ఉప సర్పంచ్ ల చెక్ పవర్ తొలగిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తొలగిస్తారు. ఏ వేతనం లేకున్నా నిస్వార్థ సేవలందిస్తున్న ఉప సర్పంచ్లకు మీరిచ్చే గౌరవం అవమానమా?
TGRTC లో పనిచేసే ఉద్యోగ/కార్మికులకు యూనిఫాం, ఉద్యోగి పేరు,ఐడి నెంబర్ తో పాటు క్రమశిక్షణ,ప్రయాణికులతో మాట్లాడే విధానం,ప్రజలకు rtc కల్పించే మెరుగైన సౌకర్యాల పట్ల అవగాహన కల్పించండి. ఒకపక్క ఉచితాలు ఇస్తూనే ప్రజలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది.
ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు అంటే...?
తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 12వేలమంది ఉప సర్పంచ్ లు, లక్ష పన్నెండువేల వార్డు మెంబర్లను అవమానించడమే...! అభివృద్ధినీ అడ్డుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ.. హక్కులు తొలగించడం వికృత చర్య.
మురికి కాల్మొలిసిన మొలకలు తీయవచ్చు
మానవాంగమ్మెల్ల మంట బెట్టకుమురా
తప్పు బట్టిన చోట తగు శిక్ష చేయవచ్చు
ప్రాణము దీయుట ప్రజ్ఞగాదు సుమా.
>మురికి కాలువలో చెత్త ఉంటే ఏం తీయాలి? కాలు మురిగితే ఏం చేయాలి?
జరిగే తప్పులను అధికారికంగా చేయాలని ప్రతిపాదనలా?
*"బీఎస్పీ ని బలోపేతం చేసుకుంటేనే బహుజన రచయితలు,కళాకారులకు ఆత్మగౌరవం,అభివృద్ధి."*
"కమ్యూనిస్టు ఉద్యమమైన,తెలంగాణ ఉద్యమమైనా నాయకత్వం వహించే కులాలకే అస్తిత్వం,ఆత్మ గౌరవం, అభివృద్ధి,అధికారం.ఇది చరిత్ర చెబుతున్న సత్యం.తెలంగాణ రాష్ట్ర సాధన లో కీలక పాత్ర పోషించిన బహుజన(ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనారిటీ)రచయితల,కళాకారుల జీవితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లే నేటికీ యధా విధిగా ఉన్నాయని *పాటమ్మతో రాంబాబు మరియు యోచన గార్ల* నేతృత్వం లో వరంగల్ జిల్లాలో జరిగిన కళాకారుల సమావేశంలో నిర్ధారణ అయింది.
కమ్యూనిజాన్ని,తెలంగాణ వాదాన్ని బలోపేతం చేయడానికే కళాకారుల ఆట,పాట,జ్ఞానం,శక్తి ఉపయోగ పడిందే కానీ,బహుజనుల బతుకులు, ఆర్థిక స్థితిగతులు మార్చడానికి ఉపయోగ పడలేదు అనేది ఈ సమావేశంలో తేటతెల్లమయింది.
అందుకే *"మనదే శ్రమ-మనదే నాయకత్వం"* కావాలి,అదే బహుజన వాదం.ఇది జరిగితేనే మన బహుజనుల బతుకులు మారుతాయని, బాబాసాహెబ్ అంబేద్కర్,కాన్షిరాం గార్ల పోరాటం ద్వారా నిరూపితమైంది. అందుకు సాక్ష్యమే ఉత్తరప్రదేశ్ లో బెహెన్ మాయావతి జీ గారి పాలన.కావున బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బహుజనులకు నాయకత్వం, ఆత్మగౌరవం,అస్తిత్వం ఇవ్వగలదని.,అందుకోసం పార్టీని మనం మాత్రమే అభివృద్ధి చేసుకొని మన జీవిత స్థితిగతులను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం అనివార్యంగా ఉందని నేను అభిప్రాయపడుతున్నాను.
ఈ సమావేశంలో భాగస్వాములయిన ప్రతి రచయిత,కళాకారుడి బీఎస్పీ రాష్ట్ర కమిటీ పక్షాన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
-ఇబ్రం శేఖర్,రాష్ట్ర అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ,తెలంగాణ
(బహుజన రచయితలు,కళాకారుల ఆత్మీయ సమావేశం,వరంగల్
25 మార్చి,2026)
కరీంనగర్ జిల్లాలో నేటి నుండి జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను అశ్విని తానాజీ వాకడే ACLB గారు సందర్శించారు. పరీక్షల సరళిని పరిశీలించారు.ఎలాంటి చిన్న తప్పిదానికి అవకాశం ఇవ్వకుండా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరీంనగర్లోని మల్కాపూర్ ప్రీ-ప్రైమరీస్కూల్ ను అశ్విని తానాజీ వాకడే ACLB గారు సందర్శించారు. పిల్లల భవిష్యత్తుకు ప్రీ-ప్రైమరీ దశ ఎంతో కీలకమని,ఆ దశలోనే బలమైన పునాది వేయాలని ఆటపాటల ద్వారా చిన్నారులకు ఆసక్తికరంగా విద్యను బోధిస్తూ,అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.
బలహీన వర్గాల జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ మీద ఖమ్మం పోలీస్ వైఖరి చాలా అవమానకరం. సమస్య ఏదైనా కానీ పబ్లిక్ ప్లేస్ లో ఇంత దారుణంగా దాడి చేయడం సామాన్యులు జీర్ణించుకోలేనిది.ప్రింట్& ఎలక్ట్రానిక్ మీడియా దీనిని ముక్త కంఠంతో ఖండించాలి.
ఒంటి మీద వేసుకున్న ఖాకీ డ్రెస్ ని కాసుల కోసం కాకుండా కన్న వారి పేరు ప్రతిష్టలను నిలబెట్టే విధంగా నిజాయితీగా డ్యూటీ చేసే ఇలాంటి దమ్మున్న పోలీస్ ఆఫీసర్
జిల్లాకి ఒక్కరు ఉంటే చాలు పేదవాళ్లకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.
మువ్వన్నెల జెండాకి ప్రతి రూపం మీ నెత్తిపై ఉన్న 3 సింహాల టోపీ.దాని విలువ పెంచుతున్న మీ నీతి, నిజాయితీ, ధర్మానికి 🙏🙏🙏
నిప్పులాంటి ఈ పోలీస్ ఆఫీసర్ మరెంతో గొప్ప స్థాయికి ఎదగాలని మీ దీవెనలు అందించండి 🙏
I love you ci శ్రీరామ్ sir గారు 🌹🌹🌹
హలో బహుజన ఛలో బడంగ్ పేట్
నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంగా మార్చుకున్నాం.._
నేడు తెలంగాణ రాష్ట్రాన్ని బహుజనుల రాష్ట్రంగా మార్చుకుందాం రండి_
_ఈ నెల 15 న జరిగే బహుజనుల రాజ్యాధికార యుద్ధ భేరి సభకు వేలాదిగా తరలిరండి_
#Telangana#SocialJustice#bspnews#BSP
కరీంనగర్ గడ్డ కుట్రపూరిత రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గని అధికారులను కోరుకుంటుంది. ఆ దిశగా ముందుకు సాగుతారని ఆశిస్తున్నాము🙏.
మహేందర్ జీ.
బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కరీంనగర్.
కుమ్మెర చిన్నారి కోసం ఒక తల్లి హృదయం రక్తం కారుతోంది న్యాయం కావాలి
ఈ రోజు నా హృదయం వెయ్యి ముక్కలైంది. ఒక తల్లిగా, ఒక భక్తురాలిగా, ఈ నేల కుమార్తెగా నాగర్కర్నూల్లో జరిగిన విషాదం నన్ను కుదిపేసింది.
దైవస్థానం అయిన కుమ్మెర మల్లన్న జాతర ఎలా ఇలాంటి అమానుషానికి వేదిక అవుతుంది? ఇంకా రెండు నెలలు కూడా నిండని పసిపాప ఇంకా పువ్వులా వికసించకముందే మన మధ్య నుంచి పోయింది. ఎందుకు? అహంకారం కోసం? క్రూరత్వం కోసం? వివక్ష అనే విషం కోసం?
దేవాలయ ద్వారాల వద్ద హింసకు పాల్పడిన వారికి ఒక మాట స్పష్టం:
మీరు ధర్మ రక్షకులు కాదు ధర్మానికి శత్రువులు.
మన సనాతన ధర్మం ప్రతి ప్రాణిలో దైవత్వాన్ని చూస్తుంది. ఆశీర్వాదం కోసం వచ్చిన కుటుంబాన్ని అడ్డుకోవడం, హింసకు దిగడం, ఒక శిశువు ప్రాణం తీసుకోవడం ఇది నేరం మాత్రమే కాదు, మహాపాపం.
గణేష్ గారు, మౌనిక గారు మీ కన్నీళ్లు మా కన్నీళ్లు.
ఈ పోరాటం ఇక మీ కుటుంబానికే కాదు మన సమాజ మనస్సాక్షికి సంబంధించినది.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు, పూర్తి న్యాయం జరిగే వరకు మేము నిశ్చలంగా ఉండము.
న్యాయం తప్పక జరగాలి.
#JusticeForKummeraBaby #Nagarkurnool #SanatanaDharma #EqualityBeforeGod #MadhaviLatha
🔴జర్నలిస్ట్ రఘు అరెస్ట్..!!! 💥
ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో 15వేల మంది పోలీసులు పహరతో జేసీబీలతో పేద ప్రజల 1000 గుడిసెలు కూల్చుతున్న
ప్రదేశానికి వెళుతుండగా నకిరేకల్ లో జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేసిన పోలీసులు..!!
#journalistraghuarrest#khammamissue
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం. దాడిని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది.
పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పాము.. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పసి పాప మృతికి కారణమైన వారి పై BNS 106(1), BNS 316(3), జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు పెట్టి నిందితుల పై చర్యలు తీసుకోవాలి
కులవివక్షతో రజక కుటుంబం పై దాడి చేసి పసి బిడ్డ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని @SpNagarkurnool కి ఫోన్ లో డిమాండ్ చేశాము.
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కుల వివక్ష చూపుతూ ఆలయానికి వెళ్ళిన వారిపై దాడి చేసి రెండు నెలల చిన్నారిని కాలితో తొక్కి హత్య చేసిన కాంగ్రెస్ సర్పంచ్, అగ్రనాయకులపై వెంటనే కేసు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు హైద్రాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ బి శివదర్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రాన్ని అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, సీహెచ్ ఉపేందర్, మాజీ ఎంపీపీ రాజు గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి చాకలి ఆనంద్, భరత్ గౌడ్, సుర్వి యాదయ్య మరియు తదితరులు ఉన్నారు.
@VisharadanDr నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో జరిగిన ఘటన సమాజమే సిగ్గుపడే దుశ్చర్య. బాధ్యులైన పోలీసులను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలి.
We Want justice ⚖️