Watch | #NASA astronauts #SunitaWilliams and #BarryWilmore are back on Earth after the successful Splashdown of #SpaceX Crew-9 at Tallahassee, Florida - where the recovery personnel are continuing to step through procedures to hoist Dragon onto the recovery vessel Megan, teams will lift the craft onto the recovery ship and open the hatch of #SpaceXDragon spacecraft
The crew will be assisted out of the capsule one by one
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
Deeply saddened by the loss of Shri Ratan Tata Ji. A true visionary whose kindness, integrity, and leadership will continue to inspire us and generations to come. My condolences to the Tata family .
చంద్రబాబుగారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. మరోవైపు గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది. చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి.
India’s Historic Paralympics Debut in Paris!
Our athletes are making history at the Paralympics with their outstanding performances!
Let’s celebrate this landmark moment!
#Cheer4India#Paralympics2024
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాను. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలి. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలి. మా పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుంది. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాలి.
కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై @ncbn ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్‌ను వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశాం. కోవిడ్ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టన్నెల్–1, జనవరి 2024లో టన్నెల్–2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. తద్వారా 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైయస్సార్‌గారి కలలను సాకారం చేశాం. ఇంకా ఆర్ అండ్ ఆర్ (రీహ్యాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లోనే దానికి కావాల్సిన సుమారు రూ.1200 కోట్లు చెల్లిస్తే, ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చు. ఆర్ అండ్ ఆర్ కోసం వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా ఆర్ అండ్ ఆర్‌పై ప్రయత్నిస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు.
గతంలోనూ, 2014–19 మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అమాంతంగా సివిల్ వర్క్స్ ఎస్టిమేట్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద చంద్రబాబుకు ఉన్న యావ, నిర్వాసితులను ఆదుకోవడంలో ఎప్పుడూ కనిపించ లేదు. గండికోటకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి, నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు రూ.1000 కోట్లు చెల్లించి, పూర్తిస్థాయిలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. అలాగే చిత్రావతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ కింద రూ.250 కోట్లను మా ప్రభుత్వమే చెల్లించి పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. బ్రహ్మసాగర్‌కు కూడా రూ.60 కోట్ల ఖర్చుతో డయాఫ్రం వాల్ పూర్తి చేసి, శ్రీశైలం నుంచి తెలుగు గంగ కెనాల్ లైనింగ్ కూడా పూర్తి చేసి, 17వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లగలిగాం. తద్వారా 17 టీఎంసీల పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయగలిగాం. ఎప్పుడో పూర్తైన పులిచింతల ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్‌ను కూడా చంద్రబాబు అప్పుడు పట్టించుకోలేదు. దాని కోసం కూడా రూ.140 కోట్లను మా వైయస్సార్సీపీ ప్రభుత్వమే ఖర్చు చేసి పూర్తిస్థాయి సామర్థ్యం 46 టీఎంసీల నీటిని నిల్వ చేశాం.
ప్రస్తుతం కరవు నేలకు అందాల్సిన కృష్ణా వరద జలాలన్నీ కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్ మీదుగా కడలిపాలు అవుతున్న నేపథ్యంలో వెలిగొండ ఆర్ అండ్ ఆర్ అంశంపై దృష్టి పెట్టాలని, వెంటనే ఈ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కింద చెల్లింపులు చేసి ఈ సీజన్లోనే నీటిని నింపి సాగు, తాగునీటిని అందించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాను.
My best wishes and congratulations to @Neeraj_chopra1 on winning the Silver in the men’s javelin throw event at the Olympics.
The entire nation is incredibly proud of you!
#IndiaAtOlympics
Congratulations to the Indian men’s hockey team on bringing home the Bronze at the 2024 Olympics!
The Indian flag continues to fly high!
#IndiaAtOlympics