Yoga for One Earth, One Health: From Rigveda to Global Soft Power
Yoga is not just a set of postures. It is India’s timeless offering to humanity, today's record gathering in vizag is a philosophy rooted in the Rigveda, where the sages invoked: “प्रातः काले ब्रह्मा, मध्याह्ने तु महेश्वरः।
सायं काले तु स्वयं विष्णुः,
त्रिमूर्तिर्दिवाकरः।”, Let us move together, speak together, and let our minds be in harmony. This ancient wisdom laid the foundation for a civilization that understood that true well-being is not limited to the individual but extends to the entire cosmos.
Prime Minister sri @narendramodi ji, recognizing this profound heritage, elevated Yoga from the ashrams to the global stage. Under his leadership, Yoga has transcended boundaries, becoming a unifying force for a present day fragmented world. The declaration of June 21 as International Yoga Day, endorsed by 177 nations in the @UN a record in itself, signaled the reawakening of India’s spiritual soft power.
In today’s fractured geopolitics and polarized societies, Modi’s vision of “One Earth, One Health” through Yoga is a global survival strategy. Amid climate change, pandemics, mental health crises, and lifestyle disorders, Yoga offers a holistic blueprint.
I urge everyone to begin and make yoga part of routine for a healthy life.
#InternationalYogaDay #OneEarthOneHealth #YogaAndhra2025
సమగ్ర అభివృద్ధి నివేదిక 2024-2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా; పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రిగా @PawanKalyan బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా ప్రజలు NDA కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ, గత సంవత్సర కాలంలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలతో పంచుకోవాలని, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర అభివృద్ధి నివేదిక విడుదల చేస్తున్నాము. ప్రజలందరూ ఈ నివేదిక ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తూ, రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గౌ|| ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి మార్గదర్శకత్వంలో, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతతో NDA ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచెయ్యనుంది.
Thread 🧵 👇🏻1/5
#NDAGoodGovernance #IdhiManchiPrabhutvam
The tragic demise of the former CM of Gujarat, Sri @vijayrupanibjp Ji, in the Air India flight crash that occurred in Ahmedabad, along with other passengers, is deeply devastating. His journey was more than political - it was a true commitment towards public service. I express my heartfelt condolences on his passing and extend my deepest sympathies to his family members, friends, and BJP cadre during this unsettling phase of distressing time.
#AhmadabadPlaneCrash
Deputy CM @PawanKalyan garu congratulated “Keerthi Chakra” Major Gopal Naidu and his family for their bravery.
Major Naidu played a key role in eliminating five terrorists on October 26, 2023.
#PawanKalyan#MajorGopalNaidu
జనసేన పార్టీ పట్ల భోగి రెడ్డి పృధ్వి నారాయణ గారు చూపించిన అభిమానం, తాను జీవితాంతం పోలీస్ శాఖకు అందించిన సేవలకు ప్రభుత్వం అందించే పెన్షన్ డబ్బును తన తదనంతరం కూడా సమాజానికి మంచి చేయాలని పరితపించే జనసేన పార్టీకి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకోవడం స్ఫూర్తినిచ్చింది నా మనసును హత్తుకుంది - @PawanKalyan
Heartfelt thanks for your wishes, Dy CM of AP, Thiru @PawanKalyan avl.
Always amazed by your charisma & your deep-rooted nationalism. Greatly admire your passion to serve the common public. Your uprightness in holding to the values inculcated by Sanatana Dharma is truly inspiring.
ప్రజా తీర్పుకు ఏడాది...
ప్రజా చైతన్యానికి ఏడాది...
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది...
NDA కూటమి చారిత్రక విజయానికి ఏడాది...
జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది...
04-06-2024 ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు, 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలుకొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు... దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత్ నిర్మాత గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి దృఢమైన నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో, దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని అడ్డుగోడగా నిలచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్పూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే @JanaSenaParty సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు.
మీరు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నాం, గత తప్పిదాలను సరిచేస్తూ, భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047 లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా "జనసేన పార్టీ - తెలుగుదేశం - బీజేపీ" పార్టీల NDA కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమాభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులకు, వీరమహిళలకు, @JaiTDP, @BJP4Andhra కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
#1YearForNDAHistoricVictory #PrajaTeerpuDinam
పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈ శుభ సందర్బంగా గౌరవనీయులు శ్రీ మంద కృష్ణ మాదిగ @Krishna_Madiga7 గారికి నా హృదయపూర్వక అభినందనలు. వెనకబడిన వర్గాల కోసం, మరీ ముఖ్యంగా మాదిగ సమాజం కోసం ఆయన చేస్తున్న అవిశ్రాంత కృషి, ఎం.ఆర్.పి.ఎస్. ద్వారా చేసిన అనేక సామాజిక పోరాటాలు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలు నిజంగా ప్రశంసనీయం.వికలాంగుల హక్కుల కోసం మరియు గుండె జబ్బులతో బాధపడే పిల్లల కోసం ఆయన చేసిన కృషి అసాధారణం.
ఈ పురస్కారం ఆయన సేవలకు గుర్తింపుగా ఈ దేశం ఇచ్చిన గౌరవం. మంద కృష్ణ మాదిగ గారి ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది - @PawanKalyan
#PadmaAwards2025
సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి
🔸 థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు
🔸 నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి
🔸 రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది
🔸 సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి
ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దు
రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని... ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు - సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు. దీనికి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు... ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని... ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.
ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే..?
టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఇంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకొంటాయన్నారు.
సినిమా హాళ్ల బంద్ నేపథ్యంపై...
తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం... తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనకగల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దన్నారు. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు... బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకొనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందని విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
@AndhraPradeshCM@Anitha_TDP@tfpcin@TFCCofficial@PIB_India@IPR_AP@pibvijayawada
We have come to know that a spokesperson from our NDA partner @JaiTDP allegedly made anti-national statements. It is up to the TDP to take appropriate disciplinary action. JanaSena Party will not interfere in their internal matters - @JanaSenaParty#PahalgamTerrorAttack
కూటమి ప్రభుత్వం ద్వారా విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం 33వ వార్డులో 1 కోటి 33 లక్షల అంచనా వ్యయంతో కూడిన సీసీ రోడ్లు, సీసీ కాల్వలు, ఓపెన్ జిమ్, కల్వర్టుల నిర్మాణాలకు గాను నిధులు మంజూరు అయ్యాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్థానిక శాసన సభ్యులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీసెట్టి వసంత లక్ష్మీ గారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, జనసేన వార్డు అధ్యక్షులు ఆకుల రాజు గారు, జీవీఎంసీ ఇంజనీర్ డీఈ. వేంకటేశ్వర రావు గారు, ఈఈ నర్సింగ్ గారు, టూ టౌన్ ఎస్ఐ. సింహాచలం గారు, వార్డు నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, బూత్ ప్రెసిడెంట్లు, స్థానికులు, ఆర్పీలు పాల్గొన్నారు.
#AndhraPradesh
#IdhiManchiPrabhutvam
ఎన్నో వ్యధలు, ఎన్నెన్నో కన్నీటి గాధలు
దారీ తెన్నూ లేక డోలీ మోతల బాధలు
అన్నిటికీ అంతం పలుకుతూ అభివృద్ధికి
పునాది వేస్తూ గిరి శిఖరాల్లో ఆవాసాల మధ్య అనుసంధానం ఏర్పరుచుతూ చేపట్టిన కార్యక్రమం అడవి బిడ్డలకు ఇచ్చిన మాట "అడవి తల్లి బాట"
#AdaviThalliBaata#PawanKalyanAneNenu