తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం
* వైసీపీ గూండా చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి
* ఎన్నికల్లో గెలవలేమని అర్థమై వైసీపీ అరాచకానికి పాల్పడుతోంది
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు, శ్రేణులను కవ్వించి వైసీపీ గూండాలు దాడులకు తెగబడటం అత్యంత హేయం. తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారు. అక్కడే కొన్ని వాహనాలను నాశనం చేసి, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని, దౌర్జన్యాలు, గొడవలు చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ఈ దుశ్చర్యలకి పాల్పడుతోంది. రాష్ట్రంలో అశాంతి, అరాచకం, అలజడులు సృష్టించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలనే వైసీపీ పన్నాగం దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసీపీ హింసకు దిగింది.
*ఎస్.ఈ.సి. కఠిన చర్యలు తీసుకోవాలి
జనసేన పార్టీ ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారి మీద, జనసేన శ్రేణులపై దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాగం కూడా ఈ దాడులకి పాల్పడ్డవారిని, వెనుక ఉన్నవారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా గౌరవించే నాయకులు. రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్రను పెంచాలనే బృహత్ ఆశయంతో ఆయన పనిచేస్తున్నారు. దీనిని కాలరాసేలా వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలి.
(నాదెండ్ల మనోహర్)
చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన
జనసేన పార్టీ తరుపున 13వ వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాం
నర్సీపట్నం లో 4 వార్డ్ లు జనసేన పార్టీ పోటీ చేస్తుంది
గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్న ప్రతి ఒకరిని జనసైనికులు మరియు ప్రజలు అదిరిస్తారు అని కోరుకుంటున్నాను ✊
జై జనసేన ✊ జై పవన్ కళ్యాణ్ ✊
ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా సమాజ శ్రేయస్సు కొరకు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరుపున ఇవే మా ఘన నివాళులు.
#PoliceCommemorationDay#JanaSenaTelangana#JSPForTelangana
వైసీపీ పై శ్రీ కిరణ్ రాయల్ ఆగ్రహం ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ గారు వేసిన రోడ్లు ధ్వంసం
రూ.4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును అర్ధరాత్రి ధ్వంసం చేశారు
ప్రజల రాకపోకల కోసం నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం
కూటమి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే విధ్వంసానికి పాల్పడ్డారు
ప్రజలు వినియోగించే రహదారిని ధ్వంసం చేయడం హత్యకన్నా దారుణం
ఏకగ్రీవాలపై గతంలో జగన్ చేసిన ప్రకటనకు ఇప్పుడేం సమాధానం చెబుతారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలపై జగన్ చర్యలు తీసుకుంటారా…?
నేను ఏమాత్రం అధైర్యపడను.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు! ✊
నా చివరి శ్వాస వరకు నేను జనసేన పార్టీలోనే ఉంటాను.
JSP అభ్యర్థుల గెలుపు కోసం పూర్తిస్థాయిలో పనిచేస్తాను. పార్టీ అప్పగించే ప్రతి బాధ్యతనూ నిబద్ధతతో నిర్వర్తిస్తాను.
జై జనసేన! 🚩✊
#APLocalBodyElections#deputycmpawankalyan@PawanKalyan@APDeputyCMO
గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేద్దాం - పల్లె ప్రగతిని కొనసాగిద్దాం!
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి అఖండ విజయాన్ని అందిద్దాం.
#VoteForGlass
#APLocalBodyElections
సీట్ల సర్దుబాటులో అసంతృప్తి గా ఉన్న జనసేన అభ్యర్థులు రేపు సత్తెనపల్లి టౌన్ నుండి రెబల్ గా బరిలోకి దిగుతున్నారు
కూటమి లో ఎప్పడు ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు
గెలిచిన ఓడినా అడుగు ముందుకే
ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము
ఈ సారి మా కోసం మేము యిద్దం చేస్తాం ✊
వెనక్కి తగ్గేది లేదు 🔥
ఈ విషయం లో పార్టీ అధిష్టానం సహకరించి బీఫార్మ్ ఇస్తే పార్టీ సింబల్ నుండి పోటీ లేని పక్షం లో ఇండిపెండెంట్ గా పోటీ లోకి దిగనున్న జనసేన అభ్యర్థులు
Sorry @PawanKalyan అన్న ఈ సారి మీ మాట వినలేము
@JanaSenaParty
ఇంకా ఎంతమంది పురుగుల మందు తాగి పోతే గీ అధికారులకు, గీ సర్కారుకు కడుపు సల్లబడుతుంది
మా పన్నులతో మీకు జీతాలిచ్చి
AC గదులల్ల కుసోబెడుతుంటే, మా సావుల కోసం ఎక్కినవ్వులు నవ్వుతన్నవులే దొర..?
గీ Congress సర్కార్ నీకిచ్చిన ధైర్యంలే..?
ఎవరి అండ చూసుకుని ఇంత ఎచ్చిడి జేస్తున్నవో జనం చుస్తున్నరు
పతొక్కటి… జనం గమనిస్తున్నరు.
#CongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana