రూ. లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు, మరోవైపు రైతులకు లక్ష మోసాలు
@ncbn గారూ... రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ, మీరు చేస్తున్నవి డ్రామాలు, అంకెలగారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం మీకు మాత్రమే సాధ్యం.
రైతులమీద మీ ప్రేమ, మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల మీ పాలనే పలుమార్లు రుజువు చేసింది. హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే, రోజూ ధర్నాలు చేస్తే మీరు ఏరోజైనా పట్టించుకున్నారా? మా ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటలబీమాను తీసివేసి రైతుల వెన్నువిరిచిన మాట వాస్తవం కాదా?
సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యంచేసి, రైతుల నడ్డివిరిచారు. మీరు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు తప్ప, రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?
తీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే, మీరు వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఓ పక్క రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు మీరే అడ్డుతగులుతున్నారు. మరొపక్క ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే దాదాపుగా 7-8 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000లు ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు.
ఇక హార్టికల్చర్ హబ్ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబుగారూ, మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలుపెట్టండి.
Heartiest congratulations to our Indian women’s hockey team on a historic Asian Games triumph. Defeating defending champions China 1–0 ending a 44-year wait for gold is a moment of immense pride for the country. The team’s resilience in defence, crowned by Savita Punia’s crucial penalty-stroke save, was exceptional. I am happy to learn that this victory also secures India a direct place at the 2028 Los Angeles Olympics. We are proud of our players and wish them continued success.
@TheHockeyIndia@savitahockey
``నిరుపేదలకు పట్టెడన్నం దొరికేలా చేయడం ప్రభుత్వ ధర్మం.. అందుకు ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడకూడదు`` అని చెప్పిన ప్రజానేత దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
#YSRForever
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల విద్యార్థులకు కూడా ఉన్నత విద్యకు అవకాశం కల్పించి, డబ్బు లేక చదువు ఆగిపోకుండా అండగా నిలిచారు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. పేద కుటుంబాల్లో పుట్టిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేలా విద్యకు భరోసా కల్పించారు మహానేత రాజన్న.
#YSRForever
“Red Book Lokesh”, enough of your empty challenges about the time and place. I have already tweeted, addressed the media and raised serious questions. Do you have the courage to answer them and face the facts? Stop hiding behind women officials and making them speak for you. End this loud, cowardly political theatre. Our party leaders are ready to come to your residence or TDP office for a democratic debate. Name the time. Dare to face them and answer!
@naralokesh
Nara Lokesh’s photo festival starts again! Lights, camera, credit-grabbing action! The DSR Group spent Rs 13.41 crore from its CSR funds to renovate the school. Lokesh entered only for the climax, armed with scissors, cameras and a rehearsed speech, to pocket borrowed glory. Their money, their work, his blockbuster publicity!
@naralokesh should remember Y. S. Jagan’s revolutionary Nadu-Nedu scheme, which transformed thousands of government schools with modern classrooms and better infrastructure. Jagan changed schools and children’s futures; Lokesh merely changes poses before the camera. This is the coalition government’s political model: others lay the foundation, while Lokesh arrives to unveil the plaque. No vision, no contribution, no achievement, only endless publicity. Jagan delivered an educational revolution; Lokesh delivers ribbon-cutting comedy and shameless political theatre!
What a golden week for Indian sports!
From hitting historic bullseye to sweeping continental championships, our champions have filled our hearts with immense pride:
Team India Women's Cricket Team, dominating the field with a flawless campaign to clinch the #WomensAsiaCup crown.
Dhiraj Bommadevara, making history as the first Indian male recurve archer to win a World Cup!
Junior Men's & Women's Hockey Teams, for winning their respective AHF Junior Asia Cup 2026 trophies with sheer grit.
Your relentless passion and hard work inspire millions. Wishing many more such victories in the future!
@BCCIWomen@BommadevaraD@TheHockeyIndia
ఈ రోజు సింగరాయకొండలో డా. ఆదిమూలపు సురేష్ గారి క్యాంపు కార్యాలయం లో మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్. శ్రీ ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగినది.
ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, టౌన్ అధ్యక్షులు, ముస్లిం మైనార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
అమెరికా, ఓర్లాండోలో ఘనంగా వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమం..వైయస్ఆర్ సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్న ప్రవాసాంధ్రులు
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైయస్ఆర్ సీపీ అభిమానులు, ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైయస్ఆర్ సీపీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ చల్లా మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు వైయస్ఆర్ ప్రభుత్వం అందించిన అండను వివరించారు. వైయస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రవాసాంధ్రులు వైయస్ఆర్ సీపీని బలోపేతం చేయాలని, వైయస్ జగన్మోహన్రెడ్డి గారిని మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ గత పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో వైయస్ఆర్ సంక్షేమ వారసత్వాన్ని కొనసాగించారని పేర్కొన్నారు.
వైయస్ఆర్ విశ్వసనీయత, నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు ఉందని రత్నాకర్ పండుగాయల అన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడిగా వైయస్ఆర్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని గుర్తు చేశారు. తండ్రి ని మించిన తనయుడు, జగన్ అన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడం మన ఒకేఒక్క లక్ష్యం అని చెప్పారు.
డా. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ వైద్య రంగానికి అందించిన ప్రాధాన్యతను వివరించారు. ముఖ్యంగా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా ఆర్థిక స్థోమత లేని అనేక కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందేలా చేసిన ఘనత వైయస్ఆర్ కు దక్కుతుందని పేర్కొన్నారు.
డా. కొండా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించారు. పేద కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచే అనేక కార్యక్రమాలను వైయస్ఆర్ అమలు చేశారని అన్నారు. ఆ పథకాల ద్వారా తమ జీవితాలు మారిన అనుభవాలను అనేక మంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రవాసాంధ్రులు వైయస్ఆర్ హయాంలో తమ కుటుంబాలకు లభించిన ప్రయోజనాలను గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ తదితర సంక్షేమ పథకాల ద్వారా వ్యక్తిగతంగా పొందిన ప్రయోజనాలను వారు వివరించారు. వైయస్ఆర్ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో రత్నాకర్ పండుగాయల, డా. కొండా మోహన్‌రెడ్డి, డా. వాసుదేవరెడ్డి, జలందర్, రాయల్‌రెడ్డి, రాజశేఖర్, రవి, సంజీవ, రఘు, జనార్ధన్, సునీల్, వెంకట్ పులి, శేషాద్రి, సురేంద్ర, మధు, కిరణ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు, వైయస్ఆర్ అభిమానులు, వైయస్ఆర్ సీపీ సానుభూతిపరులు హాజరై వైయస్ఆర్ కు నివాళులర్పించారు.
#JoharYSR
#YSRLivesOn
చంద్రబాబు.. కరువు కవల పిల్లలు. బాబు వస్తే కరువు వస్తుందని మళ్లీ నిరూపితమైంది
ఎండిపోయిన ఈ చెరువు చంద్రబాబు నారావారిపల్లెకి పక్క గ్రామంలో ఉన్న రంగంపేట చెరువు
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇవే కరువు పరిస్థితులు కనిపిస్తుంటాయి
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు
#TDPAntiFarmers
#SadistChandraBabu
వైయస్ జగన్ గారి పాదయాత్రను ఆపడం.. నీ తరం కాదుకదా.. నీ బాబుగారి తరం కూడా కాదు చింతమనేని ప్రభాకర్
పాదయాత్రతో ప్రజల తరఫున ఎలా పోరాడాలో అందరికీ చూపించింది వైయస్ ఫ్యామిలీ
నీకు దమ్ముంటే పాదయాత్ర టైమ్‌లో మీ ప్రాంతంలో బహిరంగ సభ పెడతాం.. దాన్ని ఆపు చాలు
-కాసు మహేష్ రెడ్డి గారు, గురజాల మాజీ ఎమ్మెల్యే
#YSJaganPadayatra
కార్పొరేషన్ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుదాం: కాకాణి
నెల్లూరు నగర నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కాకాణి
నెల్లూరు సిటీ పరిధిలోని, శ్రీ కన్వెన్షన్ హాల్లో శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైయస్ఆర్ సీపీ ప్రధాన నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు
చంద్ర శేఖర్ రెడ్డి గారితో కలిసి వైయస్ఆర్ సీపీ నాయకులకు ఐడీ కార్డులు అందజేసిన కాకాణి
స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబును ఖచ్చితంగా ఢీకొడతాం
వైయస్ జగన్ గారి ప్రకటనతో టీడీపీ శ్రేణుల్లో వణుకు మొదలైంది
ఎన్నికలు దగ్గర పడటంతోనే చంద్రబాబు కొత్త నాటకాలు ఆడుతున్నారు
27 నెలల తర్వాత పెన్షన్లు ఇస్తామంటూ చంద్రబాబు కొత్త హామీలు ఇస్తున్నారు
చంద్రబాబు జీవితంలో నిజం చెప్పరు.. ఆయన ఇచ్చేవి నెరవేరని హామీలే
వైయస్ఆర్ అన్నట్లు మునిశాపం వల్ల చంద్రబాబుకు నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని భయం
టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు
చంద్రబాబు నాయుడికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది
చంద్రబాబు తన జీవితంలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి గారు మాట్లాడుతూ..చంద్రబాబుకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది..
స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబును ఖచ్చితంగా ఢీకొనాల్సిందేనని వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టం చేసినప్పటి నుంచి టీడీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందని కాకాణి వ్యాఖ్యానించారు. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, 27 నెలల తర్వాత పెన్షన్లు ఇస్తామంటూ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. మోసపూరిత వైఖరి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు గతంలో చెప్పినట్లుగానే చంద్రబాబు పొరపాటున కూడా నిజం చెప్పరని, ముని శాపం ఉంది కాబట్టి నిజం చెబితే తన తల వెయ్యి ముక్కలవుతుంది కాబట్టి ఆయన ఇచ్చే అబద్ధాల హామీలు ఎప్పటికీ నెరవేరవని ఆరోపించారు. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు ప్రజలను బెదిరించి, ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు..
చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ముగిసిందని, ఆయనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కాకాణి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన జీవితంలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని ధ్వజమెత్తారు
నెల్లూరు నగర కార్పొరేషన్‌కు సంబంధించి పాలకపక్షం కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిందని కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలో జగన్ గారు ఇచ్చిన అవకాశంతో
ముస్లిం మైనారిటీ నాయకుడు ఖలీల్ అహ్మద్‌తో పాటు తామంతా అసెంబ్లీలో అడుగుపెడతామని భావించామని, అయితే దురదృష్టవశాత్తు ఫలితాలు వేరేలా వచ్చాయని కాకాణి తెలిపారు. చంద్రబాబు నాయుడికి క్యాషియర్ గా ఉన్నందుకే నారాయణపై ఆధారపడి టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. నెల్లూరుకు నారాయణ చేసింది శూన్యం
నారాయణ గెలిచినప్పటి నుంచి నెల్లూరు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని కాకాణి ఆరోపించారు.
నారాయణ నగరానికి రావడమే అరుదు అని, అర్ధరాత్రి వేళల్లో నెల్లూరుకు రావడం, సొంత పనులు చూసుకోవడం, ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా మాట్లాడి అమరావతికి తిరిగి వెళ్లడమే నారాయణ నైజమని విమర్శించారు. నారాయణ వల్ల నెల్లూరు ప్రజలకు రూపాయి ఉపయోగం లేదని, వైయస్ఆర్ సీపీ శాసనమండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నారాయణ వద్ద వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ, నెల్లూరులో చెట్లు, చెత్తను కూడా వదలకుండా దోపిడీకి పాల్పడుతున్నారని కాకాణి తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యాసంస్థల కంటే రాజకీయాల్లోనే సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతోనే నారాయణ ఈ విధమైన కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డీఎస్సీ లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది...
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని. డీఎస్సీ (DSC) వ్యవహారంపై ప్రభుత్వం నడుచుకుంటున్న తీరును, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కాకాణి తీవ్రంగా తప్పుబట్టారు.
డీఎస్సీ విషయంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, అధికారులకు పెత్తనం ఇస్తే వారు సరిగ్గా పనిచేయలేదు కాబట్టే ఆ నింద ప్రభుత్వంపై పడింది అని మాట్లాడటం నవ్వొచ్చేలా ఉందని కాకాణి ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు నాలికను ఏ పక్కకైనా మడతపెట్టి మాట్లాడగలరని విమర్శించారు. డీఎస్సీలో పొరపాట్లు ఎక్కడ జరిగాయో సమాధానం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. జీవోలు, నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నలు..స్పోర్ట్స్ కోటా పెంపు.. 2 శాతం ఉన్న స్పోర్ట్స్ కోటాను ఎవరి అనుమతితో 3 శాతానికి పెంచారో చెప్పాలని కాకాణి ప్రశ్నించారు. 29 ఉన్న ఆటలను 65 రకాల ఆటలు గా ఎందుకు పెంచారో స్పష్టం చేయాలన్నారు.
సాధారణ పరిపాలన శాఖ (GAD) ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌ను సవరిస్తూ.. ఉపాధ్యాయులు పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి వీలులేదని, అవసరం లేదని ఏ ప్రాతిపదికన జీవో విడుదల చేశారని నిలదీశారు. సాధారణ పరిపాలన శాఖ బాధ్యత సీఎం దే.. ఏ రాష్ట్రంలోనైనా సాధారణ పరిపాలన శాఖ (GAD), శాంతిభద్రతలు, భూ సంస్కరణలు వంటి కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయని కాకాణి గుర్తుచేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు, అసెంబ్లీ సమావేశాలలో జీఏడీ (GAD) కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే బాధ్యతను సీఎం తనకు అప్పగించేవారని తెలిపారు. అంతటి కీలకమైన శాఖలో సీఎం సంతకం లేకుండా, ఆయనకు తెలియకుండా జీవో విడుదల కావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మొదట ఎక్కడా పొరపాటు జరగలేదని చెప్పి, ఇప్పుడు అధికారులపై నెట్టేయడం సరికాదన్నారు.
డీఎస్సీ స్కామ్‌ను బయటకు తీయడంలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తులలో సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకరని, అందుకు తాము గర్విస్తున్నామని కాకాణి పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన పొరపాట్లను సాక్ష్యాధారాలతో సహా బయటపెడితే.. ప్రభుత్వం సమాధానం చెప్పలేక కమిటీలు, విచారణల పేరుతో దాటవేస్తోందని కాకాణి మండిపడ్డారు.
తప్పులను ఎత్తిచూపిన ప్రతిసారి ఒక విచారణ పేరు చెప్పడమే తప్ప, అసలు ఆ తప్పులు ఎలా జరిగాయో ప్రభుత్వం స్పష్టం చేయడంలేదని కాకాణి విమర్శించారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, జగన్ మోహన్ రెడ్డి గారి పై నిందలు వేయడం సరికాదన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేరని, ప్రభుత్వంలో ఉన్నవారు తప్పులకు సమాధానం చెప్పలేక మైకుల ముందుకు వచ్చి ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ విధానాల వల్ల విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని కాకాణి పేర్కొన్నారు. ప్రభుత్వం తమను మోసం చేసిందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని, రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవని వ్యాఖ్యానించారు.అధికార బలం ఉందనే ధీమాతో అక్రమ కేసులు పెడతామని, బెదిరింపులకు గురిచేస్తామంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. మా పార్టీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలతో, ఆయన ఇచ్చిన గుండె ధైర్యంతో పోరాడే పార్టీ. అని దేనికైనా సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లాలో పోలీసులను పురమాయించి వైయస్ఆర్ సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైయస్ఆర్ సీపీ కార్యకర్తల జోలికి రావాలంటే ముందుగా చంద్రశేఖర్ రెడ్డి గారిని, నన్ను దాటుకొని వెళ్లాల్సిందేనని కాకాణి తెగేసి చెప్పారు.
వైయస్ఆర్ సీపీకి స్థానిక సంస్థల ఎన్నికలే నాంది పలకాలి...
నెల్లూరు నగర నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ శ్రేణులు రాబోయే స్థానిక సంస్థల (కార్పొరేషన్) ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి విజయం సాధించాలని కాకాణి పిలుపునిచ్చారు.
నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయని, నెల్లూరులోని మొత్తం 72 కార్పొరేషన్ సీట్లలో ప్రతి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
నాయకులు, కార్యకర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టాలని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం అందరూ నడుచుకోవాలని స్పష్టం చేశారు. వైయస్ఆర్ సీపీ ఒక కుటుంబం అని, జగనన్న ఏది చెప్తే అది అమలు చేయడమే పార్టీ విధానమని పేర్కొన్నారు. జగన్ పాలన లేకపోవడంతోనే ఇబ్బందులు..
జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్లే వైయస్ఆర్ సీపీ కేడర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వేధింపులు, కేసులు, జైళ్లు, ఉద్యోగాలు పోవడం వంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని, జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సమస్యలన్నీ తొలగుతాయని చెప్పారు.
టికెట్లు ఆశించే ప్రతి ఒక్కరికీ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు అని, అయితే టికెట్ రాని పక్షంలో అధైర్యపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను, నాయకుడిని రాబోయే రోజుల్లో వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి తగిన గుర్తింపు ఇస్తామని కాకాణి హామీ ఇచ్చారు
🚨 #TeluguDrugsParty
దొంగే.. దొంగా..దొంగా అని అరిచినట్లు డ్రగ్స్ గురించి, లిక్కర్ గురించి మీరే మాట్లాడాలి @JaiTDP?
మీ పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరకలేదా? బ్లడ్ టెస్ట్‌లో మెథాంఫెటమైన్ పాజిటివ్ వచ్చినమాట నిజంకాదా?
మీ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చి అరెస్టయింది వాస్తవం కాదా?
గుంటూరులో కొకైన్ , మంగళగిరిలో గంజాయి, MDMA , కుప్పంలో గంజాయి ఇలా రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చింది మీరు కాదా?
ఇక మద్యం విషయంలో అయితే వేల సంఖ్యలో ప్రైవేటు మద్యం షాపులకు తలుపులు తెరిచి గుడి, బడి, నివాస ప్రాంతాల పక్కన మద్యం షాపులు పెట్టి, కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది మీరు కాదా? మాట్లాడేముందు కాస్తైనా సిగ్గుండాలి.
#LokeshForDrugs
#DrugsodhuBro
#TDPDrugMafia
#SadistChandraBabu
పండగవేళ ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు.. చోద్యం చూస్తున్న చంద్రబాబు..!
ఒక్కో కుటుంబంపై అదనంగా దాదాపు 2 వేల రూపాయలు భారం
పేద, మధ్య తరగతి వాళ్లు పండగ చేసుకోకూడదా @ncbn ?
#SadistChandraBabu
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం భారీ జనసందోహం నడుమ అట్టహాసంగా సాగింది
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన మాచర్ల నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరి గౌతమ్ రెడ్డి గారు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఆరె శ్యామల గారు, కారుమూరువెంకటరెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు, SEC సభ్యులు కొమ్మారెడ్డి చలమారెడ్డి గారు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు ఎనుముల మురళీధర్ రెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తల సమన్వయం, రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
మాచర్ల నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు