#QuantumRevolutionInAP
At Amaravati, we are building the foundations of a future-ready innovation ecosystem. By bringing together academia, industry, startups and government, Andhra Pradesh aims to position India at the forefront of the quantum revolution. Grateful to @livemint for this deep dive into Andhra Pradesh’s Quantum Valley initiative.
https://t.co/Oklu2eFKoO
దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాలు ప్రత్యేక విభాగాలుగా ఉంటాయి.
కానీ గొడ్డలి పార్టీకి మాత్రం —
▪️ గంజాయి బ్యాచ్
▪️ బ్లేడ్ బ్యాచ్
▪️ సోషల్ మీడియా సైకో బ్యాచ్
▪️ ఫేక్ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్
▪️ హత్యా రాజకీయాల కిరాయి ముఠా బ్యాచ్
▪️ దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్
▪️ కల్తీ లిక్కర్ బ్యాచ్
ఇలా ఏడు విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేసే రాజకీయాలకే పరిమితమైంది.
ప్రజలకు అభివృద్ధి చూపించలేని వారు… అశాంతి, అబద్ధాలు, అరాచకాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు.
#GoddaliParty
#PsychoFekuJagan
#EndOfYCP
#Andhrapradesh
#Mahanadu2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించింది.
#SthreeShakti
నేను డీఎస్సీ కోసం ఎదురు చూసిన నిరుద్యోగిని... @ysjagan గారికి నా ప్రశ్నలు
ఒక ఉద్యోగం కోసం ఎంతకాలం ఎదురు చూడాలో నిరుద్యోగులకే తెలుసు. ఒక నోటిఫికేషన్ వస్తుందేమో అని ప్రతి రోజు పేపర్ చూస్తూ, ప్రతి బడ్జెట్లో ఆశలు పెట్టుకుని, ప్రతి ఎన్నికల్లో హామీలు వింటూ గడిపిన సంవత్సరాలు మావి.
నేను కూడా అలాంటి వేలాది మంది యువతలో ఒకడిని. టీచర్ కావాలనేది నా కల. మా కుటుంబం ఆశ. కానీ గత ఐదేళ్లు ఆ కల కేవలం కలగానే మిగిలిపోయింది.
2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగ యువత ఎంతో ఆశ పెట్టుకుంది జగన్ గారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ వస్తుందని, డీఎస్సీలు జరుగుతాయని, ఖాళీలు భర్తీ అవుతాయని నమ్మింది. కానీ జరిగినది ఏమిటి?
ఐదేళ్లలో ఒక్క మెగా డీఎస్సీ కూడా లేదు.
లక్షలాది మంది యువత వయసు పెరిగింది. కొందరు ప్రైవేట్ ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు. కొందరు కుటుంబ బాధ్యతలతో పరీక్షలకే దూరమయ్యారు. మరికొందరు ఆశలు కోల్పోయారు.
అప్పుడు మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడని మీరు... ఇప్పుడు 16,347 పోస్టులతో జరిగిన మెగా డీఎస్సీపై ఏడాది తర్వాత అకస్మాత్తుగా కన్నీళ్లు కార్చడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
నిజంగా మీకు యువతపై ప్రేమ ఉంటే ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?
ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. నా లాంటి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. మా కుటుంబాల్లో ఆనందం వచ్చింది. మా తల్లిదండ్రుల కష్టాలకు ఫలితం దక్కింది. కానీ ఆ ఆనందం కూడా మీకు ఇబ్బందిగా కనిపిస్తున్నట్టు ఉంది.
మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచే కేసుల మీద కేసులు వేశారు. కోర్టులకు వెళ్లారు. ప్రక్రియ ఆగిపోవాలని ప్రయత్నించారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు విడుదల చేసింది. మెరిట్ లిస్టులు పెట్టింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసింది. చివరకు నియామకాలు పూర్తిచేసింది.
ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాక, శిక్షణలు పూర్తయ్యాక, పాఠశాలల్లో చేరాక మళ్లీ కొత్త కథలు మొదలుపెట్టడం ఎందుకు?
మీ ఆరోపణలు నిజమైతే ఒక అభ్యర్థి అయినా ముందుకు వచ్చి "నేను డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాను" అని చెప్పాడా?
ఒక్క నియామకం అయినా అక్రమమని నిరూపించగలిగారా?
ఒక్క అభ్యర్థి అయినా రాజకీయ సిఫారసుతో ఉద్యోగం పొందాడని ఆధారాలు చూపించగలిగారా?
లేకపోతే ఇవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలే కాదా?
ఇంకా విచిత్రం ఏమిటంటే... డీఎస్సీ గురించి మాట్లాడుతున్న మీ పార్టీకి గతంలో డీఎస్సీ అవినీతి ఆరోపణల చరిత్ర ఉంది. ఓఎంఆర్ షీట్లు మార్చారని, డబ్బులు తీసుకుని మార్కులు పెంచారని కేసులు నమోదైన రోజుల గురించి మేము కూడా చదివాం. ఆ చరిత్ర మర్చిపోయి ఇప్పుడు పారదర్శకంగా జరిగిన నియామకాలపై బురదజల్లడం ఏ నైతిక హక్కుతో?
ఈరోజు నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిలబడగలిగానంటే అది ఎన్నో సంవత్సరాల కష్టం, చదువు, పోటీ, మెరిట్ వల్లే. నా లాంటి వేలాది మంది కూడా అదే విధంగా ఉద్యోగాలు సాధించారు.
మా విజయాన్ని అవమానించవద్దు జగన్ గారు.
మేము లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకోలేదు.
మేము రాజకీయ సిఫారసులతో ఉద్యోగాలు పొందలేదు.
మేము రాత్రింబవళ్లు చదివి, పోటీ పరీక్షలు రాసి, మెరిట్‌తో ఉద్యోగాలు సాధించాం.
అందుకే మీకు ఒక నిరుద్యోగి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారిన యువకుడి ప్రశ్న...
ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వని మీరు యువత గురించి మాట్లాడే అర్హత సంపాదించారా?
16,347 మంది జీవితాల్లో వెలుగులు నింపిన మెగా డీఎస్సీపై విషం చిమ్మడం ఆపి, కనీసం వారి కష్టాన్ని గౌరవించలేరా?
ఎందుకంటే...
ఉద్యోగం రాకముందు మేము నిరుద్యోగులం.
ఉద్యోగం వచ్చిన తర్వాత మేము ఉపాధ్యాయులమయ్యాం.
కానీ యువత ఎదుగుదల చూడలేకపోవడం మాత్రం మీ రాజకీయాల అసలు స్వరూపాన్ని బయటపెడుతోంది.
#Mahanadu2026#NTRLivesOn
మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#PsychoFekuJagan
జగన్ నాటకాలు చూసి చూసి జనం ఛీ కొట్టినా.. ఆ డ్రామాలు మానడం లేదు. బాబాయి గుండెపోటు, కోడి కత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపాడు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య వైసిపి నేతల అనుచరుడని పోలీసులు తేల్చారు. ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా @ysjagan?
#YcpCriminalPolitics
It is a matter of pride for Andhra Pradesh that the first project under our forward-looking Integrated Clean Energy Policy 2024 is now being commissioned.
SAEL’s 600 MW solar project in Rayalaseema, built with an investment of ₹3,000 crore in a record 11 months, reflects the speed, confidence, and execution capability of our state.
Our government is committed to positioning Andhra Pradesh as India’s clean energy capital, with a target of attracting ₹10 lakh crore in green energy investments over the coming years.
#ChooseSpeedChooseAP
@SAEL_India
ఈరోజు దళిత డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి. కష్టపడి చదువుకుని, దశాబ్దాల పాటు డాక్టర్ గా ప్రజలకు సేవలందించి... చివరికి దయనీయ స్థితిలో గొడ్డలి పార్టీ చేతిలో పిచ్చివాడని ముద్ర వేయబడి చనిపోయిన డాక్టర్ సుధాకర్ గురించి వారి కుటుంబ సభ్యుల మాటల్లో...
#DoctorSudhakarStory#DalitDrohiJagan
#AntiDalitYSRCP
మార్ఫింగ్ వీడియో లతో తప్పుడు ప్రచారం చేయడం @JaganannaCNCTS కి అలవాటు అయ్యింది. కుప్పంలో ని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడ ఆలయ అర్చకులు అందచేసిన తీర్థ ప్రసాదాలు భక్తిప్రపత్తులతో స్వీకరించారు. ఈ వీడియో ను కట్ చేసి సీఎం గారు ప్రసాదం తీసుకున్నట్లు నటించారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటో ఈ వీడియో లో చూడండి. దేవుని సన్నిధి లో జరిగిన వాస్తవాలను వక్రీకరించే హీన స్థితికి వైసీపీ చేరింది.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసిన అధినేతను మించిపోయారు గొడ్డలి పార్టీ నేతలు. తమ రాక్షస రాజకీయాలకు మూగజీవాలను బలి చేస్తున్నారు. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగితే గాడిద ఏం పాపం చేసిందని.. దాని రక్తం కళ్ళజూశారు.
#PsychoFekuJagan
During my visit to Kavali in Nellore today, Thanamgari Babu garu invited me to his home for lunch. I bought some freshly caught fish from the market, and T Venkamma garu graciously cooked a delicious meal for us. We shared lunch with the family while discussing the aspirations of fishermen and the coastal community. Grateful for their warm hospitality.
#MatsyakarulaSevalo
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని చాటుతోంది. వేట నిషేధ సమయంలో గంగపుత్రుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆదుకునేందుకు అమలు చేస్తున్న “మత్స్యకారుల సేవలో” పథకం కింద వరుసగా రెండో ఏడాది భారీ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ప్రజా ప్రభుత్వం మత్స్యకారుల వెన్నంటే నిలుస్తూ, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది.
నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రతీ కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందిస్తున్న ఈ సాయం, వేట నిషేధ కాలంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనుంది.
ప్రతీ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల సంరక్షణ కోసం వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది ఈ సాయం అందించడం గమనార్హం.
గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం అందించగా, ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరిగి 1,30,796 కుటుంబాలకు చేరింది. రెండేళ్లలోనే మొత్తం రూ.505 కోట్ల సాయాన్ని ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అందించింది. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.10 వేల సహాయం మాత్రమే అందించగా, కూటమి ప్రభుత్వం దానిని రెట్టింపు చేసి రూ.20 వేలకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం మరోసారి నిరూపించింది.
మత్స్యకారుల సంక్షేమం కేవలం ఆర్థిక సాయంతోనే పరిమితం కాలేదు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్‌కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 పెండింగ్ క్లెయిమ్స్‌కు రూ.5.65 కోట్ల పరిహారాన్ని సకాలంలో చెల్లించింది. కుటుంబాలు రోడ్డున పడకుండా చేయాలనే బాధ్యతతో ప్రభుత్వం పనిచేస్తోంది.
అంతేకాకుండా మత్స్యకారుల ఆదాయ వనరులు పెంచేందుకు సీవీడ్ సాగును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సముద్రతీర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను పెంచి మత్స్యకార కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
“వేటకు విరామం… కానీ మత్స్యకారుల కుటుంబాలకు కాదు” అన్న భావనతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు గంగపుత్రుల జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. సంక్షేమం అంటే కేవలం మాటలు కాదు… అవసరమైన సమయంలో అండగా నిలవడమేనని ప్రజా ప్రభుత్వం మరోసారి నిరూపిస్తోంది.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
గాడిదకి రక్తం వచ్చేలా, గొడ్డలి పార్టీ అరాచకం.
రాజకీయ ప్రయోజనాల కోసం గొడ్డలి పార్టీ మరో ఘాతుకానికి ఒడిగట్టింది. పెట్రోల్ డీజిల్ సరఫరా పై ఇటీవల తిరుపతిలో అత్యంత దారుణంగా ఒక ఎద్దును హింసిస్తూ ప్రదర్శన జరిపిన వైకాపా, నేడు పెట్రోల్ డీజిల్ ధరల పేరుతో గాడిదలను హింసించింది. జగన్ రెడ్డి పుట్టిన రోజు పేరుతో మూగ జీవాలను బలి ఇచ్చి ఆ రక్తాన్ని అతని ఫొటోకు పూసిన రప్పా రప్పా బ్యాచ్ తరచూ జంతు హింసకు పాల్పడుతూనే ఉంది. విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన అనుచరులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. గాడిదలకు మోటారు సైకిల్ సీటు, హెడ్ లైటు కట్టి వాటి మెడ, శరీర భాగాలు తీవ్రంగా రక్త స్రావం అవుతున్నా కూడా కొడుతూ లాక్కెళ్లారు. దారుణమైన మానసిక ప్రవర్తన ఉన్నవారు మాత్రమే ఇలా చేయగలుగుతారు. ఈ వికృత చర్యలతో స్థానికులు వైకాపా ను చీదరించుకున్నారు.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
కూటమి ప్రభుత్వం @ 23 నెలలు - 100 విజయాలు
సంక్షేమం, సామాజిక భద్రత :
1. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ – నెరవేరిన ఎన్నికల హామీలు
2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం
3. స్త్రీ శక్తి : మహిళలకు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం - 63.61 కోట్ల ప్రయాణాలు (మే 6 వరకు)
4. దివ్యాంగ శక్తి : దివ్యాంగులకు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం – 20.51 లక్షల ప్రయాణాలు
5. దీపం 2 పథకం : ఏటా ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ - ఇప్పటికి 4 కోట్ల సిలిండర్లు.
6. అన్న క్యాంటీన్ : రాష్ట్రంలో 269 ఏర్పాటు - 9.15 కోట్ల భోజనాలు (మే 6 నాటికి)
7. అన్నదాత సుఖీభవ : 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిపి రూ.8,985 కోట్లు జమ
8. ఎన్టీఆర్ భరోసా : ఇప్పటివరకు సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రూ.63 వేల కోట్లకు పైగా వ్యయం
9. మత్స్యకార సేవలో : ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు
10. ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000... రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది
11. అంగన్వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు
12. బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్ల అందజేత
13. P 4 ద్వారా పేదరిక నిర్మూలన – 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శుల చేయూత
14. 23 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు పేదలకు అందజేత... మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ :
15. మత్స్యకారుల కోసం జీ.వో 217 రద్దు – నీటి వనరులపై హక్కు
16. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు
17. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ
18. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
19. ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ.3,670 కోట్లు
20. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనానికి రూ.51 కోట్లు
21. ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు
22. వక్ఫ్ బోర్డు పునరుద్ధరణ – అన్ని వర్గాలకు ప్రాధాన్యం
23. పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు
24. నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు
25. చేనేతలకు ఉచిత విద్యుత్ : నెలకు మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు
26. జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం
27. 20 లక్షల ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్
28. సోలార్ రూఫ్ టాప్కు బీసీలకు రూ.20 వేల అదనపు సాయం
29. లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలు – మరో 5 లక్షల మంది లక్ష్యం
నియామకాలు, ఉద్యోగుల సంక్షేమం :
30. మెగా DSC రిక్రూట్మెంట్ - ముఖ్యమంత్రి తొలి సంతకం, 15,941 టీచర్ పోస్టుల భర్తీ
31. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు
32. 10 వేలకు పైగా పోస్టులతో కొత్తగా జాబ్ కేలండర్ విడుదల
33. ప్రభుత్వ ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు
34. మహిళా ఉద్యోగులకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా మెటర్నిటీ లీవ్
రాజధాని, మౌలిక సదుపాయాలు :
35. భవిష్యత్ నగరంగా అమరావతి నిర్మాణం – శాశ్వత, ఏకైక రాజధానిగా కేంద్రం గెజిట్
36. రూ.861 కోట్లతో 20,060 కి.మీ పాత్ హోల్ ఫ్రీ రోడ్లు- రూ.2500 కోట్లతో రహదారుల నిర్మాణం
37. విజయవాడ – మచిలీపట్నం 6 లైన్ రోడ్డుకు ఆమోదం
38. మూలపేట - వైజాగ్ - కాకినాడ బీచ్ రోడ్, నాగపూర్ – అమరావతి హైవే నిర్మాణం
39. హైదరాబాద్ - అమరావతి - చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా
40. రికార్డు స్థాయిలో బెంగుళూరు - అమరావతి హైవే పనులు
41. గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లె పండుగ కింద గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం
42. అడవితల్లి బాటలో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, 4జీ నెట్వర్క్ సౌకర్యం
43. ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు
44. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి
45. వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
46. జూలై నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి
47. లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు – విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు గెజిట్
48. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు
పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ :
49. 28 నూతన పాలసీలు, పరిశ్రమలకు రాయితీల కోసం దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు
50. ఒక్క ఏడాదికి దేశంలోని పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి – బిజినెస్ రిఫార్మర్ అవార్డు
51. CII సమ్మిట్ 538 ఒప్పందాలు. రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగాలు
52. 17 SIPB సమావేశాల్లో రూ.11,37,222 పెట్టుబడులు, 10,01,147 లక్షల ఉద్యోగాలు
53. 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్
54. విశాఖ IT హబ్ – TCS ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన
55. రాజధానిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన, క్వాంటమ్ రిఫరెన్స్ ఫెలిసిటీ సెంటర్ ప్రారంభం
56. కాకినాడలో AM గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన… రెండేళ్లలో గ్రీన్ అమోనియా ఎగుమతి
57. రాష్ట్రానికి సెమీ కండక్టర్, డిఫెన్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు
58. శ్రీ సిటీలో రూ.5 వేల కోట్లతో LG, రూ.1000 కోట్లతో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన
59. అనకాపల్లి జిల్లాలో రూ.5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థకు శంకుస్థాపన
60. అనకాపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
61. విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్‌కు శంకుస్థాపన
62. రూ.1 లక్షల కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు
కీలక నిర్ణయాలు-సంస్కరణలు :
63. 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 90కి పైగా CSS పథకాల పునరుద్ధరణ
64. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం... పెరిగిన మూలధన వ్యయం
65. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత
66. తిరుమల సహా దేవాలయాల్లో సంస్కరణలు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు
67. రుణాల రీ షెడ్యూల్‌తో ప్రభుత్వంపై తగ్గిన వడ్డీల భారం
68. 50 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.2 వేల కోట్ల బకాయిల చెల్లింపులు
69. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి ఊతం
70. చెత్త పన్ను రద్దు - దాదాపు 84 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ తొలగింపు
71. ప్రతీ నెలా 3వ శనివారం ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’, డోర్ టు డోర్ కలెక్షన్, స్వచ్ఛ రథాలు
72. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై నిషేధం, నెట్ జీరో లక్ష్యంగా కార్యాచరణ
వ్యవసాయం, రైతు సంక్షేమం :
73. రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో డబ్బులు జమ
74. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి పంటలకు రూ.1,100 కోట్లు
75. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం - ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు
సమర్ధ నీటి నిర్వహణ :
76. 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ, కుప్పానికి సాగు నీరు
77. రాయలసీమలో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నింపి సాగు, తాగునీరు
78. సాగునీటి ప్రాజెక్టులకు 23 నెలల్లో రూ.24 వేల కోట్ల వ్యయం
79. శరవేగంగా పోలవరం నిర్మాణం – డయాఫ్రం వాల్ పూర్తి
80. రూ.2 వేల కోట్లతో పోలవరం నిర్వాసితులకు పునరావాసం
81. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.571 కోట్లు వ్యయం – జులై నాటికి తొలి దశ పూర్తి
82. తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి - ఏపీ వాటాగా రూ.55 కోట్ల కేటాయింపు
83. శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజీ నిర్మాణానికి గెజిట్ నోటిఫికేషన్
84. చింతలపూడి ఎత్తిపోతల అనుమతుల్లో పురోగతి
85. సాగు నీటి ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.610 కోట్లతో మరమ్మతులు
86. రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికలతీత, లాకుల మరమ్మతులకు నిధులు
87. మళ్లీ సాగునీటి సంఘాల కీలక పాత్ర- 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు
డిజిటల్ గవర్నెన్స్ :
88. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ
89. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 1,035 సేవలు
విద్య, వైద్య రంగాలు :
90. గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ
91. విద్యా వ్యవస్థలో పెనుమార్పులు - మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
92. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల సాధన – ‘ముస్తాబు’ వంటి వినూత్న కార్యక్రమాలు
93. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు
విద్యుత్, గ్రీన్ ఎనర్జీ :
94. గాడిన పడిన విద్యుత్ రంగం – ట్రూ డౌన్‌కు అంకురార్పణ
95. యూనిట్ కాస్ట్ 0.30 పైసలు తగ్గింపు – మరో 0.30 పైసలు తగ్గింపు లక్ష్యం
96. EVలకు ప్రోత్సాహం -వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గింపు
97. 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలు
శాంతి భద్రతలు :
98. తగ్గిన క్రైమ్ రేట్ – మహిళల భద్రతకు ప్రాధాన్యత
99. గంజాయి-డ్రగ్స్ పై ఉక్కుపాదం- ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
100. అగ్నిమాపక శాఖ బలోపేతం – రూ. 34 కోట్లతో కొత్త పరికరాలు, వాహనాలు
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
అవనిగడ్డ నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (విలేజ్ హెల్త్ క్లినిక్)ను స్థానిక శాసనసభ్యులు శ్రీ @mbuddhaprasad గారితో కలిసి ప్రారంభించాను.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సంకల్పంతో దేవాలయం అంత పవిత్రంగా భావించే ఈ 'ఆరోగ్య మందిరాల' ద్వారా గ్రామంలోనే 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నాం.
కృష్ణా జిల్లాకు కేటాయించిన ₹110 కోట్లలో, ఒక్క అవనిగడ్డ నియోజకవర్గానికే 36 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను, ₹9.40 కోట్లతో BPHU కేంద్రాలను మంజూరు చేసి పూర్తి చేస్తున్నాం.
క్యాన్సర్ నివారణే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్.. రికార్డు స్థాయిలో 5.50 లక్షల మంది బాలికలకు ఒకేరోజు HPV వ్యాక్సినేషన్ అందించి వైద్య రంగంలో కొత్త చరిత్ర సృష్టించాం.
ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వల్ల రవాణా ఖర్చు భారం లేకపోవడంతో, పేద ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆరోగ్య పరీక్షల కోసం పెద్ద ఎత్తున ఆస్పత్రులకు వస్తున్నారు. దీనివల్ల ఓపీలు 50% పైగా పెరిగాయి.
అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్న 'స్వర్ణాంధ్ర ప్రదేశ్', ప్రధాని మోదీ గారి 'వికసిత్ భారత్' సాకారం కోసం మనందరి సహకారం అవసరం.
#Avanigadda #SwarnandhraPradesh #VikasitBharat #PublicHealth #AndhraPradesh #BJPAndhraPradesh #BJPIndia @BJP4Andhra
We’re not here to manage the system, we’re here to transform it.
On the first day of the #CollectorsConference, I reminded our officers that governance is measured not by files moved or reports submitted, but by results delivered and lives improved. Citizen satisfaction is our true report card. The speed of delivering governance is not merely a slogan, it is a determinant of growth.