అమ్మ చెల్లి పవన్ కళ్యాణ్ అన్నయ్యా ❤
నా చివరిశ్వాస వరకు జనసేన జెండా నీ వదలను
Inspiration Of Pk Sir&SivaShankar Sir ❤️
TSJSP StudentWing State Organize Secretary
కాంగ్రెస్,BRS నాయకులకు ప్రజాధనాన్ని దోచుకునే శ్రద్ధ
నిరుద్యోగులపై ఉంటే
రోడ్లపైకి యువత వచ్చి నిరసన తెలిపే అవకాశం వచ్చేది కాదు
వీరికి యువత భవిష్యత్తు వద్దు
వారి సొంత ప్రయోజనాలే ముద్దు
నిరుద్యోగ యువతకోసం జనసేన అండగా ఉంటుంది
#BRSCongressBetrayedYouth#JanaSenaWithTelanganaYouth
పదేళ్ల BRS పాలనలో పేపర్ లీకులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, గ్రూప్-1 నోటిఫికేషన్ లేక యువత భవిష్యత్తు నాశనమైంది. ఇప్పుడు వారే నిరుద్యోగులకు అండగా ఉంటామంటూ నాటకాలు ఆడుతున్నారు.
#BRSCongressBetrayedYouth#JanaSenaWithTelanganaYouth
వైద్యుల సూచనతో మరో రెండు వారాలు క్షేత్ర స్థాయి పర్యటనలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దూరం
•మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే విధి నిర్వహణ
ఇటీవల కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు అధికారిక కార్యక్రమాలకు అందుబాటులోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పిఠాపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అయితే క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా జనసమూహం మధ్యకు వెళ్లిన సందర్భంలో శస్త్ర చికిత్స చేసిన భుజానికి ఏ మాత్రం అసౌకర్యం కలిగినా గాయం తిరగబెడుతుందని, అలాంటి పరిస్థితి ఏర్పడితే మరోమారు సరిచేయడం కూడా క్లిష్టతరమవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఎడమ భుజానికి కూడా ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. కనీసం మరో రెండు వారాల పాటు క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు ఉప ముఖ్యమంత్రివర్యులకు సూచించారు. వైద్యుల సలహా మేరకు క్షేత్ర స్థాయి పర్యటనల షెడ్యూలు మార్చాలని కార్యాలయ అధికారులకు సూచనలు చేశారు.
అదే సమయంలో అధికారిక కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
వైద్యుల సూచనతో మరో రెండు వారాలు క్షేత్ర స్థాయి పర్యటనలకు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు దూరం
•మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే విధి నిర్వహణ
ఇటీవల కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమాలకు అందుబాటులోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పిఠాపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అయితే క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా జనసమూహం మధ్యకు వెళ్లిన సందర్భంలో శస్త్ర చికిత్స చేసిన భుజానికి ఏ మాత్రం అసౌకర్యం కలిగినా గాయం తిరగబెడుతుందని, అలాంటి పరిస్థితి ఏర్పడితే మరోమారు సరిచేయడం కూడా క్లిష్టతరమవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఎడమ భుజానికి కూడా ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. కనీసం మరో రెండు వారాల పాటు క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు ఉప ముఖ్యమంత్రివర్యులకు సూచించారు. వైద్యుల సలహా మేరకు క్షేత్ర స్థాయి పర్యటనల షెడ్యూలు మార్చాలని కార్యాలయ అధికారులకు సూచనలు చేశారు.
అదే సమయంలో అధికారిక కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
మళ్ళీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న BRS పార్టీ
గత10 ఏళ్లలో న్యాయం చేయనివారు
ఇప్పుడు నిరుద్యోగులు గురించి మాట్లాడుతున్నారు
సిగ్గు సిగ్గు ఇంత దిగజారి రాజకీయం చేస్తున్న రాజకీయ నాయకులు
ఏ గత పదేళ్లలో గాజులు వేసుకున్నారా అని అడుగుతున్న ఒక నిరుద్యోగిగా
@PawanKalyan@JSPTelangana
#BRSCongressBetrayedYouth#JanaSenaWithTelanganaYouth
ఉద్యోగాలు కాదు... యువతకు మోసమే దక్కింది!
పదేళ్ల BRS పాలనలో పేపర్ లీకులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, గ్రూప్-1 నోటిఫికేషన్ లేక యువత భవిష్యత్తు నాశనమైంది. ఇప్పుడు వారే నిరుద్యోగులకు అండగా ఉంటామంటూ నాటకాలు ఆడుతున్నారు.
2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లలో 10% నియామకాలు కూడా పూర్తి చేయలేదు. యువత డిక్లరేషన్ అమలు కాలేదు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి తెలంగాణ యువకుడి తరఫున గళమెత్తుదాం. ఈ రెండు పార్టీలను తరిమి కొడదాం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మనుబోతుల పాడు గ్రామ పంచాయతీ ఆదివాసీ మహిళలతో అధికారులు దురుసుగా ప్రవర్తించిన తీరు తీవ్ర ఆందోళనకరం.
దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యను తీర్చడం మానేసి వారి మీదే అటవీ శాఖ అధికారులు దాడులకు దిగడం అప్రజాస్వామికం, దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
లేని పక్షంలో ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం!
- జనసేన నాయకులు డా. గడల శ్రీనివాస రావు
#BhadradriKothagudem #JSPForTelangana
జనసేన పార్టీ పార్లమెంట్ సమావేశంలో గ్రౌండ్ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రతి పార్లమెంట్ టీమ్ బాధ్యతలు, రానున్న ZPTC & MPTC ఎన్నికలపై కీలక దిశానిర్దేశం జరిగింది.
ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య పనిచేస్తూ, టీమ్‌తో సమన్వయంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది.
#JanaSena #PawanKalyan #JanaSenaParty #Telangana #JSPTelangana #ZPTC #MPTC #GrassrootPolitics #PoliticalUpdate #TelanganaPolitics #PJNews
Mentions: @JanaSenaParty@PawanKalyan@JSPTelangana
వరంగల్ జిల్లాలో జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణ మరోసారి స్పష్టమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు శ్రీ తాళ్లపెల్లి బాలు గౌడ్, శ్రీ బైరి వంశి కృష్ణ ఆధ్వర్యంలో హనుమకొండకు చెందిన శ్రీమతి పబ్బు సునీత గౌడ్ గారితో పాటు, అధిక సంఖ్యలో మహిళలు ఆదివారం జనసేన పార్టీలో చేరారు. హైద్రాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ గారి ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు మహిళలు తెవిపారు. వరంగల్ జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడం, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించడం తదితర అంశాలను ఈ సందర్బంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, సురేంద్ర, హర్షియా, షబానా, పద్మజ, మెరుగు శివకోటి, వెళ్తూరి నగేష్,పిండి రాజేష్, దేవునూరి రాజేష్, ప్రశాంత్, దిలీప్ సామల, సంతోష్, గణిపాక కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
#Warangal
#JanaSenaMissionTelangana #JSPForTelangana
ఉద్యోగాలు లేవు… కానీ రాజకీయ డ్రామాలకు మాత్రం కొరత లేదు!
నిన్న ఉద్యోగాల పేరుతో సభ పెట్టారు.
చూస్తుంటే…
ఉద్యోగాల సమీక్ష కంటే…
రాజకీయ నాటకమే ఎక్కువగా కనిపించింది.
మైకులు ఉన్నాయి…
లైట్లు ఉన్నాయి…
చప్పట్లు ఉన్నాయి…
భారీ డైలాగులు ఉన్నాయి…
కానీ అక్కడ లేనిది ఒక్కటే…
తెలంగాణ ఉద్యోగాల అసలు లెక్క.
ఒక పార్టీ…
“నోటిఫికేషన్ మాది…” అంటోంది.
మరో పార్టీ…
“నియామకాలు మేమిచ్చాం…” అంటోంది.
క్రెడిట్ కోసం ఇద్దరూ పోటీ పడుతున్నారు…
బాధ్యత తీసుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు.
తెలంగాణ నిరుద్యోగ యువత మాత్రం నవ్వాలో… ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉంది.
“మీరిద్దరూ క్రెడిట్ పంచుకుంటున్నారు… మరి నిరుద్యోగాన్ని కూడా పంచుకుంటారా?”
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరం దాటింది.
BRS పార్టీకి 9½ సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి 2½ సంవత్సరాలు అవకాశం వచ్చింది.
మొత్తం పన్నెండు సంవత్సరాలు…
ఇప్పటికీ వేలాది మంది యువత చేతిలో ఉద్యోగ నియామక పత్రం లేదు…
కానీ నాయకుల చేతిలో మాత్రం క్రెడిట్ సర్టిఫికెట్లు రెడీగా ఉన్నాయి.
BRS పార్టీని అడుగుతున్నాం…
నిన్న సభ పెట్టేంత బాధ…
అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఒక్కరోజైనా కనిపించిందా?
ఈ రోజు అధికారంలో లేరనే కారణంతో నిరుద్యోగ యువతను గుర్తు చేసుకోవడం బాధ్యత కాదు.
కాంగ్రెస్‌కు అర్హత లేదని చెబితే…
తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న మీ పాలనను ప్రజలు ఎలా అంచనా వేయాలి?
కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒకటే మాట.
గత ప్రభుత్వాన్ని తిట్టడం…
మీ హామీలను నెరవేర్చినట్లు కాదు.
రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు.
ఇప్పుడు సభల్లో సంఖ్యలు చెబుతున్నారు.
సంఖ్యలు కాదు…
శాఖల వారీగా పూర్తి నియామకాల వివరాలు విడుదల చేయండి.
ఉద్యోగాలపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయండి.
ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నది ఉద్యోగాల పోటీ కాదు.
క్రెడిట్ వేలం.
ఒకరు…
“మొదటి అడుగు మాది” అంటున్నారు.
మరొకరు…
“చివరి సంతకం మాది” అంటున్నారు.
కానీ…
ఉద్యోగం కోసం జీవితంలో పదేళ్లు కోల్పోయిన యువకుడిని మాత్రం ఎవరూ తమవాడని చెప్పడం లేదు.
మీరిద్దరూ క్రెడిట్ కోసం పోరాడుతున్నారు…
యువత మాత్రం…
Age Limit కోసం పోరాడుతోంది.
మీరు సభల కోసం తేదీలు ప్రకటిస్తున్నారు…
యువత మాత్రం…
పరీక్ష తేదీలు వాయిదా పడతాయేమో అని భయపడుతోంది.
మీరు రాజకీయ భవిష్యత్తు కోసం ప్రచారం చేస్తున్నారు…
యువత మాత్రం…
వయోపరిమితి దాటిపోతుందేమో…
తన కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో… అని ఆందోళన చెందుతోంది.
నిన్న T-Hub గురించి గొప్పలు చెప్పారు…
స్టార్టప్‌ల గురించి చెప్పారు…
ప్రపంచ స్థాయి అభివృద్ధి గురించి చెప్పారు…
బాగానే ఉంది.
కానీ…
అశోక్‌నగర్‌లో కోచింగ్ చదువుతున్న నిరుద్యోగ యువకుడి జీవితాన్ని కూడా ఒక్కసారి మీ ప్రెజెంటేషన్‌లో చూపించారా?
గ్రామం నుంచి వచ్చి…
ప్రభుత్వ ఉద్యోగం కోసం పదేళ్లు చదివిన యువతి కథ కూడా మీ స్లైడ్‌లలో ఉందా?
లేక…
అవి ఓటు వచ్చే కథలు కావు కాబట్టినా?
స్టార్టప్‌ల గురించి మాట్లాడటం తప్పు కాదు.
అభివృద్ధి గురించి చెప్పడం కూడా తప్పు కాదు.
కానీ అదే సమయంలో…
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత గురించి కూడా సమానంగా మాట్లాడాలి కదా!
తెలంగాణ ఉద్యమంలో యువత పోరాడింది…
క్రెడిట్ రాజకీయాల కోసం కాదు.
విద్యార్థులు త్యాగాలు చేసింది…
ప్రతి ఎన్నికకు ఉద్యోగాల హామీలు వినడానికి కాదు.
జనసేన పార్టీ తెలంగాణ స్పష్టంగా చెబుతోంది.
ఇద్దరూ చప్పట్లు ఆపండి.
ఇద్దరూ డైలాగులు ఆపండి.
ఇద్దరూ రాజకీయ నాటకాలు ఆపండి.
ఇప్పుడు…
లెక్కలు మాట్లాడండి.
ప్రతి శాఖలో…
ఎన్ని పోస్టులు?
ఎన్ని ఖాళీలు?
ఎన్ని నోటిఫికేషన్లు?
ఎన్ని నియామకాలు?
ఎన్ని పెండింగ్?
ఎన్ని కోర్టుల్లో ఉన్నాయి?
ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయండి.
BRS పార్టీ…
మీ 9½ సంవత్సరాల పాలనకు లెక్క చెప్పండి.
కాంగ్రెస్ ప్రభుత్వం…
మీ 2½ సంవత్సరాల పాలనకు లెక్క చెప్పండి.
క్రెడిట్ అడిగే ముందు…
బాధ్యత తీసుకోండి.
చప్పట్లు అడిగే ముందు…
జవాబు చెప్పండి.
ప్రచారం చేసే ముందు…
ఉద్యోగాలపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయండి.
ఎందుకంటే…
క్రెడిట్‌తో ఎవరి జీవితం మారదు… ఉద్యోగంతో ఒక కుటుంబం మారుతుంది.
తెలంగాణ యువతకు మీ రాజకీయ క్రెడిట్ అవసరం లేదు.
వారికి ఉద్యోగం కావాలి.
వారికి న్యాయం కావాలి.
వారికి భవిష్యత్తు కావాలి.
జై తెలంగాణ!
జై జనసేన!
@PawanKalyan@itsRamTalluri@JSPTelangana@JanaSenaParty@RahulGandhi@revanth_anumula@KTRBRS@BRSHarish@BJP4Telangana
#తెలంగాణనిరుద్యోగులు
#JobsForTelangana
#తెలంగాణఉద్యోగాలు
#తెలంగాణయువత
ఈ రోజు నాకు చాలా ఆనందంగా అనిపించింది.
ఇప్పటి వరకు మీలో చాలా మందిని ట్వీట్స్‌లో, పోస్టుల్లో, ఎడిట్స్‌లో, సోషల్ మీడియాలో మీరు చేస్తున్న అహర్నిశల కృషిలో మాత్రమే చూశాను. కానీ ఈ రోజు మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవడం, మాట్లాడడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది మీ ప్రతిభకంటే మీ నిబద్ధత. ప్రతిరోజూ విమర్శలు, ట్రోలింగ్, వ్యతిరేకత ఎదురైనా… ఎలాంటి స్వార్థం లేకుండా, ఒక్క పదవి ఆశించకుండా… శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని, సిద్ధాంతాలను, విలువలను నమ్మి ప్రేమతో మీరు చేస్తున్న ఈ ప్రయాణం నిజంగా అభినందనీయం.
ఈ రోజు మనమంతా కలిసి కూర్చున్నప్పుడు ఒక్క విషయం బలంగా అనిపించింది… మనం విడివిడిగా పనిచేసే వ్యక్తులం కాదు. ఒక లక్ష్యం కోసం కలిసి నడిచే ఒక కుటుంబం.
మీరు వేసే ప్రతి పోస్ట్, చేసే ప్రతి ఫ్యాక్ట్ చెక్, ప్రతి రిప్లై, ప్రతి ట్రెండ్, ప్రతి నిద్రలేని రాత్రి… చాలాసార్లు ఎవరికీ కనిపించకపోవచ్చు. కానీ అవన్నీ జనసేన ప్రయాణంలో ఎంతో విలువైనవి.
ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ, నేర్చుకుంటూ, బాధ్యతతో, క్రమశిక్షణతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుదాం. జనసేన బలం ఎప్పుడూ జనసైనికులే. ఈ రోజు వారి మధ్య నిలబడటం… వారిలో ఒకడిగా ఉండటం నాకు ఎంతో గర్వంగా అనిపించింది.
ప్రయాణం ఇప్పుడే మొదలైంది… కలిసి నడుద్దాం, కలిసి గెలుద్దాం.
#JanaSena #Telangana #PawanKalyan
#socialmedia #janasainiks
@PawanKalyan@itsRamTalluri@JSPTelangana@JanaSenaParty
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మనుబోతులగూడెంలో పోడు భూముల విషయంలో అటవీ అధికారులు ఆదివాసీ మహిళలతో ప్రవర్తించిన తీరు తీవ్రంగా ఖండించదగినది. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ వారి తరఫున ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తుంది.
- జనసేన నాయకులు శ్రీ మిరియాల రామకృష్ణ
#BhadradriKothagudem #JSPForTelangana
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం, మనుబోతులపాడు గ్రామపంచాయతీలో ఆదివాసీ మహిళలతో అధికారులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. మహిళల గౌరవాన్ని, ఆదివాసీల రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాసే ఇటువంటి చర్యలను @JSPTelangana పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
ఆదివాసీ మహిళల గౌరవం, భద్రత, రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడటం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా @TelanganaCMO@TelanganaCS స్పష్టమైన చర్యలు తీసుకోవాలి.
@TelanganaDGP@revanth_anumula@PawanKalyan@itsRamTalluri
#JusticeForTribalWomen #TribalRights #WomenSafety #BhadradriKothagudem #JanaSenaTelangana
సినీ పరిశ్రమలో నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని కల్పించి నిర్మాతగా నాకు జన్మనిచ్చిన నా దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కుటుంబ సమేతంగా కలిసి, ఆగస్టు 16న జరగనున్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు ఆహ్వానించి వారి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
#JananiSuryaPayanam
జనసేనలో న్యాయవాదులకు అత్యున్నత గౌరవం ఉంటుంది.
• తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం
• నవంబర్‌లో వేలాది మంది న్యాయవాదులతో జనసేన సభ పెడతాం
• కార్యకర్తకు కష్టమొస్తే లీగల్ సెల్ సభ్యులు అందుబాటులో ఉంటారు
• తెలంగాణ మేనిఫెస్టోకు న్యాయవాదులు భాగస్వామ్యమందించాలి
#JanaSenaLegalCell #JSPForTelangana
18.07.2026
విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ పునర్వైభవం కోసం కృషి: జిల్లా కలెక్టర్ గారిని కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్
విశాఖపట్నం:జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని గ్రంథాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, వాటికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ తెలిపారు.
ఇటీవల గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలిసి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, నిధుల కొరత మరియు భవన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మంత్రిగారు సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, భవన సదుపాయం కోసం జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు.
ఈ నేపథ్యంలో, నేడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎం.అభిషిక్త్ కిషోర్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా, జిల్లా కేంద్ర గ్రంథాలయం (DCL) మరియు గ్రంధాలయ కార్యాలయాలకు శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 'డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్' భవనంలో తాత్కాలిక వసతి కల్పించవలసిందిగా ఆయన కోరారు. అలాగే, చిల్డ్రన్స్ లైబ్రరీ, సిటీ బ్రాంచ్ లైబ్రరీ, మహిళా మరియు చిల్డ్రన్స్ గ్రంథాలయం, మరియు భీమునిపట్నం గ్రంథాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
మా అభ్యర్థనపై జిల్లా కలెక్టర్ గారు ఎంతో సానుకూలంగా స్పందించారు. భవన కేటాయింపునకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని మరియు సంబంధిత అధికారులను ఆదేశిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రంథాలయాల ఆధునీకరణ ద్వారా నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు నాణ్యమైన సేవలందించడమే లక్ష్యమని చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ తెలిపారు.
@APDeputyCMO@AndhraPradeshCM@PawanKalyan@ncbn@naralokesh@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@mnadendla@NagaBabuOffl@TSivasankararao@itsRamTalluri@vizagcollector
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం జరిగే ఎంపీల సమావేశంలో పాల్గొంటున్నాను. నా తొలి సమావేశాలకు ముందు అధినేత దిశానిర్దేశం నాకు మరింత స్పష్టతని, ధైర్యాన్ని ఇస్తాయి.
@JanaSenaParty#pawankalyan