Midhun reddy tho vunde Andari meedha both involved and uninvolved party leaders n cader meedha attempt murder sections petti cases pettaru…
Midhun reddy ki kuda time vastundi bro veedhi rowdy laga behave chesi trigger cheste cader Bali avtharu.. his dad might be soft but not Midhun reddy. Only persons very close to him knows about him
@VSReddy_MP Okkappudu ni birthday ki CDP lu launch chesam Jagan anna ki supportive ga vuntunnav ani… ilanti lucha gadiki CDP lu anduku chesamo anipistundi ninnu chustunte ippdu
విజయవాడలో పోలీస్ లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు, నాలుగు వారాల్లోగా ఆయన తల్లికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. ఈ తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. రాజధానిలో పోలీసులు అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారు. పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా కనీస పశ్చాత్తాపం కూడా లేకపోవడం అత్యంత దారుణం!
ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌తో సహా ఉన్నతాధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మేం మొదటి నుంచీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయాన్ని గుర్తించాలి.
ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాల్సిన చంద్రబాబు, అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, కేసును తొక్కి పెట్టేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో జరిగిన లోపాలకు, ఉన్నతాధికారుల పాత్రను సమగ్రంగా పరిశీలించడంలో విఫలమైనందుకు @ncbn ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాల్సిందే. ఈ వైఫల్యాల కారణంగానే ఇవాళ సీబీఐ విచారణ అవసరం ఏర్పడింది. విచారణ ఎదుర్కోవాల్సిన వారిని కాపాడేందుకు ‘సిట్’ ఏర్పాటు ఒక సాకుగా మారకూడదు.
ఈ కేసులో పూర్తి వాస్తవాలను సీబీఐ వెలికి తీయాలి. ఎవ��ి బాధ్యత ఏమిటో నిగ్గు తేల్చాలి. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నవారైనా సరే, ఈ నేరంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి న్యాయం జరిగేలా చూడాలి. తన ప్రభుత్వ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. సాయికృష్ణ తల్లికి తన కుమారుడి మరణం వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు తెలియాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆమెకు న్యాయం జరగాలి. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేం వారికి అండగా ���ిలబడతాం.
I welcome the Andhra Pradesh High Court's decision to transfer Gade Saikrishna's custodial death case to the CBI and also directing the State Government to pay 25 lakh to his mother within four weeks. This judgment is a slap on the face of the Chandrababu Naidu government. A heinous crime committed with no sense of remorse!
We have consistently demanded a CBI inquiry and a thorough investigation into the role of senior police officials, including the DGP and the Vijayawada Commissioner of Police. Rank and political protection must never place anyone above the law.
Chandrababu Naidu sought to bury this case through a State-controlled SIT instead of ensuring an independent investigation. His government must answer for the lapses in the probe and the failure to adequately examine the role of senior officials, which today highlighted the need for a CBI enquiry. Appointing a SIT cannot become an excuse to shield those who should face scrutiny.
The CBI must uncover the full truth, establish responsibility and bring everyone involved to justice, regardless of their position. @ncbn garu cannot wash his hands of his government's responsibility. Saikrishna's mother deserves answers, accountability and justice. We will stand firmly with his family until justice is delivered.