Panja Re Release Trailer will be Officially Launched by our fan boys Sujeeth & Harish Shankar garu on August 23rd at 11.07AM🔥
More celebrites will be launching our trailer ❤️
#Panja4K
విధ్వంసం కాదు… నిర్మాణమే యువత లక్ష్యం కావాలి
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రపై బ��మైన సందేశాన్ని ఇచ్చారు.
“యువత కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు… భారతదేశ ప్రస్తుత బలం కూడా. ప్రశ్నించండి… కానీ నిజానిజాలు తెలుసుకుని ప్రశ్నించండి. మార్పు కోసం పోరాడండి… కానీ ఆ పోరాటం విధ్వంసం వైపు కాకుండా నిర్మాణం వైపు నడవాలి. డబ్బుకు మీ ఓటును అమ్ముకోకండి… తప్పుడు సమాచారానికి మీ ఆలోచనను అమ్ముకోకండి… ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి” అని యువతకు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో వేగంగా వచ్చే ప్రతి సమాచారం నిజం కాదని, ఏ విషయాన్నైనా నమ్మే ముందు ఆలోచించాలని, అనుసరించే ముందు ప్రశ్నించాలని, నిర్ణయం తీసుకునే ముందు నిజానిజాల���ు పరిశీలించాలని సూచించారు. బలమైన ప్రజాస్వామ్యానికి గుడ్డిగా అనుసరించేవారు కాదు… ఆలోచించే, ప్రశ్నించే, పరిష్కారాలు చూపే బాధ్యతాయుతమైన యువత అవసరమని స్పష్టం చేశారు.
భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల త్యాగాల స్ఫూర్తితో యువత తమ శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగించాలని కోరారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత మాత్రమే కాదు… అవకాశాలను సృష్టించే యువత ��ావాలి. దేశాన్ని విమర్శించడమే కాదు… దేశాన్ని ముందుకు నడిపించే యువత కావాలి అని పేర్కొన్నారు.
అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. అడవితల్లి బాట కింద ₹2,078 కోట్లతో 2,310 కి.మీ. గిరిజన రహదారులు, ₹8 వేల కోట్లతో మెగా వాటర్ గ్రిడ్, ₹9,355 కోట్లతో 6,500 గ్రామాలకు తాగునీరు, రైతు సంక్షేమం, అటవీ పరిరక్షణ, అమరావతి అభివృద్ధి, పోలవరం పూర్తి వంటి కార్యక్రమాలను మన NDA ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తోందని వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలోనూ దాదాపు ₹1,000 కోట్లతో కీలక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
“సంక్షేమం ద్వారా ప్రజలకు ఈ రోజు భరోసా కల్పిస్తున్నాం… అభివృద్ధ�� ద్వారా రేపటి అవకాశాలను నిర్మిస్తున్నాం. ఈ తరం చేతిలో ఉన్నది కేవలం ఒక జ్యోతి కాదు… భారతదేశ భవిష్యత్తు. ఆ జ్యోతిని మీ ఆలోచనలతో, ప్రతిభతో, కష్టంతో, నిజాయితీతో మరింత ప్రకాశవంతం చేయండి” అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.
#IndependenceDayIndia
భా���తదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
గ్రామ గ్రామాన జాతీయ జెండాను ఎగురవేసి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గౌరవప్రదంగా నిర్వహించాలి.
మీ మీ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము.
జై హింద్ 🇮🇳
#IndependenceDay #80thIndependenceDay
NDA కూటమి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు జనసేన - తెలుగుదేశం - బీజేపీ పార్టీల తరపున ప్రత్యేక విజ్ఞప్తి. కూటమి అభిమానుల ముసుగులో కూటమి స్ఫూర్తిని దెబ్బ తీసే వారిపట్ల అప్రమత్తంగా ఉండండి.
@JaiTDP@BJP4Andhra#StopSocialMediaAbuse
కరీంనగర్ గడ్డ నుంచి ఎ��తోమంది గొప్ప నాయకులు వచ్చారు…కానీ కరీంనగర్‌కు దక్కింది ఏంటి?
నాయకులు ఎదిగారు…కానీ కరీంనగర్ ఎందుకు ఎదగలేదు?
ఇక మాటలు కాదు…కరీంనగర్ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.
- కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం జనసేన ఆత్మీయ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఇంచార్జి శ్రీ @JSPshankargoud గారు
#JSPChaloKarimnagar #JanaSenaTelangana #JSPForTelangana
Remembering Shri Khudiram Bose Ji on his martyrdom anniversary.
At just 18 years of age, Shri Khudiram Bose Ji embraced the ultimate sacrifice for the freedom of Bharat, standing fearlessly against British colonial rule. His courage, unwavering patriotism and indomitable spirit made him one of the youngest and most inspiring martyrs of India’s freedom struggle.
He did not live to see a free India, but his sacrifice became a part of the foundation on which our freedom was built. His life reminds every generation that the love for the Motherland knows no age and that courage can give a young life an eternal place in history.
My humble tributes to this brave son of Bharat, whose name will forever inspire the Nation’s youth with courage, patriotism and devotion to the Motherland.
Jai Hind!
- @PawanKalyan
#KhudiramBose
ఏళ్లుగా రహదారులు, రవాణా సౌకర్యాల కోసం ఎదురుచూసిన గిరిజన గ్రామాల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఆ మార్పును స్వయంగా చూస్తూ. తమ గ్రామాలకు చేరుతున్న అభివృద్ధిని చూసి గిరిజనులు వ్యక్తం చేస్తున్న ఆనందమే ఈ దృశ్యాలకు నిదర్శనం.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో, మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, కనెక���టివిటీ మెరుగుదల పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇవి కేవలం రోడ్లు కాదు..ఆసుపత్రికి చేరువ చేసే మార్గాలు..పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే బాటలు..రైతుల పంటలకు మార్కెట్‌ను చేరువ చేసే దారులు..గిరిజన గ్రామాలను అవకాశాలతో అనుసంధానించే వంతెనలు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన మార్పు ఇప్పుడు కళ్లముందు కనిపిస్తుంటే..వారి మాటల్లో వినిపిస్తున్న ఆనందం ఈ అభివృద్ధికి నిజమైన కొలమానం.
#WorldTribalDay #AdaviThalliBaata #PawanKalyanAneNenu
ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ బస్సా అన్నవారికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమే సమాధానం
* కూటమిలో మూడు పార్టీలు ఉండడంతోనే ��ంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం
* ఈ అభివృద్ధి కోసమే 2024 ఎన్నికల్లో తపనపడ్డాను
* దేశం కోసం సెలవు తీసుకోకుండా కష్టపడుతున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి గురించి ఇష్టానుసారం మాట్లాడడం బాధించింది
* మూడవసారి ప్రధానిగా శ్రీ మోదీ గారు దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్తున్నారు
* శ్రీ మోదీ గారికి వెనుక బలంగా నిలబడదాం
* భోగాపురంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#BhogapuramAirport
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
విశాఖ:
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తన పుట్టినరోజు(ఆగస్టు 1)ను పురస్కరించుకుని విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో ఒక ఆసియా ఏనుగు, రాయల్ బెంగాల్ టైగర్‌ను ఒక ఏడాది పాటు దత్తత తీసుకున్నారు
ఏనుగుకు రూ.4.30 లక్షలు, పులికి రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.6.30 లక్షలను వాటి పోషణ, సంరక్షణ, వైద్యం నిమిత్తం జూ అధికారులకు విరాళంగా అందజేశారు
ఈ చొరవ వన్యప్రాణుల సంరక్షణకు ఎంతో దోహదపడుతుందని జూ క్యూరేటర్ జి.మంగమ్మ హర్షం వ్యక్తం చేశారు
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక అడుగు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం.
ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గ్రోత్ ఇంజన్. విమాన విడిభాగాల తయారీ, మరమ్మత్తు కేంద్రాలు, శిక్షణ సంస్థలతో వేలాది ఉపాధి అవకాశాలు.
#AndhraPradesh#BhogapuramAirport#AlluriSitaramaRajuAirport
నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టి.ఆర్.) పరిధిలోని గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో పులి మరణించిన ఉదంతం నా దృష్టికి వచ్చింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యం. అలాంటిది ఒక పులి ప్రాణం కోల్పోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. మన అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేస��తోంది.
ఈ మరణం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయడానికి సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరపాలని ఎన్.ఎస్.టి.ఆర్. ఫీల్డ్ డైరెక్టర్‌ను ఆదేశించాను. అది సహజ మరణమా? లేక వేటగాళ్ల దుశ్చర్య, విషప్రయోగం వంటి మానవ ప్రమేయం ఏదైనా ఉందా? అనే కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలి. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్మార్��ం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించాలి.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను తక్షణమే పెంచాలని, క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించాను. ఆంధ్రప్రదేశ్ అటవీ సంపదను, ఇక్కడి జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడం మనందరి కర్తవ్యం. కూటమి ప్రభుత్వం అడవుల పరిరక్షణకు, వన్యప్రాణి రక్షణకు కట్టుబడి ఉంది. ఈ ఘటనలో ఎవరిదైనా తప్పు ఉన్నట్లు తేలితే చట్టప్రకారం అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయి.
- @PawanKalyan
@moefcc @APFDOfficial @HANUMAN_APGOV @PIB_India @IPR_AP @pibvijayawada
భోగాపురం మండలం రెల్లిపేట ��్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారు
భోగాపురం మండలం రెల్లిపేట గ్రామంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గారు ఈరోజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే లోకం మాధవి గారు, గౌరవ ముఖ్యమ��త్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్లను సకాలంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేస్తూ వారి జీవితాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.
అనంతరం లబ్ధిదారులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి మరియు మెరుగైన మౌలిక సదుపాయ��ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
@janasenaparty @pawankalyan @ncbn @jspshatagniteam @jspveeramahila @apdeputycmo
#LokamMadhavi #pensionpampini #JanasenaParty #IdhimanchiPrabhutvam #NellimarlaConstituency
‘పరిరక్షణ నిల్వ’ ప్రాంతంగా కొండకర్ల ఆవ
•చిత్తడి నేలల ప���ిరక్షణలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
•పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశం
•ప్రజా ప్రయోజనాలు దెబ్బ తినకుండా చిత్తడి నేలల సంరక్షణ చర్యలు
•చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం
•సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పరిరక్షణ చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణను బాధ్యతగా స్వీకరించి, వాటి పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను ‘పరిరక్షణ నిల్వ’ (కన్జర్వేషన్ రిజర్వ్) ప్రాంతంగా గుర్తించే ప్రక్రియలో ముందడుగు వేసినట్టు పేర్కొన్నారు. జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి, అక్కడ ఎకో-టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కొండకర్ల ఆవ చిత్తడి నేలను కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించేందుకు అవసరమైన నో అబ్జెక్షన�� సర్టిఫికేట్ ( NOC) జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అటవీశాఖ ప్రతిపాదనలకు జలవనరుల శాఖ కూడా ఆమోదం తెలిపింది. సాగునీరు, జలాశయ నిర్వహణ, హైడ్రాలిక్ వ్యవస్థలు మరియు ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాలకు ఎటు��ంటి భంగం కలగకుండా తగిన రక్షణ చర్యలతో ఈ అనుమతి మంజూరైంది.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శాస్త్రీయ అధ్యయనాలు మరియు క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించాం. వాటిని నోటిపై చేయాల్సిన అవసరం ఉంది. తొలి దశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ అనుమతుల ప్రక్రియ తుది దశలో ఉంది. చిత్తడి నేలలు అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయాలని, వాటి పరిరక్షణ ద్వార��� భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుంది. అలాగే స్థానిక ప్రజల జీవనోపాధుల మెరుగుదలకు కూడా ఇవి దోహదపడతాయి. అందువల్ల చిత్తడి నేలల పరిరక్షణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తోంది. అర్హత కలిగిన అన్ని చిత్తడి నేలలను నోటిఫై చేసే ప్రక్రియను సంబంధిత శాఖల సమన్వయంతో వేగవంతం చేయాలి. సంయుక్త సర్వేలు పూర్తి చేసి, చట్టపరమ���న అనుమతులను నిర్దిష్ట కాలవ్యవధిలో పొందాలి. అదే సమయంలో ప్రజా ప్రయోజన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ��ర్యలు చేపట్టాలి.
చిత్తడి నేలలపై జరుగుతున్న ఆక్రమణలు, విధ్వంసక చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో చిత్తడి నేలల పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. కొండకర్ల ఆవ అనేక రకాల వలస మరియు స్థానిక పక్షులకు ఆవాసంగా నిలుస్తోంది. జలవనరుల శాఖ సమన్వయంతో ఎకో-టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేసి, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాల”ని అటవీశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.