Yeduguri Sandinti Sharmila is an Indian politician and founder of YSR Telangana Party from the state of Telangana. She is the younger sister of A P C.M
ప్రముఖ మైనార్టీ నాయకులు మౌలానా జాఫర్ పాషా హుసానీ గారితో ఈ రోజు భేటీ కావడం జరిగింది.మైనార్టీల సమస్యలపై సుధీర్ఘంగా చర్చించాం. దివంగత మహానేత వైయస్ఆర్ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మైనార్టీల తరఫున పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.
ప్రముఖ మైనార్టీ నాయకులు మౌలానా జాఫర్ పాషా హుసానీ గారితో ఈ రోజు భేటీ కావడం జరిగింది.మైనార్టీల సమస్యలపై సుధీర్ఘంగా చర్చించాం. దివంగత మహానేత వైయస్ఆర్ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మైనార్టీల తరఫున పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.
గత 12 ఏండ్లుగా కాంగ్రెస్,టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏనాడూ పోడు రైతులను పట్టించుకోలేదు.రైతులతో పాటు చంటి పిల్లల తల్లులను జైలులో పెట్టిన ఘనత KCRకే దక్కుతుంది.మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని లక్షల ఎకరాల పోడు భూములుంటే అన్ని లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేస్తాం
https://t.co/5stiGIt0Sf
జుక్కల్ నియోజకవర్గంలోని మంజీరా నదిలో యథేచ్ఛగా ఇసుక మాఫియా సాగుతోంది. సామాన్య జనం ఇసుక రవాణాను అడ్డుకుంటే వారిపై పీడీ యాక్టు, రౌడీ షీట్ ఓపెన్ చేసి జైళ్లలో పెడుతున్నారు. బంగారు తెలంగాణను దోపిడీ, దొంగల తెలంగాణగా మారుస్తున్నారు. (1/2)
నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అయ్యాకొడుకులకు చాతకాక తెలంగాణ యువతకు వొళ్ళు వంచి పనిచేయ చేతకాదని చెప్తున్నారా?
మీ ఇంట్లో 100 కు 100%, ఐదుగురికి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు కానీ తెలంగాణ యువతకు ఉద్యోగాలు నాలుగైదు శాతం కంటే ఎక్కువ ఇయ్యలేమని చెప్పేందుకు సిగ్గుండాలె. #ShameOnYouKTR
ఊరు బతుకులను బాగు చేద్దామని
సర్పంచులుగా గెలిచినందుకు వాళ్లకు
నీ బంగారు పాలనలో బతుకే లేకుండా చంపేస్తున్నావ్ కదా KCR దొరా.
గ్రామాల్లో పనులు చేయకపోతే
పదవి పీకేస్తా అని బెదిరించి మరీ
సర్పంచుల చేత పనులు చేయించుకొంటివి ..
పైసలు ఎగ్గొడితివి.
చేసిన పనులకు బిల్లులు రాక 1/2.
తెచ్చిన అప్పులు తీరక
సర్పంచులు ఆత్మహత్య చేసుకోబట్టే.
ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితీలకు 15 లక్షలు ఇస్తామని అప్పుడు చెప్పి ఇప్పుడు
మేము అలా ఏది చెప్పలే అని తాటిమట్ట ముచ్చట్లు చెప్పబడితివి.
రేపో మాపో పైసలు వస్తాయి,
అప్పులు తీరుతాయి అనుకున్న
వాళ్ళకు చావే దిక్కు చేసావ్ కదా KCR దొర 2/2
బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం.. YSR తెలంగాణ పార్టీ 'బీసీ గౌరవ సభ'
ఛలో కోస్గి..
అక్టోబర్ 3, జూనియర్ కాలేజీ గ్రౌండ్..
రండి.. తరలిరండి.. బలహీన వర్గాల సత్తా చూపిద్దాం.. ప్రభుత్వాల మెడలు వంచుదాం..
ఇసుక మాఫియా అక్రమాలకు, జుక్కల్ MLA అవినీతికి బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో ఒకే కుటుంబంలోని నలుగురు దళితులు ప్రాణాలు కోల్పోయారు. జనాలు ఇసుక క్వారీల్లో పడి సచ్చినా అడిగే దిక్కులేదు. అంజవ్వ, జ్యోతి, గంగోత్రి, ప్రశాంత్
మృతి కి కారణమైన వారిని వెంటనే శిక్షించాలి
#TRSSandMafia
జుక్కల్ అభివృద్ధి లేదు కానీ అక్రమ ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేదు. ఇసుకను 5 మీటర్ల లోతులో తీసుకోవాలని నిబంధనలుచెపుతున్నా ఇక్కడ 15 మీటర్ల వరకు అక్రమంగా తోడుతున్నారు.
అధికారులు, పాలకుల అండదండలతో రోజు ఇసుకాసురులవ్యాపారం
రోజుకు 3 ఇసుక లారీలు 6 కోట్ల ఆదాయం లా సాగుతుంది.
#TRSSandMafia
రైతు పెట్టుబడి రాకపోతే,
పండిన పంట వరద పాలైతే,
ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే,
రైతు చావక ఇంకేం చేస్తాడు దొరా?
కెసిఆర్ ఒక్క రైతు బంధు ఇచ్చిండు.
ఫసల్ భీమా బంద్ పెట్టిండు.
పంటలకు బీమా లేదు, రైతుకు ధీమా లేదు, పంటలు వాన పాలు. కష్టం నీటి పాలు.
రైతును కన్నీటిలో ముంచిండు 1/2