ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతోంది. సహచర మంత్రివర్గ సభ్యులతో కలిసి క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
మొక్కల లెక్క కాదు.. మనుగడ లెక్క ముఖ్యం
•2047 నాటికి ఏపీని 50 శాతం గ్రీన్ కవర్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
•హరిత లక్ష్య సాధనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి
•హరిత కార్యక్రమాల్లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పరిశ్రమల భాగస్వామ్యం పెంచాలి
•ఈ ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల మొక్కలు సిద్ధం చేయాలి
•తొలి దశలో 500 నర్సరీలకు స్థలాలను గుర్తించాలి
•కోస్టల్ గ్రీన్ బెల్ట్స్, మడ అడవులు, తాటి తోటల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక
•మొక్క నాటిన నాటి నుంచి మహా వృక్షంగా ఎదిగే వరకు నిరంతర పర్యవేక్షణ అవసరం
•ఏపీ గ్రీన్‌లో పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట
•ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశంలో ఏపీ గ్రీన్ ఛైర్మన్ శ్రీ @NagaBabuOffl గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, విద్య, పరిశ్రమలు, స్థానిక సంస్థలు తదితర అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ శాఖల కృషితోపాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. మంగళవారం మంగళగిరిలోని అరణ్యభవన్‌లో శ్రీ నాగబాబు గారి అధ్యక్షతన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, హరిత ప్రణాళికలు, వాటి అమలుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ... “ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల ద్వారా 10 కోట్ల మొక్కలను సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి దశలో 500 మండలాల్లో 500 నర్సరీలకు అనువైన స్థలాలను గుర్తించి, 15 వేల ప్రైమరీ బెడ్లను ఏర్పాటు చేయాలి. మొక్కలు నాటడంలో సంఖ్య కంటే నాణ్యతకు, నాటిన మొక్కల సంఖ్య కంటే వాటి మనుగడ శాతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. స్థానిక వాతావరణం, నేల స్వభావానికి అనువైన జాతులను నర్సరీల్లో పెంచాలి. రావి, మర్రి, వేప, చింత, కానుగ, ఉసిరి, పనస, మోదుగ, ఇప్ప, రేల వంటి స్థానిక జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. రైట్ ట్రీ–రైట్ ప్లేస్ అనే విధానాన్ని పాటించాలి.
రహదారుల వెంబడి పచ్చదనం విస్తరణకు ప్రణాళిక*
రహదారుల వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి మండలానికి ప్రత్యేక ప్లాంటేషన్ టార్గెట్‌ను నిర్దేశించడంతో పాటు భూమి లభ్యత, మొక్కల ఎంపిక, నాటడం, నీటి సరఫరా, రక్షణ, సర్వైవల్ మానిటరింగ్‌పై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. 3 నుంచి 5 మీటర్ల ఎత్తు ఉన్న బలమైన మొక్కలతో ట్రీ బ్యాంక్స్ ఏర్పాటు చేసి రహదారులు, పట్టణాలు, ప్రభుత్వ ప్రాంగణాల్లో వ్యూహాత్మకంగా వినియోగించాలి. ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలను గుర్తించి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భూములు, పట్టణ ఓపెన్ స్పేస్‌లను అవెన్యూ ప్లాంటేషన్లు, బ్లాక్ ప్లాంటేషన్లు, మియావాకీ, డెన్స్ ప్లాంటేషన్లకు వినియోగించాలి.
తీర ప్రాంత పరిరక్షణతోపాటు గ్రీన్ ఎకానమీకి ప్రోత్సాహం
రాష్ట్రానికి ఉన్న దాదాపు 1,053 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరాన్ని కాపాడుకోవడానికి పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. కోస్టల్ గ్రీన్ బెల్ట్స్, సముద్ర అలల ఉధృతిని తగ్గించే మడ అడవులను పెంపకం. తీరంలో రక్షణగా నిలిచే తాటి చెట్ల తోటలను పెంచడం, గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయాలి. నర్సరీలను కేవలం మొక్కల పెంపక కేంద్రాలుగా కాకుండా గ్రీన్ ఎకానమీ సెంటర్స్ గా అభివృద్ధి చేయాలి. స్థానిక యువత, మహిళా సంఘాలకు మొక్కల పెంపకం, నిర్వహణ, సంరక్షణలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఏపీ గ్రీన్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కూడా సృష్టించాలి.
పరిశ్రమల భాగస్వామ్యంతో హరిత కార్యక్రమాలు
పరిశ్రమల భాగస్వామ్యంతో సీఎస్ఆర్, సీఈఆర్ వనరులను వినియోగించుకోవాలి. వన్ ఇండస్ట్రీ–వన్ విలేజ్, వన్ ఇండస్ట్రీ–వన్ గ్రీన్ జోన్, వన్ ఇండస్ట్రీ–వన్ గ్రీన్ కారిడార్ వంటి నమూనాలను అభివృద్ధి చేయాలి. ఏపీ గ్రీన్ లో పారదర్శకత, జవాబుదారీతనం కీలకం. నర్సరీ నుంచి ప్లాంటేషన్ వరకు జియో ట్యాగింగ్, డిజిటల్ రికార్డులు, డ్యాష్‌బోర్డును బలోపేతం చేయాలని సూచించారు. “ఎక్కడ నాటాం? ఎన్ని నాటాం? ఎన్ని బతికాయి?” అనే మూడు ప్రశ్నలకు ప్రతి స్థాయిలో స్పష్టమైన సమాధానం ఉండాలి. ప్రతి లక్ష్యానికి వ్యక్తిగత బాధ్యతను నిర్దేశించాలి. ఎవరు బాధ్యత వహిస్తారు, ఎక్కడ అమలు చేస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, నిర్వహణ ఎవరు చేపడతారు, ఎంత సర్వైవల్ రేటు సాధించాలి అన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి.
రాష్ట్రవ్యాప్తంగా రూ. 30,156 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చేరుకున్నారు.
ఆయనకు పార్టీ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, శ్రీ అరవ శ్రీధర్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ వరదరాజుల రెడ్డి గారు, అహుడా చైర్మన్ శ్రీ టీ.సీ. వరుణ్ గారు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారు, నాయకులు శ్రీ సుంకర శ్రీనివాస్ గారు, శ్రీ పి. శివకళ్యాణ్ రెడ్డి గారు, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర గారు, శ్రీ అతికారి కృష్ణ గారు, శ్రీ శ్రీనివాసరాజు గారు తదితరులు ఘన స్వాగతం పలికారు.
మరికాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
(1/4)
తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో మరో ముందడుగు.
ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో GSB రోడ్ల నిర్మాణానికి ₹4.81 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
@JanaSenaParty@PawanKalyan
విజయనగరం APSRTC ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారి చొరవతో 25 కుటుంబాలు జనసేన ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు❤️🙏
@JanaSenaParty@PawanKalyan
అందరికి నమస్కారం 🙏🏻
ఈరోజు సాయంత్రం అనగా అక్టోబర్ మూడో తేదీ సాయంత్రం ఐదు గంటలకి ఎన్టీఆర్ జిల్లా @JanaSenaParty అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు విజయవాడ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లోని జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.
ఇట్లు
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం
Just In :
ఈరోజు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో 5గురు సభ్యులతో కూడిన స్థానిక సంస్థల కోఆర్డినేషన్ కమిటీతో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు భేటీ కానున్నారు...అనంతరం నూతన పార్లమెంటరీ కమిటీలు ప్రకటించే అవకాశం..!
శ్రీవారి సన్నిధిలో, నా ప్రియమైన మనవడు వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు ₹1,00,000 విరాళంగా అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ విరాళం విలువలో చిన్నదైనా, ఇందులోని సంకల్పం మాత్రం స్వచ్ఛమైనది. ఇది భక్తితో, కృతజ్ఞతాభావంతో సమర్పించిన ఒక చిన్న కానుక.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, మానవ సేవను మరింత కరుణతో, అంకితభావంతో కొనసాగించే శక్తిని, సద్గుణాలను నా కుటుంబానికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙏
At the sacred presence of Srivari Sannidhi, I humbly handed over a cheque of ₹1,00,000 to Vengamamba Annadana Seva, through the tiny hands of my beloved grandson Vaayuv Tej.
Though the amount may be modest, the intention is pure,a gesture of gratitude and devotion.
I sincerely pray to Lord Sri Venkateswara to bless my family with strength and virtue to continue serving humanity with compassion and dedication.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న శ్రీ రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు... (1/2)
@itsRamTalluri
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి సెంటర్లో ప్రజానాయకుడు శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు, సహచర మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు, ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది.
ఎన్ని దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజానాయకుడు శ్రీ వంగవీటి మోహన రంగా గారు. కులమతాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలిచి, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకం.
రంగా గారి విగ్రహాలను గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటున్న యువతకు నా అభినందనలు. నిడదవోలు నియోజకవర్గంలో గత రెండేళ్లలో ఇప్పటికే 11 వంగవీటి మోహన రంగా గారి విగ్రహాలను ఆవిష్కరించడం, రంగా గారిపై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనం.
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిపై ప్రజలు చూపిస్తున్న ఆదరణ అభినందనీయం. సున్నిత మనస్తత్వం, గొప్ప వ్యక్తిత్వం, వివాదరహిత ధోరణి, విశాలమైన విషయ పరిజ్ఞానం కలిగిన రాధాకృష్ణ గారు రాజకీయ ప్రస్థానంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
నా రాజకీయ ప్రస్థానంలో కూడా రాధాకృష్ణ గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 2007లో నేను ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో నా అభ్యర్థిత్వానికి మద్దతుగా తొలి ఓటు వేసిన వారిలో రాధాకృష్ణ గారు ముందుండటం నేను ఎప్పటికీ మరచిపోలేని విషయం.
శ్రీ వంగవీటి మోహన రంగా గారి ఆశయ సాధనకు, శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి రాజకీయ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం తరఫున మా సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటాయి.
@RamanaiduTDP@BattulaBalarama@VangaveetiOffl
#VangaveetiMohanaRanga