జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
#KCR 10,000 మంది పంచాయతి సెక్రటరీల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వాళ్ల బలవన్మరణాలకు కారకులై, మళ్లీ ఈ రోజు 12 గం. లోగా విధుల్లో చేరక పోతే ఉద్యోగం నుండి తొలగించి వేరే వాళ్లను నియమించుకుంటామనడం రాజ్యాంగ విరుద్దం-నిరంకుశత్వం. Absolutely Unconstitutional and Dictatorial.
తెలంగాణను విచ్చలవిడిగా దోచుకుంటూ మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేటి నుండి సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.
నేడు సాయంత్రం 7 గం. కు ప్రజలందరం కలిసి ఈ దోపిడి #KCR ప్రభుత్వం పై పోరాటంలో అసువులు బాసిన ఉద్యోగ యోధులకు (భైరి సోని,JPS గారితో సహా) ప్రతి గ్రామ పంచాయతి కార్యాలయం నుండి మహనీయుల విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహిద్దాం. పార్టీలకతీతంగా అందరూ ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మనవి🙏
అందరు ఉద్యోగ మిత్రులు సోమవారం నాడు లంచ్ టైం లో కీ.శే సోని గారికి మీ మీ ఆఫీసుల్లో నివాళులు అర్పించి సమ్మె చేస్తున్న ఉద్యోగ మిత్రులకు బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి. 🙏
ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ఒక్కరం- ఇదే మన నినాదం.
#RegulariseJPS/OPS #LiberateTelangana
#TelanganaStandsWithJPS
జూనియర్ పంచాయతి కార్యదర్శి సోని మృతికి కారకుడైన తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే రాజీనామా చేయాలి✊✊ ( గిరక తాల్లు ఎక్కి కల్లు తాగడానికి ఉన్న టైం JPS ల సమస్యలపై చర్చించడానికి ఉండదు) Rip TS Govt💐💐💐💐 @EDRBRS@KTRBRS@TelanganaCMO@balkasumantrs
తెలంగాణ రాష్ట్ర గీతం "జయజయహే తెలంగాణ" పాడి 15 వ రోజు శాంతియుత నిరవధిక సమ్మె కొనసాగించిన మహబూబాబాద్ జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు & ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు.
#JPSRegularisaion#Mahabubabad
4 సంవత్సరాలు బానిసలుగా పని చేయించుకొని కేంద్ర అవార్డ్స్ పొంది, నోటిఫికేషన్ ప్రకారం న్యాయం చేయమని అడిగిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గొప్ప బహుమానం.Terminations @ Rip రాచరిక పాలన💐💐 @sachin_rt@KTRBRS@MaharashtraCmo@INCIndia@ndtv@narendramodi
9వ రోజు JPS ల నిరవధిక సమ్మెలో భాగముగా ఈ రోజు శ్రమదానం, చేతిపై గోరింటాకు తో విధులు గుర్తు చేస్తూ నిరసన, Mpw ల సంఘీభావంగ స్నాక్స్ అందజేయడం, మాకుల వెంకటేశ్వర స్వామి కి JPS ల రెగ్యులర్ గురించి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా