రాజశేఖర్ బిడ్డ ఈరోజు కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది. కడప గడ్డ మీద న్యాయానికి, నేరానికీ జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయం వైపు నిలబడతారని నమ్ముతున్నాను. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఎలాగైతే ప్రేమగా చూసుకుంటారో.. అలాగే నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డగా అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అందుకే మే 13వ తేదీన జరిగే పోలింగ్‌లో ఎంపీ బ్యాలెట్ నమూనాలోని వరుస సంఖ్య '4' మీద 'హస్తం' గుర్తు బటన్ నొక్కి రాజశేఖర్ బిడ్డను ఆశీర్వదిస్తారని కొంగుచాచి అడుగుతున్నాను.
At my father's memorial today, Shri Rahul Gandhi and I shared many beautiful memories we had with Dr. YSR. Rahul Ji recalled the inspiration he drew from the person whom he fondly remembers as "YSR Uncle." @RahulGandhi Ji
రాజశేఖర్ రెడ్డి గారు నా తండ్రి రాజీవ్ గాంధీ గారి సోదరుడు. వారిద్దరు అన్నదమ్ముళ్లు లాగా కలిసి ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఏపీకే కాకుండా మొత్తం భారతదేశానికే మార్గదర్శకులయ్యారు.
@RahulGandhi
కడప పార్లమెంట్ పరిధి ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపలో నిర్వహించిన భారీ బహిరంగసభకు విచ్చేసిన కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అశేష ప్రజానీకానికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుంది. కడపలో న్యాయాన్ని గెలిపిస్తారా..? నేరాన్ని గెలిపిస్తారా..? వైఎస్సార్ బిడ్డగా మాట ఇస్తున్నాను. ఈ గడ్డ బిడ్డగా ఇక్కడే బతుకుతాను. ఈ గడ్డ ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేస్తాను. రాష్ట్రంలో వైఎస్సార్ పాలన తిరిగి తెస్తాం. కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలి అని కోరుతున్నాను.
అమ్మ ప్రార్థన, నాన్న ఆశీస్సులు, కడప ప్రజలు నన్ను గెలిపిస్తారనే ధృడమైన విశ్వాసంతో ఉన్నాను.
కడప ప్రజలకు అమ్మ విన్నపం :
వైఎస్సార్‌ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లే ఇప్పుడు షర్మిలమ్మను కూడా ఆదరించాలని కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ముద్దుల బిడ్డ షర్మిలమ్మ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. షర్మిలమ్మను కడప ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కి పంపించాలని కోరుతున్నాను.
మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మీకు ఎందుకు రాలేదు జగనన్న?? ఏదైనా ఒక లావాదేవీ కోసం, లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు ఆయన. అలాంటి వ్యక్తి బిడ్డని నేను. ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ హృదయంలో హృదయంలా పెరిగాను. ఆయన ఆశయాల కోసం ఆ రకంగానే మీకు సహాయపడాలని నేను నిస్వార్థంగా త్యాగం చేశాను. మీ గెలుపు కోసం పని చేశాను.