@revanth_anumula@TelanganaCMO@OffDSB గ్రూప్ 2,3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టాలని అలాగే గ్రూప్1 కూడా 1:100 చేయాలని నిరుద్యోగులు జూలై 5 న జరిగిన TGPSC శాంతియుత ముట్టడికి వేలాదిగా తరలి వచ్చి అక్రమంగా అరెస్టు అయ్యారు.వెంటనే నిరుద్యోగ సమస్యలపై స్పందించండి #group2postpone
తెలంగాణ నిరుద్యోగులు తలపెట్టిన #TGPSC ముట్టడికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న. ఈ ఉద్యమం డిమాండ్లను సాధించే దాకా శాంతియుతంగా జరిగేలా చూడండి. కాంగ్రేసు, @revanth_anumula లు చేసిన పచ్చిమోసానికి నిరసనగా వీరోచితంగా పోరాడిన మోతిలాల్ నాయక్ కు, ఆయన శ్రేయోభిలాషులకు జోహార్లు🙏.
ఉద్యమ కొనసాగింపులో భాగంగా ఈ రోజు నుండి అశోక్ సార్ చేపట్టిన ఆమరణ దీక్షకు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్న. కేవలం ఆరు నెలల వ్యవధి లోనే అవే నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం అశోక్ సార్ గారు ‘రెండు సార్లు’ ఆమరణ దీక్ష చెయ్యాల్సి వచ్చిందంటే తెలంగాణల ఉన్నది కాంగ్రెసు ప్రజా పాలనా లేక ప్రతీకారపాలనా??
నిజానికి ఈ డిమాండ్లలో ఏవీ కొత్తవి లేవు. అన్నీ కాంగ్రేసు ప్రతిపక్షంలో ఉన్నపుడు కోరినవే. అధికారం లోకి రాగానే సడన్ గా నిరుద్యోగులెట్ల చేదయ్యిండ్రు, సీయం గారు??
@RahulGandhi గారి తోనే చెప్పిస్తిరి కదా మొదటి సం. లోనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జాబ్ క్యాలండర్ ఇస్తమని?
కానీ ఏడు నెలల్లో కేవలం 6063 కొత్త ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నరు! మీరిచ్చిన నియామక పత్రాలన్నీ నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలోనివే. నిలదీసి అడిగితే పోలీసు లాఠీలను ఝళిపిస్తున్నారు, బల్మూరి వెంకట్ -బౌన్సర్ల ముఠాలను ఉసిగొల్పుతున్నరు!
జీవో 46 సవరణల మీద మీరేసిన కమిటీ ఇంతవరకు జాడ లేదు, 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 మెయిన్స్ కు అనుమతి మీద కాని, గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టుల పెంపు మీద కాని, #AEE నియామకాల మీద కానీ, గురుకులాల లో బ్యాక్ లాగ్ వేకెన్సీల భర్తీ మీద (with relinquishment option) కాని, సీయం లేదా మంత్రి వర్గ సభ్యులు ఎవరు స్పందించటం లేదు! ఎందుకు?? ఇవేవి గొంతెమ్మ కోరికలు కావు కదా? మీరు అధికారంలోకి రావడానికి ఇదే అమాయక నిరుద్యోగులను ఊరూరా తిప్పి ఓట్లేయించుకున్న విషయాన్ని అప్పుడే మరచిపోయిండ్రా?
పోలీసులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి. మీరూ ఒకనాటి నిరుద్యోగులే. నిరాశతో తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా రోడ్డెక్కిన ఈ బిడ్డలతో వ్యవహరించేటప్పుడు దయచేసి కొంచెం సంయమనం పాటించగలరు. 🙏
#CongressCheatedUnemployed
#StandByAshokSir
@BRSparty
Dear @RahulGandhi Ji,
You had personally met, promised the Telangana youngsters that recruitment of 2 lakh government jobs would be completed within the first one year of Congress assuming office
Your party also published “job calendar” (full page advertisements) in all leading newspapers along with dates following your promise
It is over 7 months now but not a single new job notification has been issued so far & more importantly 10 promised dates have passed
How will your Govt deliver on the 2 lakh recruitment process without issuing any notifications?
Please do respond as none responsible in Telangana Government seem to care
@RahulGandhi Kindly,we request that u pls increase @tspsc group 2,3& posts in Telangana.Yesterday we raised this issue along with our aspirants in Ashok Nagar,dharna chowk Hyderabad but the ruling of your govt here is still not responding to the students anymore.
Why?
@priyankagandhi good morning madam.. I'm from TELANGANA STATE..
Subject:- regarding unemployment issue seviour in Telangana. Govt not given new notification even not increasing the vaccancy posts in GROUP 2 & GROUP 3, please help us madam..
From
Unemployed of Telangana
@RahulGandhi@revanth_anumula Unemployed youth believed in you and helped you win the elections, but today we feel betrayed by Congress leaders. Please fulfill the promise made before 2023 of increasing Group 2 and Group 3 posts by providing a supplementary notification.
తెలంగాణలో గ్రూప్-2 & 3 పోస్టులను పెంచాలని,
GO 46 బాధిత అభ్యర్థులకు సత్వరమే న్యాయం చేయాలని,
DSC అభ్యర్థులకు ప్రిపేర్ కావడం కోసం మరి కొంత సమయం ఇవ్లాలని,
టెట్ స్కోర్లను నార్మలైజ్ చేసినంకనే డీఎస్సీ నిర్వహించాలని,
AEE ల నియామకం వెంటనే జరపాలని, కాంగ్రేసు ఇచ్చిన జాబ్ క్యాలండర్,
నిరుద్యోగ భృతిని వెంటనే అమలు జరపాలని,
గురుకుల బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,
ఇప్పటికే ఎంపికైన 140 మంది పోలీసు అభ్యర్థులను వెంటనే శిక్షణకు పంపాలని,
అందుకు కావలసిన బడ్జెట్ ను వెంటనే పోలీసు శాఖకు విడుదల చేయాలని.. మరెన్నో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి…
రేపు నిరుద్యోగ సంఘాల జేఏసి& అశోక్ సర్, చేయబోతున్న మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం…
ఈ నమ్మక ద్రోహ-నిరుద్యోగ వ్యతిరేక కాంగ్రేసు ప్రభుత్వం మెడలు వంచైనా మన డిమాండ్లను సాధించుకుందాం రండి👊
#BRS4Jobs
@BRSparty
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం.
గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 మరియు గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 ఎల్జిబిలిటీ పరిగణించాలని విజ్ఞప్తి చేసిన వారికి, అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదు?
25వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 11 వేల పోస్టులు మాత్రమే వేసి చేతులుదులుపుకున్నది.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, ఆరు నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపించకపోవడం విద్యార్థులను మోసం చేయడమే.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామక పత్రాలు అందించి, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప, యువత, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి?
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్స్ విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకోవాలి. డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు, ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressCheatedTelangana
Prelims పరీక్షకు ముందు reservations ఇవ్వకుండా, Prelims పరీక్ష తరువాత "negative marks" వున్న పరీక్షకి marks తగ్గించడం వలన చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు.అది గాక 57,58 go లు అనేవి retrospective(సరి దిద్దు) అవుతుంది.ఈ ప్రక్రియ నోటిఫికేషన్ కి విరుద్ధంగా వుంది.
@revanth_anumula@INCTelangana@TeenmarMallanna శ్రీయుత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, గత ప్రభుత్వం నిర్వహించిన పోలీసు నోటిఫికేషన్ పై 62 కోర్టు కేసులు & G.O.46, 57, 58 ల అవకతవకలు పై కమిటీ వేసి న్యాయ విచారణ జరిపి Tspscలనే Tslprbని కూడ ప్రక్షళన చేయగలరు, అని ఇట్లు పోలీసు అభ్యర్థులు.