మొత్తం మీద బలవంతంగా ఉద్యోగస్తులతో సుపరిపాలన దినోత్సవం జరిపించేసిండ్రు…!
ఇంతకీ ఈ ప్రభుత్వంలో సుపరిపాలన అంటే ఏందో జెర చూద్దాం…
1. CM గారు సచివాలయానికి ఏనాడూ రాకపోవడం
2. ఫైళ్లను చూడకపోవడం
3. ప్రగతి భవన్ కు ప్రజలను రానివ్వకపోవడం
4. ప్రచారానికి ఏటా వందల కోట్లు ఖర్చు పెట్టడం
5. పార్టీ ఆఫీసులకు ప్రజల భూమిని గుంజుకోవడం
6. దళిత మహిళను ఛీఫ్ సెక్రటరీగా కాకుండా కుట్రలు చేయడం
7. రెండు సంవత్సరాలుగా IAS/IPS లకు పోస్టింగులు లేకుండా ఉంచడం
8. జీవోలను, ఒప్పందాలను రహస్యంగా ఉంచడం
9. అస్మదీయులకు మాదాపూర్ లాంటి ‘మంచి’ పోస్టింగులివ్వడం
10. CMO లోకి బహుజనులు పోస్టింగు కాకుండా చూడడం
11. రిటైర్డు అధికారుల చేతుల్లో కీలక శాఖలను పెట్టి, సర్వీసులో ఉన్న అధికారులను డమ్మీలను చేయడం
12. పబ్లిక్ సర్వీసు కమీషన్ ద్వారా ఉద్యోగాలను అమ్ముకోవడం..నిందితులను కాపాడడం
13. అయిన వాళ్ల కోసం టెండర్ రూల్స్ ను తరచూ మార్చడం, వేల కోట్లు దోచుకోవడం.
14. GO 317 కింద ఉద్యోగులను హింసించడం
15. ఉద్యోగుల జీతాలను ఒకటో తారీఖు నాడు ఇవ్వక పోవడం
16. నిజం మాట్లాడే పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకపోవడం
17.మాట వినని నిజాయితీ అధికారులకు పోస్టింగులు ఇవ్వకపోవడం, అవమానించడం
18. SC/ST/BC అధికారులను లూప్ లైన్లలో సంవత్సరాల తరబడి ఉంచడం
19. ఇష్టం లేని అధికారులపై పత్రికలకు లీకులివ్వడం, తర్వాత సస్పెండ్ చేయడం
20. పోస్టింగుల కోసం MLA లకు మినిస్టర్లకు లంచం ఇవ్వాల్సి రావడం
21. MLA లు 30% కమీషన్ తీసుకుంటున్నారని తెలిసినా CM వాళ్లని వెనకేసుకొని రావడం
22. లిక్కర్ స్కాముల్లో కుటుంబ సభ్యులను వెనకేసుకొని రావడం, వాళ్లను రక్షించడం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడడం
23. ధరణి లాంటి కుట్రలతో రైతుల పొట్టకొట్టడం
24. కీలకమైన విషయాలపై సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేయడం
25. రెవిన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయడం
ఇంకా ఎన్నో….!
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 18వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది.
State Cabinet will meet under the Chairmanship of Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao at 3 PM in Dr. B.R. Ambedkar Telangana State Secretariat on 18th May (Thursday).
@dr_mvreddy జేపీస్ ల సమస్య లపై సమ్మె కాలం నుంచి మా వెంట లేకున్నా ట్విటర్ ద్వారా మా సమస్యలను తెలంగాణ ప్రజానికానికి తెలిపి మమ్మల్ని సంగిభావం తెల్పినందుకు ధన్యవాదములుసార్..మీలాంటి మేధావి వర్గం ఈ సమాజానికి, ఎంతో అవసరం సార్..🙏
ఉద్యోగ భద్రతపై ఆవేదన, ఆరాటంతో ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించి JPS,OPS లు విధుల్లో చేరుతున్నరు. ప్రభుత్వం తొందరగా #JPSRegularisation కబురుతో
మానసిక ఆందోళనలో ఉన్న వారి పేద కుటుంబాలకు స్వాంతన చేకూర్చాలని విజ్ఞప్తి 🙏