సీఎం మరియు సీఎం మనవడు & కుటుంబసభ్యులు ప్రతిరోజు ఇవే నీళ్ళు తాగుతారు..!!
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఇలాంటి నీళ్ళు తాగి ఉడికి ఉడకని అన్నం తింటే తప్పేంటి??
ఇక చేతులకు దద్దుర్లు అంటారా..?
సీఎం Vaseline పూసుకుంటాడు కాబట్టి ఆయ్లేవు..!! వాళ్ళు పూస్కున్లేర్ కదా..!!
Students at Rajiv Gandhi University of Knowledge and Technologies (RGUKT)-Basar alleged that they were forced to drink sewage-like water at the Ganga and Yamuna hostels. RGUKT officials said water samples were sent to a laboratory and action would follow the findings, writes @santoshpadaala
#Nirmal #Basar #RGUKT #WaterQuality
🚆 కాజీపేటకు జరిగిన అతిపెద్ద ద్రోహం!
కోచ్ ఫ్యాక్టరీ కలకు బదులుగా RMU బిస్కెట్!
బయటకు చూస్తే ₹500 కోట్ల పెట్టుబడి, 200 MEMU రైలు సెట్ల తయారీతో కాజీపేట RMU ఒక గొప్ప విజయంలా కనిపిస్తోంది. కానీ ప్రకటనల వెనుక వాస్తవాలు ఏమిటి?
కాజీపేట కోల్పోయినవి / నిర్లక్ష్యానికి గురవుతున్న అంశాలు:
🔴 1. కోచ్ ఫ్యాక్టరీ కలకు తూట్లు
- AP పునర్విభజన చట్టానికి సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీ హామీ ఇంకా నెరవేరలేదు.
- గతంలో ప్రతిపాదించిన Wagon Manufacturing & POH ప్రాజెక్టు పక్కన పెట్టారు.
- RMUను ఆరేళ్లలో 200 MEMU రైలు సెట్ల తయారీకి పరిమితం చేశారు.
🔴 2. పరిమిత ఉద్యోగాలు, తయారీ
- పూర్తిస్థాయిలో సుమారు 2,000 ప్రత్యక్ష ఉద్యోగాలు రావచ్చనే అంచనా.
- ICF, RCF వంటి సంస్థలతో పోలిస్తే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ.
- వందే భారత్, LHB కోచ్‌ల తయారీ హామీలు ఏమయ్యాయి?
🔴 3. కాజీపేట రైల్వే డివిజన్ నిర్లక్ష్యం
- సికింద్రాబాద్ డివిజన్ ఇప్పటికే తీవ్ర రద్దీతో ఉంది.
- ప్రత్యేక కాజీపేట డివిజన్ డిమాండ్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
- RMUను చూపిస్తూ ప్రత్యేక డివిజన్ అవసరాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.
🔴 4. ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్లక్ష్యం
- 4వ, 5వ ప్లాట్‌ఫారాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
- కరీంనగర్, భూపాలపల్లి, సూర్యాపేట రైల్వే కనెక్టివిటీ ఆలస్యం.
- 20 ఏళ్లకు పైగా కాజీపేట నుంచి చెప్పుకోదగ్గ కొత్త రైళ్లు లేవు.
- కోవిడ్ సమయంలో రద్దయిన రైళ్ల పునరుద్ధరణ ఇంకా అవసరం.
🔴 5. నిర్వహణలో నిర్లక్ష్యం
- పిట్ లైన్లను ప్రయాణికుల రైళ్లకు పూర్తిస్థాయిలో వినియోగించకుండా NMG నిర్వహణకు ఉపయోగిస్తున్నారు.
- క్రూ లింకులు, కార్యకలాపాలు ఇతర స్టేషన్లకు తరలిస్తున్నారు.
- ప్రయాణికుల హబ్‌గా కాకుండా కేవలం నిర్వహణ కేంద్రంగా కాజీపేటను చూస్తున్నారు.
🔴 6. రైళ్ల పొడిగింపుల్లో అసమాన ప్రాధాన్యత
- పుణె/హడప్సర్ వైపు వెళ్లే సుదూర రైళ్ల పొడిగింపులకు ప్రాధాన్యత.
- యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్, అశోకపురం, తిరుపతి రైళ్ల సంగతేంటి?
- కాజీపేట, తెలంగాణకు అదనపు రైళ్లు ఎక్కడ?
మా ప్రధాన డిమాండ్లు
1. అసలు కోచ్ ఫ్యాక్టరీ లక్ష్యాన్ని పునరుద్ధరించాలి.
2. Wagon Manufacturing & POH ప్రాజెక్టు స్థితిని వెల్లడించాలి.
3. RMU తయారీ పరిధి, ఉద్యోగ అవకాశాలు పెంచాలి.
4. వందే భారత్, LHB తయారీపై స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలి.
5. ప్రత్యేక కాజీపేట రైల్వే డివిజన్ మంజూరు చేయాలి.
6. 4వ, 5వ ప్లాట్‌ఫారాల నిర్మాణం వేగవంతం చేయాలి.
7. కొత్త రైళ్లు ప్రవేశపెట్టి, రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలి.
8. కరీంనగర్, భూపాలపల్లి, సూర్యాపేట కనెక్టివిటీ వేగవంతం చేయాలి.
9. పిట్ లైన్లను ప్రయాణికుల రైళ్ల కోసం పూర్తిస్థాయిలో వినియోగించాలి.
10. కాజీపేట క్రూ లింకులు, కార్యకలాపాలను బలోపేతం చేయాలి.
11. తెలంగాణకు ఉపయోగపడే రైళ్ల పొడిగింపులు, కొత్త రైళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
12. కాజీపేటను ప్రధాన ప్రయాణికుల రైల్వే హబ్‌గా అభివృద్ధి చేయాలి.
కేంద్ర ప్రభుత్వానికి మా సందేశం:
RMUను, పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను మేము స్వాగతిస్తున్నాం. కానీ ఏళ్ల తరబడి జరిగిన నిర్లక్ష్యాన్ని, నెరవేరని హామీలను కప్పిపుచ్చేందుకు RMUను ఉపయోగించడాన్ని అంగీకరించం.
వరంగల్, తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. PR ప్రకటనలకు మేము మోసపోము!
🚆 కోచ్ ఫ్యాక్టరీ పేరుతో బిస్కెట్ కాదు... కాజీపేటకు న్యాయం కావాలి!
తెలంగాణకు రైల్వే కావాలి – PR కాదు, నిజమైన అభివృద్ధి కావాలి!
#JusticeForKazipet #TelanganaRailway #KazipetRMU
#Kazipetdivision
@AshwiniVaishnaw@PMOIndia@narendramodi@kishanreddybjp@bandisanjay_bjp@BJP4Telangana@VSOMANNA_BJP@INCTelangana@BRSparty@KTRBRS@BRSHarish@RaoPadmaBJP@Drkadiyam_kavya@drmsecunderabad@gmscrailway@SCRailwayIndia@RailMinIndia@IR_CRB