ఈ రోజు గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు
ఒక ప్రార్ధన..
"నీ కొండను నీవే రక్షించుకో" అని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్ధించండి.. 🙏
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి... ప్రసాదించిన ఈ పవిత్ర సంజీవని వంటి ఔషాద వృక్షాలతో నిండిన సింహగరిని పరిరక్షించి భావితరాలకు సురక్షితంగా అందించాల్సిన భాద్యతను మరచిన ఈ ప్రభుత్వానికి సద్బుద్ధిని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే వివేకాన్ని ఇచ్చి ప్రజాహిత నిర్ణయాలు తీసుకునే ధర్మబుద్ధిని మన పాలకులకు, అధికారులకు ప్రసాదించమని వేడుకోండి.
సింహగిరిని కాపాడటం అంటే స్వామివారి దివ్యక్షేత్రాన్ని, ఆయన ప్రసాదించిన ప్రకృతి సంపదను కాపాడటమే. ప్రకృతి పరిరక్షణ కూడా భగవంతుని సేవలో అంతర్భాగమే.
జై శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి🙏🙏🙏
@simhadri_swamy
#సింహాచలగిరిప్రకదక్షణ
#SimhachalaGiriPradakhsana
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #Nature #Environment
#ధర్మో_రక్షతి_రక్షతః #వృక్షో_రక్షతి_రక్షతః
Mega Prince @IAmVarunTej 🙏❤️
అభిమానుల పట్ల మరోసారి తన పెద్ద మనసు చాటుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు మరియు గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సురేష్ పాటిల్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు వెంటనే స్పందించారు.
తన తల్లిగారు శ్రీమతి పద్మజ గారి సహకారంతో హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులతో మాట్లాడించి, శ్రీ సురేష్ పాటిల్ గారికి అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చికిత్స సమయంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సమకూర్చారు.
అంతేకాకుండా, చికిత్సకు అయ్యే పూర్తి వైద్య ఖర్చును స్వయంగా ఆయనే భరించి, శ్రీ సురేష్ పాటిల్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ అండగా నిలిచారు.
అభిమానులకు అండగా ఉండటంలో వరుణ్ తేజ్ గారికి ఇది కొత్త విషయం కాదు. ఇటీవల అనంతపురానికి చెందిన ఓ అభిమాని మరణించిన సందర్భంగా కూడా, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారి సేవా భావాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వరుణ్ తేజ్ గారు, అవసరమైన సమయంలో ముందుండి సహాయం చేస్తూ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. చిరంజీవి గారి నుంచి అందుకున్న మానవత్వం, సేవా దృక్పథాన్ని ఆచరణలో చూపిస్తూ అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు.
Heartfelt birthday greetings to Hon'ble Union Minister for Railways, Information & Broadcasting, and Electronics & Information Technology, Sri @AshwiniVaishnaw Ji.
Under your leadership, Indian Railways has witnessed remarkable transformation through rapid electrification, route doubling, modern coaches, Vande Bharat trains, and the development of Amrit Bharat stations, realising the vision of Hon'ble Prime Minister Sri @narendramodi Ji for a world-class railway network.
May Lord Venkateswara bless you with good health, strength, wisdom, and a long life in service of the nation.
Anna Konidela
She is an European by birth where personal choice of liberty is supreme …. And she chose devotion as choice
These are the most powerful images of Sanatana Dharma…
One tonsuring hair for kid’s health
Two barefoot walk to tirumala uphills for husband’s health
పార్లమెంట్ చర్చల్లో ‘నేషన్ ఫస్ట్’ భావన వినిపించాలి
•రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి
•పార్లమెంటు వర్షా కాల సమావేశాల నేపథ్యంలో జనసేన ఎంపీలకు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు దిశానిర్దేశం
పార్లమెంట్ చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో జనసేన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమగ్రంగా చర్చించారు. సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరఫున గళం వినిపించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధి వంటి అంశాలపై ఎంపీలతో చర్చించారు. రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు చేకూరేలా ప్రతి అంశంపై సమగ్ర అవగాహనతో మాట్లాడాలని ఎంపీలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక బిల్లులపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ప్రతి అంశంలోనూ ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు.
దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనే జనసేన పార్టీ లక్ష్యమని, అదే దిశగా పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో పార్టీ లోక్ సభ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి @VBalashowry గారు, శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ @tangella_uday గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ @MPLingamaneni గారు పాల్గొన్నారు.
ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయి వచ్చి హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించాను. పవనన్న త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించాను. వైద్యుల సూచనలు పాటించాలని, వీలైనంత మేరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించాను.
@PawanKalyan
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ @naralokesh గారు పరామర్శించారు. హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన శ్రీ లోకేష్ గారు విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పరామర్శించారు. గవర్నర్ గారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
• పవన్ కళ్యాణ్ గారి లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వగృహంలో ఉన్న లైబ్రరీని గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆసక్తిగా చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఆటోగ్రాఫ్ చేశారు.
గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ముంబయి కోకిలబెన్ ఆసుపత్రికి కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని సోమవారం సాయంత్రం మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis గారు పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారు ఆకాంక్షించారు.
Visited Andhra Pradesh DCM Pawan Kalyan ji at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai, where he is recovering after a surgery. Wishing him a speedy and complete recovery.
@PawanKalyan#Maharashtra#Mumbai
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గత పదేళ్ళ నుంచి రెండు భుజాలకు ఉన్న గాయాలను భరిస్తూ వస్తున్నారు. ప్రజా జీవితంలో భాగంగా చేపట్టిన పర్యటనల్లో నొప్పి భరిస్తూ... ప్రజలను కలిశారు.
అనునిత్యం ప్రజా క్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచన చేసే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🏻.
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO