పురాణాల్లో కర్ణుడి గొప్ప దాన గుణం గురించి విని పౌరాణికాల్లో అనుకరణ నటులని చూసాం. కానీ ప్రస్తుతం లో వాస్తవ రూపం చూస్తున్నాము అంటే అది @PawanKalyan.
స్వాతంత్ర్య పోరాటం లో ఇంటికో యువ రక్తాన్ని ఇవ్వండి దాస్య శృంకలాల నుండి విముక్తి నేను తెస్తా అన్న భగత్ సింగ్ ని మేము పుస్తకాల్లో తప్ప పూర్వ రూపం చూడలేదు. ఆంధ్రప్రదేశ్ కి అవినీతి పాలన దింపి విముక్తి కలిగించిన నేటి రూపం @PawanKalyan.
అడవి బిడ్డల కోసం అసువులు బాసిన అల్లూరి ని నేను చూడలేదు ఆయువు ఉండగా. నేడు ఆ అడివి బిడ్డల భవిష్యత్తు కి బాటలు వేస్తున్న నేను చూస్తున్న రామరాజు @PawanKalyan.
పాలన అంటే ఆస్తులు కూడగట్టుకోవటం కాదు, మనది అమ్మి అయినా మాట నిలబెట్టుకోవటం అని చెప్పిన టంగుటూరు ప్రకాశం పంతులు గారు దామోదరం సంజీవయ్య గారు లాంటి వారి కాలం లో నేను లేను కానీ.. నేడు నేను చూస్తున్న నిస్వార్ధ రాజకీయ నాయకుడు @PawanKalyan.
ముసుగులో మగ్గిపోయి జీవితాల్లో బుగ్గి నింపుకున్న మహిళలు బ్రతుకు ల్లో వెలుగులు నింపిన వీరేశలింగం పంతులు గారి అడుగుల్లో నాడు నే నడవలేదు. నేను వీర మహిళ గా నామకరణం పొంది నే వేసే అడుగుల వెలుగు దాత @PawanKalyan.
మానవ సేవే మాధవ సేవ అని తెలిపిన మదర్ థెరిస్సా చేతిని నే తాకలేదు. నా చేతితో నాలాంటి ఎందరో యువకుల చేతులతో సమాజం కోసం సాయం చేసి చేతులు కలిపేలా నడిపిన చెయ్యి @PawanKalyan. ఇలా రాసుకుంటూ పోతే దారి తెన్ను తెలియని ఎందరికో దివిటీ @PawanKalyan.
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan అన్నయ్య #HBDPawankalyan
ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన మార్కు పనితీరు కనబరుస్తున్నారు అని పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.
గత ఇరవై సంవత్సరాల నుండి పూడిక ఎరుగని పిఠాపురంలోని చెరుకుల కాల్వను పేరుకుపోయిన చెత్తను ప్రొక్లైన్లతో తొలగించి మురికి కాల్వను శుభ్రపరచడం, గత 20 ఏళ్లలో ఎవరూ చేయని విధంగా పట్టణంలో మెయిన్ డ్రెయిన్లను అన్నింటినీ మినీ ప్రొక్లైన్లతో అడుక్కి వరకు మట్టిని ముందు చూపుతో జులై నెలలోనే తీయించారు. అలా తీయించడం వల్ల ప్రతి సంవత్సరం వర్షా కాలంలో మునిగిపోయే సినిమా సెంటర్ కి విముక్తి లభించింది.
అన్నిటికన్నా ముఖ్య విషయం నెగ్గిన అనతికాలంలోనే పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లు అన్నిటికి మరమ్మత్తులు చేయించడం, కొన్ని చోట్ల కొత్త రోడ్లు వేయించడం, పిఠాపురం నుండి సామర్లకోట వరకు కొత్త తారు రోడ్డు వేయించి దురవస్థలు నుండి సద్గతిని ప్రసాదించిన పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.
#Pithapuram
#PawanKalyanAneNenu
రాష్ట్రంలో పేదరికం జీరో స్థాయికి తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన P4 (పబ్లిక్ , ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్) కార్యక్రమంలో గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి పాల్గొని, P4 వెబ్సైట్ ను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan. (1/2)
కొంత మంది కుల అహంకారం ఉన్న వాళ్ళు మాటలతో మనకి అవసరం లేదు..!
అక్కడ చంద్ర బాబు గారు మనకు ముఖ్యం ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ తాగించడం లేదు..!
కర్మలు ఎంత ఏడ్చినా waste..!
@PawanKalyan@ncbn
చెప్పిందే చేస్తాడు.చేసేదే చెప్తాడు.
మార్పు పిఠాపురం నుంచే మొదలు✊🏻
పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్
“వాకపల్లి దేవిగారు “🥳
ఇప్పటివరకు SC మహిళకు ఏపార్టీ కూడా అవకాశం ఇవ్వలేదు
మొట్టమొదటి సారిగా SC మహిళకు అవకాశం ఇచ్చిన@PawanKalyanగారు 🫡
#JSPForSCEmpowerment#jspforwomenempowerment
పల్లెల్లో నిరంతర అభివృద్ధి పండుగ
•ఉగాది కానుకగా గ్రామీణ అనుసంధాన రహదారుల నిర్మాణం
•నాబార్డు నిధులు రూ.557.22 కోట్లతో, 1202.66 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణం
•నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఆదేశం
పల్లెల్లో అభివృద్ధి పండుగ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘పల్లె పండుగ’’ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల జాతర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పండుగను నిరంతరం గ్రామాల్లో కొనసాగించేలా... తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పండుగ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్లెవాసులకి తీపి కబురు చెబుతున్నారు. నాబార్డు నిధులు రూ. 557.22 కోట్లతో, మొత్తం 402 రహదారి పనులు చేసేందుకు నిర్ణయించారు. గ్రామాలు, మండలాల అనుసంధాన రోడ్లు ఈ నిధులతో పూర్తి కానున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 1202.66 కిలోమీటర్ల మేర గ్రామీణ అనుసంధాన రోడ్లను పునర్ నిర్మించబోతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టే ఈ పనులు పూర్తి నాణ్యతతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. పల్లెల్లో అభివృద్ధి పనుల పండుగ నిరంతరం కొనసాగేలా, గ్రామాల రూపురేఖలు మార్చేలా పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. నాబార్డు నిధులు మంజూరుకి తోడ్పాటునిచ్చిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి కృతజ్ఞతలు తెలిపారు.
తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, నా సోదరి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను🙏