్శకంగా నియామకం చేస్తాం. 28కి అదనంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మరో 5 మంది బృందాన్ని పంపుతున్నాను. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న కిందిస్థాయి కార్యకర్తలను కనీసం గుర్తించకపోతే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ఎలా సాధ్యం..? అనే ఆలోచన నుంచే ఈ కార్యక్రమం అంకురించింది. ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఇవ్వాలని, బాధ్యతలు అప్పగించడానికి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తాం. పార్టీ కార్యకర్తల సమక్షంలో, పార్టీ కార్యకర్తలే నాయకుల్ని పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసే విధానం ఇది. సమాచార సేకరణ కమిటీలు జాగ్రత్తగా సేకరించే సమాచారంతోనే ఆంధ్రప్రదేశ్ భావినాయకత్వం అన్ని స్థాయిల్లోనూ వస్తుంది. బలమైన వ్యవస్థలను నిర్మించాలంటే బలమైన వ్యక్తుల సమూహం కావాలి.
• కులాన్ని రాజకీయ పెట్టుబడిగా వాడుకోను
���ులం సామాజిక చిత్రపటం. కులాన్ని నేను మార్చాలని ప్రయత్నం చేయను. సరిదిద్దాలని ప్రయత్నం చేయను. కులాల ఐక్యత గురించి ఎందుకు మాట్లాడతానంటే... నేనెప్పుడూ కులం కార్డు తీసుకొని రాజకీయాలు చేయను. ��ాకు దేశం, రాష్ట్రం బాగుండాలి. మానవత్వం చచ్చిపోకూడదు అని ఉంటుంది. కులం ఎప్పుడూ ఇంటి గడప దాటకూడదు. కులాల గురించి ఎందుకు మాట్లాడతానంటే.. మిగిలిన వారు దిగజారి మాట్లాడినప్పుడు మాత్రమే దాన్ని సరిజేయాలని మాట్లాడుతాను.
నా కోరిక ఏమిటంటే దేశంలో ఎప్పటికైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ పేరుతో వసతి గృహాలు కాకుండా, పిల్లలందరికీ ఒకే వసతిగృహం ఉండాలని కోరుకుంటాను. రాజకీయాలు కులాలకు అతీతంగా నడవాలి. ఎవడో ��కడు దీనికోసం ముందుకు రావాలి. కులాలను కలిపేలా మాట్లాడాలి తప్పితే విడగొట్టడానికి కాదు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ కులాన్ని రాజకీయ పెట్టుబడిగా వాడుకోడు
• బీసీలు ఐక్యంగా ఉండాలి
ఇటీవల రాజమండ్రిలో బీసీ నాయకులు కొందరు నాతో సమావేశం ఏర్పాటు చేశారు. మేం జనాభాలో 50 శాతం పైగా ఉన్నాం..మాకు అవకాశాలు కల్పించండి అని అడిగారు. అసలు మీకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఏంటీ..? మీరు గొడవలు, ఇతర విషయాలప్పు���ు ఉండే ఐక్యతను ఓట్లు వేసేటపుడు ఎందుకు చూపించరు..? బీసీలంతా ఐక్యంగా ఉంటే వేరొకరిని అడగాల్సిన అవసరం ఏముంది. మీరంతా ఐక్యంగా ఉంటే మీ దగ్గరకు రాజకీయ నాయకులు వచ్చి ఎన్ని సీట్లు కావాలో చర్చించాలి కదా..? నాయకులు ఎలా ఉండాలంటే అన్ని కులాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆమోదించేలా ఉండాలి. జనాభాలో అధికంగా ఉండే కులాలను కొందరు నాయకులు రాజకీయ మూలధనంగా ఉపయోగించుకుంటున్నారు.
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల్లో వీరమహిళలకు పెద్దపీట
మహిళలక�� గౌరవం, సముచిత స్థానం కల్పిస్తూ, మహిళా నాయకత్వాన్ని నిరంతరం ప��రోత్సహిస్తున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు, మరోసారి మహిళా శక్తిని గుర్తిస్తూ జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల్లో ప్రతి పార్లమెంట్ కమిటీలో వీరమహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ వీరమహిళ విభాగం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
@JanaSenaParty
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ముఖ్య ఉద్దేశం
• జనసేన సాధక్ స్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేయడం
• ఈ కమిటీ సభ్యులు కేవలం పార్టీ నిర్మాణంలో వివిధ కమిటీల్లో పనిచేయాలనుకునే వారి వివరాలు సేకరించడం
• పార్లమెంట్, అసెంబ్���ీ, మండల, గ్రామ స్థాయితో పాటుగా, వివిధ పార్టీ విభాగాల్లో సేవలు అందించాలనే వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం
• ఈ కమిటీలు సేకరించిన వివరాలను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకురావడం
• ఈ కమిటీకి పార్టీలో పోస్టులు నిర్ణయించే అధికారం లేదు
• ఈ కమిటీలు తాత్కాలికంగా, కేవలం ఈ ప్రక్రియ ముగిసే వరకు మాత్రమే పనిచేస్తాయి.
• పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించాలి అనుకునే ఔత్సాహికులకు ఈ కమిటీల్లో చోటు కల్పించకుండా, వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
��ెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నేడు జనసేన పార్టీ జాయినింగ్ కమిటీ సమావేశం నిర్వహించబడింది.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు శ్రీ రాజలింగం గారి పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే నాయకత్వాన్ని గుర్తించి, భవిష్యత్ నాయకులను తీర్చిద���ద్దే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో జాయినింగ్ కమిటీ సభ్యులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ గడల శ్రీనివాసరావు, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, ముదురు సరస్వతి పాల్గొన్నారు.
#JanaSenaTelangana
జనసేన పార్టీ పక్షాన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ లింగమనేని రమేష్ @MPLingamaneni గారు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ���ైర్మన్ శ్రీ సి పి రాధాకృష్ణన్ @CPR_VP గారు సమక్షంలో ప్రమాణం చేశారు.
#RajyaSabha
జనసేన పార్టీలో చేరికలను సమన్వయం చేసేందుకు ఏడుగురు సభ్యులతో తెలంగాణ జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు.
జనసేన భావజాలానికి ఆకర్షితులై పార్టీలో చేరాలనుకునే వారిని సమన్వయం చేసేందుకు తెలంగాణలో ఏడుగురు సభ్యులతో ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని పార్టీ రాష్ట్ర కార్యాలయం నియమించింది. ఈ కమిటీ ద్వారా వచ్చిన చిరకాల విజ్ఞప్తులు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్ర��� @itsRamTalluri గారు పరిశీలించి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకెళ్లి, ఆయన సూచనల మేరకు చేరికల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
#JanaSenaTelangana #JSPTelangana
As lot of people are curious about this photograph. And this photograph brings back memories of a time marked by deep conversations around the Telangana movement and the idea of Samajika Telangana.
Those were the days when Bahujan thought, social justice, and the political empowerment of neglected communities were central to many of our discussions. Along with Telangana intellectuals, Bahujan activist Augustine garu, revolutionary singer Gaddar garu, and others, we often reflected on the future of Telangana, the need for a just distribution of political power, and the larger vision of Samajika Telangana.
This picture is from the pre-PRP days, when Augustine garu and Gaddar garu visited our home after my father Sri Konidala Venkat Rao garu demise. Beyond politics, it remains a cherished memory of a time when conversations were deeply rooted in social change, equality, and the aspiration to see social justice translated into political power.
ఈ రోజ��� వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.