Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
#HBDJanaSenaniPawanKalyan
కోట్లాది మంది జన హృదయ విజేత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం, అధికారం ప్రజాసేవకే అంకితం అంటూ, విలక్షణ రాజకీయాలకు నాంది పలుకుతూ, లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ, రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ చరిత్ర సృష్టిస్తున్న జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారక తెలుసుకున్నారు. బోర్వెల్ మోటార్‌కు అనుసంధానించిన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చనేది ప్రాథమిక అంచనా అని అధికారులు తెలిపారు. ఏనుగు మృతి ఘటనపై విచారణ చేపట్టి, నివేదికను సమర్పించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు.
– ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం
@APFDOfficial@PIB_India@IPR_AP@pibvijayawada
పండుగ వాతావరణం లో జనసేన పార్టీ యువజన విభాగం ఏర్పాటు
రాజకీయాల్లో మార్పు కోసం జనసేన యువజన విభాగం పని చేస్తుంది
* 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ యువజన విభాగం ఆవిష్కరణ ఉత్సవాలు
* పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు
‘జనసేన పార్టీ యువజన విభాగం ఏర్పాటు సెప్టెంబర్ 2వ తేదీ, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పండుగ వాతావరణంలో ఆవిష్కారమవుతుంది. రాజకీయాల్లో మార్పు కోసం, వచ్చేతరం ఆలోచనలను సమాజానికి అందించడం కోసం యువజన విభాగం నిబద్దత తో పనిచేస్తుంది. దేశమే ఫస్ట్ అనే నినాదంతో రాజకీయాల్లో బాధ్యతాయుతమైన యువతను దేశానికి అందజేస్తుంద’ని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. సెప్టెంబర్ 2, బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ యువజన విభాగాన్ని పిఠాపురంలో ఆవిష్కరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం శ్రీ మనోహర్ గారు స్వయంగా పరిశీలించారు.
కార్యక్రమ ప్రాంగణం వద్ద శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ "పిఠాపురంలో జనసేన పార్టీ యువజన విభాగం అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించి పార్టీ రూపొందించిన ఏవీతోపాటు ఒక ప్రత్యేక గీతం, ప్రత్యేకమైన లోగోను రేపు పిఠాపురం వేదికగా ఆవిష్కరిస్తాం. బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువజన విభాగం ఆవిష్కరణ ఉత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలీసుల అనుమతితో బైక్ ర్యాలీలు చేస్తారు. యువజన విభాగం ఏర్పాటు సందర్భంగా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక సందేశం ఉంటుందని మొదటి ప్రణాళిక వేసుకున్నాం. అయితే కేరళం లో ప్రస్తుతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చికిత్స తీసుకుంటున్న ప్రాంతంలో సాంకేతిక సమస్యలు కారణంగా రేపటి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సందేశం ఉండకపోవచ్చు. పిఠాపురంలో జరిగే యువజన విభాగం ఆవిష్కరణను 175 నియోజకవర్గాల్లో ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లతో ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహిస్తున్నాం. యువజన విభాగం ఒక గొప్ప లక్ష్యంతో పని చేస్తుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో యువత ముందు ఉంటారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ఎక్కువ అవకాశాలు ప్రాధాన్యం, మహిళలకు ప్రాధాన్యం తోనే జనసేన ముందడుగు వేస్తుంది. యువతను పార్టీలోని సంస్థ గత నిర్మాణంలోనూ ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. యువతలో గొప్ప స్ఫూర్తి నింపేలా యువజన విభాగం ఎల్లప్పుడూ పని చేస్తుంది" అని చెప్పారు.
ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల బాబు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొర బాబు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురం పట్టణం అభివృద్ధికి రూ.308.24 కోట్లు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో అభివృద్ధి పనులు
•రూ. 200 కోట్లతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ
•ఏలేశ్వరం నుంచి పిఠాపురానికి తాగునీరు
•రూ. 59.52 కోట్లతో కొత్త పైప్‌లైన్, ట్యాంకుల నిర్మాణం
•పిఠాపురం పట్టణంలో దాదాపు 5 వేల కొత్త తాగునీటి కనెక్షన్లు
•త్వరలోనే సిద్ధం కానున్న తడి చెత్త ప్లాంట్
•కోట్లాది రూపాయలతో రహదారులు, కాలువల నిర్మాణం
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణ అభివృద్ధి కొత్త దిశగా పయనిస్తోంది. పట్టణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, పారిశుద్ధ్య సదుపాయాలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, రహదారులు, కాలువలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పార్కుల అభివృద్ధి, తాగునీటి సరఫరా వంటి కీలక మౌలిక వసతుల కోసం మొత్తం రూ.308.24 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ భారీ నిధులు, సమగ్ర ప్రణాళికలతో పిఠాపురాన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
• మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
పిఠాపురం ప్రజల చిరకాల కోరిక అయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 120 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి పైప్లైన్లను నిర్మించనున్నారు. అలాగే, పట్టణంలోని ప్రధాన చెరుకుల కాలువకు ఇరువైపులా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, పిఠాపురం పట్టణంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దోమల నివారణకు తోడ్పడటంతోపాటు పట్టణ పరిశుభ్రత మెరుగుపడి, ప్రజారోగ్య పరిరక్షణలోనూ గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. పిఠాపురం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఈ ప్రతిష్టాత్మక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు రూ.200 కోట్ల నిధులను కేటాయించిన ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, సహకరించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @Dr_NarayanaP గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
• రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగు నీరు
పిఠాపురం పట్టణంలో తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 59.52 కోట్ల భారీ బడ్జెట్‌తో పనులను వేగవంతంగా జరుగుతున్నాయి. అమృత్ 2.0లో భాగంగా రూ. 57.37 కోట్లు, టిడ్కో గృహ నిర్మాణ పథకం ఇళ్లకు నీటి సరఫరా కోసం రూ. 2.15 కోట్లను కేటాయించారు. పట్టణానికి మొత్తం 120.19 కి.మీ. పైప్‌లైన్ అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న 72.90 కి.మీ. లైన్లో 35 కి.మీ. దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీని కోసం కొత్తగా, అదనంగా 82.29 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులను ప్రతిపాదించారు. పట్టణంలో 600 కిలోలీటర్ల సామర్థ్యం గల భారీ ఎత్తైన నీటి నిల్వ ట్యాంకు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో 400 కిలోలీటర్ల సామర్థ్యం గల నీటి నిల్వ ట్యాంకు నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. పట్టణ ప్రజల కోసం కొత్తగా దాదాపు 5 వేల తాగునీటి కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. పిఠాపురం పట్టణానికి రోజువారీ నీటి కొరత లేకుండా ఏలేశ్వరం జలాశయం నుంచి రోజుకు 55 లక్షల లీటర్ల నీటిని తరలించేందుకు ఒక ప్రధాన పైప్‌లైన్ ఏర్పాటు జరుగుతోంది. పిఠాపురం పట్టణ ప్రజల రోజువారీ నీటి అవసరమైన 80 లక్షల లీటర్లను దృష్టిలో ఉంచుకుని, రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
• శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు
పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో పట్టణ పరిశుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ కింద పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రూ. 4 కోట్లతో తడి చెత్త నిర్వహణ కేంద్రం, రూ.1.43 కోట్లతో మల వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం పనులు మరో రెండు నెలల్లో పూర్తికానున్నాయి. పట్టణంలోని 18,468 ఇళ్ల నుంచి ప్రతిరోజూ 25 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం పనులు వేగవంతం అవుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే రోజుకు వచ్చే 25 టన్నుల చెత్తను పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే పట్టణంలో గతంలో పేరుకుపోయిన భారీ మొత్తంలో ఘన వ్యర్థాలను కూడా గణనీయంగా తగ్గిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్త సమస్య తగ్గడంతోపాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయి.
(1/2)
#Pithapuram
(2/2)
• రూ. 21.82 కోట్లతో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు
పట్టణంలో మురుగు నీటి సమస్య పరిష్కారానికి రూ. 21.82 కోట్లతో రెండు భారీ మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP) నిర్మాణ పనులను ప్రారంభించారు. డ్రైవర్స్ కాలనీలో రోజుకు 42 లక్షల లీటర్ల సామర్థ్యంతో రూ. 11.76 కోట్లతో, మసీదు మన్యంలో రోజుకు 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో రూ. 10.06 కోట్లతో ఈ కేంద్రాలను నిర్మించనున్నారు. ఈ రెండు ప్లాంట్లు అందుబాటులోకి వస్తే, పట్టణంలోని మురుగు నీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయడానికి వీలవుతుంది.
• రహదారులు, కాలువల పనులకు ప్రాధాన్యం
పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో రోడ్లు, కాలువలు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులను కేటాయించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 2020-21 నుంచి 2025-26 వరకు పిఠాపురం పురపాలక సంఘానికి మొత్తం రూ. 19.43 కోట్ల నిధులు కేటాయించారు. వీటిలో 2024 జూన్ తర్వాత విడుదలైన అన్‌టైడ్ గ్రాంట్ రూ. 5.15 కోట్లతో రహదారులు, మురుగునీటి కాలువలు, చిన్న వంతెనల పనులు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పూర్తికాగా, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సహాయంతో కూడా పలు అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థ నిధులతో మురుగునీటి కాలువలకు రూ. 1.75 కోట్లు, పట్టణ ప్రణాళిక నిధులతో రహదారులు, కాలువలకు రూ. 3 కోట్లు, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ నిధులతో కాలువలకు రూ.5 కోట్లు కేటాయించారు. ఈ పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. ఎంపీలాడ్స్ నిధులతో రూ. 50 లక్షల విలువైన మురుగునీటి కాలువ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ల వద్ద ప్రత్యేక నిధులతో రూ. 50 లక్షల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అదే విధంగా పట్టణాభివృద్ధి సంస్థ నిధులతో రూ.1.50 కోట్లతో ఆదర్శ రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా రూ.2.10 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనానికి, అలాగే రూ. 60 లక్షలతో నిర్మించనున్న సీఎస్ఆర్ పార్కు పనులకు సాంకేతిక అనుమతులు లభించాయి. ఈ పనులన్నీ పూర్తయితే పిఠాపురం పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఈ అభివృద్ధి పనులు అన్నీ పూర్తయితే పిఠాపురం పట్టణ మౌలిక వసతుల్లో గణనీయమైన మార్పు రావడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి.
తెరపై సంపాదించిన ప్రేమను ప్రజల జీవితాలకు పంచిన విశాల హృదయం మీది.
అన్యాయం ఎదురైతే ప్రశ్నగా, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచే ధైర్యం మీది.
ఈ నేల కోసం కలలు కనడమే కాదు, ఆ కలలను కార్యరూపంలోకి తేవాలన్న తపన మీది.
అధికారాన్ని అందుకున్న క్షణంలో ఆనందం కంటే బాధ్యతను ముందుగా గుర్తించిన నాయకత్వం మీది.
ప్రజల కన్నీటిని అర్థం చేసుకుని, వారి భవిష్యత్తును బాధ్యతగా స్వీకరించిన మనసు మీది.
మీ ప్రయాణం ఒక నాయకుడి ఎదుగుదల మాత్రమే కాదు- ఒక సమాజం మీ నిజాయితీపై పెట్టుకున్న నమ్మకానికి ప్రతిబింబం.
మీరు ప్రజల కోసం వేసిన ప్రతి అడుగు, ఈ నేల చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
మీకు జన్మదిన శుభాకాంక్షలు - మీ సేవకు, మీ సంకల్పానికి, ప్రజల కోసం మీరు ఎంచుకున్న ఈ జీవితానికి నా హృదయపూర్వక ప్రణామం.
ఎందరో నాయకులను కాలం పరిచయం చేస్తుంది…
కానీ నమ్మిన నాయకుడిని కాలమే గొప్పవాడిగా నిలబెడుతుంది.
ఆ నమ్మకంతోనే చెబుతున్నాను -
నేను నమ్మిన పవన్ కళ్యాణ్ ఒక పేరు కాదు…మా గర్వం , మా గౌరవం
#HBDJanaSenaniPawanKalyan
మన పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి చేస్తున్న మన పిఠాపురం అభివృద్ధి ప్రదాత, జనసేనాని, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDJanaSenaniPawanKalyan
#HBDJanaSenaniPawanKalyan#Kerala#GenZ
Kerala Gen-Z stands with JanaSena & Pawan Kalyan!
కేరళలోని NIT కాలికట్కు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు.
యువతలో ఆయనపై ఉన్న అభిమానానికి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది నిదర్శనం. నిజాయితీ, ధైర్యం, సామాజిక బాధ్యతతో ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
అడవితల్లి బిడ్డల కోసం... అడవితల్లి బాట...
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల గిరిజన గ్రామాల్లోకి సైతం స్వయంగా వెళ్లి, ఆదివాసుల సమస్యలను తెలుసుకుంటూ, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘అడవితల్లి బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గిరి"జన"సేనాని శ్రీ @PawanKalyan గారు.
గిరిజనుల సంక్షేమం, వారి గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గిరి"జన"సేనాని గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల @PawanKalyan గారికి గిరిజన ఆడపడుచుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆ భగవంతుని ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాలతో ఉండి, గిరిజనుల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
#HBDJanaSenaniPawanKalyan
One walk.
One look.
One dialogue.
And the madness begins.🔥
Years changed.
Times changed.
The craze never did🫡
He made generations go crazy.
That is not just stardom.
That is an emotion built over decades❤️
Happy Birthday to our very own Power Star,
Sri @PawanKalyan Kalyan Garu. 🙏
#HBDPawanKalyan #HBDJanaSenaniPawanKalyan
ఆడవితల్లి బాట తో తమ జీవితాల్లో వెలుగులు నింపిన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినోత్సవం సందర్భంగా అరకు నియోజకవర్గం, చొంపి పంచాయతీలో జన్మదిన వేడుకల్లో పాల్గొని @HarshaJSP1995 టీం చేయించిన ప్రత్యేక గీతం "ఏ తల్లి కన్నదో నిన్ను ఓ పవనన్నా" విడుదల చేసిన గిరిజన సోదరీమణులు.
#HBDJanaSenaniPawanKalyan
సిద్ధాంతం కోసం అధికారాన్ని సైతం లెక్కచేయకుండా, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన జనసేనాని, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@janasenaparty@jspshatagniteam@jspveeramahila@apdeputycmo#HBDJanaSenaniPawanKalyan#lokammadhavi #nellimarlaconstituency #pawankalyanbirthdaycdp #PawanKalyan
#JSPForNewAgePolitics #voteforglass #PawanKalyan #AdaviThalliBaata
What do you wish a man…
whose presence has already given millions so much to celebrate? ❤️
Maybe nothing.
Maybe today is simply about celebrating the fact that you happened. Because some things aren't meant to be measured.
They are meant to be felt. ❤️
Happy Birthday to the ONE & ONLY #OG 🔥
@PawanKalyan #HBDPawanKalyan #TheyCallHimOG
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
సమాజంలో మార్పు కోసం నిరంతరం అడుగులు వేస్తూ, భవిష్యత్ భారత రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొనేలా యువతను చైతన్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న జననేత...
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్న కర్మయోగి...
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సూచీలో మన మాతృభూమి అట్టడుగు స్థాయిలో ఉన్న ఈ తరుణంలో, భూమిని రక్షించిన శ్రీ మహావిష్ణువు వరాహావతార స్ఫూర్తితో, ఈ జన్మదినాన దేశాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్య మహాసముద్రం నుంచి కాపాడేందుకు ఒక బృహత్తర పర్యావరణ పరిరక్షణ దీక్షను మీరు చేపట్టాలని నా ప్రగాఢ ఆకాంక్ష.
హరిద్వార్‌లో ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మీరు చేసిన పవిత్ర సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకుని, దాన్ని కార్యరూపంలోకి తీసుకువెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ కోట్లాది మంది అభిమానుల అజేయ శక్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, దేశ ప్రగతితో పాటు ప్రకృతి, నదులు, అడవులు, జలవనరుల పరిరక్షణ కోసం ఒక మహోద్యమానికి మీరు అగ్రభాగాన నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
మీ నాయకత్వంలో సాధించే ఈ విజయాల కీర్తి అజరామరంగా నిలిచిపోవాలని, దేశానికి, సమాజానికి, ప్రకృతికి మీరు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
సమస్త విజయాలతో, సంపూర్ణ ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని మనసారా అభిలషిస్తున్నాను. ✊🙏
@PawanKalyan@APDeputyCMO
founder of @JanaSenaParty #HBDPawanKalyan @watermanofindia@mvrsastry
Wishing Power Star and Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan garu a very successful, healthy and fulfilling year ahead. May you continue to serve the people with dedication, strength and sincerity.
Heartfelt birthday wishes from #AlluArjun Fans ❤️🔥
#HBDJanaSenaniPawanKalyan
గ్రామాల అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తూ…
పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తూ…
పారదర్శకతకు సాంకేతికతను జోడిస్తూ…
ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి నిర్ణయాలుగా మలుస్తూ…
ప్రకృతి పరిరక్షణతో పాటు భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్న…
@JanaSenaParty అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు
శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDJanaSenaniPawanKalyan
#VallabhaneniBalashowry
#JanaSenaParty
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు.
@PawanKalyan