VRAలను గ్రూప్ 4 స్థాయికి పెంచి ఆత్మ గౌరవం నింపి తనలో కలుపుకుంటూ గౌరవం పెంచుతుంటే.
పంచాయతీ డిపార్ట్మెంట్ మాత్రo జూనియర్ పంచాయతీ సెక్రటరీ న్యూ పోస్ట్ క్రియేట్ చేయించి, 3ఇయర్స్ నుండి 4ఇయర్స్ పెంచించి,4ఇయర్స్ తర్వాత అది చాలదని మళ్ళీ పెర్ఫార్మన్స్ చూడడానికి వస్తున్నారు,ఇదెక్కడి న్యాయం
Telanagana Panchayatraj act 2018 ను కెసిఆర్ సార్ మానస పుత్రిక అని ప్రతీతి ఉంది, కానీ ఆ వ్యవస్థ కి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎందుకు మానస పుత్రుడు/పుత్రిక లాగా చూడలేక పోతున్నారు.. ఎందుకు ఈ చిన్న చూపు. 3years of probationary కంప్లీట్ అయిన ప్రతి కార్యదర్శిని రెగ్యులర్ చేయండి Plz 🙏🙏
తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా వున్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడివున్నదన్నారు. సాధించిన దానితో సంతృప్తిని చెంది అలసత్వం వహించకూడదని, తెలంగాణ పల్లెలు మరింతగా గుణాత్మక మార్పు చెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయితీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగుతూనే వుండాలని సీఎం ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో తమ నాలుగు సంవత్సరాల శిక్షణాకాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేశిత నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి, క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
పంచాయితీ కార్యదర్శులు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతో పాటు పలు రకాల బాధ్యతలను చేపట్టాలనే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం వారికి విధిగా నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న కార్యదర్శుల వివరాలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ పరిశీలనలో నిర్దేశించిన లక్ష్యాలను మూడింట రెండు వంతులు చేరుకున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించాలని @TelanganaCS శ్రీమతి శాంతి కుమారిని, పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సందీప్ సుల్తానియా, కమిషనర్ శ్రీ హన్మంతరావులను సీఎం ఆదేశించారు.