పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలి
•రేపటి తరాలకు పచ్చని భవిష్యత్తును అందించేందుకు సహకరించాలి
•పారిశ్రామిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి పిలుపు
రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పారిశ్రామికవేత్త దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. భావితరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ముందుకు రావాలని సూచించారు.
అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణలను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లినప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సమాజానికి, ప్రకృతికి, రాబోయే తరాలకు విలువైన భవిష్యత్తును అందించగలమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పరిశ్రమలు 33 శాతం పచ్చదనం నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ-గ్రీన్ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
2026 గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, సిమెంట్, మైనింగ్, ఎనర్జీ, ఆహార శుద్ధి, ప్లాస్టిక్, పేపర్, వస్త్రాలు తదితర రంగాలకు చెందిన సుమారు 3,400 పరిశ్రమలు, కంపెనీలు వేలాది ఎకరాల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తొలి విడతగా పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 26 పరిశ్రమల్లో 129 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పరిశ్రమల యాజమాన్యాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలు 33 శాతం పచ్చదనం లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా విశాఖపట్నం వంటి నగరాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసి, పట్టణ ప్రజలు కాలుష్య ప్రభావానికి గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీ సిటీ, పరవాడ తదితర ప్రాంతాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZలు) కూడా 33 శాతం పచ్చదనాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న మహత్తర సంకల్పంలో పారిశ్రామిక వర్గాలు చురుకుగా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు పిలుపునిచ్చారు.
– ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం
పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనాన్ని పాటించాలి
•రేపటి తరాలకు పచ్చని భవిష్యత్తును అందించేందుకు సహకరించాలి
•పారిశ్రామిక వర్గాలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు
రాష్ట్ర ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పారిశ్రామికవేత్త దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. భావితరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ముందుకు రావాలని సూచించారు.
అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణలను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లినప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సమాజానికి, ప్రకృతికి, రాబోయే తరాలకు విలువైన భవిష్యత్తును అందించగలమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పరిశ్రమలు 33 శాతం పచ్చదనం నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ-గ్రీన్ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
2026 గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, సిమెంట్, మైనింగ్, ఎనర్జీ, ఆహార శుద్ధి, ప్లాస్టిక్, పేపర్, వస్త్రాలు తదితర రంగాలకు చెందిన సుమారు 3,400 పరిశ్రమలు, కంపెనీలు వేలాది ఎకరాల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, తొలి విడతగా పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 26 పరిశ్రమల్లో 129 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పరిశ్రమల యాజమాన్యాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలు 33 శాతం పచ్చదనం లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా విశాఖపట్నం వంటి నగరాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసి, పట్టణ ప్రజలు కాలుష్య ప్రభావానికి గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీ సిటీ, పరవాడ తదితర ప్రాంతాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZలు) కూడా 33 శాతం పచ్చదనాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న మహత్తర సంకల్పంలో పారిశ్రామిక వర్గాలు చురుకుగా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు పిలుపునిచ్చారు.
– ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం
@PIB_India@IPR_AP@pibvijayawada
కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు
• నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు
నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణమ్మ కరవు పీడిత ప్రాంతాలకు చేరనున్న చారిత్రాత్మక ఘట్టమైన వెలిగొండ తొలి దశ ప్రారంభోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కావడం మార్కాపురం, ప్రకాశం, కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ప్రజలకు ఎనలేని సంతోషాన్నిస్తుంది. ఈ తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు, 4 లక్షల మందికి తాగు నీరు అందుతాయి. ఈ ఘట్టం సాకారం కావడానికి గత మూడు దశాబ్దాలుగా కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంస్థలు, అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. లక్షలాది మంది తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టు కోసం 7,300 మందికి పైగా తమ ఇళ్లు, భూములు కోల్పోయి నిర్వాసితులుగా మిగిలారు. వీరికి పరిహారం చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం రూ. 905 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే నిర్వాసితులకి రూ. 768 కోట్లు చెల్లింపులు జరిపింది. వెలిగొండ ప్రారంభోత్సవం వేళ ఈ ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నేడు ఆయన నాయకత్వంలోనే తొలి దశ ప్రారంభం అవుతోంది. ఆయన దూరదృష్టి, సంకల్పం నేడు కరవు ప్రాంతంలో జల సిరులు పారిస్తుంది. మార్కాపురం, ప్రకాశం జిల్లాల పరిధిలో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద అమలు చేస్తున్న మెగా వాటర్ గ్రిడ్ పథకానికి కూడా వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా నిలవనుంది. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి సంకల్ప సాధనలో వెలిగొండ కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి శ్రమించిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
కేరళ నుంచే పవన్ విధులు… ప్రజల కోసం నిరంతర పర్యవేక్షణ !!
వైద్యం కోసం ఈ నెల 22న కేరళ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు… చికిత్స పొందుతూనే తన శాఖల పనితీరును అక్కడ నుంచే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
• ఫైళ్ల పరిశీలన
• అధికారులతో సమీక్షలు
• కీలక నిర్ణయాలు
• ప్రజా సమస్యలపై తక్షణ స్పందన
• అభివృద్ధి పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ
‘గుడి బాట’కు పెద్దపీట:
100కు పైగా పుణ్యక్షేత్రాలకు 205 కి.మీ. రహదారులను ₹120 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయం. పూర్తయిన రహదారులను నాణ్యతా ప్రమాణాలతో తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు. పుట్టపర్తి ప్రాంతంలో ఆలయ రహదారులకు మరో ₹30 కోట్లు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం:
Great Green Wall కార్యక్రమంలో భాగంగా 5,499 హెక్టార్లలో 55 లక్షల తాటి విత్తనాలు నాటే లక్ష్యంతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.
స్థలం మారింది… బాధ్యత మారలేదు.
చికిత్స కొనసాగుతోంది… పాలనపై పర్యవేక్షణ ఆగలేదు.
ఇదే పవన్ కళ్యాణ్ మార్క్ పరిపాలన - ప్రజల కోసం ఎక్కడ ఉన్నా, నిరంతరం పనిచేసే నాయకత్వం .
MIM MLC మిర్జా రహ్మత్ బేగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఈ వ్యవహారంపై @INCTelangana, @BRSparty పార్టీలు ఇప్పటికీ స్పష్టంగా స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కేవలం వారి మిత్రులు @aimim_national పార్టీ నాయకుడు కావడం వల్లే దీనిపై మీరు మౌనంగా ఉన్నట్లుగా స్పష్టమౌతుంది. ఘటన గురించి తెలిసిన వెంటనే సౌదీ పంపించి కేస్ లేకుండా చూద్దామని ప్రయత్నించి, వార్త బయటకు రావడంతో తప్పక సస్పెండ్ చేసిన @asadowaisi గారు కూడా దీనిపై బహిరంగంగా స్పందించాలి.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారు ఈ వ్యవహారంపై స్పష్టంగా స్పందించాలి. అలాగే మిర్జా రహ్మత్ బేగ్ MLC పదవికి రాజీనామా చేసేలా చర్యలు తీసుకోవాలని శాసన మండలి ఛైర్మన్ గారిని కోరుతున్నాను.
ఆరోపణలు నిజమని తేలితే, మహిళలు, బాలికల భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
@JSPTelangana@JanaSenaParty
#WomenSafety
2019 సార్వత్రిక ఎన్నికలు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన/గెలిచిన 1000 మందికి పైగా అభ్యర్థులకు 3 గంటల పాటు ప్రతి ఒక్కరినీ స్వయంగా సత్కరించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ @mnadendla గారు.
#JanaSenaParty#AndhraPradesh
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాష, తన మాధుర్యంతో “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా ఖ్యాతి గడించింది.
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన మన మాతృభాషను పరిరక్షించుకుందాం, భావితరాలకు అందిద్దాం.
తెలుగు వారిగా గర్విద్దాం – తెలుగులో సంభాషిద్దాం
#TeluguLanguageDay
Heartiest congratulations, dear @NagaBabuOffl , on taking charge as Chairman of the AP Green Executive Committee. 💐
ప్రకృతి మీద నీకున్న ప్రేమకు, Mother Nature నీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా దీన్ని భావిస్తున్నాను.
A proud and important responsibility to contribute towards a greener and better Andhra Pradesh. Wishing you great success in this new journey and many more accomplishments in the service of the people. 💚
Heartfelt congratulations and best wishes to Sri Konidela @NagaBabuOffl Garu on taking charge as the Chairman of the AP Green Executive Committee. 💐
Wishing you great success in this new responsibility and many more achievements in the service of the people of Andhra Pradesh. 🙏
#JanaSena
గత 46 సంవత్సరాలుగా పులివెందులకి ప్రాతినిధ్యం వహిస్తున్న YS కుటుంబం, ఇప్పటికీ తీరని సాగునీటి కష్టాలు. 🙏
పులివెందుల ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 🫡
ప్రజల ప్రాథమిక అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది. 👏
Congratulations @RaviTeja_offl garu and the entire #Irumudi team on this massive success.
Wonderful to see the love and response the film is receiving. Ravi Teja garu and the entire team deserve all the appreciation for their hard work.
Wishing @ShivaNirvana garu, @gvprakash, @MythriOfficial and the entire team many more successes.
Swamy Sharanam 🙏
On the occasion of @PawanKalyan Garu’s Birthday, #PawanKalyanYouthForce – Gopal Nagar, Kukatpally, in association with @YashodaHospital , is organizing a FREE MEDICAL CAMP. 🩺
📅 2nd September 2026
⏰ 8:00 AM onwards
📍 Gopal Nagar, Kukatpally
We invite parents, elders, friends and family members to make use of these valuable medical services.
Let’s celebrate the birthday of our beloved leader through service to society. 🙏
JAI HIND 🇮🇳
కోదాడ వద్ద ప్రమాద ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- ఉప ముఖ్యమంత్రివర్యులు కార్యాలయం
Palm Groves: A Natural Green Shield for Andhra Pradesh
A visionary idea of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, driven by his foresight to build a natural green shield along the State’s long coastline.
As the second line of the Great Green Wall of Andhra Pradesh, palm groves will help withstand strong coastal winds, reduce coastal erosion, strengthen biodiversity and enhance climate resilience.
With a target of 55 lakh palm seeds across 5,499 hectares, the campaign has already gathered 13 lakh seeds, with 1.65 lakh planted through the participation of government departments, students and local communities.
This is more than planting trees. It is a people-powered movement to protect our coast, strengthen coastal communities and secure a greener Andhra Pradesh for future generations.
#GreatGreenWallOfAP
📢Andhra Pradesh🛣️
In Andhra Pradesh, we have approved ₹840.41 crore for the upgradation of the 45.09-km Buttaigudem–LND Peta and Pattiseema–Kovvur sections of NH-365BB to 2-lane with paved shoulders configuration.
The project will significantly improve connectivity to the Polavaram Irrigation Project and surrounding villages. The region is agriculturally rich, with tobacco, sugarcane and palm plantations. Improved road infrastructure will enable faster, safer and more efficient movement of agricultural produce to markets, strengthening farm-to-market linkages and supporting local livelihoods.
The upgraded highway will also enhance connectivity between Andhra Pradesh and Telangana, benefiting commuters, businesses and tourists. It will provide better access to important ghats along the Godavari, which attract devotees and visitors for holy baths and trips to the Polavaram Dam.
The development of this stretch will further strengthen regional connectivity and facilitate smoother movement of pilgrims and visitors during the Godavari Pushkaralu in 2027, giving a major boost to agriculture, tourism, pilgrimage, trade and socio-economic development across the region.
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@ncbn@ramMNK@PawanKalyan@PemmasaniOnX@PurandeswariBJP@MadhavBJP@BJP4Andhra
#PawanKalyanAneNenu
Under the special focus of Deputy Chief Minister Sri @PawanKalyan, around ₹280 crore has been allocated through Jal Jeevan Mission and Amarajeevi Jaladhara. Overall project works have reached 96% completion, with 1,106 of the planned 1,111 km pipeline completed.
Works are fully complete in Pulivendula Urban, Pulivendula Rural and Simhadripuram, while drinking water supply is being extended to 24 habitations in Lingala mandal. The remaining water treatment and storage infrastructure works are in their final stages.
పులివెందుల ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా మరో ముందడుగు!
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు ₹280 కోట్లతో 96% పనులు పూర్తి కాగా, 99% పైప్‌లైన్ నిర్మాణం పూర్తైంది.
ప్రజల ప్రాథమిక అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది.