తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో విబి జీ – రాం జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని తలంచారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
Every milestone towards Viksit Bharat – 2047 is a step towards realizing the visionary dream of Hon'ble Prime Minister Shri @narendramodi Ji. The National Launch of VB-G RAM G from Mukkavaripalli in Railway Koduru Constituency, Andhra Pradesh, is one such historic milestone, making it a proud and memorable occasion for our State.
My heartfelt gratitude to Hon'ble Union Minister for Rural Development Shri @ChouhanShivraj Ji for graciously honouring our request and launching VB-G RAM G from Andhra Pradesh. This recognition reflects the Government of India's confidence in our State's commitment to transparent governance, effective implementation, and accelerated rural development.
The announcement of ₹7,707 crore for Andhra Pradesh under VB-G RAM G, coupled with ₹422 crore under PMGSY-IV for 146 road works covering 347 km and 19 bridges, is far more than an investment in infrastructure—it is an investment in the aspirations of our villages, the dreams of our farmers, the opportunities for our youth, and the future of rural Andhra Pradesh.
I also express my sincere gratitude to Hon'ble Prime Minister Shri @narendramodi Ji, whose unwavering commitment to rural empowerment continues to transform the development landscape of our nation. These landmark initiatives stand as a testament to his vision of creating vibrant, self-reliant villages as the foundation of a Viksit Bharat.
The confidence reposed in Andhra Pradesh through one of the country's largest allocations under VB-G RAM G is both an honour and a responsibility. The Government of Andhra Pradesh accepts this responsibility with utmost sincerity. We are committed to ensuring that every sanctioned road, every bridge, and every rupee entrusted to us is translated into quality infrastructure, improved livelihoods, and lasting development. We shall never disappoint the confidence reposed in our State by the Government of India.
Together, under the leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi Ji, with the continued support of Hon'ble Union Minister Shri Shivraj Singh Chouhan Ji, and under the leadership of Hon'ble Chief Minister Shri @ncbn Garu, the Government of Andhra Pradesh remains committed to building stronger villages, empowered communities, and a Viksit Andhra Pradesh that contributes meaningfully to the vision of Viksit Bharat.
@PMOIndia@MoRD_GoI@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరులో ఇటీవల నిర్వహించిన సభలో గౌరవ ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రజలు వ్యతిరేకించిన తీరు, ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, నా పై అనుచిత, అసత్య, హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం తదితర ముఖ్య అంశాలపై ఈరోజు మీడియా సమావేశం.
ప్రశ్నించండి... మేము కూడా ప్రశ్నలను స్వాగతిస్తాం. కానీ ప్రశ్నించడం పేరుతో దూషించడం, వ్యక్తిగతంగా కించపరచడం, మనోభావాలను దెబ్బతీయడం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, వ్యక్తిగత విద్వేషాలను జర్నలిజం ముసుగులో ప్రదర్శించడం, ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చట్టం సహించదు. చట్టం తన పని తాను చేస్తుంది.
• ఇష్టం వచ్చినట్లు @JanaSenaParty అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై, వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని జుగుప్సాకరమైన, భయభ్రాంతులకు గురిచేసే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోకూడదా?
• యావత్ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుల వారిపై మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తే సమాజం మౌనంగా ఉండాలా?
• నాస్తికత్వం పేరుతో కుల, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని ప్రశ్నించకూడదా?
• పసిపిల్లల మనసుల్లోనే కుల, మత విద్వేషాలను నింపేలా వ్యవహరించే వారిపై చట్టం చర్యలు తీసుకోకూడదా?
• తప్పుడు పనులన్నీ చేసి, తర్వాత కులం, మతం, ప్రాంతీయత పేరుతో రక్షణ పొందాలని ప్రయత్నిస్తే ప్రజలు గానీ, చట్టం గానీ చూస్తూ ఊరుకోవు.
తప్పు చేసిన వ్యక్తి ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదు.
జర్నలిస్టులకు, సోషల్ మీడియా యువతకు, అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి...
తప్పును తప్పుగానే చూడండి. నేరాన్ని నేరంగానే చూడండి. దయచేసి తప్పుడు వ్యక్తులకు మద్దతుగా నిలిచి సమాజానికి తప్పు సంకేతాలు ఇవ్వవద్దు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, బాధ్యత కూడా ముఖ్యం అనే సందేశం ఇవ్వండి.
జూన్ 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను సమీక్షిస్తున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణుల నుంచి వస్తున్న విశేష స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. @JanaSenaParty కోసం కష్టపడిన ప్రతి ఉద్యమి, ప్రతి సాధక్, ప్రతి జనసైనికుడికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పార్లమెంట్ పరిశీలకులకు సూచించడం జరిగింది.
పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు పార్టీ బాధ్యతలతో పాటు, వివిధ అనుబంధ విభాగాల్లో సేవలందించాలనే ఆసక్తి ఉన్న జనసేన సాధక్స్, నాయకులు, జనసైనికులందరికీ ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పిస్తున్నాం. జనసేన శ్రేణులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నాయకత్వం తీసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్లా పంచాయతీరాజ్ వ్యవస్థ మారాలి
•గత ప్రభుత్వ విజన్ లేని పాలన వల్లే పంచాయతీలు దెబ్బ తిన్నాయి
•గత రెండేళ్లలో గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా రూ.4,200 కోట్లు బదిలీ
•వ్యవస్థలు బలంగా నడవాలంటే ఉద్యోగుల పాత్రే కీలకం
•ప్రజల కోసం మీరు ఒక అడుగు వేస్తే... మీ కోసం నేను వంద అడుగులు వేస్తా
•మనం చేసే ప్రతి పనిలో పారదర్శకత ఉండాలి
• శ్రీ వెంకట కృష్ణ గారి లాంటి అధికారుల వల్లే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది
•పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు
•ప్రభుత్వ అదనపు కార్యదర్శి శ్రీ కె. వెంకటకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం పిటీషన్లు తీసుకొని వాటిని పైకి నెట్టేసే వ్యవస్థలా కాకుండా... ప్రజల కష్టాలు తీర్చే పవర్‌హౌస్ లా మారాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళికలు, విజన్ లేకపోవడం వల్లే గ్రామ పంచాయతీలు తమ పూర్తి సామర్థ్యాన్ని కోల్పోయి నిర్వీర్యమయ్యాయని, స్థానిక సంస్థల నిధులను దారి మళ్లించడం, గ్రామ సభలను నిర్లక్ష్యం చేయడం వల్ల గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోపాలను సరిదిద్ది, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలను మళ్లీ పూర్వవైభవానికి తీసుకురావడానికి గట్టి పట్టుదలతో పని చేస్తుందని స్పష్టం చేశారు. గడిచిన రెండేళ్ల కాలంలో రూ.4200 కోట్ల నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాలకు బదిలీ చేశామని తెలిపారు. మంగళవారం రాత్రి ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి గారి ఒ.ఎస్.డి. శ్రీ కఠారి వెంకటకృష్ణ గారి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “పాలనాపరంగా నాకు పెద్దగా అనుభవం లేకపోయినా, 2 లక్షల మంది ఉద్యోగులతో కూడిన పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంత విజయవంతంగా నిర్వహించడానికి శ్రీ వెంకట కృష్ణ గారే కారణం. ఆయన దగ్గర ఒక విద్యార్థిలా మారి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. 36 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఆయనపై చిన్నపాటి మరక కూడా లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అలాంటి వ్యక్తి రిటైర్ అయిపోతున్నారని తెలియగానే భుజం కొట్టేసినట్లు అనిపించింది. అందుకే ఆయన సేవలు మరో మూడేళ్లు కొనసాగేలా చర్యలు తీసుకున్నాం.
• ఇటువంటి అధికారుల వల్లే వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుంది
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో ఉన్నతమైన ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం పథకాలను రూపొందించడమే కాదు... ప్రభుత్వ వ్యవస్థల నియంత్రణలో, ప్రగతిశీల అభివృద్ధిలో, అత్యుత్తమ పరిపాలనా విధానాల అమలులో ఆయన చూపిన చొరవ అసాధారణమైనది. ప్రభుత్వ రంగంలో ఆయనకున్న అపార అనుభవం, సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, చూపిన మేధస్సు నేటికీ, రేపటికీ ఎప్పటికీ ఎంతో మంది అధికారులకు, ఉద్యోగులకు ఒక దిక్సూచిలా, మార్గదర్శకంగా నిలుస్తాయి. పాలసీ మేకింగ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వరకు.. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుండి బడ్జెట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వరకు.. యాంటీ కరప్షన్ స్ట్రాటజీస్ నుంచి లీగల్ అఫైర్స్ వరకు ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి విభాగంలోనూ ఆయన ముద్ర కనిపిస్తుంది. ఇటువంటి అధికారుల వల్లే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం రెట్టింపు అవ్వడంతో పాటు, వ్యవస్థలు బలోపేతం అవుతాయి.
(1/3)
నిన్న రాత్రంతా నిద్ర రాలేదు… ఒకటే ఆలోచన…
ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం.
నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం… గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం… వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం… ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి.
ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు… మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.
“ముందు సినిమా పూర్తి చేద్దాం… నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు… ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు…” అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్‌ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు.
ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు… జీవితాంతం మర్చిపోలేని ఋణం. ఆ ఋణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను.
ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో… కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది.
దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను… మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు… నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో.
మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే… మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం.
@PawanKalyan sir
Had a warm and productive meeting with the Hon'ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji. We discussed a range of issues of mutual interest and explored opportunities for greater cooperation between our two States.
I conveyed my sincere thanks to him for Maharashtra's support in facilitating the translocation of two female tigers to Andhra Pradesh. This generous gesture marks an important milestone in our efforts to restore a thriving tiger population in the Eastern Ghats. The introduction of female tigers will help overcome the challenges of inbreeding, enhance genetic diversity, strengthen the long-term viability of the population, and contribute to a healthy, self-sustaining tiger landscape.
This collaborative conservation effort reflects our shared commitment to protecting biodiversity through science-based and sustainable wildlife management. I am confident that the partnership between Andhra Pradesh and Maharashtra will contribute significantly to the long-term conservation of tigers in the Eastern Ghats.
I also express my gratitude to the Hon'ble Union Minister for Environment, Forest and Climate Change, Shri @byadavbjp Ji, for his continued guidance in taking this initiative forward. I look forward to continued collaboration with the Government of Maharashtra and all stakeholders in advancing wildlife conservation.
@PMOIndia@moefcc@AndhraPradeshCM@CMOMaharashtra@ntca_india
భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉంది
•శ్రీ @PawanKalyan గారికి తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించిన వైద్యులు
•అధికారిక కార్యక్రమాలు ముగించుకుని వస్తానన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొద్దిసేపటి క్రితం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్ తోపాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఆ తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్న విషయం విదితమే.
వంగవీటి రంగా గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మా నాయకుడు.రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న మేము కట్టుబడి ఉంటాం అని తీర్మానం చేసిన ప్రతీ కాపు సోదర సోదరీమణులకు 🙏
On the birth anniversary of Bharat Ratna Shri P. V. Narasimha Rao Garu, I pay my heartfelt tributes to one of India's most visionary statesmen, an exceptional scholar, former Chief Minister of the erstwhile united Andhra Pradesh, and former Prime Minister whose leadership transformed the course of our nation's history.
At a defining moment, his courage, foresight, and landmark economic reforms opened new horizons for India's growth and global standing. His remarkable intellect, administrative excellence, and unwavering commitment to national progress remain an enduring source of inspiration.
From the richness of Telugu literary heritage to the highest office of public service, Shri P. V. Narasimha Rao Garu exemplified wisdom, humility, and visionary leadership. His extraordinary legacy continues to inspire generations to serve the nation with knowledge, integrity, and unwavering dedication.
May his extraordinary legacy continue to inspire every Indian to serve the nation with wisdom, integrity, and an unwavering commitment to progress.
– @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
జనసేనలో ఊపందుకున్న చేరికలు
పార్టీ సిద్దాంతాలు, విధానాలు వివరిస్తూ ఆహ్వానిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో చేరికలు ఊపందుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జనసేన కార్యాలయం ప్రారంభించిన సంగతి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్న ఔత్సాహికులు, విద్యావంతులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా జనసేన కార్యాలయంకు విచ్చేస్తూ జనసేన పట్ల వారికున్న ఆసక్తిని వ్యక్తపపరుస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలంకు అనుగుణంగా తాము కూడా ప్రయాణిస్తామని ముందుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు జనసేన పార్టీ సిద్దాంతాలు, విదానాలు వివరిస్తూ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుండి ప్రముఖ వ్యాపారస్తులు శ్రీ నాగహరీష్, శ్రీ గోవిందస్వామి, శ్రీ తిరుమలరావు, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన శ్రీ వెంకటేష్, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి శ్రీ రామకృష్ణ జనసేన పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
#JanaSenaTelangana
తెలంగాణ జానపద కళకు ప్రతీకగా నిలిచిన పద్మశ్రీ పురస్కార గ్రహీత, 7 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య గారికి, ఆయన ప్రతిభకు గుర్తుగా గత @BRSparty ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పొందడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ, ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేయాల్సి రావడం అత్యంత దురదృష్టకరం.
తెలంగాణ సంస్కృతికి గర్వకారణమైన ఒక జాతీయ పురస్కార గ్రహీతకే ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడంలో ఇంతటి ఇబ్బందులు ఎదురవుతుంటే, అది వ్యవస్థ వైఫల్యానికే నిదర్శనం. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతో పాటు, ప్రస్తుత @INCTelangana ప్రభుత్వ నిర్లక్ష్యానికీ స్పష్టమైన ఉదాహరణ.
మా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు, మొగిలయ్య గారి ప్రతిభను గుర్తించి, కిన్నెర కళను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రోత్సహించడంతో పాటుగా, ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాలో అవకాశం కల్పించి తెలంగాణ సాంస్కృతిక కళలపై ఉన్న గౌరవాన్ని చాటారు. అలాంటి కళాకారుడికి గౌరవం, భరోసా, న్యాయం అందించడం ప్రభుత్వాల బాధ్యత.
@JanaSenaParty తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని మొగిలయ్య గారికి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి, ఆయనకు కేటాయించిన స్థలాన్ని త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
#JanasenaTelangana @JSPTelangana
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.