విద్యార్థుల స్కూల్ డైరీలో బహిరంగంగా మతపరమైన అంశాన్ని హోంవర్క్‌గా రాస్తే, తరగతి గదిలో ఇంకేమి బోధిస్తున్నారో..?
సైదాబాద్ సక్సెస్ స్కూల్ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలి!
@revanth_anumula@TelanganaDGP
ఇంకెన్నాళ్ళు శవ రాజకీయాలు చేస్తావ్ @ysjagan?
ముద్రగడ పద్మనాభం గారు మీ పార్టీకి ఎంతో సేవలు అందించినా ఏనాడైనా పార్టీలో ఆయనకు కనీస గౌరవం కల్పించావా?
మీ పార్టీ తరపున ఎన్నో సేవలు అందించిన ముద్రగడ గారికి MLA, MP, రాజ్యసభ ఆఖరికి నామినేటెడ్ పదవి అయినా ఇచ్చావా? కనీసం వారి కుటుంబ సభ్యులకు అయినా టిక్కెట్ ఇచ్చావా?
ఆయన అనారోగ్యంతో బాధపడుతుంటే కనీసం హాస్పిటల్ కి కూడా వెళ్ళి పరామర్శించని నువ్వు ఈరోజు ఆయన చనిపోయిన తరువాత శవ రాజకీయం చేయడానికి వస్తావా?
సొంత చిన్నాన్న YS వివేకానందరెడ్డి గారి పార్థివదేహాన్ని మోయని నువ్వు ఈరోజు కాపు సామాజికవర్గాన్ని మభ్యపెట్టేందుకు ముద్రగడ గారి దేహాన్ని మోసి శవ రాజకీయం మొదలు పెట్టావు
నీ నీచ రాజకీయాలకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి కన్న కూతురును తండ్రి నుండి దూరం చేసిందే కాకుండా, ఆఖరి చూపులు కూడా చూడనీయకుండా ముద్రగడ గారి కుమార్తె @kr_barlapudi గారిని @YSRCParty నాయకులు అడ్డుకుంటారా?
సొంత కుటుంబంలో ఆడవారిని నువ్వు గెంటేసినట్లే అందరి ఇళ్లలో జరగాలి అనే కుంచిత మనస్తత్వం మంచిది కాదు జగన్
మాజీ మంత్రిగా పనిచేసిన ముద్రగడ గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తుంటే, ఒక కాపు నాయకుడికి ప్రభుత్వ లాంఛనాలు జరగకుండా అడ్డుకోవాలని వైసీపీ నాయకులతో గొడవలు సృష్టిస్తావా?
ముద్రగడ గారి కుటుంబ వ్యవహారాల్లో మీ పార్టీ పెత్తనం ఏంటి జగన్? బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ దిక్కుమాలిన రాజకీయాలకు ముద్రగడ గారిని వాడుకున్నావ్, మరణానంతరం కూడా ఆయనకు ప్రశాంతత లేకుండా చేసిన నిన్ను చరిత్ర మర్చిపోదు జగన్.
#YSRSavaRajakeeyaParty
మద్యం మత్తులో, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేయడమే కాకుండా, సంబంధిత వ్యక్తుల భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెడతాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు అభిప్రాయపడ్డారు.
గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతాల్లో చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ రెండు ఘటనలపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సున్నితమైన ప్రాంతాలు గుర్తించి అవగాహనా సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.
@KAKINADAPOLICE@PIB_India@IPR_AP@pibvijayawada
సైదాబాద్ సక్సెస్ స్కూల్లో ‘కల్మా’ పేరుతో విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకమతానికి సంబంధించిన అంశాన్ని హోంవర్క్‌గా ఇవ్వడం తీవ్ర అక్షేపణీయం.
పిల్లల డైరీలో బహిరంగంగా మతపరమైన అంశాన్ని హోంవర్క్‌గా రాస్తే, తరగతిగదిలో ఇంకేమి బోధిస్తున్నారో అనే అనుమానం సహజంగానే వస్తుంది. ఇది ప్రభుత్వం విచారించాల్సిన విషయం.
మదరసా అయితే మదరసా అని చెబుతారు, మిషనరీ స్కూల్ అయితే తన ప్రత్యేకతను చెబుతుంది, వేద పాఠశాల అయితే వేదాలు బోధిస్తామని ముందుగానే తెలియజేస్తుంది. తల్లిదండ్రులు కూడా అదే అవగాహనతోనే పిల్లలను అక్కడ చేర్పిస్తారు. మరి “సక్సెస్ స్కూల్” అని పేరుపెట్టుకుని ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం..?
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి. రాష్ట్ర గుర్తింపు పొందిన సాధారణ విద్యాసంస్థల్లో అన్నిమతాలకు చెందిన విద్యార్థులు చదువుతారు. అలాంటి పాఠశాలల్లో రాజ్యాంగ విలువలు, నైతిక విద్య, విజ్ఞానం బోధించాలి తప్ప, ప్రత్యేకంగా ఒక్కమతాన్ని ప్రోత్సహించకూడదు. గతంలో కూడా ఇలాంటి బోధన, హోంవర్క్ ఇచ్చారా? అనే అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలి.
జనసేన ఏ మతానికీ వ్యతిరేకం కాదని మరొక్కసారి స్పష్టంచేస్తూ..భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ తమమతాన్ని ఆచరించే హక్కును ఇచ్చింది. విద్యాసంస్థలు రాజ్యాంగస్ఫూర్తితో విద్యార్థులందరినీ సమానంగా చూడాలి. పాఠశాలలు మత ప్రచార వేదికలుగా కాకుండా.. జాతీయత, రాజ్యాంగస్ఫూర్తి, విజ్ఞానం, నైతిక విలువలను పెంపొందించే విద్యాలయాలుగా ఉండాలి. పిల్లలకు దేశభక్తి నేర్పండి, రాజ్యాంగ విలువలు నేర్పండి, విజ్ఞానం నేర్పండి. విద్య పేరుతో ఏ మతాన్ని కూడా పిల్లలపై రుద్దే ప్రయత్నాలను అనుమతించరాదు. పాఠశాలలు జాతీయతను నిర్మించే ఆలయాలు కావాలి, మత ప్రచార కేంద్రాలు కాకూడదు అని జనసేన పార్టీ స్పష్టంగా చెబుతోంది.
@revanth_anumula@TelanganaDGP@TelanganaCMO
Fake News Alert
సాక్ష్యాలను మార్చినట్టు, నిందితులను మార్చినట్టు మనుషులను మార్చేస్తుంది ఈ గొడ్డలి పార్టీ.
ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారు అంటూ జనసేన నాయకురాలు శ్రీమతి సుజాత గారిని చూపించి తండ్రినే వ్యతిరేకించినట్టు దుష్ప్రచారం చేస్తున్న గొడ్డలి పార్టీ సోషల్ మీడియా!
తమ నాయకుడిని అన్నందుకు సుజాత గారు ఇచ్చిన సమాధానం తప్పు కానప్పటికీ, ఆ స్వరంతో కన్న కూతురు సమాధానం ఇచ్చింది అని సమాజం అనుకునేలా తప్పుడు ఉద్దేశంతో వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దిక్కుమాలిన ప్రచారాన్ని ప్రజలు గమనించాలి.
#YCheaPolitics
A civilization flourishes when it honours the hands that preserve its heritage
Delighted by the resounding success of the Andhra Pradesh Hastakala Mahotsavam 2026. The exhibitions across Visakhapatnam, Anantapur, Rajamahendravaram and Kakinada provided artisans with direct market access, valuable exposure and new opportunities for sustainable livelihoods.
The health camps organised for artisans across the State also reaffirmed our commitment to their well-being. Regular health check-ups for artisans and periodic handicraft exhibitions must continue as an ongoing initiative.
Our vision is clear: to protect our heritage, empower our artisans, expand market opportunities and take Andhra Pradesh’s timeless craftsmanship from Local to Global.
- @PawanKalyan
#AndhraPradeshHastakalaMahotsavam #Lepakshi #Handicrafts #LocalToGlobal
Every child has the right to safety, dignity and justice.
Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Sri @PawanKalyan Garu has written a letter to the Hon'ble Chief Minister of Telangana,Sri @revanth_anumula garu, urging stronger and more effective implementation of the POCSO Act, 2012.
The letter puts forward key suggestions on time-bound investigation, victim protection, evidence preservation and effective monitoring to ensure timely justice and stronger protection for every child.
#POCSO
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మృతి పట్ల జనసేన సంతాపం.
కైకలూరులో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మృతికి సంతాపం తెలుపుతూ, వారి ఆత్మకు శాంతి కలగాలని జనసేన పార్టీ నాయకులు ఒక నిమిషం మౌనం పాటించారు.
Every child has the right to safety, dignity and justice.
Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu has written a letter to the Chief Secretary, Government of Andhra Pradesh, urging stronger and more effective implementation of the POCSO Act, 2012.
The letter puts forward key suggestions on time-bound investigation, victim protection, evidence preservation and effective monitoring to ensure timely justice and stronger protection for every child.
వ్యర్థమే సంపదగా మారుతుంది… కృషి ఉంటే .
ఉప ముఖ్యమంత్రి & పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి స్వచ్ఛ ఆంధ్ర విజన్‌కు అనుగుణంగా, వీరఘట్టం మండలానికి చెందిన స్వచ్ఛరథం నిర్వాహకుడు శ్రీ పేడాడ నాగభూషణరావు గారు జిల్లాలో అత్యుత్తమ వ్యర్థాల సేకరణతో ప్రశంసలు అందుకున్నారు.
రూ.1.32 లక్షల విలువైన వ్యర్థాలను సేకరించి ఆదర్శంగా నిలిచిన ఆయనను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ @mvrkteja గారు సత్కరించడం అభినందనీయం.
స్వచ్ఛత కోసం కష్టపడే ప్రతి పారిశుద్ధ్య సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు.
కోటి కేజీల పొడి వ్యర్థాల సేకరణతో స్వచ్ఛ రథాల చారిత్రాత్మక మైలు రాయి
•రూ. 16 కోట్ల విలువైన డ్రై వేస్ట్ రీ సైక్లింగ్
•ఆపరేటర్లు, గ్రామ పంచాయతీల కృషిని అభినందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•ప్రజల భాగస్వామ్యంతో దేశానికే ఆదర్శంగా నిలిచామన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
కోటి కేజీల పొడి వ్యర్థాల సేకరణతో స్వచ్ఛరథం కార్యక్రమం చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన ఆపరేటర్లు, గ్రామ పంచాయతీలు, గ్రీన్ అంబాసిడర్లు, ప్రజలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ వ్యర్థాల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. క్షేత్ర స్థాయి సిబ్బంది అంకితభావం, ప్రజల భాగస్వామ్యంతోనే అద్భుత ఫీట్ సాధ్యమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న స్వచ్చరథం కార్యక్రమం కోటి కేజీల పొడి వ్యర్థాల సేకరణ విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు రూ. 16 కోట్ల విలువైన డ్రై వేస్ట్ రీ సైక్లింగ్ చేపట్టి చెత్త నుండి సంపద సృష్టి ద్వారా ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడింది.
క్షేత్ర స్థాయిలో తడి, పొడి వ్యర్థాల వర్గీకరణ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించే ఆలోచనతో గత ఏడాది జులై 10వ తేదీన గుంటూరు జిల్లా, లాల్ పురంలో స్వచ్ఛరథం కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రజలు తమ ఇళ్లలోని పొడి వ్యర్థాలను వేరు చేసి స్వచ్ఛరథానికి అందజేసి, ప్రతిఫలంగా నిత్యావసర వస్తువులు పొందడం అనే వినూత్న ఆలోచనతో స్వచ్ఛరథం కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఇందుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో దశలవారీగా ఇతర జిల్లాలకు విస్తరించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. స్వచ్ఛరథాల ద్వారా ఇళ్లలోనే వ్యర్థాల వర్గీకరణ పట్ల అవగాహన పెరిగి, రీ సైక్లింగ్ వ్యర్థాల సేకరణ వ్యవస్థ మెరుగయ్యింది. ఈ చైన్ సిస్టంలో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనతోపాటు డంపింగ్ యార్డుకు చేరే వ్యర్థాల పరిమాణం తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం వహించేలా 28 స్వచ్ఛ రథాలు విశిష్ట సేవలు అందిస్తున్నాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో స్వచ్ఛరథం విజయానికి విశిష్ట సేవలు అందించిన ఆపరేటర్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారు జెడ్పీ సీఈఓల సమక్షంలో సత్కరించారు.
గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తన భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా భరిస్తున్నారు. గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స సైతం సొంత నిధులతోనే చేయించుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తినప్పుడు చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు.
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం
•అధికారులకు ఆదేశాలు
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు సేవలందించారని... అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.
ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…
వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం
•అధికారులకు ఆదేశాలు
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు సేవలందించారని... అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో 19వ తేదీన ఏలేరు కాలువకు నీటి విడుదల
•పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల రైతులకు ఊరట
•పురుషోత్తపట్నం నుంచి ఏలేరు జలాశయానికి నీటి మళ్లింపునకు చర్యలు
•ఎల్ నినో, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగు నీటి ప్రణాళికలపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన శ్రీ @PawanKalyan గారు
రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీ నుంచి ఏలేరు కాలువ కింద ఉన్న ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేసేందుకు జల వనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నిర్ణయం పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని రైతులకు ఊరట కలిగించనుంది. మే 26వ తేదీన నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు(IAB) సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ 1వ తేదీన గోదావరి నది నుంచి, జులై 10వ తేదీన ఏలేరు కాలువకు నీటి విడుదల చేపట్టాల్సి ఉండగా, ఎల్ నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏలేరు జలాశయానికి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం నమోదు కాలేదు. జలాశయంలో కేవలం 8.68 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఏలేరు కాలువకు నీరు విడుదల కాకపోవడంతో పిఠాపురం నియోజకవర్గం, పరిసరాల రైతుల్లో ఆందోళన మొదలయ్యింది.
ఏలేరు కాలువ కింద ఉన్న దాదాపు 53 వేల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికీ నారు మడుల పనులు కూడా ప్రారంభించలేదు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకురాగా, సాగునీటి ప్రణాళికలపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు.
ఖరీఫ్ సీజన్ పట్ల రైతుల్లో ఆందోళన, సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించాలని సూచించారు. గోదావరిలో వరద నిర్దుష్ట మట్టానికి చేరుకున్న వెంటనే నీటిని ఎత్తిపోసేందుకు అవసరం అయిన సాంకేతిక చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ అవసరాలకు తగిన విధంగా నీటి నిర్వహణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రివర్యులు చెప్పారు. ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ తో మాట్లాడారు. సానుకూలంగా స్పందించిన ఆ అధికారులు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు 19వ తేదీ నుంచి ఏలేరు కాలువకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
@AndhraPradeshCM@CollectorKakin1@PIB_India@IPR_AP@pibvijayawada
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో క్షేత్ర స్థాయి సమావేశాలు!
• 12 ఏళ్లుగా పార్టీ ఎదుగుదలకు తోడ్పడిన కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాలు
• గ్రామస్థాయి వరకు పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కార్యాచరణ
• స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు
• ప్రతి జిల్లాలో పార్టీ విస్తరణ – కార్యకర్తల ఉత్తేజమే లక్ష్యం
#JanaSenaTelangana #JSPForTelangana #JanaSenaMissionTelangana