7వ తేదీన ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి పేరిట ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు
- ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో పూజలు చేయించనున్న రాజ్యసభ సభ్యులు శ్రీ @MPLingamaneni గారు
అక్టోబర్ 7వ తేదీనాటికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానం పూర్తి చేస్తున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో శ్రీ నరేంద్రమోడీ గారి పేరిట ప్రత్యేక పూజాకార్యక్రమాలను రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ నిర్వహించనున్నారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన పజ్రా ప్రస్థానం యాత్ర 2014 నుంచి దేశ ప్రధాన మంత్రిగా మొత్తం 25 ఏళ్లగా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల శ్రీ మోదీ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకొని - ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 7వ తేదీ తెల్లవారుజామున విశిష్టమైన ఖడ్గమాల అర్చన నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రిగా దేశ సేవలో నిరంతరం నిమగ్నమైన శ్రీ నరేంద్ర మోదీ గారికి అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు లభించాలని, ఆయనకు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని, పాలనలో మరింత శక్తి సామర్థ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజను నిర్వహించనున్నారు. దేశాన్ని ‘వికసిత్ భారత్’ లక్ష్యం వైపు ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని శ్రీ మోదీ గారి నాయకత్వం మరింత బలోపేతం కావాలని, ఆయనకు కనకదుర్గమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఈ ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. ఈ పవిత్ర క్షేత్రంలో నిర్వహించే ఖడ్గమాల పూజకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఖడ్గమాల పూజను తెల్లవారుజామున బహ్మముహూర్త సమయంలో అంతరాలయంలో నిర్వహిస్తారు. జగద్గురువులు ఆది శంకరాచార్యులు ఇంద్రకీలాద్రిలో ప్రతిష్టించిన శ్రీ చక్రానికి ఖడ్గమాల స్తోత్రంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆధ్యాత్మిక శక్తి, రక్షణ, శాంతి, సంకల్పసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
అత్యంత పవిత్రమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పేరిట ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఖడ్గమాల పూజ నిర్వహణతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. దేశ సేవలో ఆయన కొనసాగిస్తున్న నిరంతర కృషికి కనకదుర్గమ్మవారి ఆశీస్సులు లభించాలని, దేశం మరింత బలమైన, సుసంపన్నమైన, ఆత్మనిర్భరమైన భారతదేశంగా అభివృద్ధి చెందాలని, ‘వికసిత్ భారత్’ సంకల్పం సాకారం కావాలని ఉద్దేశ్యంతో శ్రీ లింగమనేని రమేష్ ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
పార్టీ కాదు.. ప్రాంతం కాదు.. ప్రజలే ముఖ్యం
• తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదు
• ప్రతి ఇంటికీ సురక్షిత నీరు.. ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమరజీవి జలధార లక్ష్యం
• రూ.30,156 కోట్లతో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం
• పులివెందులకు రూ.280 కోట్లుతో 299 గ్రామాల తాగు నీటి సమస్యకు పరిష్కారం
• 3.27 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించేలా భారీ ప్రణాళిక
• గత ఏడు దశాబ్దాల్లో నిర్మించిన వసతులకు మించి ఈ ఐదేళ్లలోనే భారీ నీటి మౌలిక వసతులు
• రాయలసీమ నుంచి ఉద్దానం వరకు ప్రతి ప్రాంతానికీ సురక్షిత తాగునీరు
• ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదని, అభివృద్ధి విషయంలో ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ విధానమని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రజలు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రత కల్పించడమే ‘అమరజీవి జలధార’ లక్ష్యమని తెలిపారు. సోమవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి రూ.30,156 కోట్ల విలువైన తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన నేల. మహాత్మా గాంధీ నడయాడిన నేల. తెలుగు సాహిత్య్యాన్ని తన అక్షరాలతో సుసంపన్నం చేసిన సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులకు జన్మనిచ్చిన నేల ప్రొద్దుటూరు. బంగారం, వస్త్ర వ్యాపారంలో మినీ ముంబై గా, దసరా ఉత్సవాల్లో రెండో మైసూరు గా ప్రొద్దుటూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
• రూ.30,156 కోట్లతో భారీ తాగు నీటి ప్రణాళిక
రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ.30,156 కోట్లతో 50,315 పనులను శ్రీకారం చుడుతున్నాం. 24,601 ఆవాసాల్లో ఇప్పటికే ఉన్న 61.60 లక్షల కుళాయి కనెక్షన్ల సామర్థ్యాన్ని పెంచి స్థిరీకరించడంతో పాటు, మరో 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లను అందిస్తున్నాం. మొత్తంగా 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ‘హర్ ఘర్ జల్’ జల్ జీవన్ మిషన్‌కు గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. 2019-24 మధ్య కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ.26 వేల కోట్లు అందించినప్పటికీ, గత ఐదేళ్లలో రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, అక్కడక్కడ పైపులైన్లు, చిన్నచిన్న పనులు చేసి వదిలేశారు. 2024తో పథకం గడువు ముగుస్తుందని, నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని, ప్రజల తాగునీటి కష్టాలు ఎప్పటికీ తీరవని తెలిసినా కూడా పట్టించుకోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, జల్ జీవన్ మిషన్‌ను కొనసాగించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నేను - గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారిని కలిసి విజ్ఞప్తి చేశాము. అలాగే, గౌరవ కేంద్ర జలశక్తి మంత్రివర్యులు శ్రీ @CRPaatil గారు, గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి @nsitharaman గారి సహకారంతో జలజీవన్ మిషన్ పథకాన్ని 2028 వరకు పొడిగించుకుని, వెంటనే పనులు ప్రారంభించాం. ఇప్పటికే రూ.4,500 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాము.
• గత మౌలిక వసతులకు భారీగా అదనపు సామర్థ్యం
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2024 వరకు రాష్ట్రంలో తాగు నీటి మౌలిక వసతుల అభివృద్ధి క్రమంగా జరిగింది. ఈ కాలంలో 816 ఎం.ఎల్.డి సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 1,072 ఓవర్ హెడ్ బ్యాలెన్స్ జలాశయాలు, 28,086 ఓవర్ హెడ్ నిల్వ జలాశయాలు, 1.18 లక్షల కిలోమీటర్ల మేర పైప్లైన్లు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే, ‘అమరజీవి జలధార’ కార్యక్రమం ద్వారా కేవలం ఐదేళ్లలోనే ఈ మౌలిక వసతులకు భారీగా అదనపు సామర్థ్యాన్ని జోడిస్తున్నాం. ఇందులో భాగంగా 1,426 ఎం.ఎల్.డి సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రాలు, 494 ఓవర్ హెడ్ బ్యాలెన్స్ జలాశయాలు, 13,075 ఓవర్ హెడ్ నిల్వ జలాశయాలు, 77 వేల కిలోమీటర్ల పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నాం. అంటే, గత ఏడు దశాబ్దాల్లో నిర్మించిన మౌలిక వసతులతో పోలిస్తే, కేవలం ఈ ఐదేళ్లలోనే 50 శాతం నుంచి 175 శాతం వరకు అదనపు సామర్థ్యాన్ని సృష్టిస్తున్నాం. (1/3)
#JaljeevanMission #AmarajeeviJaladhara
పులివెందులలో వాళ్ళు పూర్తి చేయలేకపోయిన వాటర్ స్కీమ్స్ కి కూడా 280 కోట్ల రూపాయలు కేటాయించి 7 మండలాల్లోని 299 గ్రామాల తాగునీటి సమస్యకు పరిష్కారం చూపటం.
త్వరలోనే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగు నీరు అందించబోతున్నాం.
- రాష్ట్ర వ్యాప్తంగా రూ. 30,156 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh
#AmarajeeviJaladhara
ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధారల ప్రత్యేక పైలాన్
•రూ. 30,156 కోట్ల తాగు నీటి ప్రాజెక్టుల వివరాలతో అమృత్ నగర్ కూడలిలో ఏర్పాటు
•పైలాన్‌ను ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగు నీటిని అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టులకి సంబంధించిన ప్రత్యేక పైలాన్ ను ప్రొద్దుటూరు పట్టణంలోని, అమృత్ నగర్ కూడలిలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలసి ఆవిష్కరించారు. జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ద్వారా చేపడుతున్న భారీ తాగునీటి ప్రాజెక్టుల వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఈ పైలాన్ ను ఏర్పాటు చేశారు. రూ.30,156 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న తాగునీటి సరఫరా, సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు, మల్టీ విలేజ్ స్కీమ్స్, గ్రామీణ నీటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రధాన ప్రాజెక్టుల వివరాలు ఈ పైలాన్‌లో పొందుపరిచారు. అందులో గండికోట జలాశయం నుంచి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9,000 గ్రామాల్లో చేపట్టిన సింగిల్ విలేజ్ స్కీమ్స్, 28 జిల్లాల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిలో ఫలకాలపై చెక్కారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు చేర్చాలన్న లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార పనులను ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్థనరెడ్డి, స్థానిక శాసన సభ్యులు శ్రీ నంద్యాల వరదరాజులు రెడ్డి, మైదుకూరు శాసన సభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
#JalJeevanMission
రాష్ట్రవ్యాప్తంగా రూ. 30,156 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రివర్యులకి స్థానిక శాసనసభ్యులు శ్రీ వరదరాజుల రెడ్డి, పెందుర్తి శాసన సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, రైల్వే కోడూరు శాసన సభ్యులు శ్రీ అరవ శ్రీధర్, అహుడా ఛైర్మన్ శ్రీ టీ.సీ. వరుణ్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ షేక్ రియాజ్, జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్, జనసేన నాయకులు శ్రీ సుంకర శ్రీనివాస్, శ్రీ పి. శివకళ్యాణ్ రెడ్డి, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ అతికారి కృష్ణ, శ్రీ శ్రీనివాసరాజు తదితరులు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలసి జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టులకు ఉప ముఖ్యమంత్రివర్యులు శంకుస్థాపన చేస్తారు.
#JalJeevanMission
#AmarajeeviJaladhara
రాష్ట్రవ్యాప్తంగా రూ. 30,156 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చేరుకున్నారు.
ఆయనకు పార్టీ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, శ్రీ అరవ శ్రీధర్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ వరదరాజుల రెడ్డి గారు, అహుడా చైర్మన్ శ్రీ టీ.సీ. వరుణ్ గారు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారు, నాయకులు శ్రీ సుంకర శ్రీనివాస్ గారు, శ్రీ పి. శివకళ్యాణ్ రెడ్డి గారు, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర గారు, శ్రీ అతికారి కృష్ణ గారు, శ్రీ శ్రీనివాసరాజు గారు తదితరులు ఘన స్వాగతం పలికారు.
మరికాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
(1/4)
A New Era of Housing Innovation for Andhra Pradesh
A significant step towards Housing for All in Andhra Pradesh, with the foundation stone laid for 3 lakh houses under PMAY-G 2.0 at Burripalem, Guntur.
What makes this initiative especially remarkable is the launch of India’s first 3D Concrete Printing pilot for rural housing. 177 houses will be constructed across Burripalem and Obulanayudupalem, with advanced technology enabling a house to be built in around 10 days, while reducing construction waste and improving efficiency and quality.
My heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his visionary leadership and unwavering commitment to ensuring dignified housing for every family.
I sincerely thank Hon’ble Union Minister for Rural Development Shri @ChouhanShivraj Ji for his continued support to Andhra Pradesh and for advancing innovative approaches in rural housing.
The coalition government in Andhra Pradesh is accelerating housing delivery, combining scale with technology, speed with quality and welfare with innovation.
I thank Hon’ble Chief Minister Shri @ncbn Garu for his support in taking these initiatives forward.
A roof over every family.
Innovation in every brick.
A stronger foundation for Rural Andhra Pradesh.
- @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@MoRD_GoI@PIB_India@IPR_AP@pibvijayawada
#PMAYG #HousingForAll #AndhraPradesh #RuralHousing #3DPrinting
Exclusive visuals: Foundation Stone-Laying Ceremony for the Rayalaseema Integrated Horticulture Hub and the Indian School of Agriculture in Madanapalle.
కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు 👏🫡
Comprehensive development plan with an investment of ONE LAKH CRORE covering 10 districts (Rayalaseema plus Prakasam and Markapuram).
The project aims to expand horticulture area and production, improve irrigation and roads, support processing and exports, and benefit around 9.6 lakh farmers.
కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు
• గ్లోబల్ హార్టికల్చర్ హబ్ స్థాయికి రాయలసీమ
• రూ.లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
• 10 జిల్లాల్లో మూడు దశల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్
• రైతు పొలం నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు పూర్తి వ్యవస్థ
• పచ్చని చెట్లు నరికిన నేలలోనే నేడు ప్రగతి వనం
• ప్రాజెక్ట్ జలధారతో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరుగుదల
• మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
కరవుతో పోరాడిన రాయలసీమను ఇకపై కరువు సీమగా కాకుండా, ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు సాగు నీటి సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు, పంటలను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు అవసరమైన రహదారులు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, అదనపు విలువ లభించేలా ఆధునిక కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు సమగ్ర వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి రాయలసీమ రైతుల ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌తోపాటు ప్రపంచ మార్కెట్‌కు చేరేలా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.
శుక్రవారం మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీమతి @nsitharaman గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాయలసీమ గొప్ప చరిత్రకు, ప్రత్యేకమైన సంస్కృతికి, ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన నేల. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన ఈ ప్రాంతం ఒకప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఫ్యాక్షన్ రాజకీయాల ప్రభావంతో అశాంతికి గురైన సందర్భాలు ఉన్నాయి. అభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన ప్రాంతంలో పచ్చని చెట్లను సైతం నరికి వేసిన పరిస్థితులు చూశారు. ఆ పరిస్థితుల నుంచి రాయలసీమను బయటకు తీసుకువచ్చి, అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు ఎంతో కృషి చేశారు. 2024లో మీరు అందించిన ప్రజా తీర్పు ఈ మార్పుకు మరింత బలాన్ని ఇచ్చింది. ప్రజలు ఇచ్చిన ఆ విజయంతోనే ఈ రోజు రాయలసీమలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు పడ్డాయి.
*రెండేళ్లలో రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులు*
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత 2 ఏళ్లలో రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టాం.
అందులో భాగంగా రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో, అందులో రాయలసీమ ప్రాంతాన 62 వేల ఎకరాల్లో 28 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఉద్యాన పంటల సాగును విస్తరించాం. నీటి సంరక్షణలో భాగంగా దాదాపు 70 వేల ఫామ్ పాండ్లను నిర్మించి, అదనంగా 50 వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చాం. రూ.4,500 కోట్లకు పైగా నిధులతో 23 వేలకు పైగా రహదారి పనులను చేపట్టి, 5 వేల కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశాం. ఉపాధి హామీ నిధులతో ప్రాజెక్ట్ జలధార ద్వారా నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేస్తూ, రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా ఎన్నో చర్యల చేపట్టాం. తద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరిగాయి.
• 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ యాపిల్ సాగు
రాయలసీమ రైతుల పట్టుదలకు ఉద్యాన సాగులో వస్తున్న మార్పులే నిదర్శనం. సాధారణంగా యాపిల్ సాగుకు అనుకూలంగా భావించని 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అనంతపురం ప్రాంతంలోనూ కూడా కె.ఎల్.డి. యాపిల్ సాగు సాధ్యమైంది. రాయలసీమలో మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, నిమ్మ, స్వీట్ ఆరెంజ్ తోపాటు డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఆపిల్, బెర్రీస్ వంటి అధిక విలువ కలిగిన పంటలను కూడా సాగు చేస్తున్నారు. మదనపల్లె ఆసియాలోనే అతిపెద్ద టమాటా సాగు ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. రాయలసీమలో ఉద్యాన పంటలకు ఉన్న అపారమైన సామర్థ్యానికి ఇది నిదర్శనం. (1/4)
కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ స్థాయికి రాయలసీమ
రూ.లక్ష కోట్ల పెట్టుబడితో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
10 జిల్లాల్లో మూడు దశల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్
రైతు పొలం నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు పూర్తి వ్యవస్థ
పచ్చని చెట్లు నరికిన నేలలోనే నేడు ప్రగతి వనం
ప్రాజెక్ట్ జలధారతో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరుగుదల
మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu participating along with Hon'ble Union Finance Minister Smt. @nsitharaman Garu and Hon'ble Chief Minister Shri @ncbn Garu at the Foundation Stone Laying Ceremony of the Global Horticulture Hub - School of Agriculture in Madanapalle.
#AndhraPradesh
పర్యావరణానికి హాని కలిగించే చర్యలు ఆమోదయోగ్యం కాదు
•ఆక్వా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
•పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
•సహజ నీటి వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదు
•ఆక్వా కాలుష్యంపై 15 రోజులకు ఒకసారి పర్యవేక్షణ నివేదికలు సమర్పించాలి
•పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం
•ఆక్వా పరిశ్రమల్లో పర్యావరణ నిబంధనల అనుసరణపై సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సమీక్ష
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ… ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతనీ, నీటి వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణపట్ల అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. ఏ పరిశ్రమ అయినా పర్యావరణానికి, సమాజానికి హాని కలిగించే విధంగా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదన్నారు. కాలుష్యాన్ని మూలం వద్దే నివారించడం అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భజలాలు కాలుష్య బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలు తప్పక పాటించి తీరాలని ఆదేశించారు. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు పాటించాల్సిన పర్యావరణ అనుసరణలపై సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEAI) ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆక్వా పరిశ్రమల్లో అమలు చేస్తున్న ప్రమాణాలపై సమీక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 128 ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, 82 యూనిట్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్టు ఈ సందర్భంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ తన నివేదిక ద్వారా ఉప ముఖ్యమంత్రివర్యులకు తెలియజేశారు. అందులో 49 యూనిట్లు నిర్దేశిత ప్రమాణాలను పాటించడం లేదని, నిబంధనలు పాటించని యూనిట్లను పరిశీలించగా బీఓడీ (BOD) స్థాయిలు లీటరుకు 30 మిల్లీగ్రాములకుగాను, 321 మిల్లీగ్రాములు నమోదైనట్లు వివరించారు. సుమారు 64 శాతం యూనిట్లలో 90 మిల్లీగ్రాములకు మించి ఉన్నట్టు తెలిపారు. టీఎస్ఎస్ స్థాయిలు కూడా ప్రమాదకర రీతిలో ఉన్నాయని, లీటరుకు 365 మిల్లీగ్రాములు నమోదయ్యాయని, నిర్దేశిత ప్రమాణాల మేరకు 50 మిల్లీగ్రాములు మించరాదని తెలిపారు. ఇది జలవనరులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఇంత యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదు. కాలుష్యాన్ని మూలాల వద్దే నివారించడం అత్యంత కీలకం. ఆక్వా ప్రాసెసింగ్ కార్యకలాపాల నుంచి వెలువడే మురుగు నీరు నదులు, కాలువలు, చెరువులు, సాగర సంగమ ప్రాంతాలు, భూగర్భ జలాలు తదితర నీటి వనరులను కలుషితం చేయకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజల జీవనాధారానికి, వ్యవసాయానికి, మత్స్య సంపదకు, పర్యావరణ వ్యవస్థలకు ఈ నీటి వనరులే అత్యంత కీలకం. పరిశ్రమలు కచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత ప్రమాణాలు అమలు చేయాలి.
• పారిశ్రామిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో నిర్దేశిత ప్రమాణాలు అమలును ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్షించాలి. ఎప్పటికప్పుడు పరిశీలనలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలి. అదే సమయంలో నిబంధనలు అమలులో ఏవైనా సాంకేతికపరమైన, నిర్వహణపరమైన సవాళ్లు ఉంటే పరిశ్రమల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మత్స్య రంగం, ఆక్వా ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా చర్చించేందుకు మత్స్యకార ప్రతినిధులు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించి, పర్యావరణ నిబంధనల అమలు, ప్రాసెసింగ్ రంగాల స్థిరమైన అభివృద్ధి మధ్య సమతుల్యత సాధించడం అవసరం. కూటమి ప్రభుత్వం స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణకు కట్టుబడి ఉంద”న్నారు.
ఈ సమావేశంలో సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEAI) ఆంధ్రప్రదేశ్ ప్రాంత అధ్యక్షులు శ్రీ కె. ఆనంద్ కుమార్, ప్రాంతీయ కార్యదర్శి, శ్రీ డి. దిలీప్, ఉపాధ్యక్షులు శ్రీ యు. జోగి వర్మ, శ్రీ తోట జగదీష్, శ్రీ ఐ. సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.