I’m happy to share that I’m recovering well from the necessary abdominal surgery I recently had.
A big thank you to all my well-wishers for your kind thoughts and support.
I am shocked to know about the fire accident at a school in Singapore in which @PawanKalyan garu's son, Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time. Wishing him a swift and complete recovery.
RedBook Penal Code (RPC) చెలాయించడం చాలు – ఇకనైనా మహిళా భద్రతపై శ్రద్ధ పెట్టండి!
మహిళల రక్షణ హామీలు మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. FIRలు సరిగ్గా నమోదు చేసి, న్యాయం అందించండి.
మహిళా దినోత్సవం నాడు కూడా భద్రత కోరాల్సిన దుస్థితి… RedBook Penal Code (RPC) అమలు చేస్తున్న రాష్ట్ర పాలన ఎంత దిగజారిందో చెప్పే సాక్ష్యం!
#WomenSafety #JusticeForWomen #RespectWomen #APLawAndOrder
రాష్ట్రంలోని కోట్లాది మంది అక్కచెల్లెమ్మలకి ఐదేళ్లు అన్నీ తానై సోదరుడిలా సాయపడిన వైయస్ జగన్ గారు
ప్రతి స్కీమ్‌లోనూ ఆడబిడ్డలకి అగ్రతాంబూలం.. రాజకీయంగానూ సముచిత స్థానమిచ్చి గౌరవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కచెల్లెమ్మలకి ఈ వీడియో అంకితం.
Happy International Women’s Day ! 💫
#YSJaganEmpowersWomen
#WomensDay2025
#InternationalWomensDay
#YSJaganForWomenSafety
#YSRCPForWomen
1. @ncbn గారూ, తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది.కొనేవాడులేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టుగా యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు.
2. తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి, ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖరాయడం ఏంటి? కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖరాయడం ఏంటి? మీరు బాధ్యతను వేరేవాళ్లమీద నెట్టడం ఏంటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటిసాకులు వెతుక్కోవడం ఏంటి? ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు.
3. మేం 2021లో అంటే 5ఏళ్ల కిందట, పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ.1లక్ష ఉన్నప్పుడు, సాధారణంగా అప్పుడు దిగుబడి ఎకరాకు 20 క్వింటాళ్లుపైన ఉన్నప్పుడు అప్పట్లోనే 5 ఏళ్ల కిందట ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7,000. గతంలో మీరెప్పుడూ మిర్చికి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు. 5ఏళ్ల కిందట, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన పంటలకే కాకుండా, ప్రకటించని పంటలకూ, రాష్ట్రం మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటించి, పోటీవాతావరణం కల్పించి ధరలు పడిపోకుండా అడ్డుకోవడమేకాదు, ధరలు పెరిగేట్టుగా చూశాం.
4. ధాన్యం కొనుగోళ్లకు రూ.65,000 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.7,800 కోట్లు ఖర్చుచేసి రైతుకు అండగా నిలిచాం. మరి ఈ ధరలు ప్రకటించి అప్పటికీ, ఇప్పటికీ 5ఏళ్లు అయ్యింది. 5 ఏళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా? అప్పట్లో మిర్చి సాగుకు ఎకరాకు రూ.1లక్ష అయితే, ఇప్పుడు రూ.లక్షన్నర అయిన మాట వాస్తవం కాదా? మీరుకూడా మాలాగే ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయలేదు?
5. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌చౌహాన్ సింగ్‌కు రాసిన లేఖలో మా హయాంలో మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని మీరే చెప్పారు. మీరు రాసిన లేఖ ప్రకారమే మా హయాంలో మిర్చికి మోడల్ ధర రూ.20,000 ఉంటే, గరిష్ట ధర రూ.27,000 పలికింది వాస్తవం కాదా?
6. మిర్చిరైతుల సంక్షోభంపై ఈ జనవరిలో ఉద్యానవనశాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా, మీరేమైనా పట్టించుకున్నారా? మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని, జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ, మిర్చి కొనుగోళ్లతో సంబంధంలేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటారా? గతంలో ఎప్పుడైనా, ఏ రాష్ట్రంలోనైనా నాఫెడ్ మిర్చిని కొనుగోలు చేసిందా? మీచేతిలో ఉన్న మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయకుండా, ఎప్పుడూ మిర్చి కొనుగోళ్లు చేయని నాఫెడ్ కొనాలంటూ లేఖ రాయడం రైతులను నిలువునా మోసం చేయడం, మభ్యపెట్టడం కాదా?
7. మిర్చిరైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి 15న, మీరు పాల్గొన్న మ్యూజికల్‌నైట్‌కు ఎన్నికలకోడ్ అడ్డం రాలేదా? నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా? పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడంలేదు, నిన్నటి కార్యక్రమంలో పలానావారికి ఓటు వేయమనికూడా చెప్పలేదు, కనీసం మైక్‌లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా?
8. మీ హయాంలో పంటలకు కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? పత్తి, పెసర, మినుము, కంది, టమోటా, మిర్చి, మొన్నటి ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీసమద్దతు ధరలు లభించక మీరే వారిని సంక్షోభంలో నెట్టిన మాట వాస్తవం కాదా?
9. రైతుకోసం మేం సృష్టించిన మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలు, ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా నిర్వీర్యం, సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ నిర్వీర్యం, ఆర్బీకేల్లో కనీస మద్దతు ధరల పోస్టర్లు అతికించి, CM APP ద్వారా కొనుగోలు చేసే విధానం నిర్వీర్యం, నాణ్యతను ధృవీకరిస్తూ ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తూ, బ్లాక్‌లో అమ్మే పరిస్థితిని నిరోధిస్తూ చేసిన కార్యక్రమం నిర్వీర్యం, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ ల్యాబుల వ్యవస్థ నిర్వీర్యం, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సెపరేటు కాల్‌సెంటర్, టోల్ ఫ్రీ నంబరును నిర్వహించే వ్యవస్థ నిర్వీర్యం, ఆర్బీకేల్లో కియోస్క్‌లు పెట్టి, రైతులకు తోడుగా నిలిచే విధానం నిర్వీర్యం, సున్నావడ్డీ నిర్వీర్యం, పెట్టుబడి సహాయం నిర్వీర్యం, ధాన్యం కొనుగోలు కాకుండా ఇతర పంటల కొనుగోలుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి నిర్వీర్యం.. మొత్తంగా ఇలా వ్యవసాయరంగంలోని మేం తీసుకు వచ్చిన విప్లవాత్మక వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యంచేశారు. వ్యవసాయం దండగ అన్న మీ ఆలోచన, మైండ్ సెట్ మారలేదు చంద్రబాబుగారు. ఇప్పుడు కూడా కలరింగ్ ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
10. మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేదిలేదు. నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్నికేసులు పెట్టినా రైతులకోసం, ప్రజలకోసం నిలబడతాను. చంద్రబాబుగారూ… ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోండి. ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా, వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి.
Suffering from jaundice from last 2 years . After 2 years of using medication, found the root cause as blood getting broken.liver got failed completely by the time we identified this. Liver needs to be transplanted pno:78937 58485
@naralokesh@satyakumar_y@PawanKalyan
1.@ncbn గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?
2.అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?
3.చంద్రబాబుగారూ… ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయి. వైయస్సార్సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచంలేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…?
4.ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కాని, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు మేము పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీకూడా అయిపోయింది. ఒక్కపైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్‌లు పెట్టుకున్నా… ఎప్పుడు ఇస్తామో చెప్పడంలేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు, ఆర్బీకేలను నిర్వీర్యంచేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు.
5.ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే, ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాంలే. ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదు.
6.చంద్రబాబుగారూ… రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుంది.
.@ncbn గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.
నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?
ఆడబిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్?
దీపం:
ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్?
తల్లికి వందనం:
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్?
అన్నదాత:
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్?
ఉచిత బస్సు ప్రయాణం:
రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు.
యువగళం:
రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్
50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్.
నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?
ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు.
నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు.
#WeStandForTruth
#WeAreWithYSRCPSM
We are waging a war against a demonic yellow media and it’s unethical social media. In this battle illegal detentions, undue harassment and false cases are the order of the day . I am with you in each of these battles, truth alone shall prevail.
#WeStandForTruth
#WeAreWithYSRCPSM
కష్టాలు కొత్తేం కాదు..
గతంలో ఉన్నాయి..
ఇప్పుడు ఉన్నాయి...
భవిష్యత్తులో కూడా ఉంటాయి.
ఎన్నో కష్టాలని, బాధల్ని ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మన వైస్సార్సీపీ.
నిలబడతాం..
తలపడతాం...
పోరాడుతాం....
మళ్ళీ గెలుస్తాం....
టీడీపీకి బుద్ధి చెపుదాం.
@YSRCParty
తిరుమల పవిత్రతను,
స్వామివారి ప్రసాదం విశిష్టతను,
వెంకటేశ్వరస్వామి వైభవాన్ని,
టీటీడీ పేరు ప్రఖ్యాతులను,
వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,
రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్సీపీ పిలుపునిస్తోంది.