ప్రమాదానికి గురై వెంటిలేటర్‌పై ఉన్న జనగాం జిల్లాకు చెందిన సుకేష్ S/O సారయ్య.. దయచేసి ఆయనకు సహాయం చేసి అతని ప్రాణాలను కాపాడవలసిందిగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గౌరవనీయులైన కేటీఆర్ గారిని @KTRBRS అభ్యర్థిస్తున్నారు...
ప్రతి గ్రామ ఒక కార్యదర్శి ఉండాలి అని ఒక మహత్తర నిర్ణయం తో 9355 మందిని ఓకేసారి జాబ్స్ ఇచ్చిన గొప్ప నాయకులు మీరు.. తెలంగాణ బోళ శంకరుడి (KCR)గా పేరు ఉన్న మీరు JPS లను విడతల వారీగా కాకుండా దయచేసి అందరినీ ఓకేసారి రెగ్యులర్ చేయండి సారు.@KTRBRS@TelanganaCMO@BRSparty@BRSHarish@EDRBRS
అయ్యా KCR sir ఎన్నో కారణాల చేత మేము3000 పైగా మందిమి ఆలస్యంగా JPS లుగా జాబ్ లోకి ఎక్కినం సారుఇపుడు మీరు 4 ఏండ్లు పూర్తి ఐతేనే అంటురు జర దయ తో 2yrsపూర్తి ఐన వారి అందర్నీ రెగ్యులర్ చేసి మాలో కూడా వెలుగూ నిపండి సారు@KTRBRS@TelanganaCMO@HarishRaoOffice@EDRBRS@KTRoffice@BRSHarish
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO మా యొక్క న్యాయబద్ధమైన కొరికిన పెద్ద మనసుతో స్వాగతించి మా యొక్క రెగ్యులేరేషన్ చేయుటకు నిశ్చయించుకున్న శ్రీయుత గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ప్రత్యేక అభివందనాలు ధన్యవాదములు sir💐💐
@TelanganaCMO మీరు సృష్టించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసి మీ యొక్క మాటను నిలబెట్టుకోండి సార్ మీ యొక్క మాట కోసం మా అందరి కుటుంబాలు వేచి చూస్తున్నాయి సార్ 9355 కుటుంబాలు సార్