పోలవరం జిల్లా సమీప అడవుల్లో పులి సంచారంపై నిరంతర పర్యవేక్షణ
•హనుమాన్ బృందాలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం
•క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు అటవీ శాఖ ఉన్నతాధికారులు
•అత్యాధునిక సాంకేతికత సహకారంతో పులి కదలికలపై నిఘా
•అటవీ సరిహద్దు గ్రామాల్లో పులి సంచారంపై నిరంతర అప్రమత్తతకు ఆదేశం
•పోలవరం జిల్లాలో పశువులపై పులి దాడి సంఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సమీక్ష
పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పులి కదలికలపై ఆధునిక సాంకేతికతతో కూడిన పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు పులి కదలికల సమాచారం చేరవేస్తూ, అప్రమత్తం చేయాలని తెలిపారు. బుధవారం రాత్రి అటవీ సరిహద్దు చికిలింత పంచాయతీ పరిధిలోని పశువుల కొట్టాల్లో దూడలపై పులి దాడి చేసిన సంఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ అధికారులతో సమీక్షించారు. పులి దాడిలో తొమ్మిది దూడలు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్టు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్ లో పులి కదలికలను గుర్తించినట్టు, ప్రస్తుతం అటవీ ప్రాంతంలో సంచరిస్తూనే, గ్రామాలకు సమీపంగా వస్తున్నట్టు అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. అలాంటి పరిస్థితుల్లోనే అడవికి కేవలం 300 మీటర్ల దూరంలోని ఆయిల్ ఫాం తోటలో ఉన్న పశువుల పాకపై దాడి చేసినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పులి కదలికలపై క్షేత్ర స్థాయి సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలి. మనుషులు, పశువుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో పులి జనారణ్యంలోకి వచ్చిన సందర్భంగా అటవీ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు.
* హనుమాన్ బృందాలతో 24 గంటల పర్యవేక్షణ
పులి సంచరిస్తున్న అటవీ సమీప గ్రామాల్లో హనుమాన్ బృందాలతో 24 గంటల పర్యవేక్షణ ఏర్పాటు చేయండి. అవసరం అయితే అదనపు హనుమాన్ టీంలను రంగంలోకి దించండి. తీసుకుంటున్న చర్యల పట్ల అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ స్వీయ పర్యవేక్షణ ఉండాలి. ఈ మొత్తం ఆపరేషన్ పర్యవేక్షణకు అవసరమైన పక్షంలో అటవీశాఖ కేంద్ర కార్యాలయం నుంచి సీనియర్ అధికారిని ఘటనా స్థలికి పంపాలి. అధునాతన సాంకేతికత సాయంతో ప్రతి అడుగును ట్రాక్ చేసే ఏర్పాటు చేయాలి. వన్య ప్రాణి సంరక్షణ నిబంధనల అనుగుణంగా చర్యలు ఉండాలి.
* పులి సంచార పరిసర గ్రామల్లో అవగాహనా శిబిరాలు
పులి సంచారం నమోదైన అటవీ పరిసర గ్రామాల్లో క్షేత్ర స్థాయి సిబ్బంది సహకారంతో నిరంతరం అవగాహన శిబిరాలు నిర్వహించాలి. గ్రామస్తులు అవసరం లేకుండా అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులను అటవీ ప్రాంతానికి సమీపంగా కట్టి ఉంచడం, నిర్లక్ష్యంగా వదిలేయడం చేయకుండా రైతులకు సూచనలు ఇవ్వాలి. వన్య ప్రాణుల సంచారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల ప్రజలతో అధికారులు సున్నితంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలి. సమాచారాన్ని చేరవేయడం, ఫిర్యాదులపై స్పందించే అంశంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పశువుల ప్రాణ నష్టానికి తక్షణ పరిహారం కింద ఇప్పటికే రైతులకి కొంత మొత్తం అందజేశాం. పశు వైద్యుల నివేదిక వచ్చిన వెంటనే పూర్తి స్థాయి పరిహారం అందించే ఏర్పాటు చేస్తామ“న్నారు.
@AndhraPradeshCM@HANUMAN_APGOV@PIB_India@IPR_AP@pibvijayawada
Today, Hon’ble Prime Minister Shri @narendramodi ji visited the residence of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu in Hyderabad and personally enquired about his health during his recovery.
Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu along with his wife Smt. Anna Konidala garu and children warmly received the Hon’ble Prime Minister during the visit.
Despite his demanding national responsibilities and hectic schedule, Hon’ble Prime Minister Shri Narendra Modi ji took time to personally visit and convey his heartfelt concern and blessings, reflecting his compassion, humility, and affectionate nature. His leadership continues to inspire millions across Bharat, not only through his vision for the nation but also through the personal care and concern he shows towards people treating everyone like family.
Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu and his family conveyed their heartfelt gratitude to the Hon’ble Prime Minister for his gracious visit, kind concern, and blessings.
Chapter 6 of #PawanKalyanTransformsAP was launched by Thiru @annamalai_k Avargal, who shared his admiration for the leadership and people-first governance of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu.
“From Tirupathi to Palani… a long-pending wish of devotees became a reality under the leadership of Shri Pawan Kalyan Garu, with APSRTC introducing two daily bus services for devotees,” remarked Thiru Annamalai Avargal while appreciating the initiative undertaken for devotees.
He highlighted that Shri Pawan Kalyan Garu never sees people merely as “citizens”, he treats them as his own family and remains committed to resolving their concerns with sincerity, compassion, and responsibility.
Thiru Annamalai Avargal also noted that Shri Pawan Kalyan Garu always comes prepared to serve the people with discipline, dedication, and service above politics.
Also wished Shri Pawan Kalyan Garu continued good health, strength, and greater success in his journey of public service.
@pibchennai
Wildlife is essential for ecological balance, biodiversity, and climate stability. Protecting habitats ensures harmony between humans and nature and secures a sustainable future.
Today, the Andhra Pradesh Government, under the Environment and Forest Ministry, inaugurated the HANUMAN Project (Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife), a dedicated initiative to rescue, treat, rehabilitate, and monitor injured wildlife, strengthening conservation and rapid response systems across the state.
On this World Wildlife Day, let us unite to conserve habitats, prevent exploitation, and safeguard our natural heritage for generations to come - @PawanKalyan@moefcc@byadavbjp
#WorldWildlifeDay
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో గ్రామీణ భారతం నిజమైన మార్పును చూస్తోంది.
13,000కి పైగా గ్రామ సభలు 3,000కి పైగా అభివృద్ధి పనులకు ఆమోదం ఇది మాటలు కాదు, కార్యాచరణ.
ఈ ప్రభావవంతమైన కార్యక్రమాలను కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి @Prashanthi_VPR గారు ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం గర్వకారణం.
గ్రామాల అభివృద్ధి ప్రజల భవిష్యత్తు ఇదే నిజమైన పరిపాలన.
రైతులకు అండగా ఎన్డీఏ ప్రభుత్వం: పవన్
గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫించన్లు పెంచిందని గుర్తుచేశారు.
దేశ చరిత్రలో ఇలా స్పందించిన MLA ఎవరూ ఉండి ఉండకపోవచ్చు... పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇటువంటివి కొన్ని వేలు చేసి ఉంటాడు....
పులివెందుల MLA ఖాతాలో ఇటువంటిది ఒకటి కూడా ఉండదు
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచన మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలతో గురువారం సాయంత్రం పిఠాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో గోపాలకృష్ణ చేతుల మీదుగా చిన్నారులు కరణం సత్య, చంటి లకు ఇంటి పట్టాను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, మూడవ రోజు సభలో గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రసంగించి, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ప్రజలకు అందిస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan@governorap@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
#APAssembly
శ్రీ వై ఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
మాజీ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
- నిమిషాల్లో పని పూర్తి చేసిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
- అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన శ్రీ లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరారు.
- రోడ్డు బాధ్యతను ఉప ముఖ్యమంత్రి అప్పగించిన గౌరవ సీఎం శ్రీ @ncbn గారు
- నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు
- రూ. 2 కోట్లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు శ్రీ లాకే బాబూరావు తన సక్సెస్ స్టోరీ వివరించే క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరారు. శ్రీ బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి కు అప్పగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి చెందిన శ్రీ బాబూరావు చెప్పిన వివరాల మేరకు పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి, అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
అగ్ని ప్రమాద బాధితులకు అండగా @JanaSenaParty
నిత్యవసర సరుకులు, రగ్గులు, టార్పన్లు అందించిన భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర
పిసిబి మెంబెర్ డాక్టర్ సందీప్ పంచకర్ల
విశాఖ జిల్లా పద్మనాభం మండలం అయినాడ పంచాయతీలో కొన్ని రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మూడు పూరిల్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానిక నాయకులు భీమిలి మార్కెట్ కమిటీ చైర్మన్ కురిమిన రామస్వామి నాయుడు మూడు రోజుల క్రితం కొంత నగదును అందించడంతోపాటు ఇన్చార్జికి విషయాన్ని తెలియపరిచారు.
ఈ విషయంపై జనసేన నాయకులు రాష్ట్ర పిసిపి డైరెక్టర్ డాక్టర్ సందీప్ పంచకర్ల మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోయిన స్థలాన్ని పరిశీలించారు, బాధితులతో మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటామని జనసేన పార్టీ సొంత నిధులతో వారికి కావలసిన నిత్యవసర వస్తువులు, దుప్పట్లు, తార్పానులు పంపిణీ చేశారు. ఈ విషయంపై స్థానిక రెవెన్యూ అధికారి తో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావలసిన ప్రభుత్వ సహాయ సహకారాలు వెంటనే అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురిమిన రామస్వామి నాయుడు,
శాఖరీ. శ్రీనుబాబు, వేములవలస పిఎసిఎస్ చైర్మన్ రౌతు నాగరాజు, ఏఎంసీ డైరెక్టర్ రామలక్ష్మి, వి బి నాయుడు ప్రోగ్రాం కమిటి మెంబర్,పిఎసిఎస్ డైరెక్టర్ పద్మనాభం కిలారి రమణ, డైరెక్టర్ రెడ్డి శీను, రమేష్, సురేష్,, పుప్పాల అప్పలరాజు, మనీ, గుర్నాథ్ మండల నాయకులు జిల్లా నాయకులు ముఖ్య నాయకులు ఐనాడలో పాల్గొనడం జరిగింది.