Official Twitter handle of the Deputy Superintendent Of Police ( DSP ) Mahabubabad Sub-Division, Mahabubabad, Telangana, India.
In Emergency Please #Dial100.
ఇప్పటికే సమయం మించిపోయింది, మిగతా మావోయిస్ట్ సభ్యులు కూడా బయటికి వచ్చి లొంగిపోవాల్సింగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నుండి అప్పీల్ చేస్తున్నాం.
#DGPTelangana
I along with SDPO Mahabubabad visited Government Children Home for Boys at Indiranagar Mahabubabad. Checked basic amenities in the school and had meeting with Superintendet and Staff. @spmahabubabad, @mhbdpolice, @sdpomhbd, @TelanganaCOPs, @TelanganaDGP
As part of “Cyber Jaagrookta Diwas”(Cyber Security Awareness Day), I along with SIs Shiva, Karnakar and Mahabubabad Town PS staff created awareness on Cyber Security & Safety at Maharahi Vidyalaya Mahabubabad. @spmahabubabad, @mhbdpolice, @sdpomhbd, @TelanganaCOPs, @TelanganaDGP
సోషల్ మీడియాలో బాధ్యతగల పౌరులుగా స్పందించండి. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించండి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసేముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి. ఫేక్ పోస్టులు చేస్తే చర్యలు తప్పవని గుర్తుంచుకోండి.
#telanganapolice#FakeNews
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం గుండా తరలిస్తున్న రూ. 53.28 లక్షల విలువైన 106 కేజీల గంజాయిని పట్టుకున్న @pskuravi పోలీసులు.
గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్, ఒక వాహనం, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం.... వివరాలు వెల్లడించిన @sdpomhbd N. తిరుపతి రావు.
@TelanganaCOPs
తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభమైంది. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను భావి తరాలకు అందించడమే లక్ష్యంగా స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది.
#telanganapolice#youngindiapoliceschool
పార్ట్‌టైమ్ జాబ్స్ అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను అస్సలు నమ్మకండి. తొలుత లాభాలు చూపించి, ఆ తర్వాత సర్వం దోచేస్తారు. ఈ కామర్స్ సైట్లలో వస్తువులు కొనడం, అమ్మడం ద్వారా వేలల్లో సంపాదించవచ్చనే మాటలను నమ్మిస్తారు. ఈజీ మనీకోసం వెళ్లి మోసపోకండి.
#telanganapolice#parttimejobs
శాంతిభద్రతల నిర్వహణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచారు. జాతీయస్థాయిలో తెలంగాణ పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు, డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు.
#telanganapolice
Hon'ble Chief Minister Sri A. Revanth Reddy inaugurated the Young India Police School at Manchirevula, Narsingi — a visionary step towards empowering the next generation with discipline, leadership, and civic responsibility.
#YoungIndiaPoliceSchool
https://t.co/D4amtv3Nzn
మహావీర్ బోధనలు సదా ఆచరణీయం. ఆయన బోధించిన అహింస, ప్రేమను ఆచరిస్తూ సన్మార్గంలో నడవాలి. సాటిమానవాళికి సాయం చేయాలి. మహావీరుడి మార్గంలో ప్రేమను పంచాలి.
#TelanganaPolice#mahaveerjayanthi
మహిళలు జాగ్రత్త. మీ ఆర్ధిక అవసరాలను ఆసరాగా చేసుకొని సైబర్ మోసాలు, డ్రగ్స్ దందాలోకి దించే ముఠాలకు దూరంగా ఉండండి. అనవసరంగా చిక్కుల్లో పడి జీవితాలను ఆగం చేసుకోకండి.
#telanganapolice#BeAlert
బ్యాక్ డోర్ జాబ్స్ వస్తాయని ఆశపడి మోసకపోకండి. ఉద్యోగాల భర్తీకి ఒక ప్రక్రియ ఉంటుందని గ్రహించండి. ప్రభుత్వ ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ జాబ్స్ ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మొద్దు. ఫేక్ వెబ్సైట్లతో బురిడి కొట్టించేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి.
#telanganapolice#FakeWebsites
గౌరవ సీఎం గారి @revanth_anumula ఆలోచనలతో, సహాకారంతో… డీజీ @CVAnandIPS అద్భుతమైన సంకల్పం తోడై అతి త్వరిత కాలంలోనే యంగ్ ఇండియా స్కూల్ కార్యరూపం దాల్చింది. ఎంతోమంది చిన్నారులకు ఉజ్వలమైన భవిష్యత్ ను అందించే ఈ పాఠశాల తెలంగాణ పోలీస్ శాఖ చరిత్రలోనే అతిపెద్ద మైలురాయి.
#YoungIndiaSchool
1/3- తేదీ 01-04-2025 నాడు @psmhbdrural లో నమోదైన ప్రభుత్వ ఉద్యోగి పార్థసారథి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు... పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసు బృందాల గాలింపు.. - వివరాలు వెల్లడించిన @spmahabubabad సుధీర్ రాంనాథ్ కేకన్ IPS.
@TelanganaDGP@TelanganaCOPs
68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు DGP జితేందర్ గారు బహుమతులు అందజేశారు. నోడల్ ఆఫీసర్ శిఖా గోయెల్ గారు, స్పోర్ట్స్ IGP M. రమేష్ గారితో పాటూ పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు
#TelanganaPolice#AllIndiaPoliceDutyMeet