శ్రీ @PawanKalyan గారి ఆలోచన ఎప్పుడూ జనసేన కార్యకర్తల సంక్షేమం... అభ్యున్నతి గురించే
•జన సైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుంది
•రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలం చూపిస్తూ కూటమిని మరింత బలోపేతం చేద్దాము
•కలిదిండిలో కొల్లేరు ప్రాంత జనసేన నాయకులతో పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు
జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను క్షేత్ర స్థాయిలో బలంగా ముందుకు తీసుకువెళ్ళిన జనసైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. జనసేన కార్యకర్తల సంక్షేమం, అభ్యున్నతి గురించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తారని, అటువంటి నాయకుడి అడుగుజాడల్లో పని చేయడం మనందరికీ గర్వ కారణమన్నారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో కూటమి ప్రభుత్వ నిర్వహించిన మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కొల్లేరు ప్రాంత జనసేన నాయకులతో భేటీ అయ్యారు. నాయకుల మనోభావాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పార్టీ కోసం ఎంతో తపనతో పని చేస్తున్నవారిని రాజకీయంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నారు. మనందరం రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి. క్షేత్ర స్థాయిలో మన బలం చూపిస్తూ కూటమిని మరింత బలోపేతం చేద్దాము. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి స్ఫూర్తిని చూపించామో అదే స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో ముందుకు వెళ్దాము. ఇందుకోసం ఇప్పటి నుంచే ఆ దిశగా, ప్రణాళికాబద్ధంగా పని చేద్దాము. కూటమి ధర్మానికి అనుగుణంగా వెళ్తూ మన సత్తా చాటుదాము.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ధిని బలంగా చెబుదాము. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం, జల్ జీవన్ మిషన్ ద్వారా మొదలైన పనులు ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందుతున్నాయి. గత ప్రభుత్వ సమయంలో గ్రామాల్లో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. వరి పండించే రైతులకి తమ పంట అమ్మిన 24 నాలుగు గంటల్లోనే సొమ్ము చెల్లిస్తున్నాము. గత పాలకులు రైతులకు రూ.16 వందల కోట్లు బకాయిపెట్టి వెళ్లిపోతే అవి కూడా తీర్చేశాము. వాళ్ళకీ, మన కూటమి ప్రభుత్వానికీ ఉన్న తేడాను ప్రజలకు తెలియచేద్దాము. ప్రజల కోసం ఎంతగా పని చేస్తున్నామో చెబుతూ స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకుందాము” అన్నారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ శ్రీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
మీ సాక్షి లోనే వేసాడు కదరా HarpicReddy "వైసీపీ నేత బొరుగడ్డ అనిల్" అని..
మీకు అవసరమైనప్పుడు వాడి చేత ప్రతిపక్ష నాయకుల ఇంట్లో ఆడవాళ్లను తిట్టించి ఇప్పుడు మీ వరకు రాగానే మాకు సంబంధం లేదని అంటారా.💦
#YcpCriminalPolitics#Ysrcp#YsJagan
Message is clear..
కళ్యణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ మొన్న ఏడ్చిన వాళ్ళని… మళ్లీ ఏడిపించేశారు కద సార్ @PawanKalyan 😁😁😁
జనసేన పార్టీ పేరుని వంకర్ టింకరగా మాట్లాడే సోకాల్డ్ ఫ్యాన్స్ "ప్లీజ్ క్రై మోర్" 🤡