జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు…https://t.co/9kwOFLWZOR
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్���ీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శ��ఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన హక్కుల సాధనలో తోడుగా నిలుస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
పంచాయతీ కార్యదర్శుల సమ్మె కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం..
కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు అన్యాయం..
సమ్మె ఉద్యోగుల ప్రాథమిక హక��కు..రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించింది.. పంచాయతీ కార్యదర్శులు కాదు..
ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి..
ఎర్రబెల్లి గారు, మీరు పంచాయతిరాజ్ శాఖ మంత్రేనా!
మీరు నోటిఫికేషన్ ఇచ్చినపుడే రెగ్యులరైజ్ చేస్తమని అన్నందుకే వాళ్లు జాయిన్ అయిండ్రు కదా అన్న?
మళ్ల ఇప్పుడు మాట తప్పి పాతర పెడ్తమని ధమ్కీ ఇస్తే ఎట్ల?
మీ మోసపు మాటల ప్రభుత్వాన్ని పాతర పెట్టెతందుకే పారలు నూరుతున్నదీ తెలంగాణ 👊
#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.
#JPSRegularisation#Jps_Ops_regulirisation#jpstelanga
JPS లు తమ ఉద్యోగ భద్రత కోసం చేస్తున్న సమ్మె లో నేను డైరెక్టుగా సమ్మె లో పాల్గొన్న లేకపోతున్నా, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన నా పాప కోసం బాధ పడలో నా ఉద్యోగ భద్రత కోసం ఆలోచించలో తెలియని పరిస్థతుల్లో హాస్పిటల్ నుంచే నిరసనా. @KTRBRS
Panchayat Secretaries in Telangana are on indefinite strike.
Panchayat Secretaries, who are responsible for the best panchayat awards for the state..!!
Making them overwork, Salaries are not given properly, Probation is over and they are not made permanent!!
#KCRFailedTelangana