#PawanKalyanBirthdayCDP#PawanKalyanBirthdayCDP
#PawanKalyanBirthdayCDP
A True Leader,
A simple Man With True Patriotism,
A Natural Famer,
A Writer,
A Humanitarian
A Power House of TFI
Respects Women at First Place
A Real Hero For The People,
Our janasenani
@PawanKalyan
Had a productive and insightful discussion with Hon'ble Minister for Education, IT & Electronics, Shri @naralokesh Garu at my residence today on Andhra Pradesh's development priorities.
He shared the outcomes of his recent visit to South Korea, the encouraging response from global investors, and the concerted efforts underway to attract high-value investments, cutting-edge technologies, and quality employment opportunities to our State.
Shri Lokesh Garu also enquired about my health following my shoulder surgery and conveyed his warm wishes for my speedy recovery. I deeply appreciate his thoughtful gesture of bringing the sacred prasadam and the portrait of Goddess Kanaka Durgamaa from Vijayawada.
I sincerely thank him for his concern, and warm wishes. I wish him continued success in his efforts towards the progress and prosperity of Andhra Pradesh.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
SWAMIYE SARANAM AYYAPPA 🙏
Bringing you all our first single #IrumudiKattu from #Irumudi in Telugu & Tamil 🖤
Telugu - https://t.co/1aeeFrzVsq
Tamil - https://t.co/AzIMW33338
In cinemas from August 21st!
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
జనసేనాని, ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన కల్ట్ క్లాసిక్ యాక్షన్ ఎంటర్టైనర్ "పంజా" సినిమా రీ-రిలీజ్ పోస్టర్ను రాజమహేంద్రవరంలో ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 2వ తేదీన ఉపముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానుల అభిమానం మధ్య మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న "పంజా" సినిమా ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
#PanjaRerelease
#PawanKalyan
#KandulaDurgesh
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
@ncbn@JaiTDP
I have successfully registered for the JanaSena Udyami membership. What about you?
Reach out to your Sadhak and get registered today to be part of the @JanaSenaParty movement under the leadership of JanaSenani Sri @PawanKalyan garu. This is an opportunity to grow as a leader, serve society, and be the change.
#JanasenaUdyami
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ రాష్ట్ర విద్యార్థి నాయకులు మహేష్ పెంటల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా జనసేన లో సిరిసిల్ల మరియు వేములవాడ మున్సిపాలిటీ లోని 15 వార్డుల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు క్యాడర్ తో కలిపి 200 మంది జనసేన పార్టీ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి RK సాగర్ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు.
ఈ కార్యక్రమానికి పార్టీ ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి RK సాగర్ గారు రాష్ట్ర యువజన నాయకులు గోకుల రవీందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి, గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు చల్లా శివారెడ్డి,పైసా మోజెస్ సిరిసిల్ల నాయకులు హరికృష్ణ, వంగరి సాయికిరణ్,అల్లే శ్రీకాంత్,సందిరి శ్రీకాంత్, నరేష్ రవికాంత్, అడెపు సంతోష్, కట్ల సాయి,అన్నారం సాయి,మనోజ్ ముఖ్యనాయకులు జనసేన వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు...
Our heartfelt thanks to the Director and Actor, Thiru @iam_SJSuryah Avl, for narrating the martial arts journey of Sri @PawanKalyan. Your narration effectively conveyed the journey from youthful uncertainty to a life driven in purpose, shaped by the focus and discipline attained through martial arts.
#PKMartialArtsJourney
కులం, మతం, ప్రాంతం, రాష్ట్రం అన్న భేదాలను దాటి దేశ సమగ్రతను లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాలు చేసే అరుదైన నాయకుల్లో మా నాయకుడు, @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు ముందుంటారు.
ఆయన నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, అక్కడి నుండి దేశ రాజకీయాలపై కీలక ప్రభావం చూపుతున్నప్పటికీ, ఆ పోరాట యాత్రకు పునాది పడింది తెలంగాణలోనే. ఆయనలో ఉద్యమ స్ఫూర్తి రేకెత్తించింది తెలంగాణలోనే. అందుకే పవన్ కళ్యాణ్ గారిని తమ గుండెల్లో పెట్టుకుని “నైజాం నవాబ్”గా కీర్తించిన తెలంగాణ ప్రజలు, అదే ప్రేమను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం అప్పగిస్తూ వ్యక్తం చేశారు.
కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రజలు కూడా "మాకు పవన్ కళ్యాణ్ కావాలి" అని పిలుస్తుంటే...
స్వరాష్ట్రాన్ని సాధించినా, కొద్దిమందికి మాత్రమే అభివృద్ధి అవకాశాలు అందుతున్న నేపథ్యంలో, తెలంగాణ యువత సైతం "అన్నా, మా రాష్ట్రం కోసం జనసేన కావాలి… మమ్మల్ని నడిపించడానికి పవన్ కళ్యాణ్ కావాలి" అనడం తెలంగాణ ప్రజలకు ఆయనపై ఉన్న ప్రేమకు, తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకుని గుండెల్లో దాచుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధానికి నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ ఆయనకు జన్మనిస్తే, తెలంగాణ కొండగట్టు అంజన్న స్వామి ఆయనకు పునర్జన్మనిచ్చి, వారాహి విజయయాత్రకు ఆశీస్సులు అందించి విజయపథంలో నడిపించాడు.
అలాంటి ప్రేమాభిమానాల నేల తెలంగాణ సమాజం నుండి పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరూ వేరు చేయలేరు. తెలంగాణ యువత భవిష్యత్తు కోసం జనసేన యొక్క పూర్తి స్థాయి రాజకీయ ప్రయాణం త్వరలోనే ప్రారంభమవుతుంది.
జనసేన జెండా తెలంగాణ నేలపై ఖచ్చితంగా ఎగురవేస్తుంది.
జై హింద్.
#TelanganaLovesPawanKalyan
Bhagwan Birsa Munda, revered as ‘Dharti Aaba’ (Father of the Earth), is not just a freedom fighter and tribal leader but a spiritual guide for the Adivasis. His life stood for protecting the ancestral Adivasi way of life and their identity.
When the Colonial rulers were forcefully converting the Adivasis through missionaries, Birsa Munda founded the Birsait Panth. This movement was a powerful fusion of spiritual reform and militant resistance. He declared self-rule against the colonial rulers, rejected forceful conversions and oppressive taxes that exploited the Adivasi communities.
The Birsait Panth united the tribes - Mundas, Oraons, and Kharias into a profound symbol of faith, identity and organized resistance against the foreign rule. His vision for freedom was powerfully captured in his rallying cry - “Abua raj seter jana, Maharani Raj tundujana” (“End the queen’s kingdom; establish our kingdom”)
In honour of this great freedom fighter, Bharat celebrates his birthday as Jan Jatiya Gaurav Diwas (Tribal Pride Day). On behalf of JanaSena, I pay my heartfelt tributes to the great Bhagwan Birsa Munda and may his spirit continue to inspire us - let us protect our forests, let us celebrate our heritage, let us strengthen our roots, and let us be proud of our identity.
# JanJatiyaGauravDiwas
The documentary Planet Killers presents an extraordinary account of how red sanders trees were felled, illegally transported, and smuggled, leading to the large-scale destruction of the Seshachalam Forest. It exposes the international kingpins behind this mafia, the brutal violence that took place, and the forest martyrs we lost in the process.
The criminals hiding behind political masks in the red sanders network are extremely dangerous to society. By maintaining close ties with smugglers, they turned red sanders smuggling into fuel for their political careers.
My appreciation to the makers for courageously bringing these facts to light and showing the brutal destruction of the Seshachalam Forest and its endangered Red Sanders.
#OperationAranya
https://t.co/EadoVUWL1S
We will cherish this best time spent with my most favourite person, hero @AlwaysRamCharan Anna and extremely talented director @BuchiBabuSana garu during the shoot of #PEDDI ❤️🔥
The hardwork & efforts Charan Anna is putting in for this movie is absolutely phenomenal 👏 Just wait and watch for its impact 🤩
@vriddhicinemas@SukumarWritings@MythriOfficial
*మోపిదేవి సుబ్బారాయుడి సేవలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు*
• భక్తిప్రపత్తులతో పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు
* దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన వేద పండితులు
అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుగు ప్రయాణంలో మోపిదేవిలో వెలసిన ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం శ్రీ వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి మధ్యాహ్న సేవలో పాల్గొన్నారు. తొలిసారి ఈ ఆలయానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కి... ఆలయ ఆవరణలో ఉన్న నాగ పుట్టను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి మొదట పుట్టలో పాలు పోసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి మొక్కులు చెల్లించుకుని పడగలకు మొక్కారు. అనంతరం ప్రదక్షిణగా వచ్చి అంతరాలయంలోని వేయి పడగలతో లింగమూర్తిగా వెలసిన మూలవిరాట్టుకి పంచామృతాలతో అభిషేకాదులు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ సుబ్బరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
• ఆలయ విశిష్టతను ఆసక్తిగా ఆలకించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పూజల అనంతరం ఘనాపాటి శ్రీ నవుడూరి విశ్వనాథ శర్మ ఆలయ విశిష్టతను, చరిత్రను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి వారు స్వయంభువుగా వెలసిన క్షేత్రం అని, ఆలయం వెలుపల పుట్టలో పోసిన పాలను లింగాకార మూర్తి కింద సర్పరూపంలో ఉన్న స్వామి వారు స్వీకరిస్తారని తెలిపారు. సంవత్సరానికి రెండు, మూడు సార్లు స్వామి వారు వెలుపలికి వచ్చి భక్తులకు విశ్వరూప దర్శనమిస్తారని వివరించారు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా పేరున్న మోపిదేవి క్షేత్రానికి వారాంతాలు, ప్రతి మంగళవారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని చెప్పారు. నివార్ తుపాను సమయంలో రైతులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఆలయం వెలుపలి నుంచి వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసుకున్నారు. తమిళనాట ఉన్న ఆరు విఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం తర్వాత మోపిదేవి సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం కలిగిందని అన్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు రాష్ట్ర మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, స్థానిక శాసన సభ్యులు శ్రీ మండలి బుద్దప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.
Shri @PawanKalyan Garu
శాసన సభలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని ఐటీ, హెచ్.ఆర్.డి. శాఖల మంత్రి శ్రీ @naralokesh గారు సోమవారం సభ విరామ సమయంలో కలిశారు. 25వ తేదీన నిర్వహించే డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.