భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను #TSRTC నడుపుతోంది. #Hyderabad నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లోJBS నుంచి రూ.524, BHEL నుంచి రూ.564 టికెట్ ధర. అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించింది. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం https://t.co/T98ngIObe1 వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
@TSRTCHQ @PROTSRTC
#Srisailam
ఆవకాయ పచ్చడి ప్రియులకు శుభవార్త! రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు #TSRTC ద్వారా సులువుగా పంపించుకోవచ్చు. మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంది. తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తోంది. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించండి.
@TSRTCHQ @TSRTC_LOGISTICS @PROTSRTC
ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవరన్నలది క్రియాశీల పాత్ర. వారి సేఫ్ డ్రైవింగ్ వల్లే టీఎస్ఆర్టీసీ పయ్యాలు సాఫీగా నడుస్తున్నాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. నిబద్ధత, క్రమ శిక్షణతో పాటు ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ.. #TSRTC ని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న డ్రైవరన్నలకు.. డ్రైవర్స్ డే శుభాకాంక్షలు.
డ్రైవర్స్ డే సందర్బంగా #TSRTC ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 డిపోల పరిధిలో ఉన్న డ్రైవ్లర్లను ఘనంగా సన్మానిస్తోంది.
@TSRTCHQ @PROTSRTC #DriversDay
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలను చేర్చేందుకు #TSRTC పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ఈ నెల 13 నుంచి 24వ తేది వరకు 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంస్థ.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్(@SajjanarVC) గారి అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.
“టీఎస్ఆర్టీసీకి పోలీస్, రవాణా శాఖలు ఎంతగానో సహకరిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో సంస్థ ఉద్యోగులతో కలిసి వారు పనిచేస్తున్నారు. ప్రయాణికులను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థకు వస్తోన్న ఫలితాల్లో పోలీస్, రవాణా శాఖల పాత్ర కూడా ఉంది. గతంలో మాదిరిగానే ఈ దసరాకు ఆయా శాఖలు సహకరించాలి.” అని వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు కోరారు.
బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అధిక రద్దీ ఉండే అవకాశముండటంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించినట్లు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా తిప్పుతున్నట్లు తెలిపారు.
“హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్ లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తాం. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లనూ నియమిస్తున్నాం.” అని సజ్జనర్ తెలిపారు.
ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా టీఎస్ఆర్టీసీ ఇటీవల తీసుకువచ్చిన గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలన్నారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని సూచించారు. టీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు.
బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ https://t.co/cpYkSGAM9tలో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్(ట్రాఫిక్) జి.సుధీర్ బాబు మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీకి తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చడానికి టీఎస్ఆర్టీసీతో సమన్వయంగా పని చేస్తామని చెప్పారు.
ఈ సమన్వయ సమావేశంలో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, అశోక్ కుమార్, శ్రీనివాస్, రాచకొండ, ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీలు రణవీర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రవాణా శాఖ చెందిన ఆర్టీఏలు రఘునందన్ గౌడ్(ఇబ్రహీంపట్నం), రామచందర్(హైదరాబాద్ సెంట్రల్), శ్రీనివాస్ రెడ్డి (హైదరాబాద్ నార్త్)తో పాటు టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
@TSRTCHQ @PROTSRTC @puvvada_ajay #Dasara @HiHyderabad@hydcitypolice@HYDTP @RCKTRAFFIC @CYBTRAFFIC@cyberabadpolice
ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహా ఇకలేరు!
నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ (NSRRTD)లో ఉద్యోగంలో చేరి ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీకి సేవలందించిన 98 ఏళ్ల ఆర్టీసీ కురవృద్ధుడు టీఎల్ నరసింహా గారు మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. #Hyderabad ఓల్డ్ అల్వాల్‌లోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు.
గత ఏడాది స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎల్ నరసింహ గారిని #TSRTC ఘనంగా సన్మానించింది. బస్‌భవన్‌లో జెండా పండగకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా వారిని సమున్నతంగా సంస్థ సత్కరించింది.
వజ్రోత్సవాలను పురస్కరించుకొని సంస్థ ట్యాంక్ బండ్‌పై చేపట్టిన ర్యాలీని నరసింహ గారే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆ సమయంలో తన అనుభవాలను నాతో పంచుకున్నారు. సంస్థ కొత్తగా ప్రవేశపెడుతున్న కార్యక్రమాలను ఎంతగానో ప్రశంసించారు. టీఎస్ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడానికి సలహాలు కూడా ఇచ్చారు.
ప్రజా రవాణా వ్యవస్థకు ఎంతో సేవచేసిన ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహా గారు మరణించడం బాధాకరం. టీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. నరసింహా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
కాగా, హైదరాబాద్ శివారు బొల్లారంలో టీఎల్ నరసింహా గారు 1925లో జన్మించారు. 1944లో నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ గుమస్తాగా ఉద్యోగంలో చేరారు. 1983లో ఆర్టీసీ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశారు. నిజాం కరెన్సీ ఉస్మానియా సిక్కాలో రూ. 47 జీతంతో ఉద్యోగం మొదలుపెట్టిన ఆయన.. చివరగా రూ. 1,740 వేతనం అందుకొని రిటైరయ్యారు.
@puvvada_ajay @Govardhan_MLA @tsrtchq @PROTSRTC @SajjanarVC@YakaswamyChalla
ఈ నెల 17న అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. గానుగాపూర్‌తో పాటు ప్రముఖ ఆలయాలకు నెలవైన మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్‌కు ఈ ప్రత్యేక బస్సును సంస్థ నడుపుతోంది.
సర్వీసు నంబరు 92221 గల ఈ ప్రత్యేక బస్సు.. ఈ నెల 16 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి గానుగాపూర్‌కు బయలుదేరుతుంది. 17న దత్తాత్రేయ స్వామి దర్శనానంతం.. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు పండరీపూర్ చేరుకుంటుంది. అక్కడ పాండురంగస్వామి దర్శనం పూర్తవగానే రాత్రి 10 గంటలకు తుల్జాపూర్‌కు వెళ్తుంది. తుల్జా భవాని మాత దర్శనానంతరం 18న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకుంటుంది.
గానుగుపూర్ ప్రత్యేక బస్సు టికెట్ ధర రూ.2500గా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరలో ప్రయాణ సదుపాయం మాత్రమే సంస్థ కల్పిస్తోంది. దర్శనం, భోజన, వసతి సదుపాయాల బాధ్యత భక్తులదే.
గానుగాపూర్ ప్రత్యేక బస్ ముందస్తు రిజర్వేషన్‌ను టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https://t.co/T98ngIObe1 లో చేసుకోవచ్చు. లేదా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్ బస్ స్టేషన్లలోని కౌంటర్లలో ఈ టికెట్లను పొందవచ్చు. ఈ ప్రత్యేక బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలకు 9440566379, 9959226257, 9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు.
@PROTSRTC @TSRTCHQ @CTMOTSRTC @tsrtcmdoffice @SajjanarVC@puvvada_ajay @Govardhan_MLA
సంస్థ అభివృద్ధికి నిత్యం శ్రమిస్తోన్న #TSRTC సిబ్బందికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రతి ఉద్యోగి, కార్మికుడు బాధ్యతగా పని చేసి సంస్థ పురోగతికి పాటుపడాలి. రాబోయే రోజులలో ప్రజలకు మరింతగా దగ్గరైయి.. వారికి నాణ్యమైన, మెరుగైన సేవలు అందించాలి. ఈ #MayDay సందర్బంగా ప్రజలను ప్రజా రవాణా వ్యవస్థ వైపునకు ఆకర్శించి, #TSRTC ని లాభాల బాటలో నడిపిద్దామని ప్రతినబూనదాం.
@TSRTCHQ @Govardhan_MLA @puvvada_ajay @PROTSRTC @YakaswamyChalla
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే దేవాదాయ శాఖ సహకారంతో తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేయనుంది. భక్తులు కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి.
With a view to reaching out to the devotees of Lord Shri Rama in far flung areas of Telangana, the #TSRTC has taken up pious task to deliver Bhadrachalam Sri Sitarama Kalyanam Talambralu to their doorstep.