నా మద్దతు నా ప్రయాణం చివరదాకా🔯జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ అన్నతోA Middle Class Voice for Justice 🙏
Social Activist#
Serve for the Country& stand For the hopeless
I wish Deputy Chief Minister Sri K. Pawan Kalyan garu a speedy recovery from the surgery for rotator cuff injury undergone by him at a hospital in Mumbai. I pray Almighty to bestow the strength on him to get well soon.
@APDeputyCMO@PawanKalyan
Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
జనసేనలో చేరిన శ్రీ గుడిపాటి సీతారామ్
విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త శ్రీ గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శ్రీ సీతారామ్ కలసి పార్టీలో చేరుతానని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో శ్రీ సీతారామ్ సతీమణి, యువ గాయని శ్రీమతి శ్రీలలిత పాల్గొన్నారు. ‘నేషన్ ఫస్ట్ అనే దృక్పథం కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అడుగులు వేయాలనే ఉద్దేశంతో జనసేనలో చేరాను. పార్టీ సిద్ధాంతాలకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాను’ అని ఆయన చెప్పారు.
Had a warm and productive meeting with the Hon'ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji. We discussed a range of issues of mutual interest and explored opportunities for greater cooperation between our two States.
I conveyed my sincere thanks to him for Maharashtra's support in facilitating the translocation of two female tigers to Andhra Pradesh. This generous gesture marks an important milestone in our efforts to restore a thriving tiger population in the Eastern Ghats. The introduction of female tigers will help overcome the challenges of inbreeding, enhance genetic diversity, strengthen the long-term viability of the population, and contribute to a healthy, self-sustaining tiger landscape.
This collaborative conservation effort reflects our shared commitment to protecting biodiversity through science-based and sustainable wildlife management. I am confident that the partnership between Andhra Pradesh and Maharashtra will contribute significantly to the long-term conservation of tigers in the Eastern Ghats.
I also express my gratitude to the Hon'ble Union Minister for Environment, Forest and Climate Change, Shri @byadavbjp Ji, for his continued guidance in taking this initiative forward. I look forward to continued collaboration with the Government of Maharashtra and all stakeholders in advancing wildlife conservation.
@PMOIndia@moefcc@AndhraPradeshCM@CMOMaharashtra@ntca_india
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కొద్దిసేపటి క్రితం ముంబైకి చేరుకున్నారు. గత కొంతకాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్న ఆయన వైద్య పరీక్షల నిమిత్తం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు పాముల గణపతి కాకినాడ వెంకట నగర్ కు చెందిన విష్ణుమూర్తి గారిపై తప్పుడు కేసులు పెట్టించడమే కాకుండా లక్షల రూపాయలు నష్టపోయేటట్టు చేశాడు
విష్ణుమూర్తి గారికి జరిగిన అన్యాయం పైన కాకినాడ అప్పటి 2 Town సిఐ గారు కేసు తీసుకోకపోగా వారి అండతో తప్పుడు కేసులు పెట్టించారని బాధపడుతూ జనసేన జనవాణి కార్యక్రమంలో
సంపత్ నాయక్ గారికి చెప్పడంతో సంపత్ నాయక్ గారు వెంటనే స్పందించి కాకినాడ టూ టౌన్ సిఐ అప్పలనాయుడు గారికి కాల్ చేయడమే కాకుండా విష్ణుమూర్తి గారికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని నిజానిజాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా CI గారితో మాట్లాడారు.
#JanaVaaniJanaSenaBharosa #JanaSenaTelangana
జూన్ 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను సమీక్షిస్తున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణుల నుంచి వస్తున్న విశేష స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. @JanaSenaParty కోసం కష్టపడిన ప్రతి ఉద్యమి, ప్రతి సాధక్, ప్రతి జనసైనికుడికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పార్లమెంట్ పరిశీలకులకు సూచించడం జరిగింది.
పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు పార్టీ బాధ్యతలతో పాటు, వివిధ అనుబంధ విభాగాల్లో సేవలందించాలనే ఆసక్తి ఉన్న జనసేన సాధక్స్, నాయకులు, జనసైనికులందరికీ ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పిస్తున్నాం. జనసేన శ్రేణులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నాయకత్వం తీసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
రేవంత్ రెడ్డి పోయి వేరే రాష్ట్రంలో ప్రచారం చేస్తాడు
KCR పోయి వేరే రాష్ట్రంలో పైసలు ఇచ్చి వస్తారు
పవన్ కళ్యాణ్ వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సిన పనేంటో
- TS BJP MP రఘునందన్ రావు కౌంటర్ 🔥👌
రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బంధుత్వాలు, సంబంధాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు, కాంట్రాక్టులు కూడా జరుగుతున్నప్పుడు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకు? కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ పంథాను వీడి ప్రాంతీయతను రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలి. జాతీయ సమగ్రత విషయంలో స్పష్టమైన విధానం ఉండాలి. ఇలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుకుంటు పోతే కాంగ్రెస్ పార్టీ జెన్ జీ యువతకు దేశ సుస్థిరత విషయంలో ఎలాంటి మార్గనిర్దేశకం చేస్తుంది? 12 ఏళ్ల తరువాత తెలంగాణలో సభ పెట్టాలని అనుకున్నాను. సాధారణంగా అనుమతి ఇచ్చుంటే ఇంత రాద్ధాంతం అయ్యేది కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీని వెనక ఉన్నారు అని నేను అనుకోవడం లేదు. కొందరు మధ్యలోని వ్యక్తులే సభకు ఆటంకాలు కలిగించి ఉంటారని భావిస్తున్నాను.
• మూడు రాజధానులు అయిపోయాయి... ఇప్పుడు మూడు జిల్లాల రాజధాని
అమరావతి ఉద్యమ సమయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేలా ఒక భావన కలపాలనే ఉద్దేశంతోనే జై ఆంధ్ర నినాదం ఇవ్వాలని కోరాను. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ పాలన సాగించింది. ఇప్పుడు అధికారం పోయాక మూడు జిల్లాలను కలుపుతూ ఏదో పేరుతో రాజధాని అంటున్నారు. 2014లో అమరావతి అనే రాజధాని నిర్ణయం తీసుకున్నారు. దానికి కట్టుబడి ముందుకు వెళ్లాలి. ప్రతిసారీ ఇష్టానుసారం రాజధాని మార్చుకునేలా మాట్లాడటం సరికాదు. ఇక్కడ రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. ఇక్కడ రాజధాని అభివృద్ధి చేయాలి.
రాజధాని అనేది రాత్రికి రాత్రి పూర్తయ్యే ప్రక్రియ కాదు. అది భవిష్యత్తు తరాలకు దిశానిర్దేశం చేస్తుంది. ప్రతిసారీ అమరావతి విషయంలో వైసీపీ ద్వంద్వ విధానాలతో ప్రజల్లోనూ, పారిశ్రామికవేత్తల్లోనూ కావాలనే అయోమయం నెలకొల్పుతోంది. జనసేన నూతనంగా ఏర్పాటు చేస్తున్న సేనా గళం అందరినీ కలపాలనే బృహత్తర ఆశయంతో ముందుకు సాగుతుంది’’ అన్నారు.
అస్సలు నువ్వెవరు @Ponnam_INC? నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? అంతగా నీ జాగీరు అనుకుంటే... తెలంగాణ సరిహద్దుల్లో కూర్చొని వచ్చిపోయే వాళ్లకు చెప్పుకో ఈ సొల్లు కబుర్లు!
So called National party @INCIndia and their leader @RahulGandhi should respond.
What is your intention in encouraging leaders who incite regional hatred instead of upholding national integrity?
#JaiTelangana#JaiHind
ఇక్కడ జనసేన పోటీ చేసేది తెలంగాణాలో పుట్టి పెరిగిన వాళ్ళే కానీ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమి పోటీ చెయ్యట్లేదు కదా! విద్వేషంతో దేన్నైనా ఎంతకాలం ఆపగలరు!
#JanaSenaTelangana
With deep respect and gratitude, Andhra Pradesh extends heartfelt thanks to former Karnataka Chief Minister Shri @siddaramaiah Garu for the valuable support and cooperation extended during his tenure.
His leadership reflected a true spirit of partnership and coordination between neighbouring states. The support extended in facilitating trained Kumki elephants for wildlife management stands as a meaningful example of collective responsibility and mutual trust.
On behalf of Andhra Pradesh, sincere appreciation for his goodwill, leadership, and contribution. Wishing him continued success and the very best in public life.
@CMofKarnataka@AndhraPradeshCM
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay