ఈరోజు తాడేపల్లి లో వైస్సార్సీపీ శాసనసభ మరియు శాసనమండలి సభ్యుల సమావేశం సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు YSR కాంగ్రెస్ పార్టీ అధినేత YS జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది
డీఎస్సీ (DSC) నియామకాలలో జరిగిన అవకతవకలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి @naralokesh గారు తక్షణమే రాజీనామా చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కనిగిరి నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం.
#NaraLokeshMustResign#MegaDSCScam
రెండేళ్లలోనే సుమారు 50 వేల మంది వైద్య సిబ్బందిని నియమించి ‘జీరో వేకెన్సీ’ పాలసీ అమలు చేసిన ఘనత @ysjagan గారిది అని ప్రపంచ బ్యాంకు చెప్పింది. జగన్ గారు నిర్మించిన ప్రభుత్వ వైద్య వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు నెట్టడాన్ని అభివృద్ధా అంటారా @ncbn గారూ..?
#YSJaganMark#CBNFailedCM
#SadistChandraBabu
విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొని తప్పుచేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారు. విద్యార్థులు, యువకులు కోసం, వారి భవిష్యత్తుకోసం గడచిన 2 నెలలుగా అన్నివర్గాల మద్దతుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
చంద్రబాబుగారూ.. మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ, పోలీసు బలంతో అణచివేయాలని చూసినా నిర్బంధాలు, బెదిరింపులను లెక్క చేయకుండా, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి, ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు. నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగమిస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే ఈ 74 రోజుల్లో గవర్నర్గారిని కలవడం దగ్గరనుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు, అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతగా జరిగాయి.
మే 29, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలు
జూన్ 1, 2026 - జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతిపత్రాలు
జూన్ 8-9, 2026 - నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు.
జూన్ 12, 2026 - 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు
జూన్ 18, 2026 - రాష్ట్ర గవర్నర్‌ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రం
జులై 28, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలు
జులై 31, 2026 - జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లకు వినతిపత్రాలు
ఆగస్టు 3-4, 2026 - రాష్ట్రవ్యాప్తంగా రౌండ్‌టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలు
ఆగస్టు 6-8, 2026 - నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు
ఆగస్టు 10, 2026 - రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబుగారు మీరు నోరుమెదపడంలేదు. డీఎస్సీ లీకేజీ, అక్రమాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ( విద్యాదీవెన), వసతిదీవెన కింద దాదాపుగా రూ.9వేల కోట్లు బకాయిలు, పైగా ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట నిరుద్యోగ భృతికింద నెలా నెలా రూ.3వేల చొప్పున ఇస్తానన్న సొమ్ము చూస్తే ఈమూడేళ్లకు రూ.36,000X3సంవత్సరాలు = రూ.1,08,000లు చొప్పున ప్రతి నిరుద్యోగికీ పడ్డ బాకీ సహా ఏ డిమాండ్‌పైనా ఇప్పటివరకూ నోరు తెరవలేదు. మీ కుమారుడు లోకేష్‌కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలేదు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రిగా మీరు, సంబంధిత మంత్రి అయిన మీ కుమారుడు నోరువిప్పకపోవడం దౌర్భాగ్యకరంగా ఉంది. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేయడం పరిష్కారం కాదు చంద్రబాబుగారు. ఇది మీ తప్పులను మీ అధికార జులంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడమే.
విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి.
1.డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ
2.దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా
3.రూ.9వేల కోట్ల బకాయి పడ్డ ఫీజురీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల చెల్లింపు
4.ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి, బకాయిలతో కలిపి, ఈ మూడేళ్లకాలానికి చెల్లించాలి.
ఇంత స్పష్టంగా డిమాండ్లు ఉన్నా, డైవర్ట్ చేస్తూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం?
చంద్రబాబుగారూ.. ప్రజలు అడుగుతున్న ఈ డిమాండ్లకు అంగీకరిస్తారా? లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా?
ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు, తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వీళ్లంతా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత ప్రశ్నిస్తోంది.
@ncbn గారూ.. మీరు స్పందించకపోతే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు మిమ్మల్ని విడిచిపెట్టరు. Gen-Z ప్రశ్నలకు మీరు తప్పక సమాధానాలు చెప్పాలి.
అంతవరకూ ఈ పోరాటాలు ఆగవు.
English Version- https://t.co/Qb6ASf4FOI
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని,ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి రూ. 3000 వెంటనే ఇవ్వాలని కోరుతూ కనిగిరి టౌన్ లోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా 3 వ రోజు రిలే నిరాహార దీక్ష లో.
#RileNiraharaDeeksha#naralokeshmustresign#megadscscam
నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం!
దాడి చేసినవారికి రక్షణ… బాధితులపై కేసులతో రాజకీయ కక్ష!
@ncbn గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైయస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైనా కేసులు ! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?
చంద్రబాబుగారూ… నేను సూటిగా అడుగుతున్నాను. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని అనిపిస్తోంది.
చిప్పగిరి మండలం నేమకళ్లులో వైయస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడిచేస్తే, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా? చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు.
ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో… కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో… ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో… ప్రజలకు తెలియకూడదనే హార్డ్‌డిస్కులను తీసుకెళ్లారా? చంద్రబాబుగారూ… సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా?
శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్‌ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?
గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైనా ఇదే రాజకీయ కక్షసాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినప్పటికీ… తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైయస్సార్సీపీ నాయకుడని కేసు పెడతారా?
రాష్ట్రంలోని Gen-Z తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని. కాని, ఈ ప్రశ్నలకు మీ దగ్గర మీ తనయుడు లోకేష్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
చంద్రబాబుగారూ… గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా… ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా… ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా… ఎన్ని పోలీసు బలగాలను దించినా… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం. అన్యాయాన్ని నిలదీస్తాం. అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలుకొట్టలేరు. ప్రజల వేస్తున్న ప్రశ్నలనూ ఆపలేరు.
English Version- https://t.co/9f3rhT4DOo
జీవితమంతా శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన ఆదర్శప్రాయుడు, రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు, భారతరత్న,డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము...
#DrAPJAbdulKalam#Vardhanthi#DaddalaNarayanaYadav
తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ YM ప్రసాద్ (బన్నీ) గారు మరియు పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ మండాది కృష్ణారెడ్డి గారు*
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
.@ncbn గారూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం.
అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్ ప్లాట్లకింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం… ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా?
అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా?
చంద్రబాబుగారు, ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయస్సార్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది.
English Version- https://t.co/VLL3jBidAz
కనిగిరి నియోజకవర్గం కేంద్రంలో చంద్రబాబు "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై భారీ నిరసన ర్యాలీ…..
#2YearsForCBNBackStabbing#KanigiriTown#ysrcp
కనిగిరి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి వైయస్ఆర్సీపీ క్యాడర్ ఐడి కార్డు డిజిటలైజేషన్ మరియు వెరిఫికేషన్ ప్రక్రియపై కీలక సమావేశం. గౌరవ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కనిగిరి నియోజకవర్గం లో సుమారుగా 12 వేల మందికి పైగా వివిధ పదవులలో నియమించడం జరిగింది. పార్టీ క్యాడర్ ఐడి కార్డు డిజిటలైజేషన్ మరియు వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా పూర్తి చేయాలని కోరుకుంటు ప్రతి నాయకుడు, కార్యకర్త తన బాధ్యతగా భావించి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను. బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుంది.
#ysrcp
దర్శి నియోజకవర్గ కురిచేడు మండలం నాంచారపురం గ్రామములో శ్రీ సీతారామస్వామి ద్వజస్తంబ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్ర నాథ్ ఠాగూర్ గారు. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయన. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు.
#RabindranathTagore
.@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది.
తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు.
నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదు.
కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జత కట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు.
అయినా నిజం ఒప్పుకోకుండా, సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారు.
వాస్తవం ఏమిటన్నది మీక్కూడా తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయి. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి.
చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్‌పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు.
@ncbn garu, whenever any issue arises anywhere, you have mastered the art of turning it to your advantage and finding ways to exploit it. Your modus operandi is , enable traders who created artificial shortages to profiteer, and there by generate economic gains for coalition leaders. From seeds, fertilizers, and urea to cooking gas, this pattern has been seen across our state.
Now, petrol and diesel have been added to that list. Coalition leaders are preparing for yet another round of exploitation by enabling creation of artificial shortage.
In reality, there is no shortage of petrol or diesel in neighboring states like Tamil Nadu, Karnataka, and Telangana. There is no supply crisis there.
However, here in our state, a shortage has been created due to collusion between dealers and coalition leaders. Anticipating a price hike after the completion of elections in five states, dealers are hoarding petrol and diesel. Coalition leaders have joined hands with them, and together they are preparing for large-scale profiteering.
Yet, instead of admitting the truth, they are offering weak excuses claiming that fear of further supply reduction has led vehicle owners to purchase fuel in large quantities, increasing demand and causing the shortage.
You are fully aware of the reality. That is precisely why, not even one proper review of the petrol and diesel crisis has been conducted, the issue is being managed merely through selective leaks.
Due to this artificial shortage, people from all sections of society are facing severe difficulties, and the situation is becoming increasingly grim. Farmers are among the worst affected. Due to the lack of adequate diesel, tractors and agricultural machinery are coming to a halt. During the crucial Rabi harvesting season, this crisis has become even more severe. Harvesting machines require approximately 100 to 160 liters of diesel per day, but due to lack of supply, they are lying idle in the fields.
Aquaculture farmers are also facing hardships, as aerators used in fish and shrimp farming depend on diesel.
Even now, if the situation is not corrected, people will teach you a fitting lesson.
అక్షరాన్ని ఆయుధంగా మార్చుకుని, సమానత్వం కోసం పోరాడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను స్మరించుకుంటూ.. బాబాసాహెబ్ చూపిన బాటలో నడుద్దాం.
#AmbedkarJayanti#StatueOfSocialJustice#JaiBhim