#ధర్మవరం నియోజకవర్గం గుడిసె కొట్టాల గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నాను. బీజేపీ జెండాను ఆవిష్కరించాను. పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపాను.
లోక్ సభలో రెండు సీట్ల నుంచి మొదలై ఎన్నో ఆటుపోట్లు, ఒడుదొడుకులు ఎదుర్కొని కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రస్థానంలో మూలస్తంభాలు కార్యకర్తలే. ప్రజల మనోభావాలు, ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తోంది కాబట్టే బీజేపీని మళ్ళీ మళ్ళీ ప్రజలు అధికార పీఠం ఎక్కిస్తున్నారు.
ఎన్డీయే ప్రభుత్వం కేంద్రం, రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి వివరించాలి. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు ముందుకు సాగాలి.
#BJP4ViksitBharat #BJPFoundationDay @BJP4Andhra@BJP4India
అనంతపురము నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్లమెంట్ సభ్యులు శ్రీ @RaghunandanraoM గారితో కలిసి పాల్గొన్నాను. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు. బీజేపీని ఆదరించి అఖండ విజయాలు అందిస్తున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు.
ఒకప్పుడు 2 సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ.. ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీనికి మూల కారణం సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే బీజేపీ నాయకులు.
కానీ.. కుటుంబ పార్టీల్లో చెట్టు పేరు చెప్పుకుని పబ్బం గడుపుకునే వారే ఎక్కువ. అందుకే దేశ ప్రజలు అలాంటి పార్టీలను దూరం పెట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు.
పార్టీని సమర్థంగా నడిపించడమే కాకుండా దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 2047 నాటికి 'వికసిత్ భారత్'ను సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ మహత్కార్యంలో మనమందరం భాగమవుదాం.
పార్టీ కోసం నిబద్ధతతో పని చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి.
#BJPFoundationDay2025 #BJP4ViksitBharat @BJP4Andhra@BJP4India@ArogyaAndhra
బీజీపీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ @JPNadda గారిని మర్యాదపూర్వకంగా కలిసాను.
ఏపీ లో వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు కార్యక్రమాలను, ముఖ్యంగా క్యాన్సర్ పరీక్షల పురోగతి గురించి వివరించాను. కనీసం రెండు బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సలను పటిష్టపరచడం కోసం సహకారం అందించాల్సిందిగా కోరాను. గ్రామ సచివాలయం పరిధిలో మంజూరైన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల శాశ్వత భవనాల నిర్మాణం కోసం 15 ఆర్థిక సంఘం, పీఎం-అభిమ్ నిధులను మంజూరు చేయాల్సిందిగా కోరాను.
గత వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో పూర్తి చేయలేక అరకొరగా వదిలేసిన వైద్య కళాశాలల నిర్మాణం కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి భవన నిర్మాణాలు పూర్తి చేయడానికి సహకారం అందించాల్సిందిగా కూడా అభ్యర్థించాను.
@BJP4Andhra@JaiTDP@JanaSenaParty
రాష్ట్రంలో రెండు, మూడు దశల్లో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అవసరాల మేరకు అందించడానికి నీతి అయోగ్ సానుకూలత వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో నీతి అయోగ్ సభ్యులు డాక్టర్శ్రీ కె.వినోద్ పాల్‌తో ఈ విషయమై చర్చలు జరిపాను. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల్ని సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రులను పటిష్టం చేయడానికి సాయం కోరగా డాక్టర్ పాల్ సానుకూలంగా స్పందించారు. జిల్లా ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకుల అభివృద్ధికి సాయంపై కూడా చర్చ జరిగింది. రాష్ట్రంలో 15 యాస్పిరేషనల్ బ్లాకుల్లో వైద్య సేవల అభివృద్ధికి కేంద్రం సాయంపై కూడా చర్చించాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్థానిక పరిస్థితుల దృష్ట్యా మరికొన్ని అదనపు బ్లాకులను యాస్పిరేషన్ బ్లాకులుగా గుర్తించాలని కోరాను.
జల్ జీవన్ మిషన్ ను ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సాగు నీటి పథకాలతో అనుసంధానం చేయాలని కోరగా, సంబంధిత అధికారులతో చర్చిస్తామని డాక్టర్ పాల్ హామీ ఇచ్చారు. నీతిఅయోగ్ సభ్యులు డాక్టర్ వినోద్ పాల్ గారిని రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించగా, ఆయన అంగీకరించారు.
విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక ‘వారధి’లో పాల్గొన్నాను. పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలసి వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించాను.
నా దృష్టికి వచ్చిన అర్జీలను పరిశీలించి, పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడాను. మరికొన్ని అర్జీలను ఆయా శాఖల కార్యాలయాలకు పంపే ఏర్పాట్లు చేయించాను. వాటిని పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను కోరాను.
#BJP4IND #bjp4andhra #AndhraPradesh
విజయవాడ భవానీపురంలోని దర్గా సెంటర్ వద్ద ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాను. అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను పరిశీలించాను. వరద బాధితులకు అందిస్తున్న మెడికల్ కిట్ల వివరాలు తెలుసుకున్నాను.
బాధితులతో మాట్లాడి మెడికల్కిట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాను. అలాగే ఊర్మిళా నగర్‌లోని చర్చ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను కూడా సందర్శించాను.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ధర్మవరం పట్టణంతోపాటు బత్తలపల్లి, తాడిమర్రిలో ఎడతెరిపి లేకుండా వాన పడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరుతున్నాను. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని నా కార్యాలయ సిబ్బందిని ఆదేశించాను. లోతట్టు ప్రాంతాల వారిని వేరే ప్రదేశానికి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోరుతున్నాను.
పారిశుద్ధ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించాను. పట్టణంలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరాను.
సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించాను.
వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశాను. తాగునీరు కలుషితం కాకుండా చూడటం, దోమల నివారణ చర్యలపై ఆదేశాలు ఇచ్చాను. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించాను.
డయేరియా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యు, మలేరియా, చికెన్‌గున్యా విషయంలోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. పారిశుద్ధ్యంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఏజన్సీ ప్రాంతాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సూచించాను.
#AndhraPradesh Health Minister Mr. @satyakumar_y Garu today visited the primary health center in Jaggayapet and personally spoke to the patients suffering from diarrhea and inquired about their well-being.
ధర్మవరం శాసనసభ్యునిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశాను. నా జీవితంలో మరిచిపోలేని ఘట్టంగా ఇది నిలిచిపోతుంది. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే దానికి ప్రధాన కారణం ధర్మవరం ప్రజలు. ఆశీర్వదించండి.. రుణం తీర్చుకుంటానని నేను చెప్పిన మాటలను నమ్మి నా వెంట నిలబడ్డారు.
దైవ బలం, ప్రజల ఆశీస్సులు నన్ను ఎమ్మెల్యేను, ఆపై మంత్రిని చేశాయి. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌కల్యాణ్‌గారి సారథ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాను.
Heartiest congratulations @satyakumar_y annayya on being elected as the Cabinet Minister of Andhra Pradesh. I wish you to take up higher positions politically.
ఈ క్రోధి నామ సంవత్సరం మీ జీవితంలో కొత్త కాంతులు వెల్లివిరియాలని, మీ ఇంట్లో నిత్య వసంతాలు పూయాలని, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలని, మీ కుటుంబాల్లో ఆనందాల ఉషోదయం రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ...
క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
#Ugadi#Ugadi2024#Happyugadi#Dharmavaram #AndhraPradesh
There was only one central educational institution, ‘Sanskrit Vidyapeeth’ in AP when state was bifurcated ..
After @narendramodi ji took over as PM … AP now has every prestigious institution of India👇
1. Indian Institute of Technology (IIT)
2. Indian Institute of Management (IIM)
3. National Institute of Technology (NIT)
4. Indian Institute of Info & Technology (IIIT) -2
5. Central Institute of Plastic Engineering and Technology (CIPET)
6. Indian Institute of Science & Education Research (IISER)
7. Society for Applied Microwave Electronics Engineering & Research
8. Indian Institute of Information Technology & Design Management (IIITDM)
9. National Institute of Ocean Technology (NIOT)
10. National Institute of Design (NID)
11. National Institute of Disaster Management (NIDM)
12. Central University
13. Tribal University
14. Agriculture University
15. Petroleum University
16. Maritime University
17. School of Planning and Architecture (SPA)
18. Indian Institute of Tourism & Travel Management (IITDM)
19. Culinary Institute
20. National Institute of Fashion Technology (NIFT)
21. All India Institute of Medical Sciences (AIIMS)
22. Seventeen Medical Colleges
23. Regional Ayurveda Research Institute
24. Seven ESI Hospitals
25. Indian Institute of Foreign Trade (IIFT)
26. Indian Institute of Packaging (IIP)
27. Indian Institute of Oceanography (IIO)
28. Four Deemed Universities
29. Regional Centre for Education (RCE - NCERT)
30. National Academy for Customs, Indirect Taxes and Narcotics (NACIN)
And the list goes on …
PM Modi stands with students and youth of AP by sanctioning and establishing educational institutions and training centres worth about Rs.50,000 crores in just 9 years.
#APWelcomesMODI
There was only one central educational institution, ‘Sanskrit Vidyapeeth’ in AP when state was bifurcated ..
After @narendramodi ji took over as PM … AP now has every prestigious institution of India👇
1. Indian Institute of Technology (IIT)
2. Indian Institute of Management (IIM)
3. National Institute of Technology (NIT)
4. Indian Institute of Info & Technology (IIIT) -2
5. Central Institute of Plastic Engineering and Technology (CIPET)
6. Indian Institute of Science & Education Research (IISER)
7. Society for Applied Microwave Electronics Engineering & Research
8. Indian Institute of Information Technology & Design Management (IIITDM)
9. National Institute of Ocean Technology (NIOT)
10. National Institute of Design (NID)
11. National Institute of Disaster Management (NIDM)
12. Central University
13. Tribal University
14. Agriculture University
15. Petroleum University
16. Maritime University
17. School of Planning and Architecture (SPA)
18. Indian Institute of Tourism & Travel Management (IITDM)
19. Culinary Institute
20. National Institute of Fashion Technology (NIFT)
21. All India Institute of Medical Sciences (AIIMS)
22. Seventeen Medical Colleges
23. Regional Ayurveda Research Institute
24. Seven ESI Hospitals
25. Indian Institute of Foreign Trade (IIFT)
26. Indian Institute of Packaging (IIP)
27. Indian Institute of Oceanography (IIO)
28. Four Deemed Universities
29. Regional Centre for Education (RCE - NCERT)
30. National Academy for Customs, Indirect Taxes and Narcotics (NACIN)
And the list goes on …
PM Modi stands with students and youth of AP by sanctioning and establishing educational institutions and training centres worth about Rs.50,000 crores in just 9 years.
#APWelcomesMODI
The BJP never makes false promises practising election politics. The BJP is the only party that submits progress report card on the fulfilment of the promises made to the people.
భారతీయ జనతా పార్టీ అప్పుడు ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్న విషయంలో ఒకే వైఖరి అవలంబిస్తోంది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా సామాజిక సంక్షేమ పథకాలు సమాజంలో నిరుపేదలకు చేరాలన్నదే మోదీ ధ్యేయం.