ముఖ్యమంత్రి @revanth_anumula గారు, కేసీఆర్ గారి హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు మీ ప్రభుత్వ హయాంలో తుది ఫలితాలు రాబట్టుకోవడానికి ఎనిమిది వేల మంది నిరుద్యోగ గ్రూప్-4 అభ్యర్థులు పడిన బాధలు వర్ణనాతీతం. మీరు అన్విల్లింగ్ (Relinquishment) ఆప్షన్ ఇవ్వనందు వల్ల చాలా బ్యాక్ లాగ్ పోస్టులు వచ్చే ప్రమాదముంది. ఇప్పటికైనా డిసెంబర్ 9 లోగా వారికి అపాయింట్మెంట్ ఇస్తామని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారి మాటలు నిజం చేస్తారని ఆశిస్తున్నా.
అయితే, మీ జరుపుకోబోయే విజయోత్సవాల్లో మీరు కావాలని పక్కకు పెడుతున్న జె ఎల్ అభ్యర్థుల ఫలితాల గురించి, అపాయింట్మెంట్ ఆర్డర్ ల గురించి మళ్ళీ మీ దృష్టికి తీసుకువస్తూ, ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి అభ్యర్థుల తరపున అడుగుతున్న మా ఈ మౌళిక ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
1. @KCRBRSPresident గారి హయాంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ లలోకి జూనియర్ లెక్చరర్లు పోస్టులకు అభ్యర్థులు పరీక్షలు రాసి ఏడాది గడిచిపోయింది. 8000 మంది గ్రూప్-4 ఫలితాలను ఒకే సారి విడుదల చేయగలిగిన టిజిపిఎస్సి కి, ఎప్పుడో జనరల్ ర్యాంకింగు లిస్టు ఇచ్చి ఉన్న 1392 మంది ఉన్న జె ఎల్ అభ్యర్థుల ఫలితాలను దశలవారీగా కూడా ఎందుకు 'పూర్తిగా' విడుదల చేయలేకపోతుంది? వాళ్ళు ధర్నా చౌక్ ను ఇంకా ఆశ్రయించకపోవడమే దీనికి కారణమా?
2. పేద విద్యార్థులు, ముఖ్యంగా బిసి, ఎస్సి,ఎస్టీ పిల్లలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ కళాశాలల్లో విద్య బలోపేతానికి ఈ రెండు నెలలు చాలా కీలకం. నూతనంగా ఎంపికయ్యే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యకు అత్యవసరం. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడానికి మీ పైన ఉన్న ఒత్తిడి ఏమిటి? ఆ ఒత్తిడి చేస్తున్న సంఘ నాయకులెవరు?
3. విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్న మీ దర్శనం ఈ పేద అభ్యర్థులకు ఎలాగూ దక్కదు. పోనీ,మీ మంత్రుల ఇళ్ల చుట్టూ, గాంధీ భవన్ చుట్టూ తిరిగితే అయినా అపాయింట్మెంట్ తేదీల గురించి ఒక స్పష్టత వస్తుందేమో అనుకుంటే, వాళ్లకు కనీస సమయం కూడా ఇవ్వట్లేదు. పరీక్ష రాసి నిజాయితీగా ఉద్యోగం సాధించడమే ఈ అభ్యర్థులు చేసుకున్న పాపమా? వీళ్లకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎప్పుడిస్తారో అయినా చెబితే కనీసం మానసికంగా ఐనా సిద్ధపడి ఉంటారు కదా!
4. నెక్స్ట్ అకడమిక్ ఇయర్ వరకూ ఈ ప్రాసెస్ ను సాగదీసి 'ఖజానా' ను మిగుల్చుకునే కుట్ర, ఇతర ఒత్తిళ్లు ప్రభుత్వం మీద ఉన్నాయనే అభ్యర్థుల అనుమానాలు నిజమేనా మరి? ఇటీవల డిఎస్సి నియామకాల్లో నకిలీ స్పోర్ట్స్ పత్రాల గురించి వస్తున్న వార్తలు చూస్తే ప్రభుత్వ సమర్ధత మీద అనుమానాలు రావడం సహజమే.
చివరిగా, మీరు ఒక నాడు బలిదేవత అన్న సోనియా గారి పుట్టిన రోజు సందర్భంగా ముగించబోతున్న మీ ప్రభుత్వ అపజయోత్సవాల్లోనైనా జె ఎల్ అభ్యర్థుల అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి. లేకపోతే, మొత్తం ఇంటర్మీడియట్ విద్య ను మీరు మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 'బలి' చేసినట్టే.
జెఎల్ అభ్యర్థుల పెండింగ్ ఫలితాలను విడుదల చేసి వెంటనే వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తాత్సరం చేస్తే అభ్యర్థుల తరపున @BRSparty పోరాటానికి సిద్ధంగా ఉందని ప్రకటిస్తున్నాం. @TelanganaCMO@KTRBRS #tgpscJLappointmentOrders #CongressFailedTelangana
#BRS4Jobs
ప్రజలతో ఉండి, ప్రజలతో మమేకమై, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే ప్రజా నాయకుడు మా రేవంతన్నా!
ప్రజా అభివృద్దియే శ్వాసగా, తెలంగాణ ప్రజానీకం వృద్ధిలోనే తన సంతోషాన్ని వెతుక్కునే ప్రజా నాయకుడు మన రేవంతన్నా!
జన నేత, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
ఎందుకు ఈ మొండి వైఖరి?
గురుకులాలో జరిగిన తప్పిదం మళ్ళీ చేయనున్నారా?
నిరుద్యోగుల బాధలు రేవంత్ ప్రభుత్వానికి పట్టవా ?
బ్యాక్ లాగ్ వద్దు అని మోరపెట్టుకుంటున్న గ్రూప్ 4 అభ్యర్థులు
1:3కి సెలెక్ట్ అయిన గ్రూప్ 4 అభ్యర్థులకు అన్ విల్లింగ్ ఇవ్వాలని.. తద్వారా బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా చూడాలనీ వేడుకుంటున్న గ్రూప్-4 అభ్యర్థులు
గతంలో గురుకులాల్లో లాగా బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా ఫలితాలకు ముందు నిర్ణయం తీసుకోవాలి. గ్రూపు 4 ఫలితాలు ఇచ్చాక బ్యాక్ లాగ్ అయితే అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపే ప్రమాదం వుంది
ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షతో చెడ్డ పేరు మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి
G.O 46 రద్దు విషయములో మాట తప్పిన ప్రభుత్వం.
గురుకులంలో 2500 పోస్టులు బ్యాక్ లాగ్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు.
గ్రూపు 4లో కూడా 3000 పోస్టులు బ్యాక్ లాగ్ అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ తన మొండి వైఖరితో అభ్యర్ధులును ఇంకా ఇబ్బంది పెడుతుంది.
3000 మంది నిరుద్యోగుల ఆశలు ఫలించేనా?? ప్రభుత్వం ఇప్పటికీ అయిన కళ్ళు తెరిచి గ్రూప్ 4 అభ్యర్థులకు అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చేనా.
@OffDSB సార్ దయచేసి గ్రూప్ 4 లో ఫలితాల కంటే ముందు unwilling ఆప్షన్ ని ఇవ్వండి, తద్వారా సుమారు 3000 మందికి న్యాయం జరుగుతుంది. దయచేసి ఈ సమస్య ని పరిస్కారం చూపండి సార్ 🙏
@OffDSB@revanth_anumula
తిరిగి తిరిగి అలిసిపోయాము. ప్రజాపాలన లో గురుకూల అభ్యర్థులకు పట్టిన గతి Group 4 Aspirants కి కూడా వస్తుంది అని బయం తో ఉన్నాం.Group 4 లో Unwilling option ఇచ్చి Back log post లుగ మిగలకుండా చూడండి, 3000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. న్యాయము చేయండి.
@VenkatBalmoor@revanth_anumula యువనేత,విద్యార్థి నాయకుడు అన్న అంటే నేను ఉన్నాను అంటూ విద్యార్టుల తరుఫున నిరంతరం పొరుడుతున్న ..
MLC బాల్మూరి వెంకట్ అన్నకు
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐💐
ఇట్లు
గ్రూప్-4 అన్విల్లింగ్ అభ్యర్థులు..
@VenkatBalmoor@revanth_anumula జన్మదిన శుభాకాంక్షలు అన్న 💐.
మేము Group 4 లో బ్యాక్ లాగ్ post లు గా మిగలకుండా Unwilling option ఇప్పించాలని తమరిని వేడుకుంటున్నాం.
విద్యార్ధి నాయకుడిగా
నిరుద్యోగుల తరఫున మీరు ప్రభుత్వాన్ని ఒప్పించి
మీ పుట్టిన రోజు సంధర్బంగా మాకు శుభ వార్త తెలియజేస్తారని ఆశిస్తున్నాం🙏
@KTRBRS#AskKTR
KTR Sir
GROUP- 4 లో Unwilling option ఇచ్చి Post లు బ్యాక్ లాగ్ కాకుండ చూడాలనీ Govt కి TGPSC కి request చెయ్యండి.
3000 కుటుంబాల కి న్యాయం చెయ్యండి.
*# Group-4 NoBacklog #Unwilling_Group4*
@KTRBRS
KTR Sir
GROUP- 4 లో Unwilling option ఇచ్చి Post లు బ్యాక్ లాగ్ కాకుండ చూడాలనీ Govt కి TGPSC కి request చెయ్యండి.
3000 కుటుంబాల కి న్యాయం చెయ్యండి.
*# Group-4 NoBacklog #Unwilling_Group4*