I had to ask someone on a call today whether I was speaking with an AI.
I felt oddly delighted to learn they were a real person. We’ve officially reached that era.
We might need a voice CAPTCHA for phone calls at this point. (The Turing test is becoming personal)
As AI makes customer service faster and more scalable, genuinely human experiences will become even more valuable.
Real human connection is becoming a premium.
తెలుగు ప్రజలందరికీ ‘‘తెలుగు భాషా దినోత్సవం’’ శుభాకాంక్షలు. ప్రముఖ తెలుగు రచయిత, భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా నిర్వహించుకునే తెలుగు భాషా దినోత్సవం తెలుగు భాష ప్రాశస్త్యాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. తెలుగు భాష పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
కష్టపడి పనిచేసేవాళ్ళకి ఆవకాశాలివ్వక దేశం నుంచి తరిమి కొట్టడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడిని పెల్లెట్ బుల్లెట్లతో కాల్చడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అయ్యేయస్సు ప్రొబేషన్‌లోనే అవినీతి చెయ్యడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
వెలితి లేకుండా అన్నిటినీ కల్తీ చేసి తినేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రజాస్వామ్యం అంటూనే పిల్లల పరంపరకి అధికారాన్ని ఇచ్చుకునేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
దూకుడుగా వచ్చి పడిపోయిన లారీని దొమ్మీచేసి దోచుకెళ్లడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
చట్టాన్ని చట్రంలో బంధించి చుట్టాలకి వాడుకోవడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
శాస్త్రీయ దృక్పథాన్ని శవంలా పాడెక్కించడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
దేశాన్ని పాలిస్తూ, పిల్లలకి విదేశీ పాలు తాగేందుకు పంపించడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
మానసిక రుగ్మతలను అమానవీయం అని ముద్రవేసి వార్తలు ముద్రించటానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
వివేకాన్ని వదిలి వ్యక్తి పూజ చేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ప్రజలందర్నీ మత్తులో ముంచి, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
సూక్ష్మ పరిశీలనని చిదిమేసి సూత్రాల్ని బట్టీకొట్టే చదువు నేర్పేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
సాధ్యాసాధ్యాలను వదిలేసి సాధ్యమైనంత త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
పెచ్చులూడిన రహదారులపైన పెక్కు జనాభాని ప్రమాదాల్లో చంపేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అభిమానాన్ని సొమ్ముచేసుకుని అణాకానీ వినోదాన్ని విసిరేసేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఆటస్థలాలన్నీ కబ్జా చేసి కాంక్రీటు కోటల్ని కట్టేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
న్యాయస్థానాలన్నీ నత్తనడకగా నడిచి న్యాయం మరిచేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఈజ్ ఆఫ్ బిజినెస్ వదిలి, ఈసురోమని ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
భారీ తప్పిదాలకి కూడా బాధ్యత తీసుకోకుండా బాదరబందీ లేకుండా బ్రతికేందుకు,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
అస్థికలు, సగం కాలిన శవాలు, కర్మాగారాల వ్యర్థాలు అన్నీ మననదుల్లో వదిలేయడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
ఇది పక్కోడు పీల్చే గాలిలే అని పొగ అంతా వదిలేయడానికి,
మనకొచ్చింది స్వాతంత్ర్యం,
మనకొచ్చింది స్వాతంత్ర్యం.
- డా శ్రీకాంత్ మిర్యాల
GPT-Live can listen while it speaks.
To make that feel natural at ChatGPT scale, we rebuilt the voice stack from client to model.
This new architecture keeps audio flowing continuously, so deeper reasoning and tool use don't interrupt the conversation.
ఒక కథ చెప్తాను.
అనగనగా ఒక డాక్టర్ గారు, ఆయన మా శ్రీమతికి పరిచయం. ఎంతో చదివేవారు రాత్రనక పగలనక పాపం. పొద్దున్న మరిచిపోయేవారు. పీజీ పరీక్షలు ఇంకో రెండు నెలల్లో ఉన్నాయి. ఇక ఫెయిలవుతానని ఆవిడతో వాపోయారు. సాధారణంగా మనకి అర్థం అయ్యేది మరిచిపోము, మీకెందుకిలా అవుతోంది అని ఆవిడ ఆశ్చర్యపడి, ఎందుకైనా మంచిది కేజీహెచ్ ఎదురుగా మా ఆయన ఒక దుకాణం (క్లినిక్) తెరిచి ఖాళీగా ఈగలు దోమలు తోలుకుంటూ ఇలాంటి కథలు రాస్తుంటాడు, వెళ్లి ఆయన్ని కలవమన్నారు.
అతను సర్లే వస్తే కొండ పోతే ఈక అని అన్నట్లు వార్డు వర్కు పూర్తయ్యాక సాయంకాలం నా దగ్గరికి వచ్చారు. డాక్టరుగారూ మేడమ్ పంపారట ఒక సార్ వచ్చారు అని మా రిసెప్షనిస్టు చెప్పింది. స్వాతి పుస్తకంలో ఎప్పట్నుంచో ఒక కథ రాద్దామని ఆలోచిస్తున్న నేను మా మేడమ్ పేరు వినగానే అలెర్ట్ అయిపోయి, పంపించమన్నాను.
డాక్టర్ గారు చెప్పింది మొత్తం విన్నాను. విషయం ఏమిటంటే ఆయన ఏ పని చేస్తున్నా ఏదో ఒక పనికిమాలిన ఆలోచన బుర్రలో దూరుతుంది. అది ఉదా, చంద్రబాబు విశాఖపట్నం వస్తారా? సచిన్ మళ్లీ ఆడితే ఎలా ఉంటుంది? ఇలాంటివన్నమాట. అవి ఆలోచనలు ఒక గొలుసుకట్టుగా గ్యాప్ లేకుండా గమ్యం లేకుండా అలా వస్తూనే ఉంటాయి. పాపం పుస్తకం ముందే ఉంటుంది, ఏకాగ్రత ఎక్కడో ఉంటుంది. దాంతో ఆయన చదవలేకపోయేవాళ్ళు. ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయన తన మనసు మళ్లించడానికి. పరీక్షలు దగ్గరపడే కొద్దీ, ఆయన ఆ ఆలోచనలను అడ్డుకునేకొద్దీ అవి తీవ్రం కావడం మొదలయ్యాయి.
మొత్తం విన్నాక ఇది ఓసీడీ అండి అని చెప్పాను. అదేంటి సార్ ఓసీడీ అంటే చేతులు మళ్లీ మళ్లీ కడుక్కోవడం, సర్దినదే మళ్లీ సర్దటం ఇలాంటివి కదా, నాకవేమీ లేవే అని అడిగారు. అవునండీ కానీ మీకు ఉన్నది ప్యూర్లీ అబ్సెషనల్ టైపు. ఇది కూడా ఓసీడీ నే అని చెప్పి కౌన్సిలింగ్ చేసి, మందులు రాసిచ్చాను. నెల రోజుల్లో కొన్ని ఏళ్ళ నుంచీ ఉన్న ఆలోచనలు తొంభై శాతం తగ్గిపోయాయి. చక్కగా పరీక్షలు రాసి పాసయ్యారు.
తర్వాత ఆయన ధన్యవాదాలు చెప్తూ, నాకు ఎంబీబీఎస్ మొదటి ఏడాది నుంచీ ఈ సమస్య ఉంది, నేను అప్పుడే మీలాంటి వాళ్ళని కలిసి ఉంటే నాకు ఇన్నేళ్ల బాధ తప్పి ఉండేది. పీజీ ఎంట్రన్సులో కూడా మంచి ర్యాంకు వచ్చుండేది అని బాధ పడ్డారు.
కాబట్టి చెప్పొచ్చే విషయం ఏమిటంటే ఎక్కువమంది మానసిక రుగ్మతలతో ఉంటూ ఇది రుగ్మత కాదు అనుకుని లేదా నేనింతే అనుకుని లేదా ఈ సమస్యకి చికిత్స లేదనుకుని అలా జీవితం వెళ్లదీస్తారు. కానీ ఈలోగా వాళ్ళ పొటెన్షియల్ పడిపోయి జీవితంలో చేరదగిన స్థాయికి చేరకపోవడం, వాళ్ళ బంధాల్లో ఉండాల్సిన సంతృప్తి ఉండకపోవడం వెరసి సగం సగం జీవితం గడుపుతూ ఉంటారు.
ఆయన దగ్గర ఫీజు తీసుకోలేదు. కానీ ఆ మొత్తం వైద్యం నా ఫీజు, మందులతో సహా కలిపి ఐదొందల రూపాయలు అవుతుంది. కాబట్టి మనకి ఉండే బాధకి దానికయ్యే ఖర్చుకి పొంతనే ఉండదు. ఇక మీ ఇష్టం.
అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి! 🙏
నా తదుపరి ప్రాజెక్ట్‌గా ఒక తెలుగు LLM (Large Language Model) రూపొందించాలని అనుకుంటున్నాను.
ఈ మోడల్ తెలుగు రీజనింగ్, సాహిత్యం, విద్య, సంస్కృతి వంటి అంశాలపై మంచి అవగాహన కలిగి ఉండాలి.
అంతేకాకుండా, తెలుగు భాషలోని అన్ని రకాల శైలులను అర్థం చేసుకునేలా ట్రెయిన్ చేయాలనుకుంటున్నాను. ఉదాహరణకు:
ఆధునిక తెలుగు
ప్రాచీన/సాంప్రదాయ తెలుగు
ప్రభుత్వ & అధికారిక పత్రాలు
వార్తాపత్రికలు
నవలలు
కవిత్వం
సినిమాల సంభాషణలు
ఇతర తెలుగు రచనలు
ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్మించాలంటే నాకు ఎక్కువ మొత్తంలో తెలుగు డేటా అవసరం.
మీ దగ్గర లేదా మీకు తెలిసిన తెలుగు పుస్తకాలు, డిజిటల్ ఆర్కైవ్స్, డాక్యుమెంట్లు, వార్తాపత్రికలు, పబ్లిక్ డొమైన్ రచనలు లేదా ఇతర ఉపయోగకరమైన తెలుగు వనరులు ఏవైనా ఉంటే, దయచేసి ఈ పోస్ట్‌కు కామెంట్ చేయండి లేదా నాకు DM చేయండి.
మీ సహకారం తెలుగు కోసం ఒక మంచి AI మోడల్‌ను రూపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. 🙏❤️
Today we're announcing the completion of one of the largest engineering projects in the company's history:
We rebuilt the X Android app from scratch
It's faster, smoother and more reliable. But most of all: it will enable us to build new features at lightning speed.
🧵All the while, when people raised concerns about it, it didn’t really bothered me to check, but this seems like extreme and I am assuming it has been days like this… This has appalled me.
This has appalled me today…
Read the whole 🧵
I was casually strolling on reddit and saw this post about going outside, due to bad Air quality, I didn’t gave much thought to it, and then I received a message from my Equestrian saying that classes have been canceled due to bad Air Quality.