@miryalasrikanth నిజమే, విద్యా విధానం లో ఎన్నో మార్పులు జరగాలి. శాస్త్రీయ విద్య అవసరం. ఆత్మష్టైర్యాన్ని కలిగించే మార్గదర్శకులు కావాలి. మూఢత్వం, వినోదం , ముఖ్య అవసరాలు కాదని బోధించాలి.
సినెమా అయిపోయింది. బయటకి వచ్చాం. ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడటం లేదు. ఒకరి మొహం ఒకరు చూసుకొని కార్ ఎక్కి ఇంటికి వచ్చేశాం. అసలు ఎక్కడ నేర్చుకుంటున్నారు ఈ డైరెక్టర్స్ సినెమా మేకింగ్ గురించి. ఒక సినెమా తియ్యాలంటే ముందు కావాల్సిన అంశాలు ఏంటి? అవి పేపర్ మీద పెట్టాకనే సినెమా తియాలి అనే చిన్న లాజిక్ పక్కన పెట్టి నాలుగు పెగ్గులు వేసుకున్నాక చేసిన డిస్కషన్ ని పేపర్ మీద పెట్టి అదే కధ , అదే కధనం అని నమ్మించి చివరకి half backed product ని జనాల మొహాన పడేస్తున్నారు.
ఈ హీరోల గుల ఏంటో మరి. మాస్ హీరో అంటే మీనింగ్ మార్చేస్తున్నారు. వందల మందిని senseless గా నరుక్కుంటా పోతే అది హీరోయిజం అనుకోవడం, loud music, slow motion shots ని హీరోయిజం అనుకోవడం. ఆ గుల తీర్చుకోవడం కోసం నిర్మాతలని నమ్మించడం, లేదా తానే సొంతగా పైసలు పెట్టుకోవడం.
ప్రెస్ మీట్ లో నోరు తెరిస్తే అబద్దం. ఇంత కష్ట పడ్డాం, అంత కష్టపడ్డాం అని , మంచి కధ అంటారు, కధనం అంటారు ఇప్పటివరకు మీరు చూడని సినెమా అంటారు. టికెట్ రేట్ పెంచి ఆ price తోనే సినెమా చూడమంటారు. అంత granted గా తీసుకుంటారా ప్రజలని. ఎన్నో flop movies చూశాను. కొంచెం అది బాగుంది , ఇది బాగుంది ఇంకా కాస్త మంచి గా తీసి ఉంటే ఇంకా బాగుండేది అనుకుటాం మూవీ లవర్. సినెమా అయ్యాక ఒక పబ్ కి పోయి ఆ సినెమా గురించి డిస్కషన్ ఉంటది. కాని నిన్న మాత్రం ఎవరూ ఏం మాట్లాడలేదు. ఎక్కడా కూర్చోలేదు. ఎంత నైట్ అయినా ఆ సినెమా గురించి నాలుగ్ మాటలు ట్వీట్ చేసి పడుకునే వాడిని. అసలు మాట్లాడాలనిపించ లేదు.
Sorry to say this @NameisNani . నీవంటే చాలా అభిమానం ఉంది. నీ స్టోరీ సెలక్షన్ మీద ఒక respect ఉంది. కాని ఈ సినెమా నన్ను చాలా distub చేసింది. రికవర్ అవ్వడానికి టైం పడుతుంది.
#TheParadise
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
ఇంకో 20 ఏండ్ల తర్వాత....
ఆంధ్రా గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా అగ్రకులాల జాడ కనుమరుగు అవుతుంది
BC/SC ల లో కేవలం ముసలితరం వ్యవసాయం చేసే వాళ్ళు మిగులుతారు
హైదరాబాద్ విస్తీర్ణం జహీరాబాద్ నుండి చౌటప్పల్ దాగా పెరుగుతుంది...
హైదరాబాద్ ఈ స్థాయిలో పెరగడానికి మా నాన్న గారే కారణం అని చిన్న బాబు టీడీపీ మీటింగ్స్ లో ఊదరగొడుతూ ఉంటారు....
అమరావతి అప్పటికి ఉంటుందో లేదో కూడా తెలియదు...ఎందుకంటే అందుకే...!!!
విజయవాడ - గుంటూరు లో ముసలి తరాలకి సేవలు చేయడానికి కూడా యువత కనపడరు...
అప్పటికి ఆంధ్రా లో నాయకులు కేవలం అధికారం ఉన్నప్పుడు మాత్రమే ఉంటారు...లేకపోతే పక్క రాష్ట్రాలలో కాపురాలు ఉంటాయి...
మెల్లగా తెలంగాణ తన ఐడెంటిటీ ను కోల్పోవడం మొదలవుతుంది...ఎందుకంటే ఆంధ్రా యువత అంత హైదరాబాద్ మీద పడటం తో 3 అగ్రకులాల మధ్య యుద్ధం ఉంటానే ఉంటుంది....
ఇవి మచ్చుకు....ఇంకెంత విధ్వంసం ఆంధ్రా లో జరుగుతుందో ఊహించడం కూడా కష్టమే...
🔥 India Today రిపోర్ట్లో ప్రతిధ్వనించిన ప్రజల ఆకాంక్ష..
“పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలి” — ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులోని మాట. ❤️
2029లో జనసేనాని సీఎం కావాలన్నదే జనం కోరిక✊🔥
#CMPAWANKALYAN
@TeluguScribe 2024 ఎలెక్షన్ లో బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే, మళ్ళీ మనం అధికారానికి వస్తాం అని విజయ సాయి రెడ్డి సలహా ఇచ్చిన ఒంటెద్దు పోకడతో పెదచేవిని పెట్టి, అధికారం పోగొట్టుకున్నారు దారుణంగా, అందుకే ఆయన పార్టీలోంచి పోయాడు.