@satyakumar_y garu "జానీ లో నరాజు గాకురా అన్నయ్య" పాటకు స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించిన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి Satya Kumar Yadav గారు. ప్రజలతో మమేకమై, ఉత్సాహంగా నృత్యం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 👏💃
#SatyaKumarYadav#HealthMinisterAP@TrendPSPK
Warm birthday greetings to BJP National President Shri @NitinNabin Ji.
Your dedication towards strengthening the organisation and your commitment to the vision of a strong, developed and self-reliant India continue to inspire countless karyakartas across the nation.
May this day be filled with happiness and may you be blessed with great health, success, and prosperity.
ధర్మవరం గీతా నగర్లోని బ్యాడ్మింటన్ కోర్టులను సందర్శించాను. క్రీడాకారులతో మాట్లాడాను. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందువల్ల యువత క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ ముందుకు సాగాలి. ఇలాంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి.
#Dharmavaram#Sports
#Badminton
#AndhraPradesh
#bjp4andhra
గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లోని నాట్కో క్యాన్సర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక PET-CT యంత్రాన్ని, కేంద్ర మంత్రి శ్రీ @PemmasaniOnX గారు, స్థానిక శాసన సభ్యులు శ్రీ మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారితో కలిసి ప్రారంభించాను.
రూ. 18 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక PET-CT సదుపాయం ద్వారా క్యాన్సర్ నిర్ధారణ, అత్యాధునిక వైద్య సేవలు పేద, మధ్యతరగతి ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. రూ.20 వేలకు పైగా ఖర్చయ్యే స్కాన్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి.
#PETCT
#GGHGuntur
#Healthcare
#AndhraPradesh @BJP4Andhra@JaiTDP
ధర్మవరానికి చెందిన పద్మావతి గారి నేత్రదానం ఇద్దరి జీవితాల్లో కొత్త ఆశను నింపింది. తన మరణంలోనూ మరొకరికి చూపునివ్వాలనే ఆమె సంకల్పం, అందుకు అంగీకరించిన కుటుంబ సభ్యుల నిర్ణయం ఎంతో అభినందనీయం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఈ గొప్ప కార్యం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షిస్తున్నాను.
నేత్రదానం చేద్దాం - మరో ఇద్దరి ప్రపంచాన్ని వెలిగిద్దాం.
#Netradanam #AndhraPradesh #Dharmavaram
#EyeDonation #Inspiration @BJP4Andhra@ArogyaAndhra
ధర్మవరం పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో వ్రత మండపాన్ని ప్రారంభించాను.
స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాను. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాను.
#Dharmavaram#ChennakesavaSwamy#VrathaMandapam#Spirituality
#AndhraPradesh @BJP4Andhra
ఈ సందర్భంగా మంత్రివర్గ సహచరులతో కలిసి నాదెండ్ల భాస్కరరావు గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించాము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
హైదరాబాద్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు, సోదరులు శ్రీ Nadendla Manohar గారిని కలిసి, వారి తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నాదెండ్ల భాస్కరరావు గారి మరణంపై నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను.
సింగపూర్ పర్యటనలో భాగంగా లిటిల్ ఇండియాలోని నలన్ ప్రాంతాన్ని సహచర మంత్రులతో కలిసి సందర్శించాను. సింగపూర్ హోం వ్యవహారాలు, జాతీయ భద్రతా సమన్వయ శాఖ మంత్రి శ్రీ కే.షణ్ముగం గారితో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నాము. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, పరిపాలనా అంశాలు, ఇతర కీలక విషయాలపై చర్చించాము.
#SingaporeVisit #KShanmugam #LittleIndia #Governance #AndhraPradesh @BJP4Andhra
A grounded leader who doesn’t just speak about development but works shoulder-to-shoulder with people on the ground. 👏
Kudos to @satyakumar_y Ji for embodying the true spirit of participatory governance and sustainable rural development.
మంత్రి @satyakumar_y గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు
రేపటి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల సందర్బంగా మెగా రక్తదానం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే
మంత్రికి ఘన సన్మానం చేసిన ఎమ్మెల్యే, యాదవ్ సోదరులు
కళ్యాణదుర్గం పట్టణానికి విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు, టీడీపీ, కూటమి నాయకులు..రేపటి రోజున విజనరి లీడర్, ప్రపంచ మేధావి, అభివృద్ధి ప్రధాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్బంగా ప్రజావేదిక నందు ఘనంగా వేడుకలతో పాటు మెగా రక్త దాన శిబిరం కోసం చేసిన ఏర్పాట్లను, ప్రజావేదికను మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి చూపించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు. ఇంట్లో భోజనం అనంతరం మంత్రి గారికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు ఘనంగా సన్మానం చేయగా, యాదవ సోదరులు మంత్రికి సన్మానం చేయటం జరిగింది..
@ncbn@PawanKalyan@naralokesh@JaiTDP
#SatyaKumarYadav #AmilineniSurendrababu #MLAKalyanadurgam #kalyanadurgam #AmilineniforPeople #Ananthapur #TDP #Janasena #NDAkutami #AndhraPradesh
రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో సూర్య సేవా సమితి, సర్కిల్ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్.ఓ ప్లాంట్ను ప్రారంభించాను.
హాస్పిటల్కు వచ్చే రోగులు, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడానికి ఈ ప్లాంట్ దోహదపడుతుంది. గ్రామీణ అభివృద్ధి, ప్రజల ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టి మా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
#ROPlant
#DrinkingWater
#PublicHealth
#Rayadurgam
#AndhraPradesh @BJP4Andhra
అనంతపురము జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం, గోనబావి గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ ఆశ్రమ పాఠశాల భవన పునర్నిర్మాణ పనులను ప్రారంభించాను. ఇందుకోసం 12 కోట్ల రూపాయలను మా కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వసతులను మెరుగుపరచడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుంది.
నూతన పాఠశాల భవనం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
#RuralDevelopment
#EducationForAll
#Rayadurgam
#AndhraPradesh @BJP4Andhra
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (Working President) బాధ్యతలు చేపడుతున్న సోదరులు శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఒక నాయకుడి వారసుడిగా మాత్రమే కాకుండా.. క్షేత్రస్థాయిలో పాదయాత్రల ద్వారా, కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుంటూ లోకేష్ గారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా సమస్యలపై ఆయన పోరాటం, యువతను నడిపిస్తున్న తీరు అమోఘం.
అలాగే, టీడీపీలో వివిధ నూతన బాధ్యతలు చేపడుతున్న నాయకులందరికీ అభినందనలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో, రాష్ట్ర అభివృద్ధిలో వీరందరూ చురుకైన పాత్ర పోషిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
@BJP4Andhra@JaiTDP
భవిష్యత్తు డాక్టర్లకు స్వాగతం. ఇంటర్ బైపిసి ఫలితాల్లో అసాధారణ ప్రతిభ చూపించిన ధర్మవరం నియోజకవర్గ ప్రతిభావంతులకు అభినందనలు.
కూలీల బిడ్డలైనా, కటిక పేదరికంలోనూ పట్టుదలతో చదివిన మాధవి (985), లక్ష్మి (982) ఇంటర్ ఫలితాల్లో సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. డాక్టర్లు కావాలన్న మీ లక్ష్యానికి నా పూర్తి మద్దతు ఉంటుంది.
#Dharmavaram #EducationFirst #Inspiration #SuccessStory #APInterResults
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాళ్లపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. అనంతపురం జీజీహెచ్ లో ఉన్న ఒకరు, కదిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 26 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాను. బాధితులకు మా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది.
#SathyaSaiDistrict #Kadiri #AndhraPradesh @BJP4Andhra
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నాను.
“Nation First – Party Next – Self Last” అనే భావనతో ప్రతి కార్యకర్త పని చేయాలి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి ఏకాత్మ భావంతో, దేశ సేవనే పరమావధిగా తీసుకుని ముందుకు సాగుతోంది.
1985లోనే మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు, కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించే రోజు వస్తుందని చెప్పారు. ఆ మాటలు నేటి రాజకీయ పరిణామాల్లో నిజమయ్యాయి.
దేశం, సమాజం కోసం కట్టుబడి పనిచేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలి. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
#BJP
#Prashikshana
#NationFirst
#Dharmavaram
#AndhraPradesh @BJP4Andhra
అనంతపురము జిల్లా అభివృద్ధిలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న RDT(రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్)కి కేంద్ర ప్రభుత్వం ఇటీవల FCRA రెన్యూవల్ అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో సంస్థ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారిని మర్యాపూర్వకంగా కలిశాను.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు, గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ @AmitShah గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి చొరవతో ఆర్డీటీకి ఈ అనుమతులు లభించాయి. అనంత వాసులకు మెరుగైన సేవలందించడంలో ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది.
ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి ప్రసాద్ గారు, శ్రీ @ParitalaSriram గారు, బీజేపీ నాయకులు శ్రీ సందిరెడ్డి శ్రీనివాస్ గారు, శ్రీ ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి గారు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
#Anantapur #RDT #AndhraPradesh #Development #FCRA @BJP4Andhra@JaiTDP@JanaSenaParty