Janasenani with Gen Z – Part 2
Janasena Party Chief, Hon'ble Deputy CM Sri @PawanKalyan inspiring interaction with Gen Z, addressing their thoughts, questions, and perspectives on society, leadership, and the future.
Watch now: https://t.co/WazLLOmEjz
#JanasenaniWithGenZ
రుద్రా వీణ వాయిస్తా. 📈
SEZ భూములు : 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్టుగానే, ' తిరిగి రైతులకు ఇచ్చేలా registration చేయిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.'
#PawanKalyanAneNenu
Janasenani with Gen Z - Part 2 Promo
An inspiring interaction between Gen Z youth and Janasena Party Chief, Hon'ble Deputy CM of AP Sri @PawanKalyan on young leadership, influencer content creation, 2019 election defeat, and @actorvijay political journey.
#JanasenaniWithGenZ
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
-మా నాన్నని చూసి ఓట్లేయండి
-మా మామని చూసి ఓట్లేయండి
-మా తాతని చూసి ఓట్లేయండి
అని చెట్టు పేరు చెప్పి పుచ్చు కాయలు అమ్ముకునే నాయకులున్న వర్తమాన రాజకీయాల్లో,
నాతో సహా ఏ నాయకుడినైనా కాల పరీక్ష పెట్టిన తర్వాతే మీరుఎంచుకోండి, అంటున్నావంటే @PawanKalyan 🙏🙏
విజయవాడలోని 4.17 ఎకరాల విలువైన ఆర్టీసీ స్థలాన్ని లూలూ గ్రూప్‌కు 99 ఏళ్ల లీజుకు ఇస్తూ గతంలో జారీ చేసిన జీవో నెం. 137 (తేదీ: జూలై 5, 2025) ను రద్దు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ (AG) కోర్టుకు రాతపూర్వకంగా తెలిపారు. ప్రజా వ్యతిరేకతను గుర్తించి ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం శుభపరిణామం..
న్యాయ పోరాటంతో రూ. 400 కోట్ల ప్రజా ఆస్తిని కాపాడిన వడ్డే శోభనాదీశ్వరరావు గారి పట్టుదలకు హృదయపూర్వక అభినందనలు 🙏
చట్టబద్ధతను నిలబెట్టి, సరైన నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ హైకోర్టుకు ధన్యవాదాలు.
ప్రభుత్వ భూములు ప్రజా ప్రయోజనాలకే ఉండాలి, ప్రభుత్వ భూముల లీజులు పూర్తి పారదర్శకతతోనే జరగాలి ✊
#Transparency #Accountability
#AndhraPradesh
కాకినాడ జిల్లాపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక దృష్టి
•రెండు నెలలకి ఒకసారి కాకినాడ, పిఠాపురంలలో పర్యటన
•ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరానికి కృషి
•కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు
•జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై దిశానిర్దేశం
•నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
•జిల్లా పరిధిలో ఏ ఒక్క రోడ్డుపై గుంతలు కనబడరాదు
•వర్షాకాలానికి ముందే కాకినాడ జిల్లా పరిధిలో గ్రేట్ గ్రీన్ వాల్ పూర్తి చేయాలి
ఇక మీదట కాకినాడ జిల్లా పరిధిలో రెండు నెలలకి ఒకసారి ప్రత్యేకంగా పర్యటిస్తానని, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ నేరుగా వారి సమస్యలు తెలుసుకుంటానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ గారు, ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారితో సమావేశం అయ్యారు. కాకినాడ జిల్లాతోపాటు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
•అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కాకినాడ జిల్లాతోపాటు పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. డొంక రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు. జిల్లా పరిధిలో ఉన్న రోడ్లన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించండి. రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిన చోట కొత్త రోడ్లు నిర్మాణం చేపట్టాలి. చిన్న చిన్న గుంతలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న సేవలపై పర్యవేక్షణ పెంచాలి. ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గ్రామ స్థాయిలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలలు, హాస్టళ్లను సందర్శిస్తూ విద్యార్ధులకు అవసరం అయిన సౌకర్యల కల్పన పైగా ఆలోచన చేయాలి. యువతకు క్రీడలు, కళలు తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. నైపుణ్యాన్ని వృద్ధి చేసి వారిలో ఉన్న శక్తిని ద్విగుణీకృతం చేయాలి. గ్రంథాలయాలను బలోపేతం చేయాలి. యువతలోని నైపుణ్యాన్ని, కొత్త ఆవిష్కరణలను వెలికితీసి ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాల”ని కలెక్టర్ కు సూచించారు.
•రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి
పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. వర్షాకాలం లోపు కాకినాడ జిల్లా పరిధిలో తీర ప్రాంతం వెంబడి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అటవీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీకి పలు సూచనలు చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రేషన్ మాఫియాని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
“లివర్ మార్పిడికి జనసేన అండ – @PawanKalyan గారి స్ఫూర్తితో ప్రాణానికి భరోసా… అజయ్ గారి ప్రేరణతో ₹1,00,000 ఆర్థిక సహాయం”
“కష్టం ఎక్కడ ఉంటే… జనసేన అక్కడ ఉంటుంది”
#KishoreGunukula గారు - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
కష్టపడి జీవనోపాధి నెట్టుకొస్తున్న ఒక కుటుంబానికి వరుసగా ఆపదలు ఎదురయ్యాయి. కుటుంబ పెద్దను కోల్పోయినా ధైర్యంగా తమ కాళ్లపై తామే నిలబడుతున్న ఆ కుటుంబంలో ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది.
“నా తమ్ముడికి తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏర్పడింది. ఆర్థికంగా మాకు స్థోమత లేకపోవడంతో, #PawanKalyan గారిని ఆదుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ, కలెక్టర్ గారికి అర్జీ సమర్పించిన సోదరి రేవతి గారి తమ్ముడు వెంకటాద్రికి జనసేన పార్టీ తరఫున వీలైనంత సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నాము.”
ఆ కుటుంబంలోని వెంకటాద్రి లివర్ తీవ్రంగా డ్యామేజ్ కావడంతో అత్యవసర చికిత్స అవసరమైంది. శారీరకంగా లివర్ దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినప్పటికీ, ఆ ఆపరేషన్‌కు అవసరమైన భారీ ఖర్చును భరించే ఆర్థిక స్థోమత మాత్రం వారికి లేదు.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యవేక్షకులు @AjayaKumarJSP గారు వెంటనే స్పందించి, ఆయన ప్రేరణతో జిల్లా నాయకులందరూ కలిసి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించి భరోసాగా నిలిచారు.
ఇది కేవలం సహాయం కాదు… ఒక ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల,సీనియర్ నాయకులు నూనె మాలికార్జన యాదవ్,సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,కార్యాలయ ఇంచార్జ్ జమీర్,పప్పు సాయి,రాధమ్మ, అనిల్, సురేష్, శ్రీకాంత్, లత, రాజేష్, కృష్ణ,సురేంద్ర పిల్లేల,రవి కోన, తదితరులు పాల్గొన్నారు.
అందుకే మనసున్న ప్రతి దాత ముందుకు వచ్చి, ఈ చిన్నారికి అవసరమైన వైద్య సహాయానికి తమ వంతు చేయూత అందించాలని మనస్పూర్తిగా కోరుతున్నాము.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రత్యేకంగా వెంటనే స్పందించి సహాయం అందించిన వేములపాటి అజయ్ గారికి మా కృతజ్ఞతలు..
@APDeputyCMO@NagaBabuOffl@mnadendla@JSPShatagniTeam@itsRamTalluri
#nellore #Andhrapradesh #PawanKalyanAneNenu #JanasenaUdyami
అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలి
పవిత్ర క్షేత్రంలో తాగునీటి సమస్య ఉండకూడదు
రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
రూ.17.33 కోట్లతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకం ప్రారంభం
తీరనున్న 30 వేల మంది తీర ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు
రూ. 5 కోట్లతో ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ 6 ఎంఎల్ టీ నిర్మాణానికి శంకుస్థాపన