మీరు మాకోసం నరకయాతన అనుభవించి చనిపోయిన రోజు. మీ తీరని కల మద్రాసు/తొండైమండలం తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు కలగచేయడం. ఆది కూడా నెరవేరుతుంది.
#Pottisreeramulu
@BollineniRNaidu ఓం నమో వేంకటేశాయ 🙏
అయ్యా, బ్యాడ్జీలు మాత్రం తెలుగు లో ఉండేలా చూడండి. క్రింద పెట్టిన వాటిలో మొదటి దానిలా కాకుండా రెండో దానిలా తయారు చేయించండి.
తెలుగు ని ప్రేమించు, ఇతర భాషలను గౌరవించు😊
@PawanKalyan గారూ, తెలుగు భాషాభిమానులందరి తరఫున మీరు ఈ విషయం మీద పనిచేయాలి. సవెం రమేష్ ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ కూడా కాదు, ఎల్లలు లేని తెలుగు గుండె చప్పుడు ఒక మనిషిగా మారితే అదే ఆయన.
ప్రభుత్వ పెద్దలకు,
@naralokesh@ncbn@PawanKalyan
మీరు "ఈగల్" అని పెట్టండి, "డేగల్" అని పెట్టండి. ముందుగా ప్రభత్వ ఉత్తర్వులు తెలుగులో విడుదల చెయ్యండి. కార్యకలాపాలు తెలుగులో జరపండి.
తెలుగు అమలుకు ఒక ప్రత్యేక జట్టు తీసుకురండి 🙏.
#తెలుగెక్కడ#మనమాతృభాషతెలుగు
ఆలన లాలన భాషగా ఉన్న తెలుగు భాష, పాలన (పరిపాలన) భాష గా దైనందిన కార్యక్రమాలలో, కార్యాలయాలలో వాడుక ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం నేడు కనిపిస్తుంది.. ఎంతమంది ఏకీభవిస్తారు?
#IndianRailways#Telugu
Telugu language has worldwide Recognition. Telugu Goes Global
But Avoided in its own State
Indian railways avoiding Telugu in the state where Telugu is Primary language (AP)
📍 Parvatipuram (PVP) Railway station, Waltair Division (ECoR)
#Parvathipuram
విజయవాడలో జరిగిన అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగలో మాతృభాష బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న బాలోత్సవ కార్యదర్శి పిన్నమనేని మురళి గారు.
@RGidugu#తెలుగు
ఆ తల్లి అంత ముద్దుగా తెలుగు పద్యం చదివింది. మీరూ ఉన్నారు, తెలుగులో రాయడానికి గింజుకు చస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కావాలి కానీ, తెలుగు వద్దు..
తెలుగు బిడ్డ పుట్టునరోజున, తెలుగు చానల్ వాళ్ళు తెలుగులో దీవించలేరా..?
@ICICIBank_Care@ICICIBank మీరు తెలుగు మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎనిమిది కోట్ల మందికి కనీసం కస్టమర్ కేర్ తెలుగు భాషను ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, వారిని మీరు అవమానిస్తున్నారు. తెలుగు వారి అకౌంట్లు కావాలి కానీ వారికి సేవలు చేయడానికి తెలుగు కస్టమర్ కేర్ వద్దు కదా..?
ఆహా వేదికగా @alluarjun కుమార్తె పద్యం చదవడం, నిజంగా చాలా పెద్ద విషయం. సెలబ్రిటీ పిల్లలు ఇలా చేయడం వల్ల, తమ పిల్లలకు తెలుగు నేర్పే విధంగా ఇది ఎందరో తల్లితండ్రులను ప్రోత్సహిస్తుంది. @ahavideoIN
తెలుగు భాషను చంపింది మన ప్రభుత్వాలే. విద్యా వ్యవస్థను మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకొని, లాయర్ కావాలన్నా, ఎంజీనియర్, డాక్టర్, అకౌంటెంట్ కావాలన్నా ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిందే అని శాసించాయి. ఇంక మన భాష నేర్చుకోవాల్సిన అవసరం ఎక్కడుంది?
స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచి పోయాయి, చాలా నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తెలుగు సబ్జెక్ట్, అంటే తెలుగు కోర్స్ ఒకటి, డిగ్రీ వరకన్నా తప్పనిసరి చేస్తే భాష బ్రతుకుతుంది.
PS: నేను ప్రభుత్వ జోక్యాలకు, ప్రభుత్వ నియంత్రణలకు బద్ధ విరోధిని. కానీ మన ప్రభుత్వాలు బ్రిటిష్ వాళ్ళ కన్నా ఎక్కువ మన భాషను నాశనం చేశాయి. ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్దు కోవడానికి ఇంత కన్నా మెరుగైన మార్గం నాకు కనిపించ లేదు.